శుక్రవారం, మే 01, 2015
మే డే అంటే మనందరికీ శలవు దినంగా తెలుసు. కానీ అది ఎందుకు ఎలా ఏర్పడిందో తెలుసుకుందము. . విప్లవం వెల్లివిరిసిన ప్రతిచోటా నేడు శ్రమజీవుల విజయోత్సవదినంగా 'మే డే' వెలుగులు విరజిమ్ముతోంది. ఎర్రజెండా ధగధగలు మిన్నంటుతూ శ్రమజీవుల్లో ఆనందం పంచుతూ సాగుతోంది. ఆకలి మంటల ఆర్తనాదాలు, అన్యాయాన్ని ఎదిరించే గళాలు పల్లవించే రోజుగానూ మే డే విలసిల్లుతోంది.
మే దినోత్సవం లేదా మే డే ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం. ఈరోజు పబ్లిక్ శెలవు దినం. చాలా దేశాలలో మే డే , అంతర్జాతీయ కార్మిక దినోత్సవం గా జరుపుకుంటారు. ఇవి అన్నీ కూడా కార్మికుల పోరాటం మరియు కార్మికుల ఐక్యతను గుర్తుచేస్తుంది.
ఈ రోజులను కార్మికులు పండుగ రోజుగా జరుపుకుంటారు . మే డే ఒక చారిత్రాత్మక చైతన్య దినం. చికాగోలో వున్న కొంతమంది రక్తతర్పణం చేసి కేవలం తమ దేశంలో వుండే కార్మికవర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారు.
ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకుంటున్న దానిక వర్గానికి ఆ సమయంలో తాముకూడా మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులుంటాయి. ఈ చాకిరీ మేం చేయలేమని పని ముట్లు కింద పడేసి ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడటం చేసి, చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించడం కార్మిక వర్గ పోరాట పటిమకు నిదర్శనంగా నిలబడ్డారు . 24 గంటలలో ఎనిమిది గంటలు పని, ఎనిమిది గంటలు విశ్రాంతి , ఇంకా ఎనిమిది గంటలు రిక్రీయేషన్ అన్నవి ఈ పోరాటం ద్వారా సాధించుకున్నారు. ఇది పారిశ్రామిక యుగం ఏర్పడిన తర్వాత కలిగిన మార్పు. యంత్రాలు రాకముందు మనిషి చాలా గంటలకొద్దీ పనిచేసేవాడు. అదొక బానిస బతుకులా వుండేది . మనిషి వైజ్ఞానిక పరిజ్ఞాన్ని ఉపయోగించి యంత్రాలను సృష్టించుకున్నాడు. యాంత్రిక యుగంలో క్యాపిటలిజం ఏవిధంగా పెరిగిందో అదే స్థాయిలో సామాజిక స్పృహ, చైతన్యం కూడా పెరిగాయి. అందువల్లనే పని గంటల పోరాటం వచ్చింది. కానీ మనలాంటి దేశంలో చికాగో కంటే ముందే కలకత్తాలో కార్మికులు నిర్ణీత పనిగంటల కోసం హౌరా రైల్వేస్టేషన్‌లో 1862లో సమ్మెచేశారు. అప్పటివరకు ఆ రైల్వే కార్మికులు 10 గంటలు పనిచేసేవారు. అప్పుడే బెంగాల్ పత్రికల్లో పాలకవర్గానికి చెందిన అధికారులు ఎన్ని గంటలు పనిచేస్తారో మేము కూడా అన్ని గంటలే పనిచేస్తామని డిమాండ్ చేశారు. కాగా, అది విస్తృత స్థాయిలో ప్రజా పోరుగా మారలేదు. కాబట్టి ఆ సంఘటన ఉద్యమ స్వరూపాన్ని అందుకోలేదు.
1923లో మొదటిసారి మన దేశంలో ‘మే డే’ను పాటించడం జరిగింది. 1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడటం మూలంగా అప్పటినుంచే కార్మికవర్గంలో చైతన్యం పెరగడం మొదలైంది. అప్పటినుండి ‘మే డే’ను పాటించడం జరుగుతుంది. కానీ అసంఘటిత కార్మికవర్గం అన్ని రంగాల్లో వచ్చింది. 1985 తర్వాత చోటుచేసుకున్న ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ పరిణామాల వల్ల అసంఘటిత కార్మికవర్గాల కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడంలేదు. మొత్తానికి ఎందరో మహనీయులు పోరాటం ఫలితంగా మే డే ఏర్పడింది.
గురువారం, ఏప్రిల్ 30, 2015
ఈరోజు ప్రపంచపు నిజాయతీ రోజు ( World Honesty Day ). ఏప్రిల్ నెలలో మొదటిరోజును ఫూల్స్ రోజు గాను చివరిరోజును హానేస్టే డే గాను జరుపుకుంటున్నారు. ఈరోజును మొట్టమొదట ప్రతిపాదించినది M. Hirsh Goldberg. ఈ రోజు ఎవరైనా ఎవరినైనా ప్రశ్న అడగవచ్చు. ఎదుటివారు ముక్కు సూటిగా జవాబు చెప్పాలి. ఆ జవాబు ఎలా చెప్పాలి అంటే పూర్తిగా నిజాయితిగా చెప్తున్నట్టు సుస్పస్టముగా అర్ధంకావాలి. Hirsh Goldberg ఒక నవలా రచయిత. ఇతను ఎన్నో పుస్తకాలు రచించారు. ఇతని పుస్తకాలలో కూడా నిజాయితి గురించి రచించారు. అతని రోజువారి జీవితాలను ప్రభావితం చేసింది. ఆ సమయంలో అసత్యాలు వాళ్ళ వచ్చే ఇబ్బందులు ప్రజలుకు అర్ధం అయ్యింది. అందుకే ఏప్రిల్ మొదటి రోజును అసత్యాలకు రోజుగాను. ఇదే నెలలో చివరి రోజును అసత్యాలు మాయమై Goldberg నిజాయితీ డే గా ఏర్పడింది.
విమర్శకులు కూడా నిజాయితీ డే గా అధ్యక్షులు మరియు జార్జ్ వాషింగ్టన్ మరియు అబ్రహం లింకన్ కూడా గతంలో నోబెల్ బహుమతిని నాయకుల నిజాయితీ కి జ్ఞాపకార్ధంగా రూపొందించబడింది.
నిజాయితీ డేకి అసత్యాలుకు దూరంగా ఉండాలని మరియు నిజమే చెప్పాలని కోరారు . ప్రతి ఏడాది ఏప్రిల్ 30, గోల్డ్బెర్గ్ తాను ప్రజలకు నిజాయితీగా వున్నా కంపెనీలుకు , సంస్థలుకు , సమూహాలుకు , మరియు వ్యక్తులకు వారి నిజాయితిని గుర్తించి చిత్తశుద్ధి అవార్డులు ఇస్తున్నారు .
ప్రపంచం మొత్తం మీద సగటు మహిళ రెండు అసత్యాలు ఒక రోజు చెబుతుంది అని. సగటు బ్రిటీష్ వ్యక్తి రోజుకి మూడు అసత్యాలు చెప్తారట . ఒక మనిషి సగటు ఒక అబద్ధం చెప్తారని సర్వేలు చెప్తున్నాయి.
పిల్లలకు మనం మంచి అలవాట్లు నేర్పించాలి అందులో ముఖ్యముగా నిజాయితీగా వుండటం నేర్పించాలి. అసత్యాలు పలకడం వాళ్ళ వచ్చే ఇబ్బందులు. పిల్లలకు అర్ధం అయ్యేలా చెప్పాలి. మనం ఒక అబద్దం చెప్తే అది మనలను ప్రశాంతంగా వుండనివ్వదు. అంతేకాదు ఒకదానికి ఒకటి అబద్దాలు చెప్పవలసి వస్తుంది. మొదటే నిజాయితిగా సత్యాన్నే చెప్పటం వాళ్ళ కొంచెం కష్టంగా వున్నా అది హాయిగానే వుంటుంది. నిజాయితీ గా వుండాలంటే దానికి ఎంతో దైర్యం కావాలి. అలాంటి దైర్యం రేపటి పౌరులకు అవసరం. అప్పుడే దేశభవిష్యత్తు భాగుంటుంది. సత్యమేవ జయతే ఇది మన భారతీయుల నినాదము.
