Blogger Widgets

Thursday, April 16, 2015

చార్లీ చాప్లెన్ ఒక అద్బుతం

Thursday, April 16, 2015


చార్లీ చాప్లెన్ తెలియని వారువుండరు. ఆయన1889 ఏప్ర్లెల్ 16 వతేదిన ఇంగ్లాండ్ లో జన్మించారు.మనందరికీ తెలిసి చార్లీ చాప్లెన్ అంటె ఆయన హాస్య నటుడు.చాప్లెన్ డ్రస్ స్టయిల్ బిగుతుగా వున్న కోటు, లూజ్ ఫేంట్, పెద్దషూ , చేతికి ఒక వంకీ కర్రా, వంకర టింకరి నడక,మరి దానికి బ్రష్ లాంటి మీసకట్టుతో, చాప్లెన్ మనకు కనిపిస్తారు. ఎలాంటి వారికి అయినా నవ్వుతెప్పించే కళాకారుడు చాంప్లెన్.అయనను తన పాత్రలో ట్రాంప్ గా తయారు చేసుకున్నారు. చాప్లెన్.
చాప్లెన్ మంచి కళాకారుడు, మిమిక్రి చాలాబాగా చిన్నప్పటినుండీ బాగా చేసేవారు.మంచిరచయిత, పాటగాడుకూడా.అయన ఒకశాంతి ప్రియుడు, అందంగాడు, మంచిహృదయంకలవాడు,చాంప్లెన్ ఒక ప్రపంచ అద్బుతాలలో ఒకరు.  చార్లీ చాప్లిన్ 1889 ఏప్రిల్ 16 వ తేదీన ఇంగ్లండ్‍లోజన్మించాడు. అతని తల్లి పేరు హన్నా ఆమె శ్పానిష్-ఐరిష్ వంశంనుండి వచ్చింది. తండ్రి చార్లెస్ ఫ్రెంచి-యాదు వంశీయుడు. తల్లిదండ్రులిరువురు వృత్తిరీత్యా నటులు వారి ప్రదర్శనలు 'వాడెవిల్' అనే తరహాకి చెందినవి. అంటే ఆట, పాట, హాస్యంతో కూడిన చౌచౌ ప్రదర్శనలన్నమాట. ఇంగ్లండ్‍లో మ్యూజిక్ హాల్స్‍గా ప్రసిద్ధికెక్కిన నాటక మందిరాలలో ఈ వాడెవిల్ ప్రదర్శనలు జరిగేవి. చాప్లిన్ తల్లిదండ్రులు ఈ ప్రదర్శన లిచ్చి డబ్బు గడించేవారు. కాని, అలా గడించిన డబ్బంతా తండ్రి తాగేసేవాడు. అందువల్ల చాప్లిన్ బాల్యమంతా కటిక పేదరికంలోనే గడిచింది. తండ్రి కొన్నాళ్లకి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మరికొన్నాళ్లకి చనిపోయాడు. తల్లి అష్టకష్టాలు పడి పిల్లలను పెంచింది. కొన్నాళ్లకి ఆమెకి మతి చలించి, ఉన్మాదిని అయింది. ఆమెను మానసిక చికిత్సాలయంలో చేర్పించారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు చాప్లిన్ మూడేళ్ల వయస్సులోనే మిమిక్రీలో తన ప్రావీణ్యం కనబరచాడు. అయిదవ ఏట మొదటిసారిగా తన తల్లి బదులుగా స్టేజి మీదకి ఎక్కి పాట పాడాడు. క్రమంగా నట వృత్తిలో ప్రవేశించాడు. కాని వేషాలు వరసగా దొరికేవి కావు. పది పదకొండేళ్ల వయస్సు వచ్చేవరకు అతని జీవితం చాల దుర్భరంగా గడిచింది. కూలి నాలి చేసి పొట్టపోసుకునేవాడు. మార్కెట్‍లోనో, పార్కులలోనో పడుకునేవాడు. కాని క్రమంగా వేషాలు వేసే అవకాశాలు వచ్చాయి. అందులో ఒకటి "From Rags to Riches " అనే నాటకంలో మరొకటి షెర్లాక్ హొమ్స్ నాటకంలో బిల్లీ అనే ఆ ఫీసు బోయ్ వేషం. 1904 నాటికి మంచి నటుడుగా పేరు వచ్చింది. మంచి భవిష్యత్తువుందని అందరు అనేవారు. అన్న సిడ్నీ ద్వారా కార్నో కంపెనీ అనే సంస్థలో నటుడుగా చేరాడు. 