మంగళవారం, ఏప్రిల్ 03, 2012
షాహాజీ-జిజాబాయ్ దంపతులకు పూణేకు దగ్గర ఉన్న జున్నార్ పట్టణమందు శివాజీ ఫిబ్రవరి 19, 1627 న జన్మించాడు. జిజాబాయ్‌కి శంభాజీ తర్వాత పుట్టిన కొడుకులు అందరూ చనిపోతూవుండగా జిజాబాయ్ ఎప్పుడూ పూజించే దేవత అయిన పార్వతిదేవి పేరును శివై పేరు శివాజీకు పెట్టింది. శివాజిని పార్వతిదేవి ప్రసాదంగా భావించింది.
షాహాజీ పూణేలో తన జాగీరు వ్యవహారాలను తన భార్యఅయిన జిజాబాయ్ కి అప్పగించి యువకుడయిన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగుళూరు జాగీరుకు వెళ్ళాడు. శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమి పైన, ప్రజల పైన ప్రేమ కలుగునట్లు విద్యాబుద్దులు నేర్పింది. చిన్నప్పటినుండి భారత రామాయణ గాథలు చెప్పి వీర లక్షణాలు కలిగేలా చేసింది. పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం తన తల్లివద్దనే నేర్చుకున్నాడు శివాజి. తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో శివాజీ యుద్ద తంత్రాలలో గొప్ప నేర్పరిగా మారాడు. సకల విద్యలు నేరుచుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే తన ప్రధాన కర్తవ్యముగా అనుకోని ఆ దిశగానే తన ప్రయత్నము మొదలు పెట్టాడు . మరాఠా సామ్రాజ్య స్థాపనకు చాలా కృషి చేసాడు శివాజి.చిన్నవయసులోనే అంటే 17 సవత్సరాల వయసులోనే శివాజీ మొట్టమొదటి యుద్దం చేసి బిజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. మరో మూడేళ్ళలో కొండన, రాజ్‌ఘడ్ కోటలను సొంతం చేసుకొని పూణే ప్రాంతాన్నంతా తన తన ఆధీనములో తెచ్చుకున్నాడు. శివాజీ తమ కోటలను సొంత చేసుకోవడం చూసి ఆదిల్షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన షాహాజీని బందీ చేసాడు. తర్వాత శివాజీని, బెంగుళూరులో ఉన్న శివాజి అన్న అయిన శంభాజీని పట్టుకోవడానికి రెండు సైన్యాలను పంపగా అన్నదమ్ములిరువురు ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రిని బంధ విముక్తుడిని చేయించుకున్నారు. తరువాత వారు చాలా యుద్ధాలు చేసారు. వాటిలో ప్రధానముగా ప్రతాప్‌ఘడ్ యుద్దం, కొల్హాపూర్ యుద్దం, పవన్‌ఖిండ్ యుద్దం, షైస్తా ఖాన్ తో యుద్దం, సూరత్ యుద్దం మొదలగున్నవి. తరువాత 1666లో ఔరంగజేబు తన యాభయ్యవ పుట్టినరోజు సందర్భంగా శివాజీని, అతని ఆరేళ్ళ కొడుకు శంభాజీని ఆగ్రాకు పుట్టినరోజు వేడుకలకు అహ్వానించాడు. ఇది శివాజీని అలా ఆహ్వానించటం వెనుక మోసపూరితమైన ఆలోచన ఔరంగజేబు కలిగివుండటమే. మొదట శివాజీని చంపాలనుకున్నాడు దానివల్ల మరాఠాలు ఒక్కసారిగా చెలరేగుతారని తెలుసుకొని శివాజీని బందీగా ఉంచాలని నిశ్చయించాడు. తన కొడుకుతో బందీగా ఉన్న శివాజీ ఎలాగయినా తప్పించుకోవాలని ప్రయత్నించసాగాడు. ప్రతిరోజు తాను ఏరికోరి సమకూర్చిన పళ్ళను ఆగ్రాలోని సాధువులకు, గుడులకు, ఫకీర్లకు పంపించేలా అనుమతి తీసుకున్నాడు. కొన్ని నెలలపాటు పళ్ళ బుట్టలు పంపించిన తర్వాత తాను పనిమనిషిగా మారువేషం వేసుకొని కొడుకును బుట్టలో పెట్టుకొని తప్పించుకున్నాడు. శివాజీ, శంభాజీ ఇద్దరూ పళ్ళబుట్టల్లో దాక్కుని తప్పించుకొన్నారని అంటారు. అప్పటికే శివాజీ ప్రాబల్యం తగ్గడం వల్ల, మొఘలులు మరిన్ని యుద్దాలలో పాల్గొంటూ ఉండడంవల్ల ఔరంగజేబు శివాజీ నుండి ముప్పు ఉండదని భావించినా సరే పెద్దగా పట్టించుకోలేదు. శివాజీ ఎక్కువ ప్రాచుర్యంపోందేలా కాకుండా రహస్యంగా తన కార్యకలాపాలు నిర్వహించడం మొదలుపెట్టాడు. 1674 నాటికి లక్ష మంది సుశిక్షితులయిన సైన్యాన్ని, ఆయుధాలు, అశ్వాలు, నౌకా వ్యవస్థను సమకూర్చుకున్నాడు. 1670 జనవరి నుండి మొఘల్ కోటల పైన దాడులు చేసి సొంతం చేసుకోవడం మొదలు పెట్టాడు. అలుపెరగని యుద్దాలతో అలసిపోవడం, సరి అయిన సైన్యం లేకపోవడం, ఖజానా ఖాళీ కావడంతో మొఘల్ సైన్యం శివాజీని ఎదుర్కొనలేకపోయింది. తరువాత కొన్నాళ్ళకు సింహగఢ్ యుద్ధం చేసి తానాజీ తన అనుచరులతో రహస్యంగా ఆ కోటను కొద్దిరోజులపాటు క్షుణ్ణంగా అధ్యయనం చేసాడు. అన్ని ప్రధాన ద్వారాల్లో కట్టుదిట్టమయిన సైన్యం ఉంది. చివరగా కోటకు ఒకవైపు ఉన్న ఒక కొండ తానాజీని ఆకర్షించింది. ఆ కొండ చాలా ఏటవాలుగా ఉండడంతో సైన్యం ఆ కొండ ఎక్కడం అసాధ్యం. అప్పుడు తానాజీ 'యశ్వంతి ' అనే పేరుకల ఉడుముకు తాడు కట్టి కొండ పైకి విసిరాడు. తాడు సహాయంతో పైకి వెళ్ళినవారు అందించిన తాళ్ళను పట్టుకొని సైన్యం కోటలోకి చేరుకొంది. చరిత్రలో యుద్దంలో ఉడుమును ఉపయోగించడం ఇదే ఫస్ట్ కావచ్చు అని చారిత్రకుల విశ్లేషణ ప్రకారం తెలుస్తోంది .
యుద్దతంత్రాలలో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలో కూడా శివాజీ భారతదేశ రాజులలో అగ్రగణ్యుడు. మంత్రిమండలి, విదేశాంగ విధానం,పటిష్టమయిన గూఢచారి వ్యవస్థ ఏర్పాటు చేసాడు. ప్రజలకోసమే ప్రభువు అన్న సూత్రం పాటించి, వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి వ్యయం చేయక ప్రజల సంక్షేమం కోసమే పాటు పడ్డాడు. జూన్ 6, 1674న రాయఘడ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియరాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ 'ఛత్రపతి ' అని బిరుదును ప్రదానం చేసారు.కొన్నాళ్ళకు 50,000 బలగంతో దక్షిణ రాష్ట్రాల దండయాత్రచేసి వెల్లూరు, గింగీలను సొంతం చేసుకున్నాడు.27 ఏళ్ళపాటు యుద్దాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజి మూడు వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680 రాయఘడ్ కోటలో మరణించాడు. మరణించేనాటికి 300 కోటలు శివాజీ ఆధీనంలో ఉండేవి. కొండలపైన ఉన్నత సాంకేతిక విలువలతో దుర్భేధ్యమయిన కోటలను నిర్మింపచేయడంలో శివాజీ ప్రపంచ ఖ్యాతి పొందాడు. నాసిక్ నుండి మద్రాసు దగ్గర ఉన్న జింగీ వరకు 1200 కిలోమీటర్ల మధ్య ఈ 300 కోటలు నిర్మించబడ్డాయి.
సోమవారం, ఏప్రిల్ 02, 2012
2 ఏప్రిల్, 2012 అనగా ఈరోజు అంతర్జాతీయ బాలల పుస్తకాల రోజు గా జరుపుకుంటున్నాం. పుస్తకం తీయటానికి అంతర్జాతీయ బాలల బుక్ డే స్పూర్తినిస్తూ, పిల్లలుకు బుక్స్ చదవాలని వారికి తెలియచేయటం ముఖ్యఉద్దేసముగా ఉంది.
ఏప్రిల్ 2 న హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ యొక్క పుట్టినరోజుకు గుర్తుగా International childrens books day గా జరుపుకుంటున్నాము. The Little Mermaid Story.,
The Ugly Duckling , The Nightingale వంటి అనేక ప్రముఖ పిల్లల కథల రచయిత హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ పుట్టిన ఈ రోజు యువ సాహిత్యంప్రేమికులకు గుర్తించడానికి ఎంచుకున్నారు.
యంగ్ పీపుల్, లేదా IBBY (IBBY stands for International Board On Books for Young People.)కోసం పుస్తకాలు అంతర్జాతీయ బోర్డ్ ఆర్గనైజ్ చేయటం జరిగింది. దీని లక్ష్యం పుస్తకాలు మరియు యువ ప్రజలకు చదివేతందుకు ప్రోత్సహించడము అనే ఉద్దేశము కలిగివుంది. IBBY 1953 లో జురిచ్, స్విట్జర్లాండ్ లో స్థాపించబడింది. నేడు ప్రపంచం లోని అన్ని ప్రాంతాల నుండి 70 నేషనల్ సెక్షన్లు జరిగినది.
అంతర్జాతీయ బాలల బుక్ డే సందర్భంగా రచన పోటీల్లో మరియు ప్రసిద్ధ రచయితలు మరియు విశదీకరింపులు నుండి చర్చలు సహా ప్రపంచవ్యాప్తంగా events నిర్వహించారు , నేను కూడా ఆపోటి లో పాల్గొన్నాను కూడా.
అందరికీ వండర్ల్యాండ్, హ్యారీ పాటర్, అండ్ ది ఆలిస్ వంటి రచనలు బాగా తెలిసిన పరిచయం ఉండగా మనకు అద్భుతమైన పిల్లల పుస్తకాలు మనకు లభిస్తున్నాయి. ఈ పిల్లల పుస్తకాలు, పిల్లలే కాకుండా పెద్దలు కూడా చదువుకునే టట్టు వున్నాయి.
మనం రోజు స్కూల్ బుక్స్ చదువుతాం అవి కాకుండా మంచి పుస్తకాలు కనుగొనుటకు ప్రయత్నించండి, అంతర్జాతీయ బాలల బుక్ డే సందర్భముగా ఈరోజు నుండి మంచి పుస్తకాన్ని చదవటానికి అలవాతుచేసుకోండి.
Get ready for reading on International Childrens Book Day! so Happy International Children 's Book Day .
శనివారం, మార్చి 31, 2012
శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం
ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి
అంటూ మనం శ్రీరామ చంద్రుని జన్మదినోత్సవాన్ని చైత్ర శుధ్ధ నవమి రోజు చేసుకుంటాం. దీని తాత్పర్యము ఏమి అంటే భరత దేశం లో ధర్మ బధ్ధ జీవనానికి ఒక నిలువెత్తు నిర్వచనం గా ,మనిషి ఇలా బ్రతకాలి, అని ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి మానుష్య జన్మకున్న వైశిష్ట్యాన్ని మనకి ఆవిష్కరించిన మర్యాదా పురుషోత్తముడు నా తండ్రి శ్రీ రామచంద్రమూర్తి అని ఈ శ్లోకం అర్ధం.
|
|
వివాహం: శ్రీ రాముడు జనకుడు ఏర్పాటు చేసిన స్వయంవరములో పాల్గొని శివధనస్సు విరిచినాడు. అప్పుడు సీత వరమాల శ్రీరాముని మేడలో వేసినది. జనక మహారాజు విశ్వామిత్ర మహర్షిని సంప్రదించి దశరథమహారాజుకు శ్రీ రాముడు, సీతాదేవి వివాహం విషయం దూతల ద్వారా అయోధ్యకు వర్తమానం పంపిం చాడు. దూతలు మూడురోజుల ప్రయాణం చేసి అయోధ్యకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న దశరథుడు సంతోషించాడు. వశిష్ట వామదేవాదులతో చర్చించి మరునాడే మిథిలానగరానికి వెళ్ళాలని దశరథుడు నిర్ణయించు కున్నాడు. ఆరోజున చతురంగబలాలతో దశరథుడు కౌసల్యాదేవి వశిష్ట వామదేవాదులతో మిథిలానగరానికి వెళ్ళారు. జనకుడు దశరథుడికి స్వాగతం పలికాడు. సీతా దేవి వివాహానికి సన్నాహాలు ప్రారంభించాడు. సీతా రాముల కళ్యాణం కమనీయంగా జరిపారు. అది శ్రీరాముడు జన్మించిన రోజు, రామునికి వివాహము అయినరోజు మరియు, అయోధ్యలో శ్రీరామునికి రాజ్య పఠాభిషేకము జరిగిన రోజు నవమి. అందుకే ఈ నవమిని శ్రీరామనవమిగా జరుపుకుంటున్నాము.
|
దశరథునికి ప్రియమైన కుమారుడు, నీలమేఘశ్యాముడు , సీతాదేవికి భర్త , భక్తుడైనా హనుమంతుని చేత సేవించబదినవాడు, వాలిని చంపిన వాడు చేతిలో కోదండమును కలిగినవాడు, దశకంఠుదు రావణుని చంపినవాడు , దయాహృదయం కలవాడు , భక్త వత్సలుడు అయిన శ్రీ రాముడుని నమస్కరిస్తున్నాను రామ నామ స్మరణ వల్ల మనసు పవిత్రంగా ఉంటుంది. కస్ట మైన పనులు కూడా సులువుగా చేయగలిగే శక్తి వస్తుంది.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ||
పరమశివుడు పార్వతీ దేవి తో చెప్పిన ఈ శ్లోకం అందరికీ తెలిసినదే అయిన శ్రీ రామ రామ రామ అని మూదు సార్లు జపిస్తే శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేసిన ఫలము వస్తుందనేది ఈ శ్లోక భావం. కావున శ్రీ రామ నవమి రోజున ఈ మంత్రము జపించి శ్రీరాముని కృపకు పాత్రులు అవ్వగలరు.
బ్లాగ్ మిత్రులందరికి శ్రీ రామనవమి శుభాకాంక్షలు.
ఏప్రిల్ 1 ని మనం ఏప్రిల్ ఫూల్ రోజు గా జరుపుకుంటాం. దీనికి ఒక కధ వుంది. అది ఏమిటంటే పదహారో శతాబ్దం మధ్య వరకు యూరప్ లో కూడ సంవత్సరాది మార్చి నెల మధ్యలోనే జరుపుకునేవారు. యూరప్ లో ఈ నూతన సంవత్సరపు ఉత్సవాలు మరియు వసంత కాలపు ఉత్సవాలు కలిపి ఓ పది రోజుల పాటు వరసగా జరుపుకునేవారు. ఏప్రిల్ 1 రాగానే ఈ ఉత్సవాలు ముగిసే సందర్భంలో ఒకరికొకరు బహుమానాలు ఇచ్చి పుచ్చుకునేవారు. ఇలా ఎప్పుడూ ఘనంగా జరుపుకునేవారు. అలావుండగా అప్పటి ఫ్రాంసు దేశపు రాజు సంవత్సరాదిని మార్చి మధ్య నుండి జనవరి 1 వ తారీఖుకి మార్చుతూ ఒక నోటీసు జారీ చేసాడు. ఆ రోజులలో వార్తాపత్రికలు, రేడియోలు, టీవీలు, కంప్యూటర్స్ లేవు. వారు అప్పట్లో దండోరా వేయించి వుంటారు. కాని రాజు గారి నోటీసు అందరికీ చేరలేదు. అందిన వాళ్ళు కూడ పాత అలవాట్లని వారు మార్చుకోలేకపోయారు. కనుక రాజధానిలో సంవత్సరాది జనవరి ఒకటిన జరిగిపోయినా కానీ దేశపు మూలల్లో మాత్రము ఏప్రిల్ 1 న బహుమానాలు ఇచ్చుకోవటంమానలేదు. అందుకని వాళ్ళని ఎగతాళిగా ఏప్రిల్ ఫూల్స్ అనేవారు. పాత అలవాట్లు మనలేక వారు జరుపుకుంటున్నారు కదా. అందుకని ఇప్పటికీ అల్లరిగా బహుమానాలు ఇచ్చుకోవటం, మరియు ఒకరిని ఒకరు ఫూల్స్ చేసుకుంటున్నారు. అందుకే ఏప్రిల్ 1 ని ఫూల్స్ డే గా జరుపుకుంటున్నారు. చాలా సరదాకా వుంటుంది. ఫూల్స్ అయ్యినవారు బాధపడకుండా సరదాగా తీసుకొని ఎంజాయ్ చేయచ్చు. ఫూల్స్ డే బాగుంది కదండి. Enjoy The Fools Day .
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