గురువారం, జూన్ 07, 2012
ఇలాంటి సాంప్రదాయక మైన నృత్యాన్ని (శివతాండవం వంటివి ) చూడాలి అంటే మనకు ఇప్పుడు animations తప్ప వేరే మార్గము లేదు. ఎందుకంటే ఇలాంటి నృత్యాలు అంతరించి పోతున్నాయి అనిపిస్తోంది. ఈ నృత్యం చూస్తుంటే నాకు ఇదే మనుషులు చేస్తే ఎంత బాగుంటుందో అనిపించింది. మనం ఇలాంటి నృత్యాలను అబివృద్ది పరుచుటకు ప్రయత్నిస్తే బాగుంటుంది. సరే ఈ రోజు మనము సాంప్రదాయ నృత్య కళాకారుడు అయిన డాక్టర్ నటరాజ రామకృష్ణ గారి వర్ధంతి. ఈరోజు ఆయన వర్ధంతి సందర్బముగా ఆయనికి నివాళ్ళు అర్పిస్తున్నాం. ఈ రోజు ఆయన గురించి తెలుసుకుందాం.
డాక్టర్ నటరాజ రామకృష్ణ
డాక్టర్ నటరాజ రామకృష్ణ (1933 - 2011) ఆంధ్రనాట్యము, పేరిణి శివతాండవము, నవజనార్ధనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు.ఆజన్మ బ్రహ్మచారి . ఈయన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వాడు. ఆంధ్రనాట్యము ఒక పురాతన లాస్య నర్తనం. పదవ శతాబ్దంలోని కాకతీయ సామ్రాజ్య కాలంలో, మగవారు నాట్యం చేసే పేరిణీ శివతాండవం ఉండేది. ప్రబంధ నాట్య సాంప్రదాయానికి సంబంధించిన నవజనార్ధనం గత 400 ఏళ్ళుగా తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం లోని కుంతీమాధవ మందిరం లో ప్రదర్శింపబడుతోంది. జూన్ 7, 2011 వ తేదీన హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మరణించాడు. ఈయనకి చాలా అవార్డులువచ్చాయి. నటరాజ , భారత కళాప్రపూర్ణ, భారతకళా సవ్యసాచి, కళాప్రపూర్ణ, కళాసరస్వతి, దక్షిణ భారతపు ఉత్తమ నాట్యాచార్యుడు, ఉత్తమ పరిశోధకుడు, ఆస్థాన నాట్యాచార్యుడు, ఆస్థాన నాట్యాచార్యుడు, అరుదైన పురస్కారం, శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం, రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ అవార్డ్, పద్మశ్రీ, కళాసాగర్ అవార్డ్, విశిష్ట పురస్కారం లు అందుకున్నారు.
బుధవారం, జూన్ 06, 2012
జాణతనాలాడేవేలే జంపు గొల్లెతా, వోరి
ఆణిముత్యముల చల్ల లవి నీకు కొల్లలా
పోయవే కొసరుచల్ల బొంకుగొల్లెతా , వోరి
మాయింటి చల్లేల నీకు మనసయ్యీరా
మూయకువే చల్ల చాడిముచ్చు గొల్లెతా, వోరి
పోయవో పోవొ మాచల్ల పులు సేల నీకును
చిలుకవే గోరంజల్ల జిడ్డు గొల్లెతా , వోరి
పలచిని చల్ల నీకు బాతి గాదురా
కలచవే లోనిచల్ల గబ్బి గొల్లెతా , వోరి
తొలరా మా చల్లేల దొరవైతి నీకు
అమ్మకువే చల్లలు వయ్యారి గొల్లెత, వోరి
క్రమ్మర మాతోడనిట్టె గయ్యాళించేవు
సొమ్మెలం బోయేవేలె సొంపు గొల్లెతా, వోరి
దిమ్మరి కోనేటిరాయ తిరమైతి నీకును
మంగళవారం, జూన్ 05, 2012
|
ప్రకృతిలో జరిగే అద్బుతము ఈ శుక్రగ్రహం |
శుక్రగ్రహ గ్రహణం భారత కాలమానం ప్రకారం సూర్యోదయము తో ప్రారంభము అవుతుంది .ఇది అత్యంత అరుదుగా కనిపించే గ్రహణము. ఇది సూర్యగ్రహణము కాదు చంద్ర గ్రహణము కాదు. శుక్ర గ్రహణం అది రేపు కనిపించి మరలా 102 సంవత్సరములు తరువాత కనబడుతుంది. అంటే ఇది అత్యంత అద్బుతమైన గ్రహణము. సూర్యుని మద్యలో నల్లని మచ్చ వలె కనిపిస్తుంది. ఇది 2012 జూన్ 6 వ తేదీన భారతదేశంలో శుక్ర గ్రహణం సంభవించనుంది అని చాలా రోజునుండి ఎదురు చూసాం కదా. అది దేదీప్యమాన వెలుగుతో వుండే సూర్యుడు తేజోహీనుడైతే, దానిని సూర్యగ్రహణం గాను, రాత్రి సమయంలో వెన్నెలను అందించే కాంతి గల చంద్రుడు కాంతి విహీనమైపోతే చంద్ర గ్రహణంగా భావిస్తున్నాం. మరి మహా కాంతితో నక్షత్రం వలె రాత్రి సమయంలో కనపడే శుక్ర గ్రహం కూడా కాంతివిహీనమై నల్లని మచ్చలా కనపడటాన్ని గ్రహణంగా పేర్కొంటారు. సూర్యుడికి భూమికి మధ్య చంద్రుని బదులు శుక్రుడు అడ్డు వస్తే ఓ మినపగింజ ఆకృతిలో సూర్యబింబం పై శుక్రుడు నల్లని చుక్కలా గోచరమగును. దీనినే శుక్ర గ్రహణం అంటారు. సూర్యునిపై నల్లని మచ్చగల శుక్ర గ్రహణం తోనే భారతదేశ వ్యాప్తంగా సూర్యోదయాలు ప్రారంభమగును. అందుచేత భారతదేశ వ్యాప్తంగా సూర్యోదయాలనుంచి.... ఉదయం 10.01 వరకు ప్రత్యక్షంగా నేత్రాలతో చూడకుండా, మసి పూసిన అద్దంతో గాని, ఫిల్మ్ తో గాని ఇతర అందుబాటులో వుండే సోలార్ ఫిల్టర్ ద్వారా గాని శుక్ర గ్రహణాన్ని వీక్షించవచ్చును. నేరుగా సూర్యుని చూడవద్దు. ఇలాంటి ప్రకృతిలో జరిగే అద్భతాన్ని తప్పక చూడండి. ఇది అందరు చూడవచ్చు కావున తప్పక చూడండి. నేను అయితే చాలా ఆత్రుతగా వున్నాను ఈ అద్బుతాన్ని చూడటానికి. నేను చూడటానికి రడీ మరి మీరు రడీ నా.
పంచపాండవులుకు మరి వారి బార్య అయిన ద్రౌపది కి అండగా వుండి శ్రీ కృష్ణుడు వారిని కాపాడేవాడు. ద్రౌపదికి శ్రీ కృష్ణునిపై చాలా భక్తివిశ్వాసాలు కలికి వుంది. నిండు సభలో దుర్యోధన, దుశ్శాసనులు ఆమెను వివస్త్రను చేసి అవమానించే సమయములో కాపాడినవాడు శ్రీ కృష్ణుడు అని అందరికీ తెలుసు. అలాంటి సమయములో మహాబలశాలి అయిన భీముని కాని, సవ్యసాచి అయిన అర్జునుని కానీ, ధర్మనిరతుడైన ధర్మరాజు ను కానీ, భావిష్యదర్సాకుడు అయిన సహదేవుని కానీ, సహాయము అడగలేదు. " హే కృష్ణా! హే మాధవా! ద్వారకావాసా! పాహిమాం పాహిమాం!" అని ఆర్తితో గడ్డిగా పిలిచింది. శ్రీ కృష్ణుడు ఒక పిలుపుతో పలికేవాడు కదా! అక్షయ వలువలను ప్రసాదించి ఆమెను కాపాడాడు.
కురుక్షేత్ర యుద్ధం తరువాత ఒక రోజు అందరూ ఆనందంగా ముచ్చటిస్తున్న సమయములో ద్రౌపది "కృష్ణా! నాకు ఒక చిన్న సందేహం వుంది. అలనాడు నన్ను కాపాడమని కురుసభలో ప్రార్ధించాను కానీ నువ్వు వెంటనే రాలేదేమి? కొంత ఆలస్యము చేసావు కదా!" అన్నది. కృష్ణుడు చిన్న నవ్వు నవ్వి అమాయకంగా "అమ్మా! నేనేమిచేసేది? నీవు హృదయవాసా అని పిలవక ద్వారకావాసా! అని పిలిచితివి కదా, మరి నేను ద్వారకకు
వెళ్లి రావలసి వచ్చింది. నీవు ఇంకా నా శాశ్వత చిరునామాను గుర్తించలేదు" అన్నాడు. అదేమిటి? " ఈశ్వర స్సర్వాభూతానాం హృద్దేశేర్జునతిష్టతి" ఈశ్వరుడు సర్వ భూతాముల హృదయాలను అదిష్టింఛివుంటాడు. అని చెప్పాడు శ్రీ కృష్ణుడు.
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