Blogger Widgets

మంగళవారం, ఆగస్టు 31, 2010

వసుదేవ సుతం దేవం

మంగళవారం, ఆగస్టు 31, 2010


వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం

దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం

అతసి పుష్ప సంకాశం హార నూపుర శోభితం 
రత్న కంకణ  కేయూరం కృష్ణం వందే జగద్గురుం

కుటిలాలక సంయుక్తం పూర్ణ చంద్ర నిభాననం
విలసత్ కుండల ధరం కృష్ణం వందే జగద్గురుం




మందార గంధ సంయుక్తం చారు హాసం చతుర్భుజం
బహి: పింఛావ చూడాంగం  కృష్ణం వందే జగద్గురుం 

ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీల జీమూత సన్నిభమ్

యాదావానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్

గోపికానాం కుచద్వందం కుంకుమాంకిత   వక్షసం
శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం

రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుసోభితం
అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం




 శ్రీ వత్సాంగం మహోరస్కం వనమాలా విరాజితం
శంఖ చక్ర ధరం దేవం  కృష్ణం వందే జగద్గురుం 

గురువారం, ఆగస్టు 26, 2010

శ్రీ సాధు శ్యాంప్రసాద్ గారి పదవీ విరమణ

గురువారం, ఆగస్టు 26, 2010

మా తాత  శ్రీ సాధు శ్యాంప్రసాద్ గారి పదవీ విరమణ  చేస్తున్న సంధర్భంగా 
మా తాతయ్య  చింతా రామకృష్ణారావు గారు రచించిన సన్మానకుసుమాంజలి సమర్పిస్తూ, 
 మన లహరి బ్లాగు ద్వారా  అబినందనలు తెలియ జేస్తున్నాను. 

శ్రీ సాధు శ్యాంప్రసాద్

శ్రీరస్తు                 శుభమస్తు               అవిగ్నమస్తు.
శ్రీ సాధు శ్యాంప్రసాద్ (ఎడ్మినిష్ట్రేటీవ్ ఆఫీసర్. బీ.ఐ.యీ. ) 
తే.. 31 - 8 - 2010.ని పదవీ విరమణ చేయుచున్న సందర్భముగా సమర్పించిన
సన్మాన కుసుమాంజలి.
రచన:- చింతా రామ కృష్ణా రావు.(రిటైర్డ్ తెలుగు లెక్చరర్)

శాll శ్రీమత్ సాధు సు పూజ్య పాద యుగళా శ్రీయుక్త వక్షా! హరీ!
ధీమంతుండగు సాధు శ్యాముడిపుడే దేదీప్య మానంబుగా
ప్రేమన్ జేసెడి వృత్తిలో విరమణం బ్రీతిన్ యొనర్చెన్. తనన్
ప్రేమం గాచి; సుఖంబులిచ్చి నిలుమా! శ్రీమంత రక్షింపగన్. 1

ఉll సాధు సు పూజ్య వంశమున చక్కగ సుబ్బమ సత్య నార్యకున్
మాధవుడిచ్చు సత్ ఫలము మాదిరి పుట్టితి వీవు శ్యాంప్రసాద్!.
శ్రీధవుడట్లు పొందితివి సీతను. కంటిరి రామ కృష్ణునిన్;
మేదుర భావ పూర్ణుఁడగు మేధగ సత్ కిరణున్; సతాంవరా!  2

సీll పరగితి వెల్డీసి పదవిలో పందొమ్ది - వందల డబ్బది తొందిలోన.
ఎనుబది మూడులో నెనరున యూడీసి - పదవి నందితి వీవు ప్రబఁ జేయ.
రెండు వేల్రెండులో నిండగు మనమున - సూపరిండెంటువై శోభిలితివి.
రెండువేలెమ్దిలోనిండగు యేవోగ - పదవి చేపట్టి సత్ప్రభను గొలిపి;
గీll నేటి వరకును చూడ నీ సాటి లేరు
లేరు లేరను తీరున గౌరవమును
పెంచినాడవు పదవికి. ప్రీతితోడ
ముప్పదేడులు గడిపిన పుణ్య తేజ!  3

ఉll చేసిన సేవ లన్నిటిని శీఘ్ర గతిన్ గురితించె పాలకుల్.
బాసట నిల్చి నీదు ప్రతిభన్ గొనియాడుచు ప్రోత్సహించుచున్.
నీ సరి లేరనంగ వరణీయ మహాద్భుత సేవఁ జేసి నీ
వాసిని చూపినావు.వర భావ సముజ్వల దివ్య మూర్తిరో!  4. 

