భారతీయవాన్మయములో నారదుడు లేని కధే లేదు. ఆ మహానుభావుడు చేసినా అది లోకకళ్యానానికే దారితీస్తుంది. వామనావతారంలోని విష్ణువు పాదము ఆకాశానికి తాకినప్పుడు ఆ విష్ణువు పాదాన్ని కడగటానికి బ్రహ్మ తన మానస పుత్రునిని నీళ్ళు పోయమన్నాడు బ్రహ్మ. అలాగే నారదుడు నీరు పోసాడు. అందుకే ఆయనను నారదుడు అంటారు. బ్రహ్మ తేజస్సుతో, నలిననాభుని, లక్ష్మి దేవిని కూడా శపించగల శక్తి తనకు తానె సంపాదిచుకున్నాడు. దక్షుని శాపంతో కలహాల మునిగా మారాడు. ఆ కలహాలు కూడా దుష్ట శిక్షణకు, అహంకారము అణచువేయటానికి, అసూయ పోగొట్టటానికి, లోకాలకు మంచిని పంచటానికి ఉపయోగపడేవి. ఎల్లప్పుడూ నారాయణ స్మరణం తో భక్తి భావానికి ప్రతీకగా నిలబడి భగవంతుని మన హృదయంలో బందిచుటకు కావలసిన భక్తి సూత్రాలను ప్రవచించిన పరమ భక్త శిఖామణి, మహర్షి నారదుడు. అహంకారంపడి, ఆడజన్మను పొంది, చారుమతి అయ్యి విష్ణు మాయను తెలుసుకున్న తరించిన పుణ్యమూర్తి, ఆ మహనీయుని జీవితం, పరోపకారానికి, లోక కల్యాణానికి ఉపయోగించారు. సాధనతో ముందు అడుగు వేయవచ్చు అని తన సంగీతం నేర్చుకోవటం తో నిరూపించారు (విద్య స్పర్ధతో పెరుగుతుందని నిరూపించారు). నారదుని జీవితం మనకు ఆదర్శము.
జై శ్రీమన్నారాయణ.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.