Blogger Widgets

మంగళవారం, మార్చి 08, 2016

మహిళలూ మహారాణులు

మంగళవారం, మార్చి 08, 2016

ఈరోజు ప్రపంచం అంతా అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మొట్టమొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక మహిళాదినోత్సవం గా పిలవబడిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8 న ఆచరిస్తారు.  ఎక్కడ మహిళలు గౌరవించబడుతారో, అక్కడ దేవతలు ఆనందిస్తారు అంటారు.  ఒక్కొక్క ప్రాంతంలో వారి ప్రదేశాన్ని బట్టి వారి మహిళలకు ఇచ్చే ప్రేమ, గౌరవం, మర్యాద, ఆర్ధిక స్వాతంత్రం,  సామాజిక స్వాతంత్రం, రాజకీయ స్వాతంత్రం, వారివారి సొంత గుర్తింపు కలిగించుకోవటానికి ఒక గుర్తుగా వుంటుంది ఈ మహిళా దినోత్సవం.  ఇప్పుడైతే ప్రపంచం మొత్తం ఈరోజును గుర్తించారు.  మన భారతదేశం లో అనాదికాలం నుండి మహిళకు ప్రత్యేకత నిచ్చేవారు.  స్త్రీని ఒక దేవతా స్వరూపంగా భావించేవారు.  పర స్త్రీ అంటే మాతృమూర్తిగా భావించేవారు. 

 నేడు మనదేశంలో కూడా పరిస్థితులు మారిపోయాయి.  ఆధునికత అనే పేరుతో పరిస్థితులు మారిపోయాయి.  ఇది చాలా బాధాకరమైన విషయం.  అన్ని రంగాలలోను పురుషులతో సమానంగా ప్రయాణిస్తున్న మహిళ మరలా అసమర్ధురాలిగా, అభద్రతా భావంవల్ల తను నిజంగా ఆత్మన్యూన్యతా భావం కలిగి మేము అసమర్దులమని దేనికి దైర్యం లేక  ఎన్నో ఆసలు కోరికలు వున్నా మేము ఏమి చెయ్యలేము అన్న భావంతో అడుగుముందుకు వేయలేకపోతున్నారు.  ఒకవేళ దైర్యం తెచ్చుకొని అడుగుముందుకు వేస్తే దానికి అనేక అడ్డంకులు కలిగి మానసిక వత్తిడి కలిగి ప్రయాణాన్ని ఆపేస్తున్నారు.   కుటుంబాలలో కూడా వారికి శారీరక మానసిక హింస ను ఎదుర్కొంటున్నారు.  అలాంటి జీవితాన్ని కాదని బయటికి వచ్చి స్వేచ్చగా వుండాలని వున్నా వుండలేని సామాజిక పరిస్థితి.  ఇవన్ని ఎప్పుడు మారతాయో ఎవరికీ తెలియదు.  ఈ మహిళా దినోత్సవాలు లాంటివి ఎన్ని జరుపుకున్నా మార్పు వస్తుందా?    స్త్రీ పట్ల వివక్ష అసలు అమ్మ కడుపులో నుండే మొదలు అవుతుంది.  స్త్రీగా పుట్టడమే పాపం అన్నట్టు వుంటుంది ఆమె జీవితకాలం ఎదుర్కొనే పరిస్థితులతో.  ఎన్ని చట్టాలలో మార్పు తెచ్చినా విద్యాభివృద్ది సాధించినా,  భూ ఆస్తి హక్కు కలిగించిన నేటి మహిళా పరస్థితి మారలేదు అనటంలో జగమెరిగిన సత్యం.
చట్టాలలో ఎన్ని మార్పులు వచ్చినా ఎక్కడికక్కడ స్త్రీకి అన్యాయం జరుగుతూనే వుంది.  ‘ఆకాశంలో సగం.. అన్నింటా సగం’ అంటూ మహిళలను ఒకవైపు ఆకాశానికి ఎత్తేస్తున్నా. మరోవైపు రోజురోజుకూ వారిపై దాడులు పెరిగిపోతున్నాయి.  భ్రూణహత్యలు, అత్యాచారాలు, గృహహింస తదితర వేధింపులు అధికమవుతున్నాయి. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కొత్త చట్టాలు తెస్తున్నా వీటిపై సరైన అవగాహన లేక ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోతున్నాయి. మహిళలకు సంబంధించిన ప్రతీ అంశానికి ఒక ప్రత్యేకమైన చట్టం ఉంది. వీటిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. గాంధీగారు అన్నట్టు ఏనాడైతే ఒక మహిళా అర్దరాత్రి నడి రోడ్డు పై ఒంటరిగా నడవగాలదో ఆనాడే నిజమైన స్వాతంత్ర్యం వస్తుంది . కాని 69 సంవత్సరాలు గడిచినా ఈ మహిళా స్వాతంత్ర్య పోరాటం చేస్తూనే వున్నారు.  అలా మారినరోజు ను నిజమైన మహిళా దినోత్సవంగా జరుపుకుందాం.  
మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. 

సోమవారం, మార్చి 07, 2016

శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్

సోమవారం, మార్చి 07, 2016

ఓం నమః శివాయః          హరహర మహాదేవ శంభోశంకర 
ఓం
స్థిరః స్థాణుః ప్రభుర్భానుః ప్రవరో వరదో వరః |
సర్వాత్మా సర్వవిఖ్యాతః సర్వః సర్వకరో భవః || 1 ||

జటీ చర్మీ శిఖండీ చ సర్వాంగః సర్వాంగః సర్వభావనః |
హరిశ్చ హరిణాక్శశ్చ సర్వభూతహరః ప్రభుః || 2 ||

ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ నియతః శాశ్వతో ధ్రువః |
శ్మశానచారీ భగవానః ఖచరో గోచరో‌உర్దనః || 3 ||

అభివాద్యో మహాకర్మా తపస్వీ భూత భావనః |
ఉన్మత్తవేషప్రచ్ఛన్నః సర్వలోకప్రజాపతిః || 4 ||

మహారూపో మహాకాయో వృషరూపో మహాయశాః |
మహా‌உ‌உత్మా సర్వభూతశ్చ విరూపో వామనో మనుః || 5 ||

లోకపాలో‌உంతర్హితాత్మా ప్రసాదో హయగర్దభిః |
పవిత్రశ్చ మహాంశ్చైవ నియమో నియమాశ్రయః || 6 ||

సర్వకర్మా స్వయంభూశ్చాదిరాదికరో నిధిః |
సహస్రాక్శో విరూపాక్శః సోమో నక్శత్రసాధకః || 7 ||

చంద్రః సూర్యః గతిః కేతుర్గ్రహో గ్రహపతిర్వరః |
అద్రిరద్ర్యాలయః కర్తా మృగబాణార్పణో‌உనఘః || 8 ||

మహాతపా ఘోర తపా‌உదీనో దీనసాధకః |
సంవత్సరకరో మంత్రః ప్రమాణం పరమం తపః || 9 ||

యోగీ యోజ్యో మహాబీజో మహారేతా మహాతపాః |
సువర్ణరేతాః సర్వఘ్యః సుబీజో వృషవాహనః || 10 ||

దశబాహుస్త్వనిమిషో నీలకంఠ ఉమాపతిః |
విశ్వరూపః స్వయం శ్రేష్ఠో బలవీరో‌உబలోగణః || 11 ||

గణకర్తా గణపతిర్దిగ్వాసాః కామ ఏవ చ |
పవిత్రం పరమం మంత్రః సర్వభావ కరో హరః || 12 ||

కమండలుధరో ధన్వీ బాణహస్తః కపాలవానః |
అశనీ శతఘ్నీ ఖడ్గీ పట్టిశీ చాయుధీ మహానః || 13 ||

స్రువహస్తః సురూపశ్చ తేజస్తేజస్కరో నిధిః |
ఉష్ణిషీ చ సువక్త్రశ్చోదగ్రో వినతస్తథా || 14 ||

దీర్ఘశ్చ హరికేశశ్చ సుతీర్థః కృష్ణ ఏవ చ |
సృగాల రూపః సర్వార్థో ముండః కుండీ కమండలుః || 15 ||

అజశ్చ మృగరూపశ్చ గంధధారీ కపర్ద్యపి |
ఉర్ధ్వరేతోర్ధ్వలింగ ఉర్ధ్వశాయీ నభస్తలః || 16 ||

త్రిజటైశ్చీరవాసాశ్చ రుద్రః సేనాపతిర్విభుః |
అహశ్చరో‌உథ నక్తం చ తిగ్మమన్యుః సువర్చసః || 17 ||

గజహా దైత్యహా లోకో లోకధాతా గుణాకరః |
సింహశార్దూలరూపశ్చ ఆర్ద్రచర్మాంబరావృతః || 18 ||

కాలయోగీ మహానాదః సర్వవాసశ్చతుష్పథః |
నిశాచరః ప్రేతచారీ భూతచారీ మహేశ్వరః || 19 ||

బహుభూతో బహుధనః సర్వాధారో‌உమితో గతిః |
నృత్యప్రియో నిత్యనర్తో నర్తకః సర్వలాసకః || 20 ||

ఘోరో మహాతపాః పాశో నిత్యో గిరి చరో నభః |
సహస్రహస్తో విజయో వ్యవసాయో హ్యనిందితః || 21 ||

అమర్షణో మర్షణాత్మా యఘ్యహా కామనాశనః |
దక్శయఘ్యాపహారీ చ సుసహో మధ్యమస్తథా || 22 ||

తేజో‌உపహారీ బలహా ముదితో‌உర్థో‌உజితో వరః |
గంభీరఘోషో గంభీరో గంభీర బలవాహనః || 23 ||

న్యగ్రోధరూపో న్యగ్రోధో వృక్శకర్ణస్థితిర్విభుః |
సుదీక్శ్ణదశనశ్చైవ మహాకాయో మహాననః || 24 ||

విష్వక్సేనో హరిర్యఘ్యః సంయుగాపీడవాహనః |
తీక్శ్ణ తాపశ్చ హర్యశ్వః సహాయః కర్మకాలవితః || 25 ||

విష్ణుప్రసాదితో యఘ్యః సముద్రో వడవాముఖః |
హుతాశనసహాయశ్చ ప్రశాంతాత్మా హుతాశనః || 26 ||

ఉగ్రతేజా మహాతేజా జయో విజయకాలవితః |
జ్యోతిషామయనం సిద్ధిః సంధిర్విగ్రహ ఏవ చ || 27 ||

శిఖీ దండీ జటీ జ్వాలీ మూర్తిజో మూర్ధగో బలీ |
వైణవీ పణవీ తాలీ కాలః కాలకటంకటః || 28 ||

నక్శత్రవిగ్రహ విధిర్గుణవృద్ధిర్లయో‌உగమః |
ప్రజాపతిర్దిశా బాహుర్విభాగః సర్వతోముఖః || 29 ||

విమోచనః సురగణో హిరణ్యకవచోద్భవః |
మేఢ్రజో బలచారీ చ మహాచారీ స్తుతస్తథా || 30 ||

సర్వతూర్య నినాదీ చ సర్వవాద్యపరిగ్రహః |
వ్యాలరూపో బిలావాసీ హేమమాలీ తరంగవితః || 31 ||

త్రిదశస్త్రికాలధృకః కర్మ సర్వబంధవిమోచనః |
బంధనస్త్వాసురేంద్రాణాం యుధి శత్రువినాశనః || 32 ||

సాంఖ్యప్రసాదో సుర్వాసాః సర్వసాధునిషేవితః |
ప్రస్కందనో విభాగశ్చాతుల్యో యఘ్యభాగవితః || 33 ||

సర్వావాసః సర్వచారీ దుర్వాసా వాసవో‌உమరః |
హేమో హేమకరో యఘ్యః సర్వధారీ ధరోత్తమః || 34 ||

లోహితాక్శో మహా‌உక్శశ్చ విజయాక్శో విశారదః |
సంగ్రహో నిగ్రహః కర్తా సర్పచీరనివాసనః || 35 ||

ముఖ్యో‌உముఖ్యశ్చ దేహశ్చ దేహ ఋద్ధిః సర్వకామదః |
సర్వకామప్రసాదశ్చ సుబలో బలరూపధృకః || 36 ||

