Blogger Widgets

Monday, September 28, 2009

చిట్టి చిట్టి బొమ్మల పెళ్ళి

Monday, September 28, 2009

దసరా కదండి అందరు బొమ్మల కొలువులు పెడతారు కదా అప్పుడు బొమ్మల పెళ్ళి కూడా పెడతారు కదా అందులో బొమ్మల పెళ్ళి కూడా పెడతారు అందుకు పాటలు పాడతాం కదా అందుకు నేను చిట్టి చిట్టి బొమ్మల పేళ్ళి పాట నేర్చుకున్నాను మీరు చూడండి.

చిట్టిబొమ్మల పెండ్లి చేయవలెనగా
శ్రింగారవాకిళ్ళు సిరితోరణాలు
గాజుపాలికలతో, గాజుకుండలతో
అరటి స్తంభాలతో అమరె పెండ్లరుగు.

చిన్నన్న పెట్టెనే వన్నెచీరల్లు
పెద్దన్న పెట్టెనే పెట్టెల్లసొమ్ము
నూరుదునె బొమ్మ, నీకు నూటొక్కకొమ్ము
పోతునే బొమ్మ, నీకు పెన్నేఱునీళ్ళు

కట్టుదునె బొమ్మ, నీకు కరకంచుచీర
తొడుగుదునే బొమ్మ, నీకు తోపంచురవిక
ఒడిబియ్యం పెడుదునే, ఒడిగిన్నె పెడుదు
అత్తవారింటికీ పోయి రమ్మందు

అత్త చెప్పినమాట వినవె ఓ బొమ్మ
మామచెప్పినపనీ మానకే బొమ్మ
రావాకుచిలకమ్మ ఆడవే పాప
రాజుల్లు నీచేయి చూడవచ్చేరు..

1 comment:

  1. బొమ్మలకొలువు, పాట రెండూ బాగున్నాయి. ఇంకా బోల్డు మంచి పాటలు నేర్చుకో..

    ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers