దేవతలకే రూపురేఖలు దిద్దిన మహా చిత్రకారుడు రాజా రవి వర్మ. రాజా రవివర్మ ట్రావెంకూర్ రాష్ట్రం (నేటి కేరళ) లోని కిలిమనూర్ నందు జన్మించాడు. తండ్రి గొప్ప పండితుడు, తల్లి కవయిత్రి, రచయిత్రి.
యుక్తవయసులోనే రామస్వామి నాయుడు వద్ద వాటర్ పెయింటింగ్, డచ్ జాతీయుడు తీడార్ జన్సన్ వద్ద ఆయిల్ పెయింటింగును నేర్చుకున్నాడు.వియన్నాలో 1873లో జరిగిన పెయింటింగ్ ఎగ్జిబిషన్ నందు ఆయన పెయింటింగుకు అవార్డ్ లభించడంతో చిత్రకారుడిగా ప్రపంచ ప్రసిద్ధి గాంచాడు. 1893లో చికాగోలో జరిగిన వరల్డ్ కొలంబియన్ ఎక్స్పోజిషన్ నందు ఆయన పెయింటింగులకు రెండుబంగారుపతకాలు లభించాయి. వస్తు పరిజ్ఞానం కొరకు భారతదేశం అంతటా పర్యటించాడు. దక్షణభారతీయ స్త్రీల సౌందర్యం ఎక్కువగా తన చిత్రకళా వస్తువుగా తీసుకుని హిందూ దేవతలకు, కావ్య మరియు పురాణ నాయికానాయకులకు రూపురేఖలు కల్పించాడు. చీరకట్టుకున్న స్త్రీలను అందంగా, చక్కని వంపు సొంపులతో చిత్రించడంలో అతనికి అతనే సాటి.ముఖ్యంగా దుష్యంతుడు శకుంతల, నలదమయంతి తైలవర్ణ చిత్రాలు ప్రత్యేక గుర్తింపును పొందాయి. భారత, రామాయణములందలి పాత్రలనేకం ఆయన ఊహాచిత్ర సృష్టే. అంటే ఆ పాత్రల రూపురేఖలు నేటికీ అలాగే స్థిరపడి పోయాయి. మనందరికీ రాముడంటే ఇలానే వుంటాడు. అలాగే మిగిలిన దేవతా చిత్రాలను వేసి మనకు పరిచయం చేసాడు. మన దేవతలందరికీ మానవరూపం ఇచ్చిన మహా చిత్రకళాకారుడు. రవివర్మ పేరుకు ముందు 'రాజా' అన్నది అతని పెయింటింగ్స్‌కి పురస్కారంగా బ్రిటిష్ వారు ఇచ్చిన బిరుదు. ఆ ప్రాంతపు స్త్రీలే ఆయన పెయింటింగ్స్‌కు స్ఫూర్తిగా నిలిచారని ప్రతీతి. ఆయనకు 1873లో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన వియానా ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో ఆయన పెయింటింగ్‌కు ప్రధమ బహుమతి లభించింది. అప్పటి నుంచే ఆయన పేరు దశదిశలా వ్యాపించింది. ఈయన్ని భారతీయ పికాసోగా చెప్పవచ్చు. రవివర్మకే అందని అందాలు లేవేమో. దేవతా చిత్రాలే కాకుండా ఎన్నో అందాలను చిత్రీకరించాడు. అక్టోబర్-2, 1906లో, 58 సంవత్సరాల వయసులో మధుమేహంతో మరణించాడు. ఈయన మరణించేనాటికి కిలామానూరు ప్యాలెస్‌లో 160 దాకా రవివర్మ చిత్రాలు ఉండేవని ప్రతీతి. ఆ తరువాత వాటిని అధికారికముగా తిరువనంతపురములోని చిత్రా ఆర్ట్ గ్యాలరీకి అందజేశారు.
lahari యీ రోజు నీవు పెట్టిన dance day &raja ravivarma posts చాల బాగున్నాయి
రిప్లయితొలగించండియీ వెసవి లొ నీ నుండి మరిన్ని మంచి posts ఆశిస్తున్నాం
tq
Thank u very much andi. thappakumdaa meeru aasimchinatte manchi postlu pettadaaniki prayatnisthaanu.
తొలగించండి