రామచరితమానస , 16 , రామాయణ మహత్త్వం
దో - భనితి మోరి సబ గున రహిత , బిస్వ బిదిత గున ఏక |
సో బిచారి సునిహహిC సుమతి , జిన్హ కేC బిమల బిబేక || 9 ||
నాకవితలో ఎట్టి సుగుణములు లేవు . కానీ జగత్ప్రసిద్ధమైన శ్రీరామకథయను ఒకే ఒక సుగుణము కలదు , జ్ఞానులును , వివేక వంతులును దానిని ఎరిగి సాదరముగా ఆలకింతురు .
దో - భనితి మోరి సబ గున రహిత , బిస్వ బిదిత గున ఏక |
సో బిచారి సునిహహిC సుమతి , జిన్హ కేC బిమల బిబేక || 9 ||
నాకవితలో ఎట్టి సుగుణములు లేవు . కానీ జగత్ప్రసిద్ధమైన శ్రీరామకథయను ఒకే ఒక సుగుణము కలదు , జ్ఞానులును , వివేక వంతులును దానిని ఎరిగి సాదరముగా ఆలకింతురు .
రామాయణ మహత్త్వం
చౌ - ఎహి మహC రఘుపతి నామ ఉదారా | అతి పావన పురానా శృతి సారా ||
మంగల భావన అమంగల హారి | ఉమా సహిత జెహి జపత పురారీ || 1 ||
భనితి బిచిత్ర సుకబి కృత జోఊ| రామ నామ బిను సోహ న సోఊ ||
బిధుబదనీ సబ భాCతి సCవారీ | సోహ న బసన బినా బర నారీ || 2 ||
సబ గున రహిత కుకబి కృత బానీ | రామ నామ జస అంకిత జానీ ||
సాదర కహహిC సునాహిC బుధ తాహీ | మధుకర సరిస సంత గునగ్రాహీ || 3 ||
జదపి కబిత రస ఏకఉ నాహీC | రామ ప్రతాప ప్రగట ఎహి మాహీC||
సోఇ భరోస మోరేC మన ఆవ | కెహిC న సుసంగ బడప్పను పావా || 4 ||
ధూమఉ తజఇ సహజ కరుఆఈ | అగరు ప్రసంగ సుగంధ బసాఈ ||
భనితి భదేస బస్తు భలి బరనీ | రామ కథా జగ మంగల కరనీ || 5 ||
ఇందు సాంబశివుడు సర్వదా జపించు శ్రీరామచంద్రునిపావననామము గలదు . ఇది మిక్కిలి పవిత్రమైనది . వేద , పురాణములసారము , కళ్యాణములకు పెన్నిధి , అశుభములు రూపుమాపునది , అనేకకాలంకారభూషితైనను , ఎంత సౌందర్యవతి అయినను వస్త్రములుధరింపని స్త్రీ శోభింపదు . అట్లే మహాకవిచే వ్రాయింపబడినది అయినను మిక్కిలి ప్రశంసింపమైనదైనను రామనామము లేని కావ్యము శోభింపదు . కానీ అల్పజ్ఞుడైన కుకవిచే వ్రాయబడినను , అది గుణరహితమైనదైనను రామనామవైభవముచే అలంకృతమైన కావ్యమును సజ్జనులు సాదరంగా చదివి , విని ఆనందింతురు. తుమ్మెదలు పుష్పములోని మధువును గ్రోలినట్లు సత్పురుషులు గుణములనే గ్రహించుదురు . ఇందు కవితారసపోషణలేకున్నను శ్రీరామచంద్రునిప్రతాపము బహుదా కీర్తింపబడినది. ఇదియే నా సంపూర్ణ విశ్వాసమునకు మూలము . సత్సాంగత్యమువలన గౌరవముదక్కని వారెవరు ? పొగ అగరు సాంగత్యమున తన సహజమైన ఘాటును , కఱుకుధనమును వదలి సుగంధమునే వ్యాపింపచేయును . అట్లే నా కవిత సౌందర్య శోభితముకాకున్నాను రామకథావర్ణమహిమగుటవలన శుభప్రదమైనది .
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.