సర్వకామవరశ్చైవ సర్వదః సర్వతోముఖః |
ఆకాశనిధిరూపశ్చ నిపాతీ ఉరగః ఖగః || 37 ||

రౌద్రరూపోం‌உశురాదిత్యో వసురశ్మిః సువర్చసీ |
వసువేగో మహావేగో మనోవేగో నిశాచరః || 38 ||

సర్వావాసీ శ్రియావాసీ ఉపదేశకరో హరః |
మునిరాత్మ పతిర్లోకే సంభోజ్యశ్చ సహస్రదః || 39 ||

పక్శీ చ పక్శిరూపీ చాతిదీప్తో విశాంపతిః |
ఉన్మాదో మదనాకారో అర్థార్థకర రోమశః || 40 ||

వామదేవశ్చ వామశ్చ ప్రాగ్దక్శిణశ్చ వామనః |
సిద్ధయోగాపహారీ చ సిద్ధః సర్వార్థసాధకః || 41 ||

భిక్శుశ్చ భిక్శురూపశ్చ విషాణీ మృదురవ్యయః |
మహాసేనో విశాఖశ్చ షష్టిభాగో గవాంపతిః || 42 ||

వజ్రహస్తశ్చ విష్కంభీ చమూస్తంభనైవ చ |
ఋతురృతు కరః కాలో మధుర్మధుకరో‌உచలః || 43 ||

వానస్పత్యో వాజసేనో నిత్యమాశ్రమపూజితః |
బ్రహ్మచారీ లోకచారీ సర్వచారీ సుచారవితః || 44 ||

ఈశాన ఈశ్వరః కాలో నిశాచారీ పినాకధృకః |
నిమిత్తస్థో నిమిత్తం చ నందిర్నందికరో హరిః || 45 ||

నందీశ్వరశ్చ నందీ చ నందనో నందివర్ధనః |
భగస్యాక్శి నిహంతా చ కాలో బ్రహ్మవిదాంవరః || 46 ||

చతుర్ముఖో మహాలింగశ్చారులింగస్తథైవ చ |
లింగాధ్యక్శః సురాధ్యక్శో లోకాధ్యక్శో యుగావహః || 47 ||

బీజాధ్యక్శో బీజకర్తా‌உధ్యాత్మానుగతో బలః |
ఇతిహాస కరః కల్పో గౌతమో‌உథ జలేశ్వరః || 48 ||

దంభో హ్యదంభో వైదంభో వైశ్యో వశ్యకరః కవిః |
లోక కర్తా పశు పతిర్మహాకర్తా మహౌషధిః || 49 ||

అక్శరం పరమం బ్రహ్మ బలవానః శక్ర ఏవ చ |
నీతిర్హ్యనీతిః శుద్ధాత్మా శుద్ధో మాన్యో మనోగతిః || 50 ||

బహుప్రసాదః స్వపనో దర్పణో‌உథ త్వమిత్రజితః |
వేదకారః సూత్రకారో విద్వానః సమరమర్దనః || 51 ||

మహామేఘనివాసీ చ మహాఘోరో వశీకరః |
అగ్నిజ్వాలో మహాజ్వాలో అతిధూమ్రో హుతో హవిః || 52 ||

వృషణః శంకరో నిత్యో వర్చస్వీ ధూమకేతనః |
నీలస్తథా‌உంగలుబ్ధశ్చ శోభనో నిరవగ్రహః || 53 ||

స్వస్తిదః స్వస్తిభావశ్చ భాగీ భాగకరో లఘుః |
ఉత్సంగశ్చ మహాంగశ్చ మహాగర్భః పరో యువా || 54 ||

కృష్ణవర్ణః సువర్ణశ్చేంద్రియః సర్వదేహినామః |
మహాపాదో మహాహస్తో మహాకాయో మహాయశాః || 55 ||

మహామూర్ధా మహామాత్రో మహానేత్రో దిగాలయః |
మహాదంతో మహాకర్ణో మహామేఢ్రో మహాహనుః || 56 ||

మహానాసో మహాకంబుర్మహాగ్రీవః శ్మశానధృకః |
మహావక్శా మహోరస్కో అంతరాత్మా మృగాలయః || 57 ||

లంబనో లంబితోష్ఠశ్చ మహామాయః పయోనిధిః |
మహాదంతో మహాదంష్ట్రో మహాజిహ్వో మహాముఖః || 58 ||

