భారత దేశానికి స్వాతంత్ర్యము వచ్చి 66 సంవత్సారాలు అయ్యింది. మనకు ఈ స్వాతంత్ర్యము రావటానికి భారతీయులు చాలా కష్టపడ్డారని మనకు తెలుసు. ఎన్నో ఉద్య్యమాలు చేసారు. అందులో చాలా ప్రముఖమైన ఉద్యమము క్విట్ ఇండియా ఉద్యమం భారత స్వాతంత్య్రోద్యమంలో అతి ప్రధాన ఘట్టం. క్విట్ ఇండియా ఉద్యమం జరిగి నేటికి 71 సంవత్సరాలు పూర్తి అయ్యింది అందుకే దీనిగురించి చెప్పుకుందాం.
ఒకదేశ ప్రజలు తమ స్వాతంత్య్రం కోసం కష్టాలు నష్టాలకు ఓర్చిఎంతవరకు పోరాడగలరో ఎన్ని త్యాగాలు చేయగలరో 'క్విట్ ఇండియా ఉద్యమం ప్రపంచానికి చాటి చెప్పింది. క్రిప్స్ రాయబారం వల్ల ఎటువంటి ఉపయోగము లేదు అని తెలిసి 1942 ఆగస్టు 8న కాంగ్రెస్ వర్కింగ్ కమిటి ముంబాయి లో సమావేశమై స్వాతంత్య్ర పోరాటానికి చిట్టచివరిగా రూపొందించారు . ఆ ఉద్యమం తన జీవితంలో చివరిదని ఇందులో విజయమో, మరణమో తేలుతుందని మహాత్మాగాంధీజీ స్పష్టం చేసారు. జాతిపిత మహాత్మాగాంధీ క్విట్ ఇండియా (ఇండియా వదిలి వెళ్లిపోండి) అనిపిలుపు నిచ్చారు. 8న ముంబాయిలో జరిగిన సదస్సులో క్విట్ ఇండియా తీర్మానం జరుగగా మరుసటి (ఆగస్టు 9) రోజు నుంచి పెద్ద ఎత్తున లేచింది. దేశం మొత్తం మీదా ఈ ఉద్యమం పెరిగిపోవటం తో కాంగ్రెస్ ఉద్యమకారులను బ్రిటీష్ సైనికులు విజృంభించి చెల్లాచెదురు చేసారు. ఈ ఉద్యమం బ్రిటిష్ పాలకులకు ముచ్చెమటలు పట్టేల చేసింది. ఈ సందర్భముగా గాంధీజీని ఆగాఖాన్ భవనంతో నిర్బంధించారు. ఆయనతో పాటు గాంధీగారి భార్య కాస్తురిబాయి జైలులోనే మరణించింది. భారత స్వాతంత్రోద్యమానికి జాతిపిత మహాత్మా గాంధీ 1916 నుండి నాయకత్వం వహించారు. సత్యం- అహింసా, సిద్దాంతాలుగా, సత్యాగ్రహం ఆయుధంగా ఆయన చెప్పిన విషయాలు యావత్ భారత ప్రజలకూ ఆనాటి నుండి 'గాంధీ సిద్దాంతంగా మారింది. ఆయన వ్యక్తి సత్యాగ్రహం, నిరాహారదీక్ష మొదలగు అనేక ప్రక్రియలు చేబూని వ్యక్తిగతంగా ప్రయోగాలు చేశారు. ఎన్ని చేసి ఎంత నైపుణ్యంతో బ్రిటిష్ పాలకులతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. బ్రిటిష్ పాలకులు భారతదేశ ప్రజలతోగాని, జాతీయ నాయకులతోగాని చర్చలూ, సంప్రదింపులూ కూడా జరపకుండా, ఏకపక్షంగా భారతదేశ 40కోట్ల ప్రజల్ని 1939నాడు రెండవ ప్రపంచ యుద్ద మారణ హోమంలోకి ఈడ్చారు. ఈ దుశ్చర్యతో విసిగెత్తి పోయిన బాపూజీ, 1942 ఆగస్టు 9వ తేదీన జరిగిన అఖిలభారత కాంగ్రెస్ కమిటి ఆమోదించిన క్విట్ ఇండియా (భారత్ చోడ్) డూ ఆర్ డై (కరో యా మరో) తీర్మానాన్ని బలపరుస్తూ, సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. ఈ ఉపన్యాసంలో చెప్పిన విషయాలు ఇలా ఉన్నాయి. భారతీయులకే కాక, ఎల్ల మానవాళికీ సర్వకాలాలకి వర్తించే తాత్విక సత్యాలతో పరిపక్వమైన రాజకీయ చాతుర్యాన్ని, ఎత్తుగడల్ని, రాజకీయ నైపుణ్యాన్నీ, విజ్ఞతనీ, గాంధీజీ విశ్వసించిన సిద్ధాంతాల నైతిక సూత్రాల