రాముడు రాఘవుడు రవికులు డితడు
భూమిజకు పతియైన పురుష నిధానము
అరయ పుత్రకామేష్టి యందు పరమాన్నమున
పరగ జనించిన పర బ్రహ్మము
సురల రక్షింపగ అసురుల శిక్షింపగ
తిరమై ఉదయించిన దివ్య తేజము
చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో
సంతతము నిలిచిన సాకారము
వింతలుగా మునులెల్ల వెదకిన యట్టి
కాంతుల చెన్ను మీరిన కైవల్య పదము
వేద వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు
పాదుకొన పలికేటి పరమార్ధము
ప్రోదితొ శ్రీ వేంకటాద్రి పొంచి విజయ నగరాన
ఆదికి అనాదియైన అర్చావతారము
అదె చూడరయ్య పెద్ద హనుమంతుని
గుదిగొని దేవతలు కొనియాడేరయ్య
ఉదయాస్తశైలములు ఒకజంగగా చాచె
అదివో ధృవమండల మందె శిరసు
చదివె సూర్యుని వెంట సారె మొగము ద్రిప్పుచు
ఎదుట ఈతని మహిమ యేమని చెప్పేమయ్య ||
దండిగా బ్రహ్మాండము దాక తోకమీదికెత్తె
మెండగు దిక్కుల నిండా మేను వెంచెను
గుండు గూడ రాకాసుల కొట్టగ చేతుల చాచె
అండ ఈతని ప్రతాప మరుదరుదయ్యా ||
దిక్కులు పిక్కటిల్ల్లగ దేహరోమములు పెంచె
పక్కన లోకములకు ప్రాణమై నిల్చె
ఇక్కడా శ్రీవెంకటేశు హితవరి బంటాయ
మిక్కిలి ఈతని లావు మేలు మేలయ్య ||
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.