శనివారం, ఆగస్టు 10, 2013
తెలుగు రచయిత లలో ప్రముఖుడు ప్రసన్న కవి, భావకవి, అహంభావకవి, సుందరకవి గా పేరుపొందిన శంకరంబాడి సుందరాచారి కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు ప్రజలకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ అందించారు. సుందరాచారి మా తెలుగు తల్లికి.. గీతాన్ని 1942 లో దీనబంధు సినిమా కోసం రచించాడు. కానీ ఆ చిత్ర నిర్మాతకు ఆ పాట నచ్చక పోవటం వల్ల ఆ సినిమాలో చేర్చలేదు. టంగుటూరి సూర్యకుమారి గ్రామఫోన్ రికార్డు కోసం ఆ పాటను మధురంగా పాడిన తరువాతనే ఆ గీతానికి గుర్తింపు లభించింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి.. కూడా తేటగీతిలో రాసింది . ఈ పద్యం ఆయన రచనలలో మణిపూస వంటిది. రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని రమ్యంగా వర్ణించిన నాలుగు పద్యాలు అవి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించి గౌరవించింది.
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి
గల గలా గోదారి కదలి పోతుంటేను
బిల బిలా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి
అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తీయందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాక
రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతి భక్తీ
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణ రాయని కీర్తి
మా చెవులు రింగుమని మారు మ్రోగేదాక
నీ పాటలే పాడుతాం నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లీ,జై తెలుగు తల్లీ,జై తెలుగు తల్లీ
అనే పాటను రచించిన శంకరంబాడి సుందరాచారి గారి జయంతి నేడే ఆగష్టు 10,1914 . సుందరాచారి, 1914 ఆగష్టు 10 న తిరుపతి లో జన్మించాడు. మదనపల్లె లో ఇంటర్మీడియేటు వరకు చదివాడు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. బ్రాహ్మణోచితములైన సంధ్యావందనము వంటి పనులు చేసేవాడు కాదాయన. తండ్రి మందలించగా జంధ్యాన్ని తెంపివేసాడు. తండ్రి మందలింపుకు కోపగించి, పంతానికి పోయి, ఇంటి నుండి బయటికి వెళ్ళి పోయాడు.
భుక్తి కొరకు ఎన్నో పనులు చేసాడు. తిరుపతిలో హోటలు సర్వరుగా పని చేసాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పని చేసాడు. ఆంధ్ర పత్రిక లో ప్రూఫు రీడరుగా, ఉపాధ్యాయుడిగా, పాఠశాల పర్యవేక్షకుడిగా ఎన్నో వైవిధ్య భరితమైన పనులు చేసాడాయన.
అమితమైన ఆత్మవిశ్వాసం ఆయనకు. ఆంధ్ర పత్రికలో ఉద్యోగం చేస్తుండగా, ఒక ప్రముఖునిపై పద్యం వ్రాయవలసి వచ్చింది. నేను వ్యక్తులపై పద్యాలు వ్రాయను అని భీష్మించుకుని, దాని కోసం ఆ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు సుందరాచారి. తరువాత విద్యాశాఖలో పాఠశాల పర్యవేక్షకుడిగా పని చేసాడు. నందనూరు లో ఉండగా ఒకసారి పాఠశాల సంచాలకుడు వచ్చాడు. ఆ సంచాలకుడు సుందరాచారిని ప్యూనుగాను, ప్యూనును పర్యవేక్షకుడిగాను పొరబడ్డాడు. దానికి కోపగించి, సుందరాచారి ఆ ఉద్యోగానికి తక్షణమే రాజీనామా చేసాడు.
భార్య అనారోగ్యం కారణంగా ఆయన వేదన చెంది, జీవిత చరమాంకంలో ఒక రకమైన నిర్లిప్త జీవితం గడిపాడు. సుందరాచారి 1977 ఏప్రిల్ 8 న తిరుపతి, గంగుండ్ర మండపం వీధిలో నివాసముంటున్న ఇంట్లో మరణించాడు.
శంకరంబాడి సుందరాచారి గారి జయంతి శుభాకాంక్షలు.
శనివారం, ఆగస్టు 03, 2013
స్నేహం అంటే చాలా గొప్పబంధం. అలాంటి బంధం గురించి వర్ణించటం ఎవరి తరంకాదు . దానికి హద్దులు , ఎల్లలు వుండవు. మనకు అతి దగ్గర సన్నితులు కేవలం స్నేహితులు మాత్రమే. ఆతరువాతె ఎవరైనా. ఆఖరికి మన అమ్మానాన్నలైనా సరె. స్నేహితులు తరువాత.
స్నేహం అద్భుతమైంది. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు. స్నేహానికి ఎల్లలు లేవు. అది సరిహద్దుల్ని చెరిపేస్తుంది. వికాసానికి బాటలు వేస్తుంది. మంచి మిత్రుడు తోడుంటే ఆయుధం ధరించినంత ధైర్యం ఉంటుంది. కన్నవారితో, కట్టుకున్నవారితో, తోడబుట్టిన వారితో చెప్పుకోలేని విషయాలను మిత్రులతో చెప్పుకోవడం మిత్రత్వం గొప్పదనం. కష్టసుఖాల్లో అండగా ఉండేవారు.. నిస్వార్థంగా సాయం అందించేవారు నిజమైన మిత్రులు. స్నేహం ఓ మధురమైన అనుభూతి. దీనికి వయసుతో నిమిత్తం లేదు. ఆటపాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అందరిలో స్నేహ భావం ఉంటుంది. అటువంటి స్నేహానుభూతిని అనుభవిస్తేనే తెలుస్తుంది. సృష్టిలో నా అనేవారు,బంధువులు లేని వారైన ఉంటారేమే గాని స్నేహితులు లేని వారుండరు. ఇంట్లో చెప్పలేని సమస్యలు, బాధలు సైతం వీరితో ఎటువంటి దాపరికం లేకుండా చెప్పుకొని ఓదార్పు పొందుతాం. అదే స్నేహం. స్నేహితులతో కలిసి ఉంటే ఎంతో ఆనందం మనతోనే ఉంటుంది.
ప్రతిఏటా ఆగస్టు నెలలో వచ్చే మొదటి ఆదివారం రోజున ప్రపంచమంతా 'ఫ్రెండ్షిప్ డే ' ను ఘనంగా నిర్వహించుకుంటారు. ఇక్కడ ఒక మంచి పాట స్నేహం గురించి.
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా
కడదాకా నీడ లాగ నిను వీడి పోదురా
ఈ గుండెలో పుచేటిది నీ శ్వాసగా నిలిచేటిది
ఈ స్నేహమోకటేనురా ...
తులతూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా...ఓ...
పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్నా
మాయా మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిధి రా
ఆ స్నేహామే నీ ఆస్థి రా నీ గౌరవం నిలిపేను రా
సందేహమే లేదు రా ...
త్యాగానికి అర్ధం స్నేహం లోభానికి లొంగదు నేస్తం...ఓ...
ప్రాణానికి ప్రాణం స్నేహం రక్తానికి రక్తం నేస్తం
నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహము రా
ద్రువతార లా స్థిరమైనదీ...ఈ జగతిలో విలువైనదీ...
ఈ స్నేహమోకటేనురా ...
స్నేహం గురించి ప్రముఖులు ఏమన్నారో తెలుసుకుందాం. వారి మాటలను దృష్టిలో పెట్టుకుందాం మరి.