పరిణితినీ రుజువు చేస్తున్నాయి. ప్రజాస్వామ్యంపైనా, భారత ప్రజలపైనా గాంధీజీకున్న ప్రగాఢ విశ్వాసాన్ని, నమ్మకాన్ని తదనంతర సంఘటనలు రుజువు చేసాయి. పైగా ఆయన ఇచ్చిన నినాదం 'కరో యా మరో తక్షణ కర్తవ్యంగా భారత స్వాతంత్య్ర సాధనానికి, ఆఖరి పిలుపూ, కార్యాచరణ వివరాలూ ఆ ఉపన్యాసంలో ఉన్నాయి. గాంధీజీ 'బహుశా ఇది ఆఖరిసారేమో, మనం కల్సుకోవడం అన్నపుడు ఎఐసిసి సభ్యులు బాగా ఏడ్చేశారట. బానిసత్వంతో విసుగెత్తిపోయి, ఇంక భరించలేని ఆనాటి భారత ప్రజల యుద్ద నినాదం అది. అందుచేతనే ఆనాటి బ్రిటిష్ పాలకులను ఆ ఉపన్యాసం, ఆ పోరాట నినాదం ఆయన 'డూ ఆర్ డై భయభ్రాంతుల్ని చేసి, ఆ ఉపన్యాసం ఇచ్చిన గంటల లోపునే గాంధీజీని ముఖ్య నాయకుల్ని ఆనాడే ఆగస్టు 9వ తేదీన అర్థరాత్రివేళ జైలుకు పంపించి నిర్భంధించారు. బ్రిటిష్ పార్లమెంటు చర్చల్లో గాంధీజీ ఉపన్యాసాన్ని విమర్శిస్తూ, అహింసా వాదులమని చెప్పుకొంటూ భారతదేశాన్ని హింసతో కూడిన అరాచకానికి, రక్తపాతానికి ప్రోత్సహించాడు గాంధీజీ అని ఆనాటి బ్రిటిష్ ప్రధాన మంత్రి సర్ విన్‌స్టంట్ చర్చిల్ నిందించాడు. ప్రజలకీ వార్త తెలియగానే ఉత్సాహవంతులూ, చైతన్యవంతులూ అయిన ప్రతీ భారతీయుడూ గాంధీజీ సందేశం ప్రకారం, తానే నాయకుడై యావత్తు దేశంలో బ్రిటిష్ పాలకులపై పోరాటాలు జరిపారు. ఆ పోరాటంలో 5లక్షల మంది జైలు పాలైనారు. 5,000 గ్రామాలు బ్రిటిష్ ఊచకోతకు (ఎయిర్ స్ట్రాఫింగ్) బాంబులకు ఆహుతైనాయి). 40,000 మంది భారతమాత చరణాలపై ప్రాణాలు అర్పించారు.
- 958 మంది దేశభక్తులకు కొరడా దెబ్బ శిక్షలు పడ్డాయి. వేలాది గ్రమాలలో గ్రామస్వరాజ్యం స్థాపించగా, బ్రిటిష్ అధికారులు, తాబేదార్లూ తరిమివేయబడ్డారు. ఆగస్టు 14న పోలీసులు కాల్పులు జరిపి 76 గ్రామస్తులను కాల్చి చంపారు. 114 మందిని చావబాదారు. ఆ ప్రాంతంలో మొత్తం 60,000 మందిని అరెస్టు చేశామనీ, 940 మందిని చంపామనీ 1630 మంది క్షతగాత్రులయ్యారనీ బ్రిటీష్ పాలకులు ప్రకటించారు. 30 లక్షల మంది బెంగాల్ కరువులో మరణించారు.
- ఎట్టకేలకు 1947 ఆగస్టు 15వ తేదీన బ్రిటిష్ సామ్రాజ్య పతాకం నేలకు దింపబడి భారతీయ స్వేచ్ఛా కేతనం, త్రివర్ణ పతాకం ధర్మచక్రంతో నీలాకాశాన రెపరెపలాడింది. గాంధీజీ ధర్మమా అని ఆయన నాయకత్వం వల్ల భారత ప్రజలలో స్వాతంత్య్రాపేక్ష, భయరాహిత్యం స్థిరంగా నెలకొల్ప బడ్డాయి. అందుచేతనే ఆయన ఇచ్చిన నినాదం చావోరేవో తెల్సుకొనే దృఢ నిశ్చయానికి బానిసత్వం నుండి పిరికితనం నుండి సంపూర్తిగా విడుదల చేయడానికి భారత ప్రజలను కృతనిశ్చయుల్ని చేసింది.
క్విట్ ఇండియా తీర్మానం.
రిప్లయితొలగించండిక్విట్ ఇండియా డబ్బై సంవత్సరాలు అయినా ఇంకా ఇప్పుడు జరుగుతూ ఉంది - క్విట్ మా రాజ్యం అంటూ
జిలేబి
abbe jilebi indiaki swatantryam vachina tarwata telangaanaku vachindi telusu ko munddu....
రిప్లయితొలగించండి