Blogger Widgets

శనివారం, డిసెంబర్ 24, 2011

తిరుప్పావై దశమ పాశురము

శనివారం, డిసెంబర్ 24, 2011

శ్రీ శ్రీకృష్ణ పరమాత్మ ను విడిచి గోపికలు విరహముచే నిద్ర లేక , వ్రతము చేయవలెనని బయలుదేరి వచ్చుచుండగా పదిమంది నిద్రించుట ఆశ్చర్యముగా ఉండును. వారిలో ఒక్కొక్కరిని ఒక్కొక్కవిదముగా మేల్కొల్పుచున్నారు. వారి నిద్ర కుడా లౌకిక నిద్ర వంటి తామస నిద్ర కాదని అది భావదనుభావము చేత కలిగిన తామస నిద్ర అని తెలియుచున్నది. భగవదనుభావమున్న వారిని మేల్కొల్పుట అనగా వారి అభిముఖ్యమును సంపాదించి వారి విశేషకటాక్షమునకు పాత్రులై పాత్రులై భగవదనుభావయోగ్యతను కలిగించుకోనుతయే! భాగాత్ప్రాప్తికి ఉపాయములు భిన్న భిన్నముగా ఉన్నట్లు కన్పట్టుచుండును. నిష్కామకర్మ, ఆత్మస్వరుప జ్ఞానము , భగవద్భక్తి , భాగాత్ర్పాప్తికి ఉపాయములుగా భగవద్గీతలో నిర్దేశింపబడెను . ఆల్వారాలను ఈ పదియవ పాసురమున మేల్కొలుపు చున్నారు.ఈ గోపిక ఫలమును ఆశించినది కాదు . లాభనష్టాలు అన్ని పరమాత్మవే కాని తనవి కావని నిశ్చలంగా ఉన్నది. ఇతర ఇంద్రియములు పనిచేయక కేవలము ఒక్క మనస్సు మాత్రమె పనిచేయుచున్నది. ఆ మనసు లో పరమాత్మ దురులకు ఆటంకములేదని సూచించుటకు కృష్ణుని పొరిగింటి పిల్ల ఈమె . ఫలము సిద్దింపక దుఃఖము కలిగినా ఉద్వేగము చెందదు . తనను పాడుట భగవానునికి ఫలముగా భావించి భాద కలిగినా భగవంతుడే ఉద్వేగము చెందాలని . ఆమె భావిచేది. ఆ సుఖాలమీద తనకి మమకారము లేదు . ఇలాంటి పారతంత్ర్య పరాకాస్తతో ఉన్న గోపిక ఈ గాఢ నిద్రలో మునిగి యున్న కృష్ణుని పొరిగింటి పిల్ల - ఈ వేళ మేల్కొల్పుచున్నారు.
పాశురము:  
నోత్తు చ్చువర్ క్కం పుగుగిన్ఱ అమ్మనాయ్
మాత్తముం తారారో వాశల్ తిఱవాదార్
నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్
పోత్త ప్పఱై తరుం పుణ్ణియనాల్ పండొరునాళ్
కూత్తత్తిన్ వాయ్వీళంద కుమ్బకరణనుం
తొత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో
ఆత్త అనందల్ ఉడైయాయ్! అరుంగలమే
తేత్తమాయ్ వందు తిఱవేలోర్ ఎమ్బావాయ్



తాత్పర్యము:  మేము రాక ముందు నోమునోచి , దాని ఫలముగా సుఖనుభావమును పోందినతల్లీ! తలుపుతెరవకపోయినా పోదువుగాక, ఒక మాటనైనను పలుకవా! పరిమళముతో నిండిన తులసిమాలలు అలంకరింఛిన  కిరీటము గల నారాయణుడు, ఏమియులేని మావంటివారము మంగళము పాడినను `పర ' అను పురుషార్ధమును ఓసంగేడి పుణ్యముర్తి , ఒకనాడు కుంభకర్ణుని మృత్యువు నూతి లో పడత్రోయగా, ఆ కుంభకర్ణుడు నిద్రలో నీచే ఓడించబడి తనసోత్తగు ఈ గాఢ  నిద్ర ను నీకు ఒసగినాడా! ఇంత అధికమగు నిద్రమత్తు వదలని ఓ తల్లీ ! మాకందరకు శిరోభుషణమైనదానా! నిద్రనుండి లేచి, మత్తును వదలించు కొని, తేరుకొని వచ్చి తలుపు తెరువు , నీ నోరు తెరచి మాటలాడు.  కప్పుకొని ఉన్న దుప్పటిని తొలగించి ఆవరణములోకి వచ్చినీ దర్శనము మాకు కలిగించు. అని ఈ పాశురములో అంటున్నారు. 


విశేషార్ధం:
నోత్తు చ్చువర్ క్కం పుగుగిన్ఱ అమ్మనాయ్:
నోమునోచుకోని స్వర్గమును చొచ్చుచున్న ఓ అమ్మా! కృష్ణుని విడిచి మాతో పాటు వ్రతము చేయుటకు సంకల్పించిన ఈమె, వ్రతము పూర్తి అయి ఫలము పొందినదానివలె ఈమె సుఖముగా పడుకోన్నదేమో అని ఆశ్చర్యముతో ఆక్షేపణగా, ఏవమ్మా ! అప్పుడే నీవ్రతము పూర్తి అయ్యినట్లున్నదే! ఫలమునుననుభావస్తున్న దానివలె వున్నావు అని అంటున్నారు.
మాత్తముం తారారో వాశల్ తిఱవాదార్:
"తలుపుతెరవకపోతే పోయావు మాటైనా పలుకవా!" ఈ గోపికా సముహామును చూచినానంద పారవశ్యముచే లోన నుండు గోపికా మాట రాక మాటాడకుండెను.
ఆంజనేయస్వామి శ్రీ రామ విజయవార్తను చెప్పగానే సీతమ్మ హర్శముచే స్థంభించినదియై ఏమీ మాటాడలేకపోయినది.  అలానే ఏ గోపికా కూడా మాటాడలేకపోయినది. దానికి సమాదానము ఇస్తే తాను అంగీకరించినట్టు అవును అని మాటాడకుండా అలానే పరుండెను.  ఆమె అభిప్రాయం తెలియనివీరు మాటైనా మాటాడవా అంటున్నారు.  ఏ మాటవిని కృష్ణునితో కలసి వున్నట్టు వారనుకుంటున్నారని గ్రహించి ఇక్కడ లేడే! మీరెందుకు అలా అంటున్నారు అన్నది.  అప్పుడు వీరు అమ్మా! నీవు దాచినా దాగదు ఈ తత్వము.  తులసి పరిమళం పైకి వ్యాపిస్తోంది అని వీరు చెప్పుచున్నారు. 
నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్:
కిరీటమందు పరిమళించుచున్న తులసి కలవాడు  నారాయణుడు.  నీవు దాచినా దాగనిది తులసి వాసన.  అతడోక్కసారి కౌగలించుకొని వడిచినా,  ఆవాసన ఎన్ని స్నానములు చేసినాను విడవదు ఆవాసన.  ఆ వాసన బయటికి వస్తుంది మీ ఇంటినుండి, అతడు లేదనుట ఎలా నమ్మీతట్టు ఉంది.  తులసి వుండుట వల్ల వీరు కృష్ణుడు అక్కడ ఉన్నాడని నిశ్చయించుకున్నారు.  అతడు నారాయణుడే అని అనుచున్నారు.
నమ్మాల్ పోత్త ప్పఱై తరుం పుణ్ణియనాల్ పండొరునాళ్:
"మాకు మంగళము పాడగానే పరను ఒసగు పుణ్యాత్ముడు". ఏమియు లేని మేము అనగా భాగాత్ప్రాప్తికి తగిన సాధనములు లేని గోపికలము చేరి ఆశ్రాయిమ్చుటకు అవకాసం ఇచ్చు పరమ ధార్మికుడు.  అతడు మాతో మాటాడకుండా నిన్ను అడ్డుకోడు. మేము జన్మతః హీనులమే కాని, నడువడి లేనివారమని అతను తలువాడు.  తనకు మంగళము పాడినా ఎవరైనా ఆశ్రయము ఇచ్చువాడు.  అంతటి ఉదారస్వభావుడు, పున్యమూర్థి, అతడే పుణ్యము అని అంటున్నారు.  అట్టి పుణ్యమే మృత్యుహేతువైనది కుంభకర్ణునికి.  ఆ పుణ్యమే నిన్ను ఈరోజు మాకు దూరం చేస్తోంది.  అది నీకు తగదని కుంభకర్ణ వృత్తాంతమును ప్రశంసించుచున్నారు.
............................పండొరునాళ్:
కూత్తత్తిన్ వాయ్వీళంద కుమ్బకరణనుం
తొత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో:
"పూర్వము ఒకరోజు మృత్యవు నోటిలో పడిన కుంభకర్ణుడును నీకు ఓడి పెద్ద నిద్రను ఒసగినాడా!.  ఈ గోపికా అహంకారవిజయము, శాస్త్రఙ్ఞానము, నిరంతర భగవద్యానం కల్గినది.  ఈమె  గాఢనిద్ర ఈ కృష్ణసంస్లేషమే.  అగస్యుని  ప్రభావంతో ఈమెకు అత్తినిద్ర వచ్చిందని ఈ పిల్లలు శంకించినారు.
అసురతత్వముగల కుంభకరునితో తనను పోల్చిరని భాదపడుతూ లోపలినుండి గోపికా లేచి వచ్చి వీరికి కనబడాలని కృష్ణ!-కృష్ణ! అనుచూ బాహ్యస్మృతి లోకి వచ్చినది.  అప్పుడే నిద్రలేచిన వారికి ఎట్టి మత్తు వుండునో అట్టి మత్తులో నున్న ఈమెను చూచి వీరనందింఛి. 
ఆత్త అనందల్ ఉడైయాయ్! :
అధికమగు నిద్రమత్తు కలదానా! అని పిలుచుచున్నారు.  మీరు మేల్కొనిన ఈతీరే మాకు చాలు.  కృష్ణభగవానుడు వద్దకు పోయి మేల్కొల్పుట ప్రధానము కాదు.  నీవు మేల్కొనుచుండగా దర్శించుట మా భాగ్యము. ఆ మత్తులో ఉన్న ఆమెను చూసి
అరుంగలమే:
"దుర్లభామగు ఓ భూషణమా!" అనుచున్నారు.  నీవేమియు చేయకున్నాను మాతో చేరి యుండుట మా గుంపుకు నాయక రత్నము అమర్చినట్లు అవుతుంది.  నీ ఙ్ఞానప్రకాసముచే మమ్ములను ప్రకాశింపచేసి ముందుకు నడువమని ప్రార్దిమ్చినారు.  ఎలా పిలవగానే ఆమె వారి ఆర్తిని చూసి తొందరగా లేచి బయటకు రావలేనని లోపలనున్న గోపిక త్వరపడుట గమనించి  
తేత్తమాయ్ వందు తిఱ:
"తెరుకోనినదానవై వచ్చి తరువు" అనుచున్నారు.  నిద్రావస్థలో అస్తవ్యస్తముగాఉన్న వస్త్రాభరణాదులతో, కృష్ణసంశ్లేష చిహ్నముతో వెలికివచ్చి అందరిదృష్టిలో పడకు. సర్ధుకొనివచ్చి తలుపు తెరువు.  లేనిచో మాకే ప్రమాధమని పైనున్న గోపికలు తేరుకొని రమ్మంటున్నారు. తలుపు తెరువుము.  నీవాక్కు మాకందునట్లు నీనోరు తెరువుము.  భగవదనుభవ పరవసమగు నీ శరీరము మా కంటపడునట్లు ప్రావరనమును తొలగించు అని ప్రార్ధిస్తున్నారు.  ఈ పాశురము లో ఈ కేంద్రేయావస్థలో నుండి ఇంద్రియములేవియు పనిచేయక మనసు భగవదాదీనమై సిద్దోపాయ నిస్టలో ఉన్న గోపిక మేల్కొల్పబడెను.


జై శ్రీ మన్నారాయణ్

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)