సీll ఆకాశ వాణిలో నద్భుత నాటక  - పాత్రలు వేసిరి ప్రతిభ చూపి;
దూరదర్శనునందు తులలీని నిపుణత - చూపి పాత్రలు వేసి శోభిలితిరి.
ప్రకటిత సేవల నుకళానికేతను - నందు జేసి బహుమతందినారు.
నాటక రంగాన మేటి నటనఁ జూపి; - రేకపాత్రలు వేసి రింపుతోడ.
ముచ్చటతో మీరు ముప్పదియారు నా - టకములలో వేసి రికద! మహిత!
అవధానముల పృచ్ఛకాగ్రణిగా నిల్చి; - గరికిపాటియె మెచ్చగా రహించి;
పెక్కు సంస్థలలోన ప్రఖ్యాత సేవలు - చేసి సజ్జనమదిఁ జేరినావు.
సాంఘిక సేవలు సారస్వతపు సేవ - నేత్ర దానాదులు నెరపినావు.
గీll మంచి వృత్తముఁ గలిగిన మాననీయ!
నేటి పదవీ విరమణను నెరపు నిన్ను
దైవమారోగ్యమిచ్చుత! దయను గనుత!
మంగళాత్ముఁడ! నీకు సన్మంగళములు. 5.

మంగళం                                                                                మహత్         
   శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ 

మదర్ థేరిస



మదర్ థెరీసాగా పేరు పొందిన ఆగ్నీస్ గోక్షా బొజాక్షువు . జన్మదినము నేడు ఆగస్టు 26 వ తేదీన. మాసిడోనియాలోని అల్భేనియన్స్ కి పుట్టినారు.  మదర్ ధేరిస పేద రోగులు సేవచేసి  అందరికీ మదర్ అయ్యారు.  ఆమెసేవకు నోబుల్ బహుమతి ని అందించారు అంతే కాదు మన భారత దేశపు ప్రముఖ  అవార్డు భారతరత్న ని ఇచ్చి ఆమెను గౌరవించారు.  ఆమె రోమన్ కేధలిక్ సన్యాసి గా జీవించారు.  
ఈ రోజు ఆమె చెప్పున గొప్ప మాట తలుచుకుందాం ఎప్పుడూ ప్రార్ధించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న అన్నమాట అన్నారు ఆమె చాలా బాగా అన్నారు కదా ఆమె మాటని ఆధర్సంగా తీసుకుందాము మరి . 

మంగళవారం, ఆగస్టు 24, 2010

Happy Rakhi

మంగళవారం, ఆగస్టు 24, 2010

The festival of Raksha Bandhan is entirely dedicated to the love and affection shared between a brother and a sister. On this day, sisters pray for long life of their brothers and ask God to bless them with his blessings. Brothers, in turn, give them enticing rakhi gifts and promise to care life long. This custom has been there since time immemorial. Various other believes are associated with Rakhi and therefore, people follow certain custom and tradition to celebrate this festival.

శుక్రవారం, ఆగస్టు 20, 2010

Varalakshmi Vrath

శుక్రవారం, ఆగస్టు 20, 2010

Goddess Lakshmi means Good Luck to Hindus. The word ‘Lakshmi’ is derived from the Sanskrit word Laksya, meaning ‘aim’ or ‘goal’, and she is the goddess of wealth and prosperity, both material and spiritual.
Lakshmi is the household goddess of most Hindu families, and a favorite of women. Although she is worshipped daily, the festive month of October is Lakshmi’s special month. Lakshmi Puja is celebrated on the full moon night of Kojagari Purnima.
Worship of a mother goddess has been a part of Indian tradition since its earliest times. Lakshmi is one of the mother goddesses and is addressed as mata (mother) instead of just devi (goddess).
As a female counterpart of Lord Vishnu, Mata Lakshmi is also called ‘Shri’, the female energy of the Supreme Being. She is the goddess of prosperity, wealth, purity, generosity, and the embodiment of beauty, grace and charm.
I wish you happy Varalakshmi Vratham.

ఆదివారం, ఆగస్టు 15, 2010

Indian Independence Day

ఆదివారం, ఆగస్టు 15, 2010


Jai Bharath 
It  was  the   fifteen th  of  August . On  this day several  years ago ,  the  British  Government  finally  ended  their  rule  over  India  and  our  country  became  free . Therefore  we  celebrate  this day  every  year  as  the  National  Festival   Day  with  joy  and  merry- making   all  over  the  country .
In  the morning of this great day there is the flag-hoisting ceremony by  the head of each state  all over the country and singing our national anthem , Jana  Gana Mana  . The national flag 
is hoisted  at railway stations ,colleges , schools , post offices  ,other public buildings and event at some business houses. parades and  processions are held, and they make an exciting  sight for people,  especially for the children . 
In the evening there are parties and entertainment in many homes. There are beautiful illuminations on many public building . crowds of people including go eagerly to see light .
Not  only  children  ,even  adults are happy on this day .After all we are celebrating the day when we became free.
for over two hundred years, British ruled over us.Our countrymen and women ,led by our great leaders like Mahatma Gandhi , fought for this freedom and many of them suffered a lot. They were sent to jail;some were even killed. But they struggled and died so that we could be free.
Jai Hindh.