1910-1913 మధ్యకాలంలో ఆ కంపెనీతో పాటు అమెరికా వెళ్ళి ప్రదర్శనలిస్తూ పర్యటించాడు. అక్కడా అతనికి మంచి పేరు వచ్చింది. అతని అభిమానులలో ఒకడు మాక్ సెనెట్. అతను కీస్టోన్ అనే స్టూడియోకు అధిపతి, నటుడు, చలన చిత్ర నిర్మాత. అప్పటికే అతడుఎన్నో కామెడీలు నిర్మించాడు. అప్పటికి స్టేజిమీద వారానికి 50 డాలర్ల జీతంపుచ్చుకుంటున్న చాప్లిన్‍ను వారానికి 150 డాలర్లతో తన సినిమాలలోకి తీసుకున్నాడు. 1914 సంవత్సరమంతా చాప్లిన్ కీస్టోన్ చిత్రాలలో నటించాడు.  జన్మతః చాప్లిన్ బ్రిటిష్ వాడైనా అతడి ప్రతిభని గుర్తించి గౌరవించి ఆదరించింది అమెరికా . మరి అదే అమెరికాలో అతని వ్యక్తిగత జీవితం పట్ల, రాజకీయ భావాల పట్ల ఎంతగా అసహనం, విద్వేషం ఏర్పడ్డాయంటే 1952 ప్రాంతాలలో అతడు అమెరికాను శాశ్వతంగా వదలిపెట్టి స్విట్జర్లెండ్‌లో స్థిరపడవలసి వచ్చింది. ముఖ్యంగా అతడు మీడియాకు ప్రధాన కేంద్రమయ్యాడు. పత్రికలవాళ్ళు అతడ్ని వ్యక్తిగతంగా, వృత్తి రీత్యా గూడా ఇబ్బందులపాలు చేస్తూనే వున్నారు. అతడ్ని అమెరికాకు వ్యతిరేకి అని, కమ్యూనిస్టని చాలా ఘోరంగా ప్రచారం చేసారు. " యిన్ అమెరికన్ యాక్టివిటీస్ కమెటీ, విచారణ పరిశోధన విభాగం న్యాయస్థానం ద్వారా చాప్లిన్‌కు తాఖీదులు పంపడం తరచూ జరిగేది. అతడు అమెరికాలో అప్పటికి 40 ఏళ్ళుగా నివసిస్తున్నప్పటికీ, చాప్లిన్ బ్రిటీష్ పౌరసత్వాన్ని వదులుకోలేదు. ఈ వంకతో అతడ్ని వేధించడం మొదలేశారు. అయితే చాప్లిన్ వాదమేమంటే , తాను కళాకారుడనని, అందువల్ల ఏ దేశ పౌరుడయినా పట్టించుకోవలసింది కాదని, తన అభిప్రాయం ప్రకారం కళాకారుడుగా తాను ప్రపంచ పౌరుడనని, ప్రత్యేకంగా ఏ ఒక్క దేశానికీ చెందినవాడ్నికాదని చెప్పాడు. కాని కమిటీ ఎలాగైనా అతడ్ని జైలుపాలు చేయాలని ప్రయత్నించింది. ఫలితం దక్కలేదు. పత్రికలవాళ్ళు అతని జీవితాన్ని అస్తవ్యస్తం చేయాలని వివధ ప్రయత్నాలు చేశారు. వారికి ఒకే ఒక కోరిక అతడ్ని ఎలాగైనా రష్యా పంపించివేయాలని.
దైనందికంగా ఏర్పడుతున్న ఇబ్బందుల కారణంగా అతడు 1952 లో అమెరికాను వదలి ఇంగ్లండ్ చేరుకొని అక్కడ నుంచి స్విట్జర్లెండ్‌లో స్థిరపడ్డాడు. అక్కడ ప్రజలు , ప్రఖ్యాత రచయితలు , కళాకారులు, చిత్రకారులు, రంగస్థల నటులు, అతన్ని ప్రశంసించేవారు. అతడ్ని " గ్రేట్ హ్యూమనిస్ట్ ' ( గొప్ప మానవతావాది) అని చెప్పుకునేవారు. అప్పటికి చాప్లిన్‌కు 64 సంవత్సరాల వయస్సు వచ్చింది. అతని కోరికల్ల చివరి ఈ కాస్త జీవితం ప్రశాంతంగా గడపాలని, పరిస్థితులన్నిటినీ బేరీజు వేసుకున్న దరిమిలా ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు


0 comments:

Post a Comment

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers