శుక్రవారం, ఆగస్టు 31, 2012
|
రామన్ మెగసెసే |
|
రామన్ మెగసెసే పురస్కారం న్యూయార్క్ కి చెందిన రాక్ ఫెల్లర్ సహోదరులు ఫిలిప్పీన్స్ ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన ఒక పురస్కారం. ఫిలిప్పీన్స్ దేశపు మాజీ అధ్యక్షుడైన రామన్ మెగసెసే జ్ఞాపకార్థం దీనిని 1957 లో ఏర్పాటు చేశారు. ఇది తరచూ "ఆసియా ఖండపు నోబెల్ బహుమతి"గా అభివర్ణించబడుతుంది. ప్రతి సంవత్సరం రామన్ మెగసెసే ఫౌండేషన్ తమతమ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆసియా దేశపు వ్యక్తులకు ఈ అవార్డును ప్రధానం చేస్తుంటుంది. ఈ బహుమతిని ప్రధానంగా క్రింది ఆరు విభాగాల్లో ప్రకటిస్తారు.
- ప్రభుత్వ సేవ
- ప్రజా సేవ
- సామాజిక నాయకత్వం
- జర్నలిజం, సాహిత్యం, సృజనాత్మకత
- ప్రపంచ శాంతి
- అత్యుత్తమ నాయకత్వ లక్షణాలు
కలవారికి మెగసెసే అవార్డ్ ఇస్తారు అని అందరికి తెలుసు. అయితే ఆ ఆవార్డ్ ఎవరుపేరుమీద ఇస్తారు అన్నది నేను చెప్పేస్తాను. రామన్ మెగసెసే పిలిప్పైన్ ఏడవ ప్రెసిడెంట్ గా పనిచేసారు. ఈయన ఆగస్టు 31, 1907 న Iba అనే ప్రదేశంలో పిలిప్పైన్స్ లో జన్మించారు. ఈయన తండ్రి పేరు Exequiel Magsaysay మరి తల్లి పేరు Perfecta de Fierro, మెగసెసే ఆర్మీలో కూడా పనిచేసారు. ఈయన మార్చ్ 7, 1957 న Mt.Manunggal, Cebu అనే ప్రదేశములో ప్లైన్ ఆక్సిడెంట్ లో చనిపోయారు. అప్పటికి మెగసెసే వయసు 50 సంవత్సరములు. ఈయన మీద అభిమానంతో రామన్ మేగాసేసే పేరుతో ఎంతో విశిష్టమైన అవార్డులు ఇవ్వటం మొదలు పెట్టారు. రామన్ మెగసెసే జయంతి సందర్బముగా ఆయనగురించి తెలుసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాను.
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.