భగవంతుని పొందుటకు భక్తులు ఆచరించే పద్దతి భజన. శ్రీ అన్నమాచార్యులవారు రచించిన భజన కీర్తనలలో చాలా గొప్పగా ప్రసిద్ధి చెందినది ఈ కీర్తన. అన్నమాచార్యులువారు ఈ కీర్తనలో వెంకటేశ్వర స్వామివారిని చాలా రకాలుగా కొనియాడారు. అందులోనే శరణు వెడుతున్నాడు. ఈ కీర్తన నేర్చుకోటానికి చాలా సులువుగా వుంటుంది. చిన్నపిల్లలకుడా సులువుగా వస్తుంది అనటంలో సందేహమే లేదు.
రాగం - మాళవి
శరణు
శరణు సురేంద్ర సన్నుత
శరణు
శ్రీసతి వల్లభ
శరణు
రాక్షస గర్వ సంహర
శరణు
వేంకట నాయక
కమల ధరుడును, కమల మిత్రుడు
కమల శత్రుడు, పుత్రుడు
క్రమముతో
మీకొలువు కిప్పుడు
కాచినారెచ్చరికయా
అనిమిషేంద్రులు
మునులు దిక్పతులు
అమర కిన్నెర సిధ్ధులు
ఘనతతో
రంభాది కాంతలు
కాచినారెచ్చరికయా
ఎన్నగల
ప్రహ్లాద ముఖ్యులు
నిన్ను
కొలువగా వచ్చిరి
విన్నపము
వినవయ్య
తిరుపతివేంకటాచల
నాయకా
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.