Blogger Widgets

ఆదివారం, డిసెంబర్ 25, 2011

తిరుప్పావై ఏకాదశ పాశురము

ఆదివారం, డిసెంబర్ 25, 2011

ఈనాటి పాశురములో లేపబడుచున్న గోపిక , కులముచేతను, రూపముచేతను, గుణముచేతను అందమైనది. కృష్ణుడు ఊరుకంతకు ఆదరణీయుడై యున్నట్లే.యీమె కూడా ఊరులోని అందరి మన్ననలను అందిన పిల్ల. ఈ పాశురములోని నిద్ర పోతున్న గోపిక వంశము వారు భరతుని వంశము చెందినవారు. వీరు అభిజాత్యము -సౌందర్యము - ఐశ్వర్యము కల గోపిక ను ఇందు లెపబడుచున్నది. ఈమె సౌందర్యము ను స్త్రీలే పృశంచించుట విశేషము.  గోపికలందురు కృష్ణతత్వమూ నేరిగినవారు.  నాకు అయితే వారు చాలా అదృష్టవంతులుగా తోచుతున్నది.  అయ్యో అప్పుడు నేను లేనే అని వుండివుంటే చాలా బాగుండును కదా, నేను ఒక గోపికగా వుండేదానను అనిపిస్తుంది.  సరే ఈనాటి పాశురము గురుంచి ఎలా ఈ గోపికను నిదుర లేపుతున్నారో చూద్దాం.
పాశురము:
  కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు 
కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు
శెత్తార్ తిఱల్ అరియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం
కుత్తం ఒన్ఱిల్లాద కోవలర్-దం పొఱ్కొడియే
పుత్తరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు నిన్-
ముత్తం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్-పాడ
శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి నీ-
ఎత్తుక్కుఱగుం పొరుళ్-ఏలోర్ ఎంబావాయ్



తాత్పర్యము:  లేగ దూడలు కల ఆవులే అయినను దూడవలేనే లేత వయస్సులో ఉన్న ఆవుమందలను పాలు పితుకగలవారును శత్రువునుఎదుర్కొని బలము చూసి యుద్దము చేయగలవారు ఏ విధమగు దోషములు లేనివారును అయిన గోపాలకుల వంశములో జనించిన బంగారుతీగా! పుట్టలో పాముయోక్క పడగవలేనున్న నితంబ ప్రదేశము కలదానా! అడవిలోని నెమలితోకవంటి అందమైన కేశపాశము కలదానా?  రమ్ము చుట్టములు చెలికత్తెలు అందరును వచ్చినారు.  నీ వాకిలి ముందు చేరియున్నారు.  నీలమేఘమువంటి వర్ణముగల శ్రీ కృష్ణుని నామమును కీర్తించుచున్నారు.  ఆ విధముగా నందరు భగవంనామమును కీర్తించుచున్నాను కదలక మెదలక ఉన్నావేమి?  ఓ సంపన్నురాలా ! నీ నిద్రకర్ధమేమితో తెలియచేయుము.



విశేషార్ధాము:
కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు:
లేగదూడలు కల చాలా ఆవుల మందలకు పాలుపితికి.  దూడలుగా గల ఆవులే ఐనను శ్రీ కృష్ణస్పర్శ, వేణుగానాము. వేణుగానమును విని కృష్ణ స్పర్శచే బలసి సమృద్దిగా పాలిచ్చుచ్చున్న ఆవులవి.   ఆవుల పాలు పిండు నేర్పునఉనంత మాత్రమున లాభములేదు.  పొంచియుండి  ఆ ఆవుల కాపదలు కల్గించెడి విరోధుల నెదిరించెడి బలము కూడా గలదీ గోపాలురకు అని చేబుచున్నారు.
శెత్తార్ తిఱల్ అరియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం:
శత్రువుల బలము నశించునట్లు ఎదురించి యుద్ధము చేయువంశము.  శ్రీ కృష్ణ పరమాత్మ అతిశయమును ఓర్వలేనివారే గోపాలురకు శత్రువులు.  భగవద్సంభంధము కలిగి భగవంతుని ప్రేమించియున్న వారికి భగవద్వేషులుగా కన్పెట్టుచుందురు.  అటువంటి బలప్రతాపము తమపై కూడా చూపునో ఏమో అని " అమ్మా! అలా బలమును చూపి త్రోసిపుచ్చుట శత్రువులనే కాని ఆశ్రయించిన వారిని కాదమ్మా! దిక్కు లేనివారిని కాదమ్మా!" అది మీ గోపాలురకు లక్షణము కాదని,
కుత్తం ఒన్ఱిల్లాద:
ఏ దోషమునులేని గోపాలవంశమున పిట్టినదాన వనుచున్నారు. శత్రువు ఎదిరించివచ్చిన ఉపేక్షించినవారను దోషములేదు. శత్రువైనను చేతిలో ఏమియు సాధనములేనిచో హింసించరాదు.  "ఎంత చెడ్డవాడైనను సరే! నన్ను ఆశ్రయించి సేవించినచో అతడు మంచి వాడే! అతడు గౌరవించదగినవాడే" అని భగవద్గీత లో శ్రీ క్రుష్ణులవారు అన్నారు కదా!  ఆ వంశములో పుట్టిననీకు ఆ లక్షణములు వుండాలి కదా!
కోవలర్-దం పొఱ్కొడియే:
గోపవంశము నందలి బంగారుతీగా! అని సంబోధించుచు మేల్కొల్పుతున్నారు. తీగ అనుటచే ఒకదాని చేరికలేనిదే నిలువనిది అని తెలుయుచున్నది.  బంగారు తీగెఅనుటచే విశదం, దృడమైనది అని అర్ధం అగుచున్నది. స్త్రీలకూ కూడా మోహము కల్గించు సౌందర్యవతి అని ఆమె సౌందర్యమును వర్ణిస్తున్నారు.  అది సౌందర్యమునకు అతిశయం అని ఆమె ను వర్ణిస్తున్నారు.
పుత్తరవల్ గుల్ పునమయిలే:
పుట్టలోని  సర్పము వంటి నితంబము కలదానా! అడవిలోని నెమలి వంటిదానా!. పుట్టలోని శరీరమునంతటను ముడుచుకొని దానిపై పడగవిప్పి పరున్న పామువలె నితంబమున్నదని ఇక్కడ వర్ణిస్తున్నారు.  ఈ వర్ణన కొత్తగా వున్నది.  అలా వుండగా ఈమెకి పునమయిలే అని అడవి నెమలివంటి జుట్టు కలది అంటున్నారు.  ఆ జుట్టు కూడా నెమలి పురివిప్పినట్టు వుందిట.  అంటే నెమలి మేఘాలను చూచి ఎలా నృత్యము చేయునో అలా జుట్టు వికసించి వుందిట.  బంగారుతీగ అనుట కూడా ఆమె అందాన్ని వర్ణిస్తున్నారు.  జుట్టు అనగా వ్యామోహం, ఆమెకి పరమభక్తి, భక్తి, పర భక్తి అను భక్తి వ్యామోహాలు కలిగివుంది.  "నీ అందము చూచి పరమపురుషుడే వచ్చునని నిర్బరంగా పడుకోటం కాదమ్మా!  మమ్ములను కలుసుకొని పరమాత్మకు చేర్చాలి అని లేపుచున్నారు.
పోదరాయ్: 
లేచి రావమ్మా!  నీ అందముచే నీ వద్దకు పరమపురుషున్ని ఆకర్షించుట కాదు.  నీ అందము తో అతని ఆకర్షించి వసపరచుకొని మమ్ములను అతని చేర్చాలని.  నీవే మాకు ఆదారం కావునా నీవు నడచి రమ్ము. అలా నడచివచ్చి తమ బృందములో చేరుమని కోరగానే, ఆమె లోపలినుండి అందరూ వచ్చినారా? అని ప్రశ్నించగా
శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు:
చుట్టరికముగల చేలికత్తేలందరును వచ్చిరి అని సమాదానము చెప్పుచున్నారు.  ఈ వ్రేపల్లెలోని వారందరును ఈమెకు చుట్టములె ఈమెకు చెలికత్తేలే.  సమానమైన బుద్ధికలవారిని సఖులందరు.  అందరూ నీ వాకిలికి వచ్చినారు.
నిన్ ముత్తం పుగుందు :
నీ ముంగలి చొచ్చి నీ వాకిట చేరినాము.  ఆమెచే బందము కలుగటచే ఆ వాకిలి పరమపదము కంటే కూడా ప్రాప్యమును భావముతో చూచుచున్నది.  సర్వశేషియగు సర్వేస్వరుడు వచ్చి నిలుచు ముంగిలి కదా ఇది. ఆ ముంగిట చేరి పొందదలచిన దేమిటో చెప్పుచున్నారు.
ముగిల్ వణ్ణన్ పేర్-పాడ:
మేఘవర్ణుని నామమును కీర్తించుతాకే వచ్చితిమి. నీలమేఘశ్యాముని వర్ణించుట, అతని స్వరూపమును కీర్తించుట మా ఆనందమునకు కాదు.  నీ మనసుకు ఆనందము కలిగించుటకు కీర్తిస్తున్నాం.
శిత్తాదే పేశాదే:
అలా కీర్తిస్తున్నను నీవు ఉలుకక పలుకకు ఉన్నావేమి? భగవద్భక్తులు భాగావదనుభావము చే పొందే ఆనందాతిరేఖము చేసే చేష్టలు, పల్కులు, చూచి , విని ఆనందించుటనే ఆకాంక్షింపదగినది.
 శెల్వప్పెణ్డాట్టి:
సంపన్నురాలగు ఓయమ్మా! భగవద్అనుభవం ఒక రాసిగా చేసికొని అనుభావిమ్చుగల ఐస్వర్యము ఈమెకి కలదు. భగవద్పరతంత్రం ఉన్నది.  అలా భగవంతుని వసపరచుకొని ఆ పారవశ్యములో పాడుకొనుట  కాదు కదా
ఎత్తుక్కుఱగుం పొరుళ్-ఏలోర్:
నీ నిద్రకు అర్ధం ఏమిటమ్మా?   ఇక్కడ నిద్ర అనగా పరిపూర్ణమైన భాగావదనుభావం లో బాహ్య స్మ్రుతి లేకుండుట.  అలాంటి ఎకానుభూతి కైవల్యము వంటిది.  అలాంటి కైవల్యము కల అమ్మాయిని పరకాలులు ఈ పాసురములో మేల్కొల్పినారు.
జై శ్రీ మన్నరాయణ్  

శనివారం, డిసెంబర్ 24, 2011

తిరుప్పావై దశమ పాశురము

శనివారం, డిసెంబర్ 24, 2011

శ్రీ శ్రీకృష్ణ పరమాత్మ ను విడిచి గోపికలు విరహముచే నిద్ర లేక , వ్రతము చేయవలెనని బయలుదేరి వచ్చుచుండగా పదిమంది నిద్రించుట ఆశ్చర్యముగా ఉండును. వారిలో ఒక్కొక్కరిని ఒక్కొక్కవిదముగా మేల్కొల్పుచున్నారు. వారి నిద్ర కుడా లౌకిక నిద్ర వంటి తామస నిద్ర కాదని అది భావదనుభావము చేత కలిగిన తామస నిద్ర అని తెలియుచున్నది. భగవదనుభావమున్న వారిని మేల్కొల్పుట అనగా వారి అభిముఖ్యమును సంపాదించి వారి విశేషకటాక్షమునకు పాత్రులై పాత్రులై భగవదనుభావయోగ్యతను కలిగించుకోనుతయే! భాగాత్ప్రాప్తికి ఉపాయములు భిన్న భిన్నముగా ఉన్నట్లు కన్పట్టుచుండును. నిష్కామకర్మ, ఆత్మస్వరుప జ్ఞానము , భగవద్భక్తి , భాగాత్ర్పాప్తికి ఉపాయములుగా భగవద్గీతలో నిర్దేశింపబడెను . ఆల్వారాలను ఈ పదియవ పాసురమున మేల్కొలుపు చున్నారు.ఈ గోపిక ఫలమును ఆశించినది కాదు . లాభనష్టాలు అన్ని పరమాత్మవే కాని తనవి కావని నిశ్చలంగా ఉన్నది. ఇతర ఇంద్రియములు పనిచేయక కేవలము ఒక్క మనస్సు మాత్రమె పనిచేయుచున్నది. ఆ మనసు లో పరమాత్మ దురులకు ఆటంకములేదని సూచించుటకు కృష్ణుని పొరిగింటి పిల్ల ఈమె . ఫలము సిద్దింపక దుఃఖము కలిగినా ఉద్వేగము చెందదు . తనను పాడుట భగవానునికి ఫలముగా భావించి భాద కలిగినా భగవంతుడే ఉద్వేగము చెందాలని . ఆమె భావిచేది. ఆ సుఖాలమీద తనకి మమకారము లేదు . ఇలాంటి పారతంత్ర్య పరాకాస్తతో ఉన్న గోపిక ఈ గాఢ నిద్రలో మునిగి యున్న కృష్ణుని పొరిగింటి పిల్ల - ఈ వేళ మేల్కొల్పుచున్నారు.
పాశురము:  
నోత్తు చ్చువర్ క్కం పుగుగిన్ఱ అమ్మనాయ్
మాత్తముం తారారో వాశల్ తిఱవాదార్
నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్
పోత్త ప్పఱై తరుం పుణ్ణియనాల్ పండొరునాళ్
కూత్తత్తిన్ వాయ్వీళంద కుమ్బకరణనుం
తొత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో
ఆత్త అనందల్ ఉడైయాయ్! అరుంగలమే
తేత్తమాయ్ వందు తిఱవేలోర్ ఎమ్బావాయ్



తాత్పర్యము:  మేము రాక ముందు నోమునోచి , దాని ఫలముగా సుఖనుభావమును పోందినతల్లీ! తలుపుతెరవకపోయినా పోదువుగాక, ఒక మాటనైనను పలుకవా! పరిమళముతో నిండిన తులసిమాలలు అలంకరింఛిన  కిరీటము గల నారాయణుడు, ఏమియులేని మావంటివారము మంగళము పాడినను `పర ' అను పురుషార్ధమును ఓసంగేడి పుణ్యముర్తి , ఒకనాడు కుంభకర్ణుని మృత్యువు నూతి లో పడత్రోయగా, ఆ కుంభకర్ణుడు నిద్రలో నీచే ఓడించబడి తనసోత్తగు ఈ గాఢ  నిద్ర ను నీకు ఒసగినాడా! ఇంత అధికమగు నిద్రమత్తు వదలని ఓ తల్లీ ! మాకందరకు శిరోభుషణమైనదానా! నిద్రనుండి లేచి, మత్తును వదలించు కొని, తేరుకొని వచ్చి తలుపు తెరువు , నీ నోరు తెరచి మాటలాడు.  కప్పుకొని ఉన్న దుప్పటిని తొలగించి ఆవరణములోకి వచ్చినీ దర్శనము మాకు కలిగించు. అని ఈ పాశురములో అంటున్నారు. 


విశేషార్ధం:
నోత్తు చ్చువర్ క్కం పుగుగిన్ఱ అమ్మనాయ్:
నోమునోచుకోని స్వర్గమును చొచ్చుచున్న ఓ అమ్మా! కృష్ణుని విడిచి మాతో పాటు వ్రతము చేయుటకు సంకల్పించిన ఈమె, వ్రతము పూర్తి అయి ఫలము పొందినదానివలె ఈమె సుఖముగా పడుకోన్నదేమో అని ఆశ్చర్యముతో ఆక్షేపణగా, ఏవమ్మా ! అప్పుడే నీవ్రతము పూర్తి అయ్యినట్లున్నదే! ఫలమునుననుభావస్తున్న దానివలె వున్నావు అని అంటున్నారు.
మాత్తముం తారారో వాశల్ తిఱవాదార్:
"తలుపుతెరవకపోతే పోయావు మాటైనా పలుకవా!" ఈ గోపికా సముహామును చూచినానంద పారవశ్యముచే లోన నుండు గోపికా మాట రాక మాటాడకుండెను.
ఆంజనేయస్వామి శ్రీ రామ విజయవార్తను చెప్పగానే సీతమ్మ హర్శముచే స్థంభించినదియై ఏమీ మాటాడలేకపోయినది.  అలానే ఏ గోపికా కూడా మాటాడలేకపోయినది. దానికి సమాదానము ఇస్తే తాను అంగీకరించినట్టు అవును అని మాటాడకుండా అలానే పరుండెను.  ఆమె అభిప్రాయం తెలియనివీరు మాటైనా మాటాడవా అంటున్నారు.  ఏ మాటవిని కృష్ణునితో కలసి వున్నట్టు వారనుకుంటున్నారని గ్రహించి ఇక్కడ లేడే! మీరెందుకు అలా అంటున్నారు అన్నది.  అప్పుడు వీరు అమ్మా! నీవు దాచినా దాగదు ఈ తత్వము.  తులసి పరిమళం పైకి వ్యాపిస్తోంది అని వీరు చెప్పుచున్నారు. 
నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్:
కిరీటమందు పరిమళించుచున్న తులసి కలవాడు  నారాయణుడు.  నీవు దాచినా దాగనిది తులసి వాసన.  అతడోక్కసారి కౌగలించుకొని వడిచినా,  ఆవాసన ఎన్ని స్నానములు చేసినాను విడవదు ఆవాసన.  ఆ వాసన బయటికి వస్తుంది మీ ఇంటినుండి, అతడు లేదనుట ఎలా నమ్మీతట్టు ఉంది.  తులసి వుండుట వల్ల వీరు కృష్ణుడు అక్కడ ఉన్నాడని నిశ్చయించుకున్నారు.  అతడు నారాయణుడే అని అనుచున్నారు.
నమ్మాల్ పోత్త ప్పఱై తరుం పుణ్ణియనాల్ పండొరునాళ్:
"మాకు మంగళము పాడగానే పరను ఒసగు పుణ్యాత్ముడు". ఏమియు లేని మేము అనగా భాగాత్ప్రాప్తికి తగిన సాధనములు లేని గోపికలము చేరి ఆశ్రాయిమ్చుటకు అవకాసం ఇచ్చు పరమ ధార్మికుడు.  అతడు మాతో మాటాడకుండా నిన్ను అడ్డుకోడు. మేము జన్మతః హీనులమే కాని, నడువడి లేనివారమని అతను తలువాడు.  తనకు మంగళము పాడినా ఎవరైనా ఆశ్రయము ఇచ్చువాడు.  అంతటి ఉదారస్వభావుడు, పున్యమూర్థి, అతడే పుణ్యము అని అంటున్నారు.  అట్టి పుణ్యమే మృత్యుహేతువైనది కుంభకర్ణునికి.  ఆ పుణ్యమే నిన్ను ఈరోజు మాకు దూరం చేస్తోంది.  అది నీకు తగదని కుంభకర్ణ వృత్తాంతమును ప్రశంసించుచున్నారు.
............................పండొరునాళ్:
కూత్తత్తిన్ వాయ్వీళంద కుమ్బకరణనుం
తొత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో:
"పూర్వము ఒకరోజు మృత్యవు నోటిలో పడిన కుంభకర్ణుడును నీకు ఓడి పెద్ద నిద్రను ఒసగినాడా!.  ఈ గోపికా అహంకారవిజయము, శాస్త్రఙ్ఞానము, నిరంతర భగవద్యానం కల్గినది.  ఈమె  గాఢనిద్ర ఈ కృష్ణసంస్లేషమే.  అగస్యుని  ప్రభావంతో ఈమెకు అత్తినిద్ర వచ్చిందని ఈ పిల్లలు శంకించినారు.
అసురతత్వముగల కుంభకరునితో తనను పోల్చిరని భాదపడుతూ లోపలినుండి గోపికా లేచి వచ్చి వీరికి కనబడాలని కృష్ణ!-కృష్ణ! అనుచూ బాహ్యస్మృతి లోకి వచ్చినది.  అప్పుడే నిద్రలేచిన వారికి ఎట్టి మత్తు వుండునో అట్టి మత్తులో నున్న ఈమెను చూచి వీరనందింఛి. 
ఆత్త అనందల్ ఉడైయాయ్! :
అధికమగు నిద్రమత్తు కలదానా! అని పిలుచుచున్నారు.  మీరు మేల్కొనిన ఈతీరే మాకు చాలు.  కృష్ణభగవానుడు వద్దకు పోయి మేల్కొల్పుట ప్రధానము కాదు.  నీవు మేల్కొనుచుండగా దర్శించుట మా భాగ్యము. ఆ మత్తులో ఉన్న ఆమెను చూసి
అరుంగలమే:
"దుర్లభామగు ఓ భూషణమా!" అనుచున్నారు.  నీవేమియు చేయకున్నాను మాతో చేరి యుండుట మా గుంపుకు నాయక రత్నము అమర్చినట్లు అవుతుంది.  నీ ఙ్ఞానప్రకాసముచే మమ్ములను ప్రకాశింపచేసి ముందుకు నడువమని ప్రార్దిమ్చినారు.  ఎలా పిలవగానే ఆమె వారి ఆర్తిని చూసి తొందరగా లేచి బయటకు రావలేనని లోపలనున్న గోపిక త్వరపడుట గమనించి  
తేత్తమాయ్ వందు తిఱ:
"తెరుకోనినదానవై వచ్చి తరువు" అనుచున్నారు.  నిద్రావస్థలో అస్తవ్యస్తముగాఉన్న వస్త్రాభరణాదులతో, కృష్ణసంశ్లేష చిహ్నముతో వెలికివచ్చి అందరిదృష్టిలో పడకు. సర్ధుకొనివచ్చి తలుపు తెరువు.  లేనిచో మాకే ప్రమాధమని పైనున్న గోపికలు తేరుకొని రమ్మంటున్నారు. తలుపు తెరువుము.  నీవాక్కు మాకందునట్లు నీనోరు తెరువుము.  భగవదనుభవ పరవసమగు నీ శరీరము మా కంటపడునట్లు ప్రావరనమును తొలగించు అని ప్రార్ధిస్తున్నారు.  ఈ పాశురము లో ఈ కేంద్రేయావస్థలో నుండి ఇంద్రియములేవియు పనిచేయక మనసు భగవదాదీనమై సిద్దోపాయ నిస్టలో ఉన్న గోపిక మేల్కొల్పబడెను.


జై శ్రీ మన్నారాయణ్

ఎవరో చూడాలి అని నాట్యమాడదే


ఎవరో చూడాలి అని  నాట్యమాడదే  నెమలి 
ఎటుగా  సాగాలి  అని  ఏరు ఎవరినడగాలి 

ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి
ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలి

కో అంటూ కబురు పెడితే రగిలే కొండగాలి
ఓ అంటూ కరిగి రాదా నింగే పొంగి పొరలి
ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి
ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలి

తనలో చినుకే బరువై కరిమబ్బే వదిలినా
చెరలో కునుకే కరవై కలవరమే తరిమినా
వనమే నన్ను తన ఒడిలో అమ్మై పొదువుకున్నదని
పసిపాపల్లె కొమ్మలలో ఉయ్యాలూపుతున్నదని
నెమ్మదిగా నా మదికి నమ్మకమందించిందెరో ఎవరో

ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి
ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలి

వరసే కలిపే చనువై నను తడిమే పూలతో
కనులే తుడిచే చెలిమై తల నిమిరే జాలితో
ఎపుడో కన్న తీపికల ఎదురౌతుంటే దీపికలా
శిలలో ఉన్న శిల్పకళ నడకే నేర్చుకున్నదిలా
దుందుడుకో ముందడుగో సంగతి అడిగి వారెవరో ఎవరో

శుక్రవారం, డిసెంబర్ 23, 2011

తిరుప్పావై నవమ పాశురము

శుక్రవారం, డిసెంబర్ 23, 2011

తిరుప్పావై లో మొదట కొన్ని పాశురములో వ్రతము ఎలా చెయ్యాలి నియామాలు ఏమిటి అని చెప్పారు.  తరువాత భగవంతుని ఒక్కరే అనుభవించకుండా గోపికలందరూతో కలసి అనుభవించాలని అనుకోని.  ముందు ఉత్తిష్ట అనే చిన్న పిల్లని నిదుర లేపారు. తరువాత బాగా దైవానుగ్రహం గల గోపికను నిదుర లేపారు.  తరువాత పాశురములో మూడవ గోపికకు తెల్లవారినది అని చెప్పి ఆమెను మేల్కొల్పారు. ఇప్పుడు నాల్గవ గోపికను నిదురలేపుతున్నారు.   ఈ గోపిక పరమాత్మయే ఉపాయము అను అధ్యవసాయమున పరినిస్తితురాలు. భాగవంతుని కంటే వేరే ఉపాయము లేదని  నమ్మినది . అలాంటి ఈమె నిద్రను చూచి గోదా మిగిలిన గోపికలు కూడి మొదటి రెండు పాశురాలు విన్నావు కదా ! మరి విని కుడా పరుంటివా ? లెమ్ము అని మెలొల్పుతున్నరు . మొదటి నాలుగు పాశురాలలొ నిద్ర నుండి మేల్కొల్పు తొ ఉన్న పాశురాలే కదా. నిద్ర గురించి భగవద్గీత లో నాలుగు అవస్తలు గురించి నాలుగు శ్లొకాలలొ వివరించారు. నాలుగు అవస్తలు 1 యతమానవస్థ 2. వ్యతిరేకావస్థ, 3. ఏకేంద్ర్దియావస్థ, 4. వశీకారావస్థ. అను అవస్థలు గురించి గీతలొ బాగా వివరించారు.
మొదటి రెండు పాశురాలలో శ్రవణము చెప్పబడినది . తరువాత పాశురములో మననము నిరూపించబడినది. ఈ పాశురము నుండి నాలుగు పాశురములలో ధ్యానదశ వివరించబడినధి. అట్టి ధ్యానములో పరకాష్ట గోపిక ఈనాడు మేల్కొల్పబడుచున్నది . మరి ఈమెను ఎలా నిదురనుండి మేల్కొల్పుతున్నారో చూద్దాం.  ఈ పాశురము చాలా విశేషమైనది. దీనికి దద్దోజనం ఆరగింపుగా సమర్పించాలి.

పాశురము: 
తూమణి మాడత్తు చ్చుత్తుం విళక్కెరియత్
దూపం కమళత్తుయిల్ అణైమేల్ కణ్ వళరుం
మామాన్ మగళే! మణి క్కదవం తాళ్ తిఱవాయ్
మామీర్! అవళై ఎళుప్పీరో ఉన్ మగళ్ తాన్
ఊమైయో అన్ఱి చ్చెవిడో అనందలో
ఏమ ప్పెరుందుయిల్ మందిర ప్పట్టాళో
మామాయన్ మదవన్ వైకుందన్ ఎన్ఱెన్ఱు
నామం పలవుం నవిన్ఱేలోర్ ఎంబావాయ్

తాత్పర్యము: ఉజ్జ్వలములైన నవరత్నములతో నిర్మించిన మేడలో మెత్తని పాన్పుపై చుట్టును దీపములు ప్రకాశించుచుందగా అగురుధూపముల పరిమళము నాసికను వశమొనర్చుకోను చుండ నిద్రపోవు ఓ అత్తా కూతురా! మణికవాటము యొక్క గడియను తీయుము.  ఓ అత్తా! నీవైనా ఆమెను లేపుము.  నీ కుమార్తె మూగదా? లేక చెవిటిదా? లేక మందకొడి మనిషా?  ఎవరైనా నీవు కదలినచో  మేము సమ్మతింపమని కాపలా ఉన్నారా? లేక మొద్దు నిద్దుర ఆవేశించునట్లు ఎవరైనా మంత్రము వేసినారా.  మహామాయావీ! మాధవా! వైకుంఠవాసా! అని అనేకములైన భగవంనామములను కీర్తించి ఆమెను మేల్కొనునట్లు చేయుము అని భావము.

విశేషార్దము:
తూమణి మాడత్తు:
ఈనాటి గోపిక అద్దాలమేడలో పరుండియున్నది.  ఏ మేడ స్వచ్చమైన తొమ్మిది విధములగు రత్నములతో నిర్మించి ఉన్నది.  ఆ భవనములో నిదురపోతున్న తీరును వారు చెప్పుకొని ఆనందించుచున్నారు.
శిత్తుం విళక్కెరియ:
చుట్టూను దీపములు ప్రకాశించుచుండగా. మణి మయ భవనములో మణుల కాంతిచేతనే ప్రకాశమున్నను దీపములు వెలిగించుట మంగళార్ధము.  పగటివేళ భగవద్ సన్నిదిని దీపము వెలిగించుటలో అర్ధం అదే.  దీపము అంటే శాస్త్ర జన్యమైన ఙ్ఞానదీపము . శాస్త్రములచే కలిగిన ఙ్ఞానము తోడైయుండుటచే భగవదఅనుభవము చక్కగా పొందును.
తూపమ్ కమళ:
అగరు మొదలగు వాని ధూపము పరిమళించుచుండగా, ఈమె దీపములే కాక అగరు పొగ కూడా వేసుకొని పరుండియున్నది.  దూపము పోగాలేకుండా పరిమమలం మాత్రమె వున్నదిట.  దీపము ఙ్ఞానదీపము వంటిది, పరిమళం అనుష్టానము వంటిది.  ఏ రెండు కల్గి భగవదనుభావము కలది.  ఈ రెండే దీపము-పరిమళం దగ్గర పెట్టుకొని నిదురిస్తున్నది.  ఈమె భగవద అనుభవంలో నిమగ్నము అయ్యివున్నది అని అనుకుంటున్నారు.
మనసు పూర్తిగా పరమాత్మయందే నిలిపి ఉన్నది.
 తుయిలణై మేల్ కణ్ వళరుమ్:
నిద్రను చక్కగా పట్టించు పడక పై నిద్రించుచున్నది ఈ గోపిక.  ఈమె పూర్తిగా భగవంతుని అనుభవిస్తున్నది.  నిద్ర పట్టిస్తున్న పానుపు భగవంతుడే.  వానితో కలసి నిదురించుటనే నిద్ర.  ఈమె నివృత్తి మార్గనిష్టూరాలు.
మామాన్ మగళే!:
అత్తా కూతురా! అని ఆమెను సంబోదిస్తున్నారు.  గోపికాభావమును పొంది కేవలము ఆధ్యాత్మికముగానే కాక భౌతికంగా కూడా వార్తితో తనకు సంభందములను ఏర్పర్చుకోనుచున్నది గోదామాత.  గోదా తననుకూడా గోపవనితగా భావించుకొని.  గోపికను అత్తా కూతురా అంటోంది.
మణి క్కదవం తాళ్ తిఱవాయ్:
"మణులతో నిర్మింపబడిన తలుపుల గడియలను తెరువుము". ఆమె భవనం మణులతో వున్నది కదా దాని గడియలు ఎక్కడున్నావో తెలియటంలేదు. ఏది ద్వారమో, ఏది గోడో తెలియటంలేదు. ఆమెనే తలుపుతెరవమన్నారు.  "మీరే తెరుచుకురండి" అని ఆమె అన్నా గోపికలు అంగీకరించక ఆమెనే తలుపు తెరవమన్నారు వీరు. మేము ఇలా చెప్పినా లేవకుండా పడుకుండుట తగదు అని చెప్పుచున్నారు.
మామీర్! అవళై ఎళుప్పీరో:
అత్తా! ఆమెను లేపుము.  మా ఆర్తిని చూచి మేలుకోపోయినా, నీ అనునయము చేతనైనా మేల్కొనునట్లు చెయ్యి.  భగవంతుడే ఉపాయమని విశ్వసించి ఆ భగవంతునికొరకు ఆర్తి కలిగిన ఇతరులకై తానుకూడా భాధపడుచు వారికి సాయపడుట తప్ప వేరే ఉపాయం లేదు.  ఇది భగవంతుని పొందుటకు అనుకూలము అని తల్లే చెప్పి ఆ పరుండిన గోపికను మేల్కొల్పాలి.  అలా మేల్కోకపొక పోవుట చూచి మనసులో భాధకల్గి
 ఉన్ మగళ్ తాన్  ఊమైయో :
నీ కూతురు మూగదా! అని అనుచున్నారు. నీ కూతురు అని కోపముతో అనుచున్నారు. మారుమాటాడదా! పలకకుండా ఎవరైనా నోరు ముసినారా?  నీ కూతురు భగవంతుడే ఉపాయము అనుకునేవారితో కలసి రాదా ఏమి ?
ఇదేనా నీకూతురుకు నేర్పిన విద్య! అని ఆక్షేపిస్తున్నారు.  ఇలా చేయటం ఆమెకు అనుకూలము కాదు సరికదా ప్రతికూలమే అవుతుంది.  భగవదనువిరోదులుతో మాటాడకూడదు కానీ భగవదప్రాప్తి కాలమగు మాతో మాటాడరాదా?
 అన్ఱి చ్చెవిడో:
మూగయే కాక చెవుడు కూడనా? మామాటలు వినబడనట్లుగా అక్కడేవరైనా ఆమె చెవిలో మాటాడుతున్నారా?
అనన్ధలో :
ఏ వ్యాపారము చేయలేని అలసటలో వున్నదా ?
ఏమ ప్పెరుందుయిల్ మందిర ప్పట్టాళో:
ఎవరైనా ఆమెను లేవవద్దని కాపలా ఉన్నారా? లేకపోతె గాఢనిద్ర పట్టునట్లు మంత్రించియున్నారా?  మాకు నిద్ర పట్టకుండా చేసినవాడే ఈమెకు నిద్రపట్టించినాడా?  అతడు కాపలాయుండి ఈమెను నిద్రనుండి మేల్కొననీయకుండా వున్నాడా? నిద్రకు, తెలివితెచ్చుకోనుటకు పరమాత్మే కారణం. అతనితో కలసినవారు నిద్రపోదురు. వీడినవారు నిద్రలేకుండా వుందురు.  అనన్యఉపాయత్వమ్ తెలిసినవారు భగవన్నామమునకు వశులై ఆ సంకీర్తనమునకు అంతరనుభావంనుండి భాహ్యను భావమునకు వస్తారు.  అదే మేల్కొనుట. 
"మామాయన్, మదవన్, వైకుందన్," ఎన్ఱెన్ఱు నామం పలవుమ్ నవిన్ఱు:
'మహా మాయావీ! మాధవా! వైకుంఠ వాసా ! అని అనేక నామాలును కీర్తించినారు.  ఈ మూడు నామాలలో భగవంతుని కళ్యాణగుణాలను కొన్నింటిని వీరు మరచినారు. మహామాయావి అనుటలో జగత్కారణం అయిన పరమాత్మ కృష్ణుని కీర్తిస్తున్నారు.
మాయ అనగా ప్రకృతి.  ఈ ప్రకృతినే పరమాత్మగా భావిస్తున్నారు. మాయ అనగా భగవద సంకల్పరూపము.అది ఆశ్చర్యమైన శక్తీ కలది. అదే ఈ సర్వమునకు మూలము అని.
మాదవ అంటే మా = శ్రీ యొక్క, ధవః = శ్రీయఃపతీ అని కీర్తించాడు. జగత్కారణమైన ఆ పరతత్వము. సర్వసులభమై దిగుటకు శ్రీ మహా లక్ష్మే కారణం.  ఆమెవద్ద శుశ్రూషచేతనే ఈ సౌలబ్యాము అతనికి అబ్బింది అని మాధవా అని కీర్తిస్తున్నారు.  ఈ లక్ష్మీపతితత్వమే యితడు పరతత్వమని నిరుపిస్తోంది.
దీనితో ఆభాగావదనుభవ నిమగ్నమైన గోపిక ఆప్రత్యేకానుభూతిని వీడి వీరితో కలసి అనుభావిమ్చినాగాని నిలువలేని మనస్థితి గలది వెలికి వచ్చెను ఈ గోపిక.  మొత్తానికి ఈ గోపికను కూడా నిదురలేపారు.

జై శ్రీ మన్నారాయణ్


My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)