మహానఖో మహారోమా మహాకేశో మహాజటః |
అసపత్నః ప్రసాదశ్చ ప్రత్యయో గిరి సాధనః || 59 ||

స్నేహనో‌உస్నేహనశ్చైవాజితశ్చ మహామునిః |
వృక్శాకారో వృక్శ కేతురనలో వాయువాహనః || 60 ||

మండలీ మేరుధామా చ దేవదానవదర్పహా |
అథర్వశీర్షః సామాస్య ఋకఃసహస్రామితేక్శణః || 61 ||

యజుః పాద భుజో గుహ్యః ప్రకాశో జంగమస్తథా |
అమోఘార్థః ప్రసాదశ్చాభిగమ్యః సుదర్శనః || 62 ||

ఉపహారప్రియః శర్వః కనకః కాఝ్ణ్చనః స్థిరః |
నాభిర్నందికరో భావ్యః పుష్కరస్థపతిః స్థిరః || 63 ||

ద్వాదశస్త్రాసనశ్చాద్యో యఘ్యో యఘ్యసమాహితః |
నక్తం కలిశ్చ కాలశ్చ మకరః కాలపూజితః || 64 ||

సగణో గణ కారశ్చ భూత భావన సారథిః |
భస్మశాయీ భస్మగోప్తా భస్మభూతస్తరుర్గణః || 65 ||

అగణశ్చైవ లోపశ్చ మహా‌உ‌உత్మా సర్వపూజితః |
శంకుస్త్రిశంకుః సంపన్నః శుచిర్భూతనిషేవితః || 66 ||

ఆశ్రమస్థః కపోతస్థో విశ్వకర్మాపతిర్వరః |
శాఖో విశాఖస్తామ్రోష్ఠో హ్యముజాలః సునిశ్చయః || 67 ||

కపిలో‌உకపిలః శూరాయుశ్చైవ పరో‌உపరః |
గంధర్వో హ్యదితిస్తార్క్శ్యః సువిఘ్యేయః సుసారథిః || 68 ||

పరశ్వధాయుధో దేవార్థ కారీ సుబాంధవః |
తుంబవీణీ మహాకోపోర్ధ్వరేతా జలేశయః || 69 ||

ఉగ్రో వంశకరో వంశో వంశనాదో హ్యనిందితః |
సర్వాంగరూపో మాయావీ సుహృదో హ్యనిలో‌உనలః || 70 ||

బంధనో బంధకర్తా చ సుబంధనవిమోచనః |
సయఘ్యారిః సకామారిః మహాదంష్ట్రో మహా‌உ‌உయుధః || 71 ||

బాహుస్త్వనిందితః శర్వః శంకరః శంకరో‌உధనః |
అమరేశో మహాదేవో విశ్వదేవః సురారిహా || 72 ||

అహిర్బుధ్నో నిరృతిశ్చ చేకితానో హరిస్తథా |
అజైకపాచ్చ కాపాలీ త్రిశంకురజితః శివః || 73 ||

ధన్వంతరిర్ధూమకేతుః స్కందో వైశ్రవణస్తథా |
ధాతా శక్రశ్చ విష్ణుశ్చ మిత్రస్త్వష్టా ధ్రువో ధరః || 74 ||

ప్రభావః సర్వగో వాయురర్యమా సవితా రవిః |
ఉదగ్రశ్చ విధాతా చ మాంధాతా భూత భావనః || 75 ||

రతితీర్థశ్చ వాగ్మీ చ సర్వకామగుణావహః |
పద్మగర్భో మహాగర్భశ్చంద్రవక్త్రోమనోరమః || 76 ||

బలవాంశ్చోపశాంతశ్చ పురాణః పుణ్యచఝ్ణ్చురీ |
కురుకర్తా కాలరూపీ కురుభూతో మహేశ్వరః || 77 ||

సర్వాశయో దర్భశాయీ సర్వేషాం ప్రాణినాంపతిః |
దేవదేవః ముఖో‌உసక్తః సదసతః సర్వరత్నవితః || 78 ||

కైలాస శిఖరావాసీ హిమవదః గిరిసంశ్రయః |
కూలహారీ కూలకర్తా బహువిద్యో బహుప్రదః || 79 ||