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh0kN5QdB0BmQJhg_ER80foxJZhTZ29bww5H-jXV1ZY9y47ZF3pFXmNpnrceoPue1JYA5UcW1M_oO6LKTZ_LscugO7nMzHSORS-W5IHEGqOMASwytUV9_RrHI33eupzO9BxKwAQ27KkbW8/s320/Screenshot_2.png) |
Everyone need Friendship |
- స్నేహం పాతబడిన కొద్దీ బాగుంటుంది.- చింగ్‌చౌ
- శత్రువు ఒక్కడైనా ఎక్కువే. మిత్రులు వంద అయినా తక్కువే - వివేకానందుడు
- విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు - గౌతమబుద్ధుడు
- మనిషికి అవసరంలో ఆదుకున్న మిత్రుడికన్నా ప్రియమైనది ఏదీ ఉండదు - గురునానక్
- కష్టకాలంలోనే మిత్రుడెవరో తెలుస్తుంది - గాంధీ
- అహంకారి కి మిత్రులుండరు - ఆస్కార్‌వైల్డ్
- ఇచ్చింది మరిచిపోవడం, పుచ్చుకున్నది జ్ఞాపకం ఉంచుకోవడమే స్నేహం - గాంధీ
- ఎవరితోనైనా స్నేహం చేయడం సులభమే, కానీ ఎక్కువ కాలం నిలుపుకోగలగడమే కష్టం -కార్డినల్‌న్యూమాన్
- చెడ్డ మిత్రుల కన్నా మిత్రుడు లేక పోవడమే నయం - మార్టిన్ లూథర్‌కింగ్
- నీ తప్పును, నీ తెలివి తక్కువ పనులను నీ ముందుంచువాడే నిజమైన నీ స్నేహితుడు - బెంజిమన్ ఫ్రాక్లిన్
- మనిషిని బట్టే అతని స్నేహితుడు ఉంటారు - స్వీడెన్ బర్గ్
- మాటలకే పరిమితమయ్యే మిత్రుడెపుడు నీ మిత్రుడుగా ఉండలేడు - లియోటాల్‌స్టాయ్
- మిత్రున్ని మించిన అద్దం లేదు మిత్రుడు లేకుండా ఏ మనిషి సర్వసంపూర్ణుడు కాలేడు - సెయింట్ బెర్నార్డ్
- స్నేహం కన్నా గొప్పది ఈ లోకంలో లేదు - రెవన్థ్ ఛొవ్దరీ
ఇలా ఒక్కొక్కరు మంచి స్నేహితుని గురించి వర్ణించారు. స్నేహాన్ని అభివర్ణించటం చాలా కష్టం .
ఈరోజు స్నేహితుల దినోత్సవమే కాకుండా ఈరోజుకు ఇంకో ప్రత్యేకత వుంది అది ఏమిటంటే sister's day. అన్నదమ్ములు మంచి స్నేహితులుగా వుండవచ్చు వుండకపోవచ్చు. అక్కచెల్లులు మాత్రము మంచి స్నేహితులుగా వుంటారుట .
సరే మరి ఈరోజు friendship day మరియు sister's day శుభాకాంక్షలు.
గురువారం, జులై 25, 2013
శ్రీవాణి వీణాపాణీ
జయగీర్వాణి శ్రీకల్యాణి
శ్రీవాణి వీణాపాణీ
జయసంగీత సాహిత్యవాణీ
శ్రీవాణి వీణాపాణీ
శ్రీవాణి వీణాపాణీ
రసరమ్య సరచరులోనా
నిను అభిషేకించెద తల్లీ
నీచరణాల పూజింతునమ్మా
అమ్మ శ్రీవాణి వీణాపాణీ
సాహిత్య శాస్త్రాలలోనా
వ్యాకరణ సుత్రాలలోనా
నీతేజంబు కొలువాయనమ్మా
అమ్మ శ్రీవాణి వీణాపాణీ
శ్రీవాణి వీణాపాణీ
జయసంగీత సాహిత్యవాణీ
శ్రీవాణి వీణాపాణీ
శ్రీవాణి వీణాపాణీ
ఆదివారం, జులై 21, 2013
ఎన్నో అద్భుతమైన ప్రశ్నలతో , సరదా సరదా మాటలతో , కధలు - పద్యాలు- ఆటలతో, మీరు కోరిన పాటలతో , మీతో సరదాగా మాట్లాడేస్తూ మిమ్మల్ని నవ్వుకునేలా, రోజు అంతా సంతోషంగా వుంచటానికి మీ ముందుకు వచ్చేస్తున్నాను
మీ చిన్ని RJ Sree Vaishnavi ని . ఎలా అంటే ప్రతీ ఆదివారము 05:00 pm to 06:00 pm వరకు
మీ అభిమాన ఆన్లైన్ రేడియో RadioJosh Masth Maza Masth Music :) లో నాతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు కదా! మరి నాతో మాట్లాడాలి అంటే ఈ నంబర్స్ కి కాల్ చేయండి నాతో సరదాగా మాట్లాడే యండి .
