హాయ్! ముందుగా అందరికి దసరా నవరాత్రి శుభాకాంక్షలు.
అక్టోబర్ 2 వ తారీకునా మా తాతగారు అయినా చింతా రామకృష్ణ రావు గారు http://andhraamrutham.blogspot.com/ ) వారి 61 వ పుట్టిన రోజు అంటే షష్టి పూర్తి అన్నమాట. తాత పుట్టిన రోజు దగ్గర పడిపోతుంది. నాకు ఏమి చెయ్యాలో తెలియటం లేదు. మా తాతకి పద్యాలు అంటే ఇష్టం నాకు పద్యాలు రాయటం రాదు. మాతాతకు ఏమి గిఫ్ట్ ఇవ్వాలో అర్ధం కావటం లేదు. మీరు నాకు ఒక హెల్ప్ చెయ్యాలి అది ఏమిటంటారా! ఏమీలేదు. మాతాత పుట్టినరోజుకు నేను ఏమి చేస్తే బాగుంటుందో ఒకమంచి సలహా ఇవ్వండి. లేదా మీరు కూడా పద్యాలు రాయగాల్గితే మాతాత పేరు మీద అందమైన పద్యాలు రాసి మీ అభినందనలతో పద్యాలు రాసి ఈపోస్ట్ కు కామెంట్ గా పెట్టండి నేను అవి ప్రింట్ అవుట్ తీసి మాతాతకు అందిస్తాను. నాకు మంచి సలహా ఇస్తారని ఆశిస్తున్నాను. నాకు సలహా ఇస్తున్నందుకు ముందుగానే ధన్యవాదములు తెలుపుతున్నాను. మరి మీ సలహాలు/పద్యాలు కోసం ఎదురుచూస్తూ.............
మీ శ్రీ వైష్ణవి.
A good gift to any one is a big hug with a smile that has 100000 KVA lighting.........
రిప్లయితొలగించండిConvey my wishes also to your grand pa.
నేను వేసిన టప్పటి అడుగులను
రిప్లయితొలగించండిఎప్పటికప్పుడు సరిదిద్దిన మా తాత
ఈ షష్టి పూర్తి కి నేనిచ్చే చిన్న Gift అని give him a hug
తాతగారి పుట్టినరోజుని ఘనంగా జరపాలన్న నీ ఆలోచన బావుందమ్మా! నువ్వు కొత్త పద్యాలు రాయక్కర్లేదు. ఉన్నవే ఆరోజు భావయుక్తంగా చదివి వినిపించు మీ తాతగారికి...చాలా సంతోషిస్తారు.
రిప్లయితొలగించండిచిరంజీవి వైష్ణవిని దీవించి ! " తాతగారి షష్టి పూర్తి సందర్భం గా నువ్వు చక్కగా ఆయన ఒడిలో కూర్చుని , తీయని కబుర్లు , అంత కంటే తీయని ముద్దులు ఇస్తే చాలు .
రిప్లయితొలగించండి" చిరంజీవి రామ కృష్ణా రావూ గారి దంపతులని " ధన కనక వస్తు వాహనములతో ఆయురారోగ్య ఐశ్వర్యములతో , మనవలు , ముని మనవలతో , నిండు నూరేళ్ళు హాయిగా వర్ధిల్లాలని వారి కీర్తి ప్రతిష్టలు శతాబ్దాల దిగంతాల వరకు వెల్లి విరియాలని మనసారా దీవిస్తూ అక్క .
విజయ దశమి సందర్భం గా అందరికీ శుభా కాంక్షలు
రిప్లయితొలగించండిమా తెలుగు గురువుగారికి
రిప్లయితొలగించండిఈ తీరుగ తెలుగులోన హృద్యమవంగన్
జోతలు తెలిపెద "ఓ మా
తాతయ్యా షష్ఠపూర్తి దండంబులివే" :)
మీ తాతగారికి నానుంచీ షష్టి పూర్తి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండి