దేవతలకే రూపురేఖలు దిద్దిన మహా చిత్రకారుడు రాజా రవి వర్మ. రాజా రవివర్మ ట్రావెంకూర్ రాష్ట్రం (నేటి కేరళ) లోని కిలిమనూర్ నందు జన్మించాడు. తండ్రి గొప్ప పండితుడు, తల్లి కవయిత్రి, రచయిత్రి.
యుక్తవయసులోనే రామస్వామి నాయుడు వద్ద వాటర్ పెయింటింగ్, డచ్ జాతీయుడు తీడార్ జన్సన్ వద్ద ఆయిల్ పెయింటింగును నేర్చుకున్నాడు.వియన్నాలో 1873లో జరిగిన పెయింటింగ్ ఎగ్జిబిషన్ నందు ఆయన పెయింటింగుకు అవార్డ్ లభించడంతో చిత్రకారుడిగా ప్రపంచ ప్రసిద్ధి గాంచాడు. 1893లో చికాగోలో జరిగిన వరల్డ్ కొలంబియన్ ఎక్స్పోజిషన్ నందు ఆయన పెయింటింగులకు రెండుబంగారుపతకాలు లభించాయి. వస్తు పరిజ్ఞానం కొరకు భారతదేశం అంతటా పర్యటించాడు. దక్షణభారతీయ స్త్రీల సౌందర్యం ఎక్కువగా తన చిత్రకళా వస్తువుగా తీసుకుని హిందూ దేవతలకు, కావ్య మరియు పురాణ నాయికానాయకులకు రూపురేఖలు కల్పించాడు. చీరకట్టుకున్న స్త్రీలను అందంగా, చక్కని వంపు సొంపులతో చిత్రించడంలో అతనికి అతనే సాటి.ముఖ్యంగా దుష్యంతుడు శకుంతల, నలదమయంతి తైలవర్ణ చిత్రాలు ప్రత్యేక గుర్తింపును పొందాయి. భారత, రామాయణములందలి పాత్రలనేకం ఆయన ఊహాచిత్ర సృష్టే. అంటే ఆ పాత్రల రూపురేఖలు నేటికీ అలాగే స్థిరపడి పోయాయి. మనందరికీ రాముడంటే ఇలానే వుంటాడు. అలాగే మిగిలిన దేవతా చిత్రాలను వేసి మనకు పరిచయం చేసాడు. మన దేవతలందరికీ మానవరూపం ఇచ్చిన మహా చిత్రకళాకారుడు. రవివర్మ పేరుకు ముందు 'రాజా' అన్నది అతని పెయింటింగ్స్‌కి పురస్కారంగా బ్రిటిష్ వారు ఇచ్చిన బిరుదు. ఆ ప్రాంతపు స్త్రీలే ఆయన పెయింటింగ్స్‌కు స్ఫూర్తిగా నిలిచారని ప్రతీతి. ఆయనకు 1873లో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన వియానా ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో ఆయన పెయింటింగ్‌కు ప్రధమ బహుమతి లభించింది. అప్పటి నుంచే ఆయన పేరు దశదిశలా వ్యాపించింది. ఈయన్ని భారతీయ పికాసోగా చెప్పవచ్చు. రవివర్మకే అందని అందాలు లేవేమో. దేవతా చిత్రాలే కాకుండా ఎన్నో అందాలను చిత్రీకరించాడు. అక్టోబర్-2, 1906లో, 58 సంవత్సరాల వయసులో మధుమేహంతో మరణించాడు. ఈయన మరణించేనాటికి కిలామానూరు ప్యాలెస్‌లో 160 దాకా రవివర్మ చిత్రాలు ఉండేవని ప్రతీతి. ఆ తరువాత వాటిని అధికారికముగా తిరువనంతపురములోని చిత్రా ఆర్ట్ గ్యాలరీకి అందజేశారు.
అంతర్జాతీయ నృత్య దినోత్సవం 1982 లో యునెస్కో సంస్థ అయిన ఎన్.జి.ఓ యొక్క ఇంటర్నేషనల్ డాన్స్ కమిటీ చే ప్రారంభించబడినది. ఈ దినాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 29 న జరుపుకుంటారు. ఈ రోజున జరుపుకొనాలనే సూచనను ఇంటర్నేషనల్ డాన్స్ కమిటీ యిచ్చినది. 1760 లో ప్రచుచింబడిన ప్రముఖ రచన lettres sur la danse యొక్క రచయిత మరియు ఆధునిక ప్రెంచ్ నృత్యనాటికల సృష్టి కర్త అయిన Jean Georges Noverre(1727-1810) యొక్క జన్మ దినాన్ని పురస్కరించుకొని ఆదినాన్ని అంతర్జాతీయ నృత్య దినంగా ప్రకటించారు.