శనివారం, ఆగస్టు 14, 2010

Happy Independence day

శనివారం, ఆగస్టు 14, 2010


మా బ్లాగ్ మిత్రులందరికీ నా తరపున మా కుటుంబసభ్యులతరపునా అందరికీ భారతస్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

సోమవారం, ఆగస్టు 09, 2010

మా తెలుగు తల్లికి మల్లె పూదండ -శంకరంబాడి సుందరాచారి

సోమవారం, ఆగస్టు 09, 2010


శంకరంబాడి సుందరాచారి గారు తెలియని వారువుండరు. మన రాష్ట గీతాన్ని రచించింది శంకరంబాడి సుందరాచారి గారి. ఆయన జన్మదినము ఆగష్ట్ 10 న. ఆయన చాలా రచనలు రచించారు. అందులో మన రాష్ట్ర గీతముగా మా తెలుగుతల్లికి మల్లెపూదండ రచించారు ఆ పాటలో మన రాష్ట్రంలో ముఖ్యమైన నదులు ప్రదేశాలు, సంసృతి , సాహిత్యాలు, ప్రముకుల పేర్లు ప్రాముఖ్యత చక్కని తెలుగులో అందంగా రచించారు. తెలుగు వారందరు హాయిగాపాడుకునేటట్టు రచించారు.
పాటచివరన జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! ముగించారు పాటని.
ఆయన జన్మదినం రోజు న ఆయన మన రాష్ట్ర గీతాన్ని వారి గొప్పతనాన్నిగుర్తుచేసుకున్నందుకు నేను సంతొషిస్తున్నాను.



మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కను చూపులో కరుణ
చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి
గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలు తాయి
అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక
రుద్రమ్మ భుజ శక్తి
మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక
నీ ఆటలే ఆడుతాం
నీ పాటలే పాడుతాం
జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!

శుక్రవారం, ఆగస్టు 06, 2010

THE GHOST PIRATE ATTACKS

శుక్రవారం, ఆగస్టు 06, 2010

ఆదివారం, ఆగస్టు 01, 2010

పింగళి వెంకయ్య

ఆదివారం, ఆగస్టు 01, 2010



పింగళి వెంకయ్య గారు  మన జాతి మొత్తం గుర్తుచేసుకొని గర్వించగల మహామనిషి అందులోను ఈయన మన ఆంద్రుడు. ఈయన జన్మ్దదినము ఆగష్టు 2వ తారీకున.వెంకయ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లా మచిలీపట్నము సమీపమున ఉన్న ప్రస్తుత మొవ్వ మండలములోనిభట్లపెనుమర్రు గ్రామములో హనుమంతరాయుడు మరియు వెంకటరత్నమ్మ దంపతులకు జన్మించారు.  ఈయన గొప్ప స్వాతంత్ర్య సమర యోధుడు మరియు భారతదేశ జాతీయ పతాక రూపకర్త .
1916 సంవత్సరం లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండానే ఎగురవేశారు.  లాలా హన్స్ రాజ్ మన జాతీయ పతాకంపై రాట్న చిహ్నముంటే బాగుంటుందని సూచించగా గాంధీజీ దాన్ని అంగీకరించాడు.అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు బెజవాడలో జరిగాయి. గాంధీజీ, వెంకయ్యను ఆ సమావేశానికి పిలిపించి కాషాయం- ఆకుపచ్చ రంగులు కలిగి, మధ్య రాట్నంగల ఒక జెండాను చిత్రించమని కోరాడు.  మహాత్ముని సూచనపై కాషాయం, ఆకుపచ్చ రంగులు కలిగి, మధ్యన రాట్నం చిహ్నం గల జాతీయ జెండాను సమకూర్చాడు వెంకయ్య. అనంతరం కోత్త ఆలోచన మీద, సత్య- అహింసలకు ప్రత్యక్ష నిదర్శనమైన తెలుపు రంగును కూడా ఉండాలని గాంధీజీ అభిప్రాయపడగా, వెంకయ్య ఆ జెండాలో అదనంగా తెలుపు రంగును చేర్చి నేటి త్రివర్ణ పతాకాన్ని దేశానికి అందించారు. కాషాయ రంగు హిందువులకు చిహ్నమని, ఆకుపచ్చ ముస్లింలకని పేర్కొనడంతో, ఇతర మతాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలనే అభిప్రాయం వెలువడడంతో గాంధీజీ సూచనపై ఆకుపచ్చ, కాషాయ రంగులుతో పాటు తెలుపు కూడా చేర్చి త్రివర్ణ పతాకాన్ని వెంకయ్య రూపొందించాడు. మధ్యనున్న రాట్నం చిహ్నం గ్రామ జీవనాన్ని, రైతు కార్మికత్వాన్ని స్పురింప చేస్తుందన్నారు. అంటే కార్మిక కర్షకులపై ఆధారపడిన మన దేశం, సత్యాహింసలపై ఆధారపడటంతో సుభిక్షంగా ఉంటుందని మన ఆశయం. ఆ ఆశయ చిహ్నమే మన త్రివర్ణ పతాకం.1947జూలై 22 వ తేదీన భారత రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ , మునుపటి త్రివర్ణ జెండాలోని రాట్నం మాత్రం వదిలి, దాని బదులు అశోకుని ధర్మచక్రం చిహ్నంగా యిమిడ్చారు. చిహ్నం మార్పు తప్పితే పింగళి వెంకయ్య రూపొందించిన జెండాకు నేటి జెండాకు తేడా ఏమీ లేదు. అశోకుని ధర్మచక్రం మన పూర్వ సంస్కృతికి సంకేతం.  పింగళి వెంకయ్య 1906 నుంచి 1922 వరకు భారత జాతీయోద్యమంలోని వివిధ ఘట్టాలలో పాల్గొన్నాడు. వందేమాతరం, హోంరూల్ ఉద్యమం, ఆంధ్రోద్యంలాంటి ప్రసిద్ధ ఉద్యమాలలో ప్రాధాన పాత్రధారిగా ఉన్నాడు.
గాంధీజీ ప్రోద్భలంతో త్రివర్ణపతాకం పుట్టింది ఆంధ్రప్రదేశ్ లోనే. మన జాతికొక పతాకం కావాలని, అదీ ఒక ఆంధ్రుని ద్వారా రూపొందిచడటం , ఆంధ్రులందరికీ గర్వకారణమైన విషయం. .జాతీయ పతాకం రెప రెప ఎగిరినంతకాలం వరకు స్మరించుకోదగిన ధన్యజీవి పింగళి వెంకయ్య . ఆయన జన్మదినము నాడు ఆయన గురించి తెలుసుకొని వివరిస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను.  ఈసందర్భంగా పింగళి వెంకయ్యగారికి మన యావజాతి అందరి తరపున Heads off  చెప్తున్నాను.

Happy friendship day

స్నేహం అంటే చాలా గొప్పబంధం. అలాంటి బంధం గురించి వర్ణించటం ఎవరి తరంకాదు . దానికి హద్దులు , ఎల్లలు వుండవు. మనకు అతి దగ్గర సన్నితులు కేవలం స్నేహితులు మాత్రమే. ఆతరువాతె ఎవరైనా. ఆఖరికి మన అమ్మానాన్నలైనా సరె. స్నేహితులు తరువాత.
స్నేహాన్ని గురించి వివేకానందుడు ఇలా అన్నారు. శత్రువు ఒక్కడైనా ఎక్కువే మిత్రులు వందాయినా తక్కువే అని.
గౌతమ బుద్దుడు ఎమ్మానారో తెలుసా విశ్వాసం లేకుండా స్నేహంలేదు అని.
ఎవరితోనైనా స్నేహం చేయడం సులభమే, కానీ ఎక్కువ కాలం నిలుపుకోగలకడమే కష్టం.
మాటలకే పరిమితమయ్యే మిత్రుడెపుడు నీ మిత్రుడుగా ఉండలేడు.
ఇచ్చింది మరిచిపోవడం, పుచ్చుకున్నది జ్ఞాపకం ఉంచుకోవడమే స్నేహం.
నీ తప్పును, నీ తెలివి తక్కువ పనులను నీ ముందు ఉంచువాడే  నిజమైన నీ స్నేహితుడు.
ఇలా ఒక్కొక్కరు మంచి స్నేహితుని గురించి వర్ణించారు. 
స్నేహాన్ని అభివర్ణించటం చాలా కష్టం .
సరే అందరికి మరో సారి స్నేహితులు అందరికీ స్నేహితుల రోజు శుభాకాంక్షలు.

Mile Sur Mera Tumhara

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)