INDIA= +91 04042410008
USA = +19142147574
![RadioJoshLive Skype Me™!](https://lh3.googleusercontent.com/blogger_img_proxy/AEn0k_twGX5AxODP6b3FwG8Us_2K2tBdnEg_8cB_kqurlO4B70YPeRcx9EBAb_tUQzWl_g7T2NMkzxYBoY0feksV67a7u3FOnd0z-9RgKkcekkQt23mS5Fj6v59PLxTbpl3jbFqglhQVUlFvDCuT-q_V_iCdZZsX=s0-d)
Skype id : radiojoshlive
Gtalk id : radiojoshlive@gmail.com
Thank u very much.
ఆదివారం, జూన్ 30, 2013
ఏ దేశమేగినా ఎందుకాలిడినాఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినపొగడరా నీ తల్లి భూమి భారతినినిలుపరా నీ జాతి నిండు గౌరవము
ఈ కవితను వినగానే అందరికి గుర్తువచ్చే మహానుభావుడు రచయిత శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారు . ఈయన నవ కవితా పితామహుడు అని అంటారు. మన సమాజానికి అనుగుణంగా భావుకతను అల్లి తెలుగు కవితకు క్రొత్త సొగసులు అద్దాడు. రాయప్రోలు గొప్ప జాతీయవాది. తెలుగు జాతి అభిమాని. ఆయన దేశభక్తి గేయాలు ఎంతో ఉత్తేజకరంగా ఉంటాయి. ఈరోజు శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారి వర్ధంతి . అందువల్ల ఈ బ్లాగ్ ద్వారా వారికి నివాళి అర్పిద్దాం. శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారు రాసిన ఒక మంచి గేయము మా తెలుగు పుస్తకంలో వుంది అది నాకు చాలా బాగా నచ్చింది. ఆ గేయం సారాంశం ఏమిటి అంటే. పాచీన కాలం నుండి భారతదేశం అనేక సంస్కృతీ సామ్ప్రదాయంలకు నిలయం. సిరిసంపదలకు, పాడిపంటలకు ప్రసిద్ది పొందింది. ఎందరో మహానీయులకు ఇది పుట్టినిల్లు. భిన్నత్వంలో ఏకత్వంని సాధించిన సమైక్య దేశం మన భారతదేశం. మన దేశగౌరవంను దశదిశలా చాటడం మన కర్తవ్యం . మన దేశ పౌరుషాన్ని నిలబెట్టడం మన భాద్యత. ఈ భావాలను ప్రజలలో ఎలా ప్రేరేపించిందో ఈ గేయం చదివి తెలుసుకుందాం.
శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై
వరలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా !
వేద శాఖలు వెలసెనిచ్చట ఆదికావ్యం బలరె నిచ్చట |
బాదరాయణ పరమఋషులకు పాదు సుమ్మిది తమ్ముడా ||
విపిన బంధుర వృక్ష వాటిక ఉపనిషన్మధువొలికెనిచ్చట |
విపుల తత్వము విస్తరించిన విమల తలమిది తమ్ముడా ||
సూత్ర యుగముల శుద్ధ వాసన క్షాత్ర యుగముల శౌర్య చండిమ
చిత్ర దాస్యము చే చరిత్రల చెరిగిపోయెర తమ్ముడా ||
మేలి కిన్నెర మేళవించీ రాలు కరుగగ రాగమెత్తి
పాలతీయని బాలభారత పథము పాడర తమ్ముడా||
దేశగర్వము దీప్తి చెందగ దేశచరితము తేజరిల్లగ |
దేశమరసిన ధీరపురుషుల తెలిసి పాడర తమ్ముడా ||
పాండవేయుల పదునుకత్తులు మండి మెరిసిన మహితరణ కధ |
కండగల చిక్కని పదంబుల కలిపి పాడర తమ్ముడా||
ఆదివారం, మే 12, 2013
అమ్మ దొంగా నిన్ను
చూడకుంటే నాకు బెంగా
కొంగట్టుకు తిరుగుతూ
ఏవో ప్రశ్న లడుగుతూ
కిలకిల మని నవ్వుతూ
కాలం గడిపే నిన్ను
చూడకుంటే నాకు బెంగా
కథ చెప్పేదాకా కంట నిదుర రాకా
కథ చెప్పేదాకా నన్ను కదలనీకా
మాట తోచ నీకా
మూతిముడిచి చుసెవూ
ఎపుడో ఒక అయ్యా నిన్ను ఎగరేసుకుపోతే
నిలవలేక నా మనసూ నీ వైపే లాగితే
గువ్వ ఎగిరిపోఇనా గూడు నిదుర పోవునా
నవ్వితేనీ కనులా ముత్యలూ రాలూ
ఆ నవ్వే నిను వీడక ఉంటె అది చాలూ
కలతలూ కష్టాలు నీ దరికీ రాకా
కలకాలం నీ బ్రతుకూ కలల దారి నడవాలీవూ
గురువారం, మే 09, 2013
తెలుగు పదానికి జన్మదినం
ఇది జానపదానికి జ్ఞానపదం
ఏడు స్వరాలే ఏడుకొండలై
వెలసిన కలియుగ విష్ణుపదం
అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం
పద కవితా పితామహుడు, శ్రీహరి గాన లోలుడైన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు జయంతి శుభాకాంక్షలు .
అమ్మ తన బిడ్డ అన్నము తినటానికి మారం చేసినప్పుడు ప్రతీ ఇంట్లోని అమ్మ చందమామని చూపిస్తూ , గోరుముద్దలు తినిపిస్తూ తన బిడ్డకి "చందమామరావో జాబిల్లిరావో" అన్నపాట ను పాడుతుంది. ఈ పాట తెలియని తెలుగు లోగిలి వుండదు. ఇలాంటి పాటలు రాసిన వారు శ్రీమహావిష్ణువు యొక్క ఖడ్గం అయిన నందకాంశ సంభూతుడు అయిన "పదకవితా పితామహుడు", "సంకీరత్నాచార్యుడు", "పంచమాగమ సార్వభౌముడు", "ద్రవిడాగమ సార్వభౌముడు" అను బిరుదాంకితుడు అన్నమయ్య. నారాయణయ్య కొడుకు నారాయణ సూరి. విద్యావంతుడు. అతని భార్య లక్కమాంబ. ఆమెది తాళ్ళపాక సమీప గ్రామం మాడుపూరు. అక్కడ ఉన్న విష్ణువు కోవెలలో అమె శ్రద్ధగా మాధవుని అర్చించేదట. వారికి చాలా కాలం సంతానం కలుగలేదు. అతడు, అతని భార్య సంతానార్ధులై తిరుమలను దర్శించారట. ఆ దంపతులు తిరుమల తిరుపతిని దర్శించుకొని, ధ్వజస్తంభం ఎదురుగా సాష్టాంగ ప్రమాణం ఆచరించినపుడు ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించిందని ఒక కధ కలదు. అలా జన్మిచిన వాడే అన్నమయ్య . సర్వధారి సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు (మే 9, 1408) కడప జిల్లా లోని రాజంపేటమండలం తాళ్ళపాక గ్రామములో అన్నమయ్య జన్మించాడు. 8వ యేట అన్నమయ్యకు ఆయన గురువు ఘనవిష్ణు దీక్షనొసగినపుడు అన్నమాచార్య నామం స్థిరపడిపోయింది.
అన్నమయ్య ఇంటిలోతల్లి సంగీతం, తండ్రి పాండిత్యం ఛాయలలో పెరిగాడు. ఉపవీత సంస్కారం పొందిన తరువాత ఇంటి గురుకులంలోనే విద్యాభ్యాసం సాగింది. ఏక సంధాగ్రాహి అయినందున అనతికాలంలో ఉన్నత విద్యావంతుడయ్యాడు. తన పదహారవ యేట అన్నమయ్యకు శ్రీవేంకటేశ్వర దర్శనానుభూతి కలిగింది. అప్పటినుండి అన్నమయ్య అద్భుతమైన కీర్తనలను రచింపసాగాడు.