బుధవారం, ఏప్రిల్ 29, 2015
దేవతలకే రూపురేఖలు దిద్దిన మహా చిత్రకారుడు రాజా రవి వర్మ. రాజా రవివర్మ ట్రావెంకూర్ రాష్ట్రం (నేటి కేరళ) లోని కిలిమనూర్ నందు జన్మించాడు. తండ్రి గొప్ప పండితుడు, తల్లి కవయిత్రి, రచయిత్రి.
యుక్తవయసులోనే రామస్వామి నాయుడు వద్ద వాటర్ పెయింటింగ్, డచ్ జాతీయుడు తీడార్ జన్సన్ వద్ద ఆయిల్ పెయింటింగును నేర్చుకున్నాడు.వియన్నాలో 1873లో జరిగిన పెయింటింగ్ ఎగ్జిబిషన్ నందు ఆయన పెయింటింగుకు అవార్డ్ లభించడంతో చిత్రకారుడిగా ప్రపంచ ప్రసిద్ధి గాంచాడు. 1893లో చికాగోలో జరిగిన వరల్డ్ కొలంబియన్ ఎక్స్పోజిషన్ నందు ఆయన పెయింటింగులకు రెండుబంగారుపతకాలు లభించాయి. వస్తు పరిజ్ఞానం కొరకు భారతదేశం అంతటా పర్యటించాడు. దక్షణభారతీయ స్త్రీల సౌందర్యం ఎక్కువగా తన చిత్రకళా వస్తువుగా తీసుకుని హిందూ దేవతలకు, కావ్య మరియు పురాణ నాయికానాయకులకు రూపురేఖలు కల్పించాడు. చీరకట్టుకున్న స్త్రీలను అందంగా, చక్కని వంపు సొంపులతో చిత్రించడంలో అతనికి అతనే సాటి.ముఖ్యంగా దుష్యంతుడు శకుంతల, నలదమయంతి తైలవర్ణ చిత్రాలు ప్రత్యేక గుర్తింపును పొందాయి. భారత, రామాయణములందలి పాత్రలనేకం ఆయన ఊహాచిత్ర సృష్టే. అంటే ఆ పాత్రల రూపురేఖలు నేటికీ అలాగే స్థిరపడి పోయాయి. మనందరికీ రాముడంటే ఇలానే వుంటాడు. అలాగే మిగిలిన దేవతా చిత్రాలను వేసి మనకు పరిచయం చేసాడు. మన దేవతలందరికీ మానవరూపం ఇచ్చిన మహా చిత్రకళాకారుడు. రవివర్మ పేరుకు ముందు 'రాజా' అన్నది అతని పెయింటింగ్స్‌కి పురస్కారంగా బ్రిటిష్ వారు ఇచ్చిన బిరుదు. ఆ ప్రాంతపు స్త్రీలే ఆయన పెయింటింగ్స్‌కు స్ఫూర్తిగా నిలిచారని ప్రతీతి. ఆయనకు 1873లో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన వియానా ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో ఆయన పెయింటింగ్‌కు ప్రధమ బహుమతి లభించింది. అప్పటి నుంచే ఆయన పేరు దశదిశలా వ్యాపించింది. ఈయన్ని భారతీయ పికాసోగా చెప్పవచ్చు. రవివర్మకే అందని అందాలు లేవేమో. దేవతా చిత్రాలే కాకుండా ఎన్నో అందాలను చిత్రీకరించాడు. అక్టోబర్-2, 1906లో, 58 సంవత్సరాల వయసులో మధుమేహంతో మరణించాడు. ఈయన మరణించేనాటికి కిలామానూరు ప్యాలెస్‌లో 160 దాకా రవివర్మ చిత్రాలు ఉండేవని ప్రతీతి. ఆ తరువాత వాటిని అధికారికముగా తిరువనంతపురములోని చిత్రా ఆర్ట్ గ్యాలరీకి అందజేశారు.
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