అష్టావదానము అన్నపదము వినేవుంటారు కదా. ఇది తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేకమైన విశిష్టత కలగిన ప్రక్రియ, ఈ ప్రక్రియ సంస్కృతంలో ను తెలుగులోనూ బాగా పరిచయము వున్నది. మా తాతగారు చింతా. రామకృష్ణా రావు గారు చాలా వివరముగా వివరించారు. మీరు కూడా తెలుసుకోవాలని కుతూహలముగా వుందా. అయితే సింపుల్ గా చెప్పెయలంటే.
అవధానం అనేది తెలుగు సాహిత్యం లో ఒక విశిష్ట ప్రక్రియ సంస్కృతము, తెలుగు కాకుండా వేరే ఏ యితర భాషలోనుఈ ప్రక్రియ ఉన్నట్లు కనపడదు. క్లిష్టమైన సాహితీ సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, చమత్కార పూరణలను అవలీలగా పూరిస్తూ, అసంబధ్ధ, అసందర్భ ప్రశ్నలను సమర్ధంగా ఎదుర్కొంటూ, ఆశువుగా పద్యాలు చెప్పుతూ అవధాని సభాసదులనలరింప జేయడం అన్నది అవధాని ప్రత్యేకత.వీటన్నిటినీ ఏక కాలంలో అవధాని చేసే సాహితీ విన్యాసమే అవధానం.
అష్టావధానముఅనే సాహిత్య ప్రక్రియ తెలుగు భాష సొత్తా అన్నట్టు వుంటుంది. ప్రప్రంచంలో ఏ భాష లోను లేని ఈ అవధానంలొ ముఖ్యమైన వ్యక్తి అవధాని. అతను అపారమైన ఏకాగ్రత వున్న పండితుడు. విశేషమైన భాషా పాండిత్యం, సమయస్పూర్తి , కల్పనా చాతుర్యము , చమత్కారం వంటివి వారిలో వుంటుంది. అవధాని కలం కాగితం పట్టకూడదు. కేవలం తన ధారణ లేక జ్ఞాపక శక్తితో, మధ్య మధ్య ఏకాగ్రతను భంగపరస్తూ అప్రస్తుత ప్రసంగి వేసే వింత ప్రశ్నలకు సముచితంగా సమాధానం చెబుతూ, కవితా వ్యాసంగం కావించాలి. మద్యలో మద్యలో గంట కొడతారు అవి లెక్కపెట్టి ఎన్ని గంటలు కోటారో చెప్పాలి. చెప్పిన కవిత్వాన్ని , ధారణ చేసి అఖరి అంశంగా అన్ని ప్రశ్నల సమాధానాల్ని అప్పచెప్పవలెను. ఎనిమిది అంశాలపై జరిగే అవధానం అష్టావధానము.
ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఇక్కడ చూడండి. మీకు పూర్తి సవివరంగా తెలుస్తుంది.
ఇలాంటి అవదానాన్ని ప్రత్యక్షముగా చూస్తే చాలా తమాషాగా వుంటుంది. టీవీ లో చూసే వుంటారు ఈ అష్టావదానము. టీవీ లో కంటే ప్రత్యక్షముగా చూడటం చాలా బాగుంటుంది. మీకు వీలయితే మీరు చూడటానికి ప్రయత్నం చేయండి. దీని మీరు చూసారంటే మన తెలుగు భాషకు వున్నా ప్రత్యేకత మీకు తెలుస్తుంది.
భగవంతుని పొందుటకు భక్తులు ఆచరించే పద్దతి భజన. శ్రీ అన్నమాచార్యులవారు రచించిన భజన కీర్తనలలో చాలా గొప్పగా ప్రసిద్ధి చెందినది ఈ కీర్తన. అన్నమాచార్యులువారు ఈ కీర్తనలో వెంకటేశ్వర స్వామివారిని చాలా రకాలుగా కొనియాడారు. అందులోనే శరణు వెడుతున్నాడు. ఈ కీర్తన నేర్చుకోటానికి చాలా సులువుగా వుంటుంది. చిన్నపిల్లలకుడా సులువుగా వస్తుంది అనటంలో సందేహమే లేదు.
ధర్మో రక్షతి రక్షితః అనే వాక్యం అందరికి తెలిసినదే ఆ పదము ఎక్కడిది అంటే వాల్మీకి రచించిన రామాయణంలోని ఒక శ్లోకంలోనిది. ఈ వాఖ్యము ప్రజా ప్రాముఖ్యం పొందిన వాక్యాలలో ఇది ఒకటి. ఈ వాక్యం యొక్క అర్ధం "ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది".
ధర్మో రక్షతి రక్షితః అనే అర్యొక్తిని అనుసరించి ధర్మముని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. ఇట్టి ధర్మాన్ని మనం ఎలా ఆచరించాలి, స్వధర్మ ఆచరణ యందు ఎట్టి నిష్ట కలిగి ఉండాలి అనే విషయాలను తెలియపరుస్తూ మానవుడి మనుగడను తీర్చి దిద్దడానికి ఏర్పడినవి. ప్రస్తుత కాలమానము ప్రకారము ధర్మము ఎక్కడుంది. ఎలావుంటుంది. అప్పుడు వాల్మికీగారు ధర్మాన్ని ఎలావుంటుంది అంటే రామో విగ్రహాన్ ధర్మః (మూర్తీభవించిన ధర్మమే రాముడు ) అని అన్నారు . మరి ఈ కాలములో ధర్మము ఎలావుంది. ఎక్కడుంది. సరే అది వదిలైయండి. ప్రస్తుతము ఈ వాక్యములో అన్నట్టు ధర్మో రక్షతి రక్షతః అన్నట్టు. ధర్మము ను మనము కాపాడితే , ఆ ధర్మము మనలను కాపాడుతుందా అన్నది నా ప్రశ్న మీకు వీలు అయితే కాపాడుతుంద లేదా అన్నది చెప్పండి.