ప్రతి సంవత్సరం, ఒక అద్భుతమైన నృత్య దర్శకుడు లేదా నర్తకుడు ప్రపంచవ్యాప్తంగా చెలామణి అయ్యేవారు ఒక సందేశాన్ని అందించటానికి ఆహ్వానించబడతారు. ఇంటర్నేషనల్ డాన్స్ కమిటీ యొక్క ప్రవేశ పత్రం ఆధారంగా ఈ ప్రసిద్ధ నృత్యదర్శకుడు లేదా నర్తకుని ఎంపిక చేయడం జరుతుంది.
UNESCO నిర్వహించిన అంతర్జాతీయ నృత్య దినోత్సవం లో యిప్పటివరకు పాల్గొన్న మరియు సందేశాన్ని అందించిన ప్రముఖులలో మెర్సీ కన్నింగ్‌హం, మారిస్ బెజర్త్ , అక్రం ఖాన్ మరియు అన్నె తెరెసా దె కీర్ స్మేకర్ లు.
ఈ దినం యొక్క లక్ష్యం నృత్య కళారూపం యొక్క ప్రపంచీకరణను చేధించడానికి,అన్ని రాజకీయ, సాంస్కృతిక మరియు జాతి అడ్డంకులు అధిగమించడానికి మరియు సాధారణ భాషలో గల నృత్య రీతులు గల ప్రజలందరినీ ఒకే చోటికి తేవడానికి కృషి చేయుట. ప్రపంచ నృత్య కూటమి, మరియు దాని నృత్య కమిటీ ఈ దినాన్ని పారిస్ లోని UNESCO లోనూ మరియు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. అసలు నృత్యం అన్నది సంగీతానికి అనుగుణంగా శరీరం కదలికలు మీద ఆదారపడి వుంటుంది. మానసిక ఉల్లాసానికి చాలా ఉపకరిస్తుంది. ఇది సరే ప్రపంచ ప్రసిద్దమైన నృత్యాలు కొన్ని వున్నాయి. వాటిలో
ఈ రోజు హిందువులకు మరియు జైనులకు ప్రత్యకమైన రోజు, అదే అక్షయ తృతీయ . వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయ గా పిలుస్తారు. సంస్కృతం లో ' అక్షయ ' అనగా క్షయం కానిది , తరిగి పోనిది అని అర్థం. హిందూ పంచాంగం ప్రకారం అక్షయ తృతీయ రోజంతా అత్యంత శుభ కరమైన ముహూర్త కాలంగా భావిస్తారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే సంపద అక్షయమవుతుందని భారతీయుల నమ్మకము. ఈ రోజు నాడే రైతులు విత్తనాలుకు పూజ చేసి నాటుతారు. ఎందుకంటే విత్తులు మంచిగా వ్యవసాయం వృద్ది చెందుతుంది. ఇంకా "అక్షయ తృతీయ" నాడే మహావిష్ణువు ఆరో అవతారమైన పరుశురాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నారు.భగీరధుడు తపస్సు ఫలితంగా గంగానది భూమి తరలి వచ్చిన రోజు. యజ్ఞ యాగాదులు చేయటానికి మంచి కాలం. శ్రీ కృష్ణులవారి బాల్య స్నేహితుడు కటిక దరిద్రుడైన సుదాముడు కృష్ణుని దగ్గరకు వెళ్లి అటుకులు సమర్పించి అత్యంత దనవంతుడైనాడు. ధర్మరాజు సూర్యనారాయణ మూర్తి నుండి అక్షయ పాత్రను పొందినాడు. వ్యాసుడు మహాభారతాన్ని చెప్తున్నప్పుడు విఘ్ననాయకుడు అయిన గణపతి భారతాన్ని రాయటం మొదలు పెట్టినరోజు. శంకరాచార్యులు వారు కనకదరా స్తోత్రాన్ని పాడితే కనకం వర్షంలాగ పడిన రోజు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు నిండు సభలో ద్రౌపది కి వస్త్రాపహరణ చేసి అవమానించదలిచారు , అప్పుడు ఆమెకి శ్రీ కృష్ణులు వస్త్రాలు ఇచ్చి ద్రౌపదిని కాపాడిన రోజు. అక్షయ తృతీయ నాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెబుతున్నాయి. కుబేరుడు, దేవతల కోశాధికారి, ధనానికి దేవత అనీ. లక్ష్మీ దేవి మరియు కుబేరుడు అక్షయ్ తృతీయ నాడు పూజిస్తే, సంపద కలగ చేస్తుంది. అంతే కాదు ఈరోజు నాడే అన్నపూర్ణాదేవి జన్మించినది. ఈరోజు కి ఇన్ని విశేషాలు వున్నాయి కాబట్టే అందుకే ఈ పర్వదినాన పుష్పమో, ఫలమో భగవంతుడికి సమర్పించినా, దైవనామస్మరణ చేసినా, చివరికి నమస్కారం చేసిన సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి.ఈ క్రమంలో అక్షయ తృతీయ నాడు బంగారం కొనడంతో పాటు అనేక శుభకార్యాలను చేపట్టవచ్చును. ఇందులో పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం వంటి మంచి కార్యాలను చేయవచ్చునని పురోహితులు సూచిస్తున్నారు.