హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు |
హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు గారు 31 ఆగస్టు 1864 జన్మించారు. ఈయన పూర్తి పేరు అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు ప్రముఖ హరికథా కళాకారుడు, సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేసిన రచయిత, కవి, బహుభాషా కోవిదుడు, తాత్వికుడు. తెలుగునాటనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా హరికథా ప్రదర్శనలిచ్చి, ప్రజల మన్ననలను పొందిన కళాకారుడాయన. "శ్రీమత్" మరియు "అజ్జాడ" పదాలు కలిపి "శ్రీమదజ్జాడ నారాయణ దాసు" గురువునకు వందనములు చెప్పడం హరికథారంభంలో ఇప్పటికీ కళాకారులు పాటిస్తున్న సంప్రదాయం. ఈయన చిన్నతనం నుండి కూడా ఏకసంథాగ్రాహి. చిన్న తనంలో కూడా భాగవతం పద్యాలు చాలా బాగా పాడేవారు. ఈయన అష్టావధాని గా రాణించారు. తెలుగు, సంస్కృతం, హిందీ, బెంగాలీ, పారశీకం, ఉర్దూ, ఆంగ్లం, అరబ్బీ భాషలన్నింటిలో అనర్గళంగా హరికథను చెప్పగలిగిన హరికథా పితామహుడు. కవిత్వం, సంగీతం, నాట్యం ఈ మూడు ప్రక్రియలకు భక్తిని కలిపి హరికథ కు ప్రాణం వంటిది ఆరోజుల్లో మైకులు లేకుండానే హరికధ చెప్పేవారు. అయన సౌండ్ కంచు మోగినట్టు గట్టిగా పాడేవారు. దాసుగారు సుమారు 21 హరికధలు స్వర పరచారు అని చెప్పుకోవచ్చు. ఆదిభట్ల నారాయణదాసుగారు 2 జనవరి 1945 న మరణించారు. ఈరోజు ఆదిభట్ల నారాయణదాసు గారి జన్మదినం సందర్బంగా హరికధ విని ఆయనను గుర్తుచేసుకుందాం. హరికధ కళాఅభిమానులందరికి హరికధా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసుగారి జయంతి శుభాకాంక్షలు.
వారి ఆత్మ కథ ఇక్కడ http://kinige.com/kbook.php?id=1057&name=Naa+Yeruka
రిప్లయితొలగించండివారి ఆత్మకథ ఇక్కడ http://kinige.com/kbook.php?id=1057&name=Naa+Yeruka
రిప్లయితొలగించండి