వణిజో వర్ధనో వృక్శో నకులశ్చందనశ్ఛదః |
సారగ్రీవో మహాజత్రు రలోలశ్చ మహౌషధః || 80 ||

సిద్ధార్థకారీ సిద్ధార్థశ్చందో వ్యాకరణోత్తరః |
సింహనాదః సింహదంష్ట్రః సింహగః సింహవాహనః || 81 ||

ప్రభావాత్మా జగత్కాలస్థాలో లోకహితస్తరుః |
సారంగో నవచక్రాంగః కేతుమాలీ సభావనః || 82 ||

భూతాలయో భూతపతిరహోరాత్రమనిందితః || 83 ||
వాహితా సర్వభూతానాం నిలయశ్చ విభుర్భవః |
అమోఘః సంయతో హ్యశ్వో భోజనః ప్రాణధారణః || 84 ||

ధృతిమానః మతిమానః దక్శః సత్కృతశ్చ యుగాధిపః |
గోపాలిర్గోపతిర్గ్రామో గోచర్మవసనో హరః || 85 ||

హిరణ్యబాహుశ్చ తథా గుహాపాలః ప్రవేశినామః |
ప్రతిష్ఠాయీ మహాహర్షో జితకామో జితేంద్రియః || 86 ||

గాంధారశ్చ సురాలశ్చ తపః కర్మ రతిర్ధనుః |
మహాగీతో మహానృత్తోహ్యప్సరోగణసేవితః || 87 ||

మహాకేతుర్ధనుర్ధాతుర్నైక సానుచరశ్చలః |
ఆవేదనీయ ఆవేశః సర్వగంధసుఖావహః || 88 ||

తోరణస్తారణో వాయుః పరిధావతి చైకతః |
సంయోగో వర్ధనో వృద్ధో మహావృద్ధో గణాధిపః || 89 ||

నిత్యాత్మసహాయశ్చ దేవాసురపతిః పతిః |
యుక్తశ్చ యుక్తబాహుశ్చ ద్వివిధశ్చ సుపర్వణః || 90 ||

ఆషాఢశ్చ సుషాడశ్చ ధ్రువో హరి హణో హరః |
వపురావర్తమానేభ్యో వసుశ్రేష్ఠో మహాపథః || 91 ||

శిరోహారీ విమర్శశ్చ సర్వలక్శణ భూషితః |
అక్శశ్చ రథ యోగీ చ సర్వయోగీ మహాబలః || 92 ||

సమామ్నాయో‌உసమామ్నాయస్తీర్థదేవో మహారథః |
నిర్జీవో జీవనో మంత్రః శుభాక్శో బహుకర్కశః || 93 ||

రత్న ప్రభూతో రక్తాంగో మహా‌உర్ణవనిపానవితః |
మూలో విశాలో హ్యమృతో వ్యక్తావ్యక్తస్తపో నిధిః || 94 ||

ఆరోహణో నిరోహశ్చ శలహారీ మహాతపాః |
సేనాకల్పో మహాకల్పో యుగాయుగ కరో హరిః || 95 ||

యుగరూపో మహారూపో పవనో గహనో నగః |
న్యాయ నిర్వాపణః పాదః పండితో హ్యచలోపమః || 96 ||

బహుమాలో మహామాలః సుమాలో బహులోచనః |
విస్తారో లవణః కూపః కుసుమః సఫలోదయః || 97 ||

వృషభో వృషభాంకాంగో మణి బిల్వో జటాధరః |
ఇందుర్విసర్వః సుముఖః సురః సర్వాయుధః సహః || 98 ||

నివేదనః సుధాజాతః సుగంధారో మహాధనుః |
గంధమాలీ చ భగవానః ఉత్థానః సర్వకర్మణామః || 99 ||

మంథానో బహులో బాహుః సకలః సర్వలోచనః |
తరస్తాలీ కరస్తాలీ ఊర్ధ్వ సంహననో వహః || 100 ||

ఛత్రం సుచ్ఛత్రో విఖ్యాతః సర్వలోకాశ్రయో మహానః |
ముండో విరూపో వికృతో దండి ముండో వికుర్వణః || 101 ||

