ఆనాడు యశోద మాత చేత రోటికి కట్టివేయబడిన అందాల వన్నెల చిన్నెల గోవిందుడే గోపికల నయనారవిందుడు అయినాడు. వారి కన్నులలో ప్రణయ జ్యోతిని వెలిగించి మనసును రగిలించి చిన్ని కృష్ణుని రాకకై ఎదురు చూసే గోపికలు కార్తీక పౌర్ణమి నాడు యమునా స్నానాలు ఆచరించి నోచే నోములు నోచి, గౌరీ దేవిని పూజించేవేళ గోపికల కోకలు దాచి పొన్నచెట్టు గుబురులలో వేణువును ఊదుతున్నాడు.
అప్పుడు గోపికలు వారిచేలికత్తేలతో ఇలా పాడుతున్నారు. వెన్నదొంగ గురించి వారు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. వారి కోకలు చెట్టుకు దాచి పొన్నచెట్టు కొమ్మను ఎక్కాడని. శ్రీ కృష్ణుని ఏరకంగా వారికీ కనిపిస్తున్నాడో వారు ఆయన అందాన్ని వర్ణిస్తూ చెప్పుకుంటున్నారు. వారి మనసులో శ్రీ కృష్ణుని మీద భక్తి, ప్రేమ ను వారు ఈ పాటలో అందంగా చెప్తున్నారు.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.