Blogger Widgets

Wednesday, May 26, 2010

అన్నమయ్య

Wednesday, May 26, 2010

అమ్మ తన పసిపాపకి చందమామని చూపిస్తూ ,గోరుముద్దలు తినిపిస్తూ
"చందమామరావో జాబిల్లిరావో, మంచి కుందనపు పైడికోరవెన్నపాలు తేవో"
ఈ పాటరాసింది తెలుగువాగ్గేయకారుడు కలియుగదైవము వేంకటేశ్వరస్వామి కి గొప్పభక్తుడు అయిన అన్నమయ్య .
అన్నమయ్య చాలాపాటలు రాసారు పాడారు .స్వామి వారికి మేలుకొలుపు అన్నమయ్య పాడినప్పుడు "నిద్రలేచేవారు.మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల మేలుకోవె నా పాలి మించిన నిధానమా " వంటి మేలుకోలుపు పాటలకు స్వామి వారు నిద్రలేసారు. మళ్ళీ రాత్రి జోల పాటలు అన్నమయ్య రాసిన"జో అచ్యుతానంద జోజో ముకుందా,  రావె పరమానంనద , రామ గోవిందా జోజో జోజో" అన్నపాటకు స్వామి వారు హాయిగా నిద్రపోతారు. అన్నమాచార్యలవారు అనేఅనేక వేలపాటలు రాసారు పాడారు. అయానపాటలవల్లే స్వామి వారికి అంతకీర్తికలిగిందా అనిపించేటట్టు వుంటాయి అన్నమయ్య పాటలు సామాన్యమానవులు కు అర్ధమైయ్యె టంత వీలు గా వుంటాయి. అన్నమయ్యపాటలు స్వామి వారికే కాదు అమ్మవారికి కూడాచాలా ఇష్టం  అమ్మవారిమీదకూడా చాలాపాటలు రాసారు.
 " క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయమునకు నీరాజనం" అన్నపాట అమ్మవారి నీరాజనం ఇచ్చుసమయమున పాడారు. అమ్మను చూసి చక్కని తల్లికి చాంగుభళా అంటూ పాట చలా బాగుంటుంది
 అంతే కాకు తిరుతిరు జవరాల అన్న పాట,  వుయ్యాల పాటలు
"అలరచంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసెనే వుయ్యాల"  తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, జనపదాలు,  శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వుంన్నాయి. అన్నమయ్యరచనలు ఇంచుమించు ముప్పైరెండువేలు పాటలు వుంటాయి.
అన్నమయ్యకు పదకవితాపితామహుడు అన్నబిరుదు కలదు.  
...


అప్పని వరప్రసాది అన్నమయ్య
అప్పసము మాకే కలడన్నమయ్య ||
అంతటికి ఏలికైన ఆదినారాయణు తన
అంతరంగాన నిలిపిన(పెను) అన్నమయ్య
సంతసాన చెలువొందే సనకసనందనాదు-
లంతటివాడు తాళ్ళాపాక అన్నమయ్య ||
బిరుదు టెక్కెములుగా పెక్కుసంకీర్తనములు
హరిమీద విన్నవించె అన్నమయ్య
విరివిగలిగినట్టి వేదముల అర్ఠమెల్ల
అరసి తెలిపినాడు అన్నమయ్య ||
అందమైన రామానుజ ఆచార్యమతమును
అందుకొని నిలచినాడు అన్నమయ్య
విందువలె మాకును శ్రీవేంకటనాఠునినిచ్చె
అందరిలో తాళ్ళపాక అన్నమయ్య ||
27 వతేది మేనెల అన్నమయ్య జన్మదినము గుర్తుచేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగావుంది.

2 comments:

 1. Very good article in commemoration of Annamayya..

  Apa

  ReplyDelete
 2. Sadhu.Sree Vaishnavi గారూ...,

  నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
  ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
  నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
  మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

  తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
  తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
  హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

  మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

  - హారం ప్రచారకులు.

  ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers