ధర్మో రక్షతి రక్షితః అనే వాక్యం అందరికి తెలిసినదే ఆ పదము ఎక్కడిది అంటే వాల్మీకి రచించిన రామాయణంలోని ఒక శ్లోకంలోనిది. ఈ వాఖ్యము ప్రజా ప్రాముఖ్యం పొందిన వాక్యాలలో ఇది ఒకటి. ఈ వాక్యం యొక్క అర్ధం "ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది".
రామాయణంలో ఈ వాక్యం ఉన్న శ్లోకం
ధర్మ ఏవహతో హంతి
ధర్మో రక్షతి రక్షితః
తస్మాద్ధర్మోన హత వ్యో
మానో ధర్మాహతో వధీత
ధర్మో రక్షతి రక్షితః
తస్మాద్ధర్మోన హత వ్యో
మానో ధర్మాహతో వధీత
ధర్మో రక్షతి రక్షితః అనే అర్యొక్తిని అనుసరించి ధర్మముని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. ఇట్టి ధర్మాన్ని మనం ఎలా ఆచరించాలి, స్వధర్మ ఆచరణ యందు ఎట్టి నిష్ట కలిగి ఉండాలి అనే విషయాలను తెలియపరుస్తూ మానవుడి మనుగడను తీర్చి దిద్దడానికి ఏర్పడినవి. ప్రస్తుత కాలమానము ప్రకారము ధర్మము ఎక్కడుంది. ఎలావుంటుంది. అప్పుడు వాల్మికీగారు ధర్మాన్ని ఎలావుంటుంది అంటే రామో విగ్రహాన్ ధర్మః (మూర్తీభవించిన ధర్మమే రాముడు ) అని అన్నారు . మరి ఈ కాలములో ధర్మము ఎలావుంది. ఎక్కడుంది. సరే అది వదిలైయండి. ప్రస్తుతము ఈ వాక్యములో అన్నట్టు ధర్మో రక్షతి రక్షతః అన్నట్టు. ధర్మము ను మనము కాపాడితే , ఆ ధర్మము మనలను కాపాడుతుందా అన్నది నా ప్రశ్న మీకు వీలు అయితే కాపాడుతుంద లేదా అన్నది చెప్పండి.
ప్రస్తుత కాలప్రకారము కాపాడుట లేదమ్మా!. నాకు అయితే ఎక్కడా ధర్మము కనిపించటము లేదు. ఎక్కడ చూసినా అధర్మమే ఉన్నట్టుంది.
రిప్లయితొలగించండిమారని నీతుల గురంచి నేను అభిప్రాయం చెప్పలేను.
రిప్లయితొలగించండిధర్మో.... అంటే- ధర్మాన్ని రక్షిస్తే అది మనలను రక్షించడమన్నది అర్ధం తప్పు. ధర్మాన్ని మనం రక్షించగలిగిన వారం కాదు. అయితే అసలు అర్ధం ధర్మాన్ని మనం రక్షణగా చేసుకొన్నప్పుడు అనగా నిజమైన ధర్మాన్ని మనం ధారణ చేసుకొన్నప్పుడు అది మనలను రక్షిస్తుంది. అయితే ఇప్పుడు నిజమైన ధర్మం అంటే- సనాతనం పరమాత్మ స్వరూపం ప్రాపయతి ఇతి ధర్మః- అనగా పరమాత్మ శాశ్వత స్వరూపం ప్రాప్తి చెందడాన్ని ధర్మంగా శాస్త్రం చెబుతున్నది. అటువంటి ధర్మం మనిషిని తప్పకుండా కాపాడుతుంది. ఆ ధర్మమార్గం ఈ రోజు కూడా లభ్యమవుతుంది. నీకు ఇంకా తెలుసుకోవాలని ఉంటే నాకు ఫోన్ చేయగలవు, మధ్యాహ్నం 2 గంటల తరువాత-09702209199. ఇంకా ఇందులో చూడగలవు-www.djjs.org
రిప్లయితొలగించండిధర్మాచరణమే ధర్మరక్షణము
రిప్లయితొలగించండిదర్మాచరణమే ధర్మరక్షణము
రిప్లయితొలగించండి