హర్యక్శః కకుభో వజ్రీ దీప్తజిహ్వః సహస్రపాతః |
సహస్రమూర్ధా దేవేంద్రః సర్వదేవమయో గురుః || 102 ||

సహస్రబాహుః సర్వాంగః శరణ్యః సర్వలోకకృతః |
పవిత్రం త్రిమధుర్మంత్రః కనిష్ఠః కృష్ణపింగలః || 103 ||

బ్రహ్మదండవినిర్మాతా శతఘ్నీ శతపాశధృకః |
పద్మగర్భో మహాగర్భో బ్రహ్మగర్భో జలోద్భవః || 104 ||

గభస్తిర్బ్రహ్మకృదః బ్రహ్మా బ్రహ్మవిదః బ్రాహ్మణో గతిః |
అనంతరూపో నైకాత్మా తిగ్మతేజాః స్వయంభువః || 105 ||

ఊర్ధ్వగాత్మా పశుపతిర్వాతరంహా మనోజవః |
చందనీ పద్మమాలా‌உగ్{}ర్యః సురభ్యుత్తరణో నరః || 106 ||

కర్ణికార మహాస్రగ్వీ నీలమౌలిః పినాకధృకః |
ఉమాపతిరుమాకాంతో జాహ్నవీ ధృగుమాధవః || 107 ||

వరో వరాహో వరదో వరేశః సుమహాస్వనః |
మహాప్రసాదో దమనః శత్రుహా శ్వేతపింగలః || 108 ||

ప్రీతాత్మా ప్రయతాత్మా చ సంయతాత్మా ప్రధానధృకః |
సర్వపార్శ్వ సుతస్తార్క్శ్యో ధర్మసాధారణో వరః || 109 ||

చరాచరాత్మా సూక్శ్మాత్మా సువృషో గో వృషేశ్వరః |
సాధ్యర్షిర్వసురాదిత్యో వివస్వానః సవితా‌உమృతః || 110 ||

వ్యాసః సర్వస్య సంక్శేపో విస్తరః పర్యయో నయః |
ఋతుః సంవత్సరో మాసః పక్శః సంఖ్యా సమాపనః || 111 ||

కలాకాష్ఠా లవోమాత్రా ముహూర్తో‌உహః క్శపాః క్శణాః |
విశ్వక్శేత్రం ప్రజాబీజం లింగమాద్యస్త్వనిందితః || 112 ||

సదసదః వ్యక్తమవ్యక్తం పితా మాతా పితామహః |
స్వర్గద్వారం ప్రజాద్వారం మోక్శద్వారం త్రివిష్టపమః || 113 ||

నిర్వాణం హ్లాదనం చైవ బ్రహ్మలోకః పరాగతిః |
దేవాసురవినిర్మాతా దేవాసురపరాయణః || 114 ||

దేవాసురగురుర్దేవో దేవాసురనమస్కృతః |
దేవాసురమహామాత్రో దేవాసురగణాశ్రయః || 115 ||

దేవాసురగణాధ్యక్శో దేవాసురగణాగ్రణీః |
దేవాతిదేవో దేవర్షిర్దేవాసురవరప్రదః || 116 ||

దేవాసురేశ్వరోదేవో దేవాసురమహేశ్వరః |
సర్వదేవమయో‌உచింత్యో దేవతా‌உ‌உత్మా‌உ‌உత్మసంభవః || 117 ||

ఉద్భిదస్త్రిక్రమో వైద్యో విరజో విరజో‌உంబరః |
ఈడ్యో హస్తీ సురవ్యాఘ్రో దేవసింహో నరర్షభః || 118 ||

విబుధాగ్రవరః శ్రేష్ఠః సర్వదేవోత్తమోత్తమః |
ప్రయుక్తః శోభనో వర్జైశానః ప్రభురవ్యయః || 119 ||

గురుః కాంతో నిజః సర్గః పవిత్రః సర్వవాహనః |
శృంగీ శృంగప్రియో బభ్రూ రాజరాజో నిరామయః || 120 ||

అభిరామః సురగణో విరామః సర్వసాధనః |
లలాటాక్శో విశ్వదేహో హరిణో బ్రహ్మవర్చసః || 121 ||

స్థావరాణాంపతిశ్చైవ నియమేంద్రియవర్ధనః |
సిద్ధార్థః సర్వభూతార్థో‌உచింత్యః సత్యవ్రతః శుచిః || 122 ||

వ్రతాధిపః పరం బ్రహ్మ ముక్తానాం పరమాగతిః |
విముక్తో ముక్తతేజాశ్చ శ్రీమానః శ్రీవర్ధనో జగతః || 123 ||

శ్రీమానః శ్రీవర్ధనో జగతః ఓం నమ ఇతి ||
ఇతి శ్రీ మహాభారతే అనుశాసన పర్వే శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్ సంపూర్ణమ్ ||

మంగళవారం, ఫిబ్రవరి 23, 2016

ఉదయాద్రి తెలుపాయె

మంగళవారం, ఫిబ్రవరి 23, 2016

తాళపాక  అన్నమయ్య 95 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపి దుందుభి నామ సంవత్సరం ఫల్గుణ బహుళ ద్వాదశి నాడు (ఫిబ్రవరి 23, 1503) పరమపదించాడు. రాగిరేకులమీద వ్రాసిన తిధుల కారణంగా అతని జన్మ, మరణ దినాలు తెలుస్తున్నాయి.  ఇతడు శ్రీమహావిష్ణువు యొక్క ఖడ్గం అయిన నందకాంశ సంభూతుడు అని భావన ఉంది. "పదకవితా పితామహుడు", "సంకీరత్నాచార్యుడు", "పంచమాగమ సార్వభౌముడు", "ద్రవిడాగమ సార్వభౌముడు" - ఇవి అన్నమయ్యకు సమకాలీనులు సాదరంగా ఇచ్చిన బిరుద నామాలు.  అన్నమయ్య వర్ధంతి సందర్బంగా ఒక మంచి పాట. 
ఉదయాద్రి తెలుపాయె నుండు రాజు కొలు వీడె | 
అద నెర్కిగి రాడాయె నమ్మ నా విభుడు ||
చన్నులపై ముత్యాల సరులెల్ల జల్లనాయె | 
కన్నులకు గప్పొదవె గాంత నా కిపుడు |
కనె కలువల జాతి కనుమోడ్చినది మీద | 
వెన్నెల వేసంగి మొగ్గ వికసించె గదవె ||
పువ్వుల లోపలి కురులు బుగులు కొనగా నెర్కసె | 
దవ్వుల దుమ్మెదగములు తరమి డాయగను |
రవ్వసేయ శుక పికము రాయడి కోర్వగ రాదు | 
అవ్వలనెవ్వతె పసల కలరున్నవాడో ||
పన్నీట జలక మార్చి పచ్చకప్రము మెత్తి | 
చెన్ను గంగొప్పున విరులు చెరువందురిమి |
ఎన్నంగల తిరువేంకటేశుం డిదె ననుంగూడి | 
కన్నుల మనసునుం దనియం గరుణించెం గదవే ||

ఆదివారం, ఫిబ్రవరి 14, 2016

భక్తానా మభయప్రదం దినకరం

ఆదివారం, ఫిబ్రవరి 14, 2016

సప్తాశ్వ రథ మారూడం
ప్రచండం కశ్యపాత్మజం 
శ్వేత పద్మ ధరం దేవం
తం సూర్యం ప్రణమామ్యహం 

సూర్యభగవానుని ధ్యాన శ్లోకం !
ధాయెత్పూర్యః మనంతకోటి కిరణం
త్రైలోక్య చూడామణి,
భక్తానా మభయప్రదం దినకరం
జ్యోతిర్మయం శంకరమ్,
ఆదిత్యం జగదీశ మచ్యుత మజం
త్రైయార్ధసారం రవిమ్,
భక్తా భీష్ట ఫలప్రదం ద్యుతినిభం
మార్తాండ మధ్యం విభుమ్!!


ఉషోదయ కిరణాలతో సమస్త జీవ కోటినీ నవ చైతన్యంతో ఉంచుతున్న ఆ సూర్యభగవానుడి జన్మదినమును ధసప్తమి గా జరుపుకుంటాం.  ప్రత్యక్ష భగవానుడు  సమయపాలనా