International Non-violence day గా 2అక్టోబర్ ,మహాత్మా గాంధీ,భారత స్వాతంత్రఉద్యమం మరియుకానిహింసతత్వశాస్త్రం మరియువ్యూహంలోమార్గదర్శకుడునాయకుడైనపుట్టినరోజుగుర్తు పెట్టబడింది.
ఈ రోజు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గారి పుట్టిన రోజు
మోహన్ దాస్ కరంచంద్ గాంధీ జన్మ నామం:మోహన్ దాస్ కరంచంద్ గాంధీ జననం: అక్టోబరు 2, 1869 పోరుబందరు(గుజరాత్) మరణం: జనవరి 30, 1948 హత్య చేయబడ్డాడు వృత్తి :న్యాయవాది పదవి :మహాత్మ, జాతి పిత భార్య/భర్త :కస్తూర్బా సంతానం:హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రామదాస్ గాంధీ, దేవదాస్ గాంధీ తండ్రి: కరంచంద్ గాంధీ తల్లి: పుతలీ బాయి గాంధి గారు చిన్నప్పటి నుండి మంచి మంచి కదలు విని inspire అయ్యేవారు. ఆయనకు చత్రపతి శివాజి, భగవత్ గీత వంటి వి ఆయన జీవితంపై గొప్పప్రభావము చూపించాయి అనటంలో అసత్యము లేదు. గాంధి గొప్పస్వాతంత్ర సమర యోధుడు. మనభారతీయులందరు చేత పూజలు అందుకుంటున్నారు.ప్రజలు అయనని జాతి పితగా గుర్తించారు. పిల్లలు బాపుజీగా తలుస్తారు. గాంధి గారు సత్యాగ్రహము, సహాయ నిరాకరణ ఉద్యమము , అహింసా వంటివి ఆయన పాటించేవారు. గాంధిగారు అహింస అనే అనే అస్త్రముతోనే మనదేశాన్ని పరిపాలించటానికి వచ్చిన బ్రిటిష్ వారిని వారిదేశానికి పారిపోయేలా చేసింది. గాంధిగారు, నారవస్త్రము , చేతికి కర్ర, కళ్ళకు అద్దాలు, కలిగివుండేవారు. ఈయన మాట సత్యమేవ జయతే. ఈరోజు గాంధిగారి పుట్టినరోజు నుNon-violence day గా జరుపుకోవాలి .
ఈ రోజు గాంధి గారి పుట్టినరోజు అని మాత్రమే కాదు ఈ రోజు న భారత రెండవ ప్రధాని లాల్ బహదుర్ శాస్త్రి గారి పుట్టిన రోజు .1904సం.అక్టోబర్ 2వ తేదిన ఉత్తరప్రదేశ్ లోని మొగలాయ్ సరాయ్ గ్రామంలో తండ్రి శారదా ప్రసాద్ రాయ్ శాస్త్రిగారు. గాంధిగారు ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమంలో ను , సత్యాగ్రహము లోను పాల్గొనుటకు ఉత్సాహంగా వుండెవారు . అప్పుడు జైల్లోకూడా స్వాతంత్ర్యము తర్వాత, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ మంత్రివర్గములో గృహ మంత్రిగా పనిచేశాడు.
స్వాతంత్ర భరత దేశానికి నెహ్రు మొదటి ప్రదాని , నెహ్రు తరువాత లాలబహదుర్ శాస్త్రిగారు రెండవ ప్రదాని గా ప్రమాణ స్వీకరము చేసారు. ఆయన. 1965 యుద్ధంలో పాకిస్తానును కాళ్ళబేరానికి తీసుకువచ్చాడు. తాష్కెంటు లో పాకిస్తానుతో సంధి చర్చలకు వెళ్ళినపుడు 1966 జనవరి 11 న గుండెపోటుతో మరణించాడు. మరణానంతరం ఆయనకు భారతరత్న పురస్కారం లభించింది. ఈరోజు వారి ఇరువురికీ (గాంధి గారికి, లాల్ బహదూర్ శాస్త్రి గార్లకు మనం వారిని తలుచుకొని నివాళి అర్పిద్దాం.
అక్టోబర్ 2 వ తారీకునా మా తాతగారు అయినా చింతా రామకృష్ణ రావు గారు http://andhraamrutham.blogspot.com/ ) వారి 61 వ పుట్టిన రోజు అంటే షష్టి పూర్తి అన్నమాట. తాత పుట్టిన రోజు దగ్గర పడిపోతుంది. నాకు ఏమి చెయ్యాలో తెలియటం లేదు. మా తాతకి పద్యాలు అంటే ఇష్టం నాకు పద్యాలు రాయటం రాదు. మాతాతకు ఏమి గిఫ్ట్ ఇవ్వాలో అర్ధం కావటం లేదు. మీరు నాకు ఒక హెల్ప్ చెయ్యాలి అది ఏమిటంటారా! ఏమీలేదు. మాతాత పుట్టినరోజుకు నేను ఏమి చేస్తే బాగుంటుందో ఒకమంచి సలహా ఇవ్వండి. లేదా మీరు కూడా పద్యాలు రాయగాల్గితే మాతాత పేరు మీద అందమైన పద్యాలు రాసి మీ అభినందనలతో పద్యాలు రాసి ఈపోస్ట్ కు కామెంట్ గా పెట్టండి నేను అవి ప్రింట్ అవుట్ తీసి మాతాతకు అందిస్తాను. నాకు మంచి సలహా ఇస్తారని ఆశిస్తున్నాను. నాకు సలహా ఇస్తున్నందుకు ముందుగానే ధన్యవాదములు తెలుపుతున్నాను. మరి మీ సలహాలు/పద్యాలు కోసం ఎదురుచూస్తూ.............
భగత్ సింగ్ ఉద్యమాలలో చాలా ఉత్సాహంగా పాల్గొనేవారు.అసెంబ్లీపై బాంబు విసిరేసిన సంఘటనకి కాస్త ముందుగా తన సహచరుడు సుఖ్‌దేవ్‌కు రాసిన లేఖలో భగత్ సింగ్ " నాకూ ఆశలూ, ఆంక్షలూ ఉన్నాయి. ఆనందమైన జీవనం గడపాలని ఉంది. అయితే అవసరమొచ్చినప్పుడు వీటన్నిటినీ త్యజించగలను. ఇదే అసలైన బలిదానం."
ఈ రోజు ప్రముఖ భారత స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ పుట్టిన రోజు. సెప్టెంబర్ 27th 1907 లో ప్రస్తుత పాకిస్తాను లోని లాయల్ జిల్లా బంగాగ్రామంలో జన్మించారు. భగత్ సింగ్ తల్లి తండ్రులు విద్యావతి,కిషన్ సింగ్. వీరు సర్దార్ కుటుంబము.భగత్ సింగ్ కుటుంబంలోని వారందరు స్వాతంత్రపోరటయోదులే. భగత్ సింగ్ పుట్టిన రోజు నాడు వారందరూ జైలు నుండి విడుదల అయ్యారు. అప్పుడు వారి కుటుంబము పండగ చేసుకుని ఆసందర్బములోని భగత్ సింగ్ అని నామకరణము చేసారు.
భగత్ సింగ్ చాలా గొప్ప దేశభక్తుడు. ఎలాఅంటే జిలియన్ వాలాబాగ్ ఉదంతంజరిగినప్పుడు ఆ ప్రదేశము అంతా రక్తముతో తడిసినది. భగత్ సింగ్ ఆ ఘటన జరిగినప్పుడు చిన్నవయసు అప్పుడు భగత్ సింగ్ అక్కడ భూమికి ముద్దుపెట్టుకొని ఆ మట్టిని ఇంటిదగ్గర పెట్టుకున్నాడు. అంత దేశభక్తికలవాడు.అతని ఉద్యమాలు భారత స్వాతంత్ర ఉద్యమం.
అయన ప్రద్దాన సంస్ఠలు నజవాన్ భారత్ సభ,కీర్తికిసాన్ పార్టి, హిందుస్తాన్ సోసలిస్ట్ రిపబ్లికన్ అసోషియెషన్. మొదలగున్నవి ప్రద్దాన సంస్తలు.
భగత్ సింగ్ ముఖ్యమైన కొటేషన్ఇన్క్విలాబ్ జిందాభాద్.
బాంబ్ కేసులో, భగత్ సింగ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.. వాళ్ళు దీని మీద విచారణ జరుపుతున్న సమయంలోనే, పోలీసు అధికారిని చంపిన సంగతి కూడా బయటపడింది.. దాంతో, ఆయనతో పాటు ఆయన స్నేహితులైన రాజగురు, సుఖదేవ్ కి కూడా మరణశిక్ష పడింది..
కానీ జైల్లో ఉన్నప్పుడు కూడా, భగత్ సింగ్ ఉద్యమాలని చేయడం ఆపలేదు.. బ్రిటీష్ ఖైదీలకి, భారతీయ ఖైదీలకి చూపిస్తున్న అసమానతలని పారద్రోలడానికి, 63 రోజుల పాటు, నిరాహార దీక్ష చేశారు.. దానితో ఆయన పేరు భారత దేశం మొత్తం మారుమ్రోగింది.. (అంతకుముందు వరకూ ఆయన కేవలం పంజాబ్ ప్రాంత వరకు మాత్రమే పరిమితమయ్యారు)
చివరికి మార్చ్23, 1931న రాజ గురు, సుఖదేవ్ తో సహా భగత్ సింగ్ ని ఉరి తీశారు…. అలా ఒక విప్లవకారుని ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది..
ఆనాడు యశోద మాత చేత రోటికి కట్టివేయబడిన అందాల వన్నెల చిన్నెల గోవిందుడే గోపికల నయనారవిందుడు అయినాడు. వారి కన్నులలో ప్రణయ జ్యోతిని వెలిగించి మనసును రగిలించి చిన్ని కృష్ణుని రాకకై ఎదురు చూసే గోపికలు కార్తీక పౌర్ణమి నాడు యమునా స్నానాలు ఆచరించి నోచే నోములు నోచి, గౌరీ దేవిని పూజించేవేళ గోపికల కోకలు దాచి పొన్నచెట్టు గుబురులలో వేణువును ఊదుతున్నాడు.
అప్పుడు గోపికలు వారిచేలికత్తేలతో ఇలా పాడుతున్నారు. వెన్నదొంగ గురించి వారు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. వారి కోకలు చెట్టుకు దాచి పొన్నచెట్టు కొమ్మను ఎక్కాడని. శ్రీ కృష్ణుని ఏరకంగా వారికీ కనిపిస్తున్నాడో వారు ఆయన అందాన్ని వర్ణిస్తూ చెప్పుకుంటున్నారు. వారి మనసులో శ్రీ కృష్ణుని మీద భక్తి, ప్రేమ ను వారు ఈ పాటలో అందంగా చెప్తున్నారు.