రామన్ మెగసెసే పురస్కారంన్యూయార్క్కి చెందిన రాక్ ఫెల్లర్ సహోదరులు ఫిలిప్పీన్స్ ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన ఒక పురస్కారం. ఫిలిప్పీన్స్ దేశపు మాజీ అధ్యక్షుడైనరామన్ మెగసెసేజ్ఞాపకార్థం దీనిని1957లో ఏర్పాటు చేశారు. ఇది తరచూ "ఆసియా ఖండపు నోబెల్ బహుమతి"గా అభివర్ణించబడుతుంది.ప్రతి సంవత్సరం రామన్ మెగసెసే ఫౌండేషన్ తమతమ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినఆసియాదేశపు వ్యక్తులకు ఈ అవార్డును ప్రధానం చేస్తుంటుంది.ఈ బహుమతిని ప్రధానంగా క్రింది ఆరు విభాగాల్లో ప్రకటిస్తారు.
ప్రభుత్వ సేవ
ప్రజా సేవ
సామాజిక నాయకత్వం
జర్నలిజం, సాహిత్యం, సృజనాత్మకత
ప్రపంచ శాంతి
అత్యుత్తమ నాయకత్వ లక్షణాలు
కలవారికి మెగసెసే అవార్డ్ ఇస్తారు అని అందరికి తెలుసు. అయితే ఆ ఆవార్డ్ ఎవరుపేరుమీద ఇస్తారు అన్నది నేను చెప్పేస్తాను. రామన్ మెగసెసే పిలిప్పైన్ ఏడవ ప్రెసిడెంట్ గా పనిచేసారు. ఈయన ఆగస్టు 31, 1907 న Iba అనే ప్రదేశంలో పిలిప్పైన్స్ లో జన్మించారు. ఈయన తండ్రి పేరు Exequiel Magsaysay మరి తల్లి పేరు Perfecta de Fierro, మెగసెసే ఆర్మీలో కూడా పనిచేసారు. ఈయన మార్చ్ 7, 1957 న Mt.Manunggal, Cebu అనే ప్రదేశములో ప్లైన్ ఆక్సిడెంట్ లో చనిపోయారు. అప్పటికి మెగసెసే వయసు 50 సంవత్సరములు. ఈయన మీద అభిమానంతో రామన్ మేగాసేసే పేరుతో ఎంతో విశిష్టమైన అవార్డులు ఇవ్వటం మొదలు పెట్టారు. రామన్ మెగసెసే జయంతి సందర్బముగా ఆయనగురించి తెలుసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాను.
హరికథా పితామహుడుఆదిభట్ల నారాయణదాసు గారు 31 ఆగస్టు 1864 జన్మించారు. ఈయన పూర్తి పేరు అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు ప్రముఖహరికథాకళాకారుడు, సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేసిన రచయిత, కవి, బహుభాషా కోవిదుడు, తాత్వికుడు. తెలుగునాటనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా హరికథా ప్రదర్శనలిచ్చి, ప్రజల మన్ననలను పొందిన కళాకారుడాయన. "శ్రీమత్" మరియు "అజ్జాడ" పదాలు కలిపి "శ్రీమదజ్జాడ నారాయణ దాసు" గురువునకు వందనములు చెప్పడం హరికథారంభంలో ఇప్పటికీ కళాకారులు పాటిస్తున్న సంప్రదాయం. ఈయన చిన్నతనం నుండి కూడా ఏకసంథాగ్రాహి. చిన్న తనంలో కూడా భాగవతం పద్యాలు చాలా బాగా పాడేవారు. ఈయన అష్టావధాని గా రాణించారు. తెలుగు, సంస్కృతం, హిందీ, బెంగాలీ, పారశీకం, ఉర్దూ, ఆంగ్లం, అరబ్బీ భాషలన్నింటిలో అనర్గళంగా హరికథను చెప్పగలిగిన హరికథా పితామహుడు. కవిత్వం, సంగీతం, నాట్యం ఈ మూడు ప్రక్రియలకు భక్తిని కలిపి హరికథ కు ప్రాణం వంటిది ఆరోజుల్లో మైకులు లేకుండానే హరికధ చెప్పేవారు. అయన సౌండ్ కంచు మోగినట్టు గట్టిగా పాడేవారు. దాసుగారు సుమారు 21 హరికధలు స్వర పరచారు అని చెప్పుకోవచ్చు.ఆదిభట్ల నారాయణదాసుగారు 2 జనవరి 1945 న మరణించారు. ఈరోజు ఆదిభట్ల నారాయణదాసు గారి జన్మదినం సందర్బంగా హరికధ విని ఆయనను గుర్తుచేసుకుందాం. హరికధ కళాఅభిమానులందరికి హరికధా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసుగారి జయంతి శుభాకాంక్షలు.
మదర్ థెరీసాగా పేరు పొందిన ఆగ్నీస్ గోక్షా బొజాక్షువు (ఆగష్టు 26, 1910 – సెప్టెంబరు 5, 1997) మాసిడోనియాలో అల్బేనియన్ సంతతికి చెందిన కుటుంబంలో జన్మించింది. ఈమె తన జీవితాన్ని పేద రోగులకు సేవచేయడంలోనే గడిపింది. ఈమె సేవకు గుర్తింపుగా 1979 లో ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారము లభించింది. ఈమెకు తరవాత భారతదేశ ప్రభుత్వం కూడా 1980లో భారతరత్నను ప్రకటించింది. ఈరోజు మదర్ థెరీస జయంతి సందర్బంగా అందరికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.
ఆకాశం లో ఎప్పుడైనా హరివిల్లు వస్తుంది కానీ ఆదివారం మాత్రం ప్రపంచం మొత్తం మీద ఒకేసారి హరివిల్లు వస్తుంది అదే నా షో పేరు హరివిల్లు. ఆహరివిల్లు కూడా ఉదయం 10:30 నుండి మద్యాహ్నం 12:00 గంటలవరకు వస్తుంది. అది కూడా ఎక్కడబడితే అక్కడ రాదండి కేవలం Online Radio Josh Live లో మాత్రమే వస్తుంది. ఇది కేవలము live ప్రోగ్రాం మాత్రమె కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి. నా కబుర్లు, పాటలు , కదలు వినటమే కాదండి మీరు నాతో సరదాగా మాట్లాడైవచ్చును. నాతో మాట్లాడి నాప్రశ్నలకు జవాబులు చెప్పెయవచ్చు. మరి హరివిల్లు షోను అస్సలు మిస్ అవ్వద్దు.
మరి నా షోపేరు చెప్పేసాను కదా, మరి నాతో మాట్లాడాలి అంటే
100 సంవత్సరముల విదేశీయుల పాలన నుండి శాశ్వితాముగా విముక్తి పొందిన దినమును మనము స్వాతంత్ర్య దినోత్సవముగా జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరము మనము 66వ స్వాతంత్రయదినోత్సవముగా జరుపుకుంటున్నాము . ఎందరో మహానుబావులు ఎన్నో త్యాగాలు చేసి స్వాతంత్ర్య భారతదేశానికి మనకు అప్పగించారు. దీనికి కొంతమంది అహింసా మార్గములో ప్రయత్నించారు. మరికొందరు హింసా మార్గములో ప్రయత్నించారు. చివరికి 1947 ఆగష్టు 15 న స్వాతంత్ర్యము పొందాం. అలా త్యాగాలు చేసి సాధించిన భారత మాతకు వందనం తెలుపుతూ. వారిని గుర్తు చేసుకొని జెండా ఎగురవేసాం కదా. ఈ స్వాతంత్ర్యదినోత్సవ దిన సందర్భముగా అందరికి నా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.