ఈ పాటరాసింది తెలుగువాగ్గేయకారుడు కలియుగదైవము వేంకటేశ్వరస్వామికి గొప్పభక్తుడు అయిన అన్నమయ్య . అన్నమయ్య చాలాపాటలు రాసారు పాడారు .స్వామి వారికి మేలుకొలుపు అన్నమయ్య పాడినప్పుడు "మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల మేలుకోవె నా పాలి మించిన నిధానమా " వంటి మేలుకోలుపు పాటలకు స్వామి వారు నిద్రలేసారు. మళ్ళీ రాత్రి జోల పాటలు అన్నమయ్య రాసిన"జో అచ్యుతానంద జోజో ముకుందా, రావె పరమానంనద , రామ గోవిందా జోజో జోజో" అన్నపాటకు స్వామి వారు హాయిగా నిద్రపోతారు. అన్నమాచార్యలవారు అనేఅనేక వేలపాటలు రాసారు పాడారు. అయానపాటలవల్లే స్వామి వారికి అంతకీర్తికలిగిందా అనిపించేటట్టు వుంటాయి అన్నమయ్య పాటలు సామాన్యమానవులు కు అర్ధమైయ్యె టంత వీలు గా వుంటాయి. అన్నమయ్యపాటలు స్వామి వారికే కాదు అమ్మవారికి కూడాచాలా ఇష్టం అమ్మవారిమీదకూడా చాలాపాటలు రాసారు. "క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయమునకు నీరాజనం" అన్నపాట అమ్మవారి నీరాజనం ఇచ్చుసమయమున పాడారు. అమ్మను చూసి చక్కని తల్లికి చాంగుభళా అంటూ పాట చలా బాగుంటుంది. అంతే కాకు తిరుతిరు జవరాల అన్న పాట, వుయ్యాల పాటల, తుమ్మెద పాటలు , గొబ్బిళ్ళ పాటలు, జనపదాలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వుంన్నాయి. అన్నమయ్యరచనలు ఇంచుమించు ముప్పైరెండువేలు పాటలు వుంటాయి. అన్నమయ్యకు పదకవితాపితామహుడు అన్నబిరుదు కలదు. అన్నమయ్య 32,000 సంకీర్తనలతో పాటు, సంస్క్రత వేంకటాచల మహాత్మ్యం, సంకీర్తనా లక్షణం, ద్విపద రామాయణం, 12 తెలుగు శతకాలు, శృంగార మంజరి, వంటి "నానా ప్రబంధములను" రచించినట్టు చిన్నన్న రచించిన ద్విపద వల్ల తెలుస్తుంది.
పద కవితా పితామహుడు, శ్రీహరి గాన లోలుడైన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు జయంతి శుభాకాంక్షలు .
మంగళవారం, మే 07, 2013
పల్లవి:
పిలువరే కృష్ణుని పేరుకొని యింతటాను
పొలసి యారగించే పొద్దాయ నిపుడు
చరణం:
వెన్నలారగించ బోయి వీధులలో దిరిగీనో
యెన్నరాని యమునలో యీదులాడేనో
సన్నల సాందీపనితో చదువగ బోయినాడో
చిన్నవాడాకలి గొనె చెలులాల యిపుడు
చరణం:
మగువల కాగిళ్ళ మరచి నిద్దిరించీనో
సొగిసి యావుల గాచే చోట నున్నాడో
యెగువ నుట్లకెక్కి యింతులకు జిక్కినాడో
సగము వేడికూరలు చల్లనాయ నిపుడు
చరణం:
చెంది నెమలి చుంగుల సింగారించుకొనీనో
ఇందునే దేవరవలె ఇంటనున్నాడో
అందపు శ్రీవేంకటేశు డాడివచ్చె నిదె వీడె
విందుల మాపొత్తుకు రా వేళాయ నిపుడు
ఆదివారం, మే 05, 2013
Hey friends catch me live today (Sunday) show
with your little RJ Sree Vaishnavi
from 05:00 pm to 6:00 pm
only on your favorite online radio channel
Masth Maza Masth Music :)
Fun with me
If you want to talk with me plz call these numbers
INDIA= +91 04042410008
Skype id : radiojoshlive
Gtalk id : radiojoshlive@gmail.com
ఆదివారం, ఏప్రిల్ 28, 2013
ఎన్నో అద్భుతమైన ప్రశ్నలతో , సరదా సరదా ముచ్చట్లుతో ,
కధలు - పద్యాలు- ఆటలు, మీరు కోరిన పాటలతో ,
మీతో సరదాగా మాట్లాడేస్తూ రోజు అంతా సంతోషంగా వుంచటానికి
మీ ముందుకు వచ్చేస్తున్నాను.
మీ చిన్ని RJ Sree Vaishnavi ని . ఎలా అంటే
ప్రతీ ఆదివారము 05:00 pm to 6:00 pm వరకు
మీ అభిమాన online RadioJoshLive Masth Maza Masth Music :) లో.
నాతో మాట్లాడాలి అని మీరు అనుకుంటున్నారు కదా!
మరి నాతో మాట్లాడాలి అంటే ఈ నంబర్స్ కి కాల్ చేయండి.
Gtalk id : radiojoshlive@gmail.com
నేను మీతో మాట్లాడటానికి రడీగా వుంటాను మరి మీరు కూడా నాతో మాట్లాడటానికి రడీనా.
Stay tune with
శుక్రవారం, ఏప్రిల్ 26, 2013
సకలం హేసఖి జానామె తత్
ప్రకత విలాసం పరమం దధసే ||
అలిక మౄగ మద మయ మషి
కలనౌ జ్వలతాహే సఖి జానామే |
లలితం తవ పల్లవి తమనసి ని-
స్చలతర మేఘ శ్యామం దధసే ||
చారుకపొల స్థల కరాంకిత
విచారం హే సఖి జానామే |
నారయణ మహినాయక శయనం
శ్రిరమనం తవ చిత్తే దధసే ||
ఘన కుచ శైల క్రస్చిత విభుమని
జననం హే సఖి జానామే |
కనతురస వేంకట గిరిపతి
వినుత భొగ సుఖ విభవం దధసే ||
ఆదివారం, ఏప్రిల్ 21, 2013
ఎన్నో ఆసక్తికరమైన విషయాలతో, అద్భుతమైన ప్రశ్నలతో , సరదా సరదా మాటలతో , కధలు - పద్యాలు- ఆటలతో, మీరు కోరిన పాటలతో , మీతో సరదాగా మాట్లాడేస్తూ మిమ్మల్ని నవ్వుకునేలా, రోజు అంతా సంతోషంగా వుంచటానికి మీ ముందుకు వచ్చేస్తున్నాను
మీ చిన్ని RJ Sree Vaishnavi ని .
ఎలా అంటే ప్రతీ ఆదివారము 05:00 pm to 6:00 pm వరకు
నాతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు కదా! మరి నాతో మాట్లాడాలి అంటే ఈ నంబర్స్ కి కాల్ చేయండి నాతో సరదాగా మాట్లాడేయండి .
INDIA= +91 04042410008
USA = +19142147574
Skype id : radiojoshlive
Gtalk id : radiojoshlive@gmail.com
శనివారం, ఏప్రిల్ 13, 2013
హాయ్!
ఎన్నో అద్భుతమైన ప్రశ్నలతో , సరదా సరదా మాటలతో , కధలు - పద్యాలు- ఆటలతో, మీరు కోరిన పాటలతో , మీతో సరదాగా మాట్లాడేస్తూ మిమ్మల్ని నవ్వుకునేలా, రోజు అంతా సంతోషంగా వుంచటానికి మీ ముందుకు వచ్చేస్తున్నాను మీ చిన్ని RJ Sree Vaishnavi ని . ఎలా అంటే ప్రతీ ఆదివారము 10:00 am to 12:00 pm వరకు మీ అభిమాన online RadioJoshLive Masth Maza Masth Music :) లో నాతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు కదా!
మరి నాతో మాట్లాడాలి అంటే ఈ నంబర్స్ కి కాల్ చేయండి నాతో సరదాగా మాట్లాడే యండి .
INDIA= +91 04042410008
USA = +19142147475
![RadioJoshLive Skype Me™!](https://lh3.googleusercontent.com/blogger_img_proxy/AEn0k_twGX5AxODP6b3FwG8Us_2K2tBdnEg_8cB_kqurlO4B70YPeRcx9EBAb_tUQzWl_g7T2NMkzxYBoY0feksV67a7u3FOnd0z-9RgKkcekkQt23mS5Fj6v59PLxTbpl3jbFqglhQVUlFvDCuT-q_V_iCdZZsX=s0-d)
Skype id : radiojoshlive
Gtalk id : radiojoshlive@gmail.com
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