హాయ్! ముందుగా అందరికి దసరా నవరాత్రి శుభాకాంక్షలు.
అక్టోబర్ 2 వ తారీకునా మా తాతగారు అయినా చింతా రామకృష్ణ రావు గారు http://andhraamrutham.blogspot.com/ ) వారి 61 వ పుట్టిన రోజు అంటే షష్టి పూర్తి అన్నమాట. తాత పుట్టిన రోజు దగ్గర పడిపోతుంది. నాకు ఏమి చెయ్యాలో తెలియటం లేదు. మా తాతకి పద్యాలు అంటే ఇష్టం నాకు పద్యాలు రాయటం రాదు. మాతాతకు ఏమి గిఫ్ట్ ఇవ్వాలో అర్ధం కావటం లేదు. మీరు నాకు ఒక హెల్ప్ చెయ్యాలి అది ఏమిటంటారా! ఏమీలేదు. మాతాత పుట్టినరోజుకు నేను ఏమి చేస్తే బాగుంటుందో ఒకమంచి సలహా ఇవ్వండి. లేదా మీరు కూడా పద్యాలు రాయగాల్గితే మాతాత పేరు మీద అందమైన పద్యాలు రాసి మీ అభినందనలతో పద్యాలు రాసి ఈపోస్ట్ కు కామెంట్ గా పెట్టండి నేను అవి ప్రింట్ అవుట్ తీసి మాతాతకు అందిస్తాను. నాకు మంచి సలహా ఇస్తారని ఆశిస్తున్నాను. నాకు సలహా ఇస్తున్నందుకు ముందుగానే ధన్యవాదములు తెలుపుతున్నాను. మరి మీ సలహాలు/పద్యాలు కోసం ఎదురుచూస్తూ.............
మీ శ్రీ వైష్ణవి.