ఏప్రిల్ 1 ని మనం ఏప్రిల్ ఫూల్ రోజు గా జరుపుకుంటాం. దీనికి ఒక కధ వుంది. అది ఏమిటంటే పదహారో శతాబ్దం మధ్య వరకు యూరప్ లో కూడ సంవత్సరాది మార్చి నెల మధ్యలోనే జరుపుకునేవారు. యూరప్ లో ఈ నూతన సంవత్సరపు ఉత్సవాలు మరియు వసంత కాలపు ఉత్సవాలు కలిపి ఓ పది రోజుల పాటు వరసగా జరుపుకునేవారు. ఏప్రిల్ 1 రాగానే ఈ ఉత్సవాలు ముగిసే సందర్భంలో ఒకరికొకరు బహుమానాలు ఇచ్చి పుచ్చుకునేవారు. ఇలా ఎప్పుడూ ఘనంగా జరుపుకునేవారు. అలావుండగా అప్పటి ఫ్రాంసు దేశపు రాజు సంవత్సరాదిని మార్చి మధ్య నుండి జనవరి 1 వ తారీఖుకి మార్చుతూ ఒక నోటీసు జారీ చేసాడు. ఆ రోజులలో వార్తాపత్రికలు, రేడియోలు, టీవీలు, కంప్యూటర్స్ లేవు. వారు అప్పట్లో దండోరా వేయించి వుంటారు. కాని రాజు గారి నోటీసు అందరికీ చేరలేదు. అందిన వాళ్ళు కూడ పాత అలవాట్లని వారు మార్చుకోలేకపోయారు. కనుక రాజధానిలో సంవత్సరాది జనవరి ఒకటిన జరిగిపోయినా కానీ దేశపు మూలల్లో మాత్రము ఏప్రిల్ 1 న బహుమానాలు ఇచ్చుకోవటంమానలేదు. అందుకని వాళ్ళని ఎగతాళిగా ఏప్రిల్ ఫూల్స్ అనేవారు. పాత అలవాట్లు మనలేక వారు జరుపుకుంటున్నారు కదా. అందుకని ఇప్పటికీ అల్లరిగా బహుమానాలు ఇచ్చుకోవటం, మరియు ఒకరిని ఒకరు ఫూల్స్ చేసుకుంటున్నారు. అందుకే ఏప్రిల్ 1 ని ఫూల్స్ డే గా జరుపుకుంటున్నారు. చాలా సరదాకా వుంటుంది. ఫూల్స్ అయ్యినవారు బాధపడకుండా సరదాగా తీసుకొని ఎంజాయ్ చేయచ్చు. ఫూల్స్ డే బాగుంది కదండి. Enjoy The Fools Day .
శనివారం, మార్చి 31, 2012
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
My Blog Lovers
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
Diabetic Challenger
DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL.
PLASE SUBSCRIBE MY CHANNEL......
THANK YOU VERY MUCH.
Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను
Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)
hii.. Nice Post Great job. Thanks for sharing.
రిప్లయితొలగించండిBest Regarding.
www.ChiCha.inMore Entertainment
వైష్ణవి గారు చాలా చక్కటి వివరం తెలియజేసారు. ధన్యవాదములు.
రిప్లయితొలగించండిక్రొత్త ఒక వింత, పాత ఒక రోత అంటారు.
కాలమానం అనేది ఖచ్చితంగా ఖగోళ శాస్త్రం మీద ఆధారపడి ఉండాలనేది అందరికీ తెలిసినదే. మరలాంటప్పుడు ఏప్రిల్ 1వ తేదీనుండి క్రొత్త సంవత్సరమును జనవరి 1వ తేదీకి మార్చినతరువాత కూడా ఇంకా ఏప్రిల్ 1వ తేదీని పట్టుకుని వ్రేళ్ళాడుతున్న వారిని ఏప్రిల్ ఫూల్ అని పిలిస్తే, ఎటువంటి ఖగోళ ప్రత్యేకత లేని జనవరి 1వ తేదీని పట్టుకుని వ్రేళ్ళాడుతున్న వారిని జనవరి ఫూల్స్ అని పిలవచ్చా!!!
More Entertainment, DSR Murthy గారికి నా పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండివారు నూతన సంవత్సర వేడుకలను ముందుకు జరుపుకోవటానికి భౌతికమైన కారణం లేకపోయినా. వేడుకలకు జనవరి 1 అయితే వీలుగా వుంటుందని మార్చుకున్నారు. సంవత్సరం లో ఎండాకాలాన్ని, శీతాకాలాన్ని, వర్షాకాలాన్ని విడదీసే రోజులవి అప్పుడు పంటలు పండే సమయం కూడా కాదు. అప్పుడు న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటే బాగుంటుంది అని మార్చారు. ఈ న్యూ ఇయర్ వేడుకలు వారు 10 రోజులు జరుపుకుంటారు. ఆ వేడుకలనుమ్ది తెలుకునేసరికి పంటలు పండే కాలం మొదలవుతుంది కదా అందుకే న్యూ ఇయర్ ను ముందుకు జరుపుకున్నారు అన్నమాట.