ఈనాటి పాశురములో లేపబడుచున్న గోపిక , కులముచేతను, రూపముచేతను, గుణముచేతను అందమైనది. కృష్ణుడు ఊరుకంతకు ఆదరణీయుడై యున్నట్లే.యీమె కూడా ఊరులోని అందరి మన్ననలను అందిన పిల్ల. ఈ పాశురములోని నిద్ర పోతున్న గోపిక వంశము వారు భరతుని వంశము చెందినవారు. వీరు అభిజాత్యము -సౌందర్యము - ఐశ్వర్యము కల గోపిక ను ఇందు లెపబడుచున్నది. ఈమె సౌందర్యము ను స్త్రీలే పృశంచించుట విశేషము. గోపికలందురు కృష్ణతత్వమూ నేరిగినవారు. నాకు అయితే వారు చాలా అదృష్టవంతులుగా తోచుతున్నది. అయ్యో అప్పుడు నేను లేనే అని వుండివుంటే చాలా బాగుండును కదా, నేను ఒక గోపికగా వుండేదానను అనిపిస్తుంది. సరే ఈనాటి పాశురము గురుంచి ఎలా ఈ గోపికను నిదుర లేపుతున్నారో చూద్దాం.
కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు
కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు
శెత్తార్ తిఱల్ అరియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం
కుత్తం ఒన్ఱిల్లాద కోవలర్-దం పొఱ్కొడియే
పుత్తరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు నిన్-
ముత్తం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్-పాడ
శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి నీ-
ఎత్తుక్కుఱగుం పొరుళ్-ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము: లేగ దూడలు కల ఆవులే అయినను దూడవలేనే లేత వయస్సులో ఉన్న ఆవుమందలను పాలు పితుకగలవారును శత్రువునుఎదుర్కొని బలము చూసి యుద్దము చేయగలవారు ఏ విధమగు దోషములు లేనివారును అయిన గోపాలకుల వంశములో జనించిన బంగారుతీగా! పుట్టలో పాముయోక్క పడగవలేనున్న నితంబ ప్రదేశము కలదానా! అడవిలోని నెమలితోకవంటి అందమైన కేశపాశము కలదానా? రమ్ము చుట్టములు చెలికత్తెలు అందరును వచ్చినారు. నీ వాకిలి ముందు చేరియున్నారు. నీలమేఘమువంటి వర్ణముగల శ్రీ కృష్ణుని నామమును కీర్తించుచున్నారు. ఆ విధముగా నందరు భగవంనామమును కీర్తించుచున్నాను కదలక మెదలక ఉన్నావేమి? ఓ సంపన్నురాలా ! నీ నిద్రకర్ధమేమితో తెలియచేయుము.
విశేషార్ధాము:
కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు:
లేగదూడలు కల చాలా ఆవుల మందలకు పాలుపితికి. దూడలుగా గల ఆవులే ఐనను శ్రీ కృష్ణస్పర్శ, వేణుగానాము. వేణుగానమును విని కృష్ణ స్పర్శచే బలసి సమృద్దిగా పాలిచ్చుచ్చున్న ఆవులవి. ఆవుల పాలు పిండు నేర్పునఉనంత మాత్రమున లాభములేదు. పొంచియుండి ఆ ఆవుల కాపదలు కల్గించెడి విరోధుల నెదిరించెడి బలము కూడా గలదీ గోపాలురకు అని చేబుచున్నారు.
శెత్తార్ తిఱల్ అరియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం:
శత్రువుల బలము నశించునట్లు ఎదురించి యుద్ధము చేయువంశము. శ్రీ కృష్ణ పరమాత్మ అతిశయమును ఓర్వలేనివారే గోపాలురకు శత్రువులు. భగవద్సంభంధము కలిగి భగవంతుని ప్రేమించియున్న వారికి భగవద్వేషులుగా కన్పెట్టుచుందురు. అటువంటి బలప్రతాపము తమపై కూడా చూపునో ఏమో అని " అమ్మా! అలా బలమును చూపి త్రోసిపుచ్చుట శత్రువులనే కాని ఆశ్రయించిన వారిని కాదమ్మా! దిక్కు లేనివారిని కాదమ్మా!" అది మీ గోపాలురకు లక్షణము కాదని,
కుత్తం ఒన్ఱిల్లాద:
ఏ దోషమునులేని గోపాలవంశమున పిట్టినదాన వనుచున్నారు. శత్రువు ఎదిరించివచ్చిన ఉపేక్షించినవారను దోషములేదు. శత్రువైనను చేతిలో ఏమియు సాధనములేనిచో హింసించరాదు. "ఎంత చెడ్డవాడైనను సరే! నన్ను ఆశ్రయించి సేవించినచో అతడు మంచి వాడే! అతడు గౌరవించదగినవాడే" అని భగవద్గీత లో శ్రీ క్రుష్ణులవారు అన్నారు కదా! ఆ వంశములో పుట్టిననీకు ఆ లక్షణములు వుండాలి కదా!
కోవలర్-దం పొఱ్కొడియే:
గోపవంశము నందలి బంగారుతీగా! అని సంబోధించుచు మేల్కొల్పుతున్నారు. తీగ అనుటచే ఒకదాని చేరికలేనిదే నిలువనిది అని తెలుయుచున్నది. బంగారు తీగెఅనుటచే విశదం, దృడమైనది అని అర్ధం అగుచున్నది. స్త్రీలకూ కూడా మోహము కల్గించు సౌందర్యవతి అని ఆమె సౌందర్యమును వర్ణిస్తున్నారు. అది సౌందర్యమునకు అతిశయం అని ఆమె ను వర్ణిస్తున్నారు.
పుత్తరవల్ గుల్ పునమయిలే:
పుట్టలోని సర్పము వంటి నితంబము కలదానా! అడవిలోని నెమలి వంటిదానా!. పుట్టలోని శరీరమునంతటను ముడుచుకొని దానిపై పడగవిప్పి పరున్న పామువలె నితంబమున్నదని ఇక్కడ వర్ణిస్తున్నారు. ఈ వర్ణన కొత్తగా వున్నది. అలా వుండగా ఈమెకి పునమయిలే అని అడవి నెమలివంటి జుట్టు కలది అంటున్నారు. ఆ జుట్టు కూడా నెమలి పురివిప్పినట్టు వుందిట. అంటే నెమలి మేఘాలను చూచి ఎలా నృత్యము చేయునో అలా జుట్టు వికసించి వుందిట. బంగారుతీగ అనుట కూడా ఆమె అందాన్ని వర్ణిస్తున్నారు. జుట్టు అనగా వ్యామోహం, ఆమెకి పరమభక్తి, భక్తి, పర భక్తి అను భక్తి వ్యామోహాలు కలిగివుంది. "నీ అందము చూచి పరమపురుషుడే వచ్చునని నిర్బరంగా పడుకోటం కాదమ్మా! మమ్ములను కలుసుకొని పరమాత్మకు చేర్చాలి అని లేపుచున్నారు.
పోదరాయ్:
లేచి రావమ్మా! నీ అందముచే నీ వద్దకు పరమపురుషున్ని ఆకర్షించుట కాదు. నీ అందము తో అతని ఆకర్షించి వసపరచుకొని మమ్ములను అతని చేర్చాలని. నీవే మాకు ఆదారం కావునా నీవు నడచి రమ్ము. అలా నడచివచ్చి తమ బృందములో చేరుమని కోరగానే, ఆమె లోపలినుండి అందరూ వచ్చినారా? అని ప్రశ్నించగా
శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు:
చుట్టరికముగల చేలికత్తేలందరును వచ్చిరి అని సమాదానము చెప్పుచున్నారు. ఈ వ్రేపల్లెలోని వారందరును ఈమెకు చుట్టములె ఈమెకు చెలికత్తేలే. సమానమైన బుద్ధికలవారిని సఖులందరు. అందరూ నీ వాకిలికి వచ్చినారు.
నిన్ ముత్తం పుగుందు :
నీ ముంగలి చొచ్చి నీ వాకిట చేరినాము. ఆమెచే బందము కలుగటచే ఆ వాకిలి పరమపదము కంటే కూడా ప్రాప్యమును భావముతో చూచుచున్నది. సర్వశేషియగు సర్వేస్వరుడు వచ్చి నిలుచు ముంగిలి కదా ఇది. ఆ ముంగిట చేరి పొందదలచిన దేమిటో చెప్పుచున్నారు.
ముగిల్ వణ్ణన్ పేర్-పాడ:
మేఘవర్ణుని నామమును కీర్తించుతాకే వచ్చితిమి. నీలమేఘశ్యాముని వర్ణించుట, అతని స్వరూపమును కీర్తించుట మా ఆనందమునకు కాదు. నీ మనసుకు ఆనందము కలిగించుటకు కీర్తిస్తున్నాం.
శిత్తాదే పేశాదే:
అలా కీర్తిస్తున్నను నీవు ఉలుకక పలుకకు ఉన్నావేమి? భగవద్భక్తులు భాగావదనుభావము చే పొందే ఆనందాతిరేఖము చేసే చేష్టలు, పల్కులు, చూచి , విని ఆనందించుటనే ఆకాంక్షింపదగినది.
శెల్వప్పెణ్డాట్టి:
సంపన్నురాలగు ఓయమ్మా! భగవద్అనుభవం ఒక రాసిగా చేసికొని అనుభావిమ్చుగల ఐస్వర్యము ఈమెకి కలదు. భగవద్పరతంత్రం ఉన్నది. అలా భగవంతుని వసపరచుకొని ఆ పారవశ్యములో పాడుకొనుట కాదు కదా
ఎత్తుక్కుఱగుం పొరుళ్-ఏలోర్:
నీ నిద్రకు అర్ధం ఏమిటమ్మా? ఇక్కడ నిద్ర అనగా పరిపూర్ణమైన భాగావదనుభావం లో బాహ్య స్మ్రుతి లేకుండుట. అలాంటి ఎకానుభూతి కైవల్యము వంటిది. అలాంటి కైవల్యము కల అమ్మాయిని పరకాలులు ఈ పాసురములో మేల్కొల్పినారు.
జై శ్రీ మన్నరాయణ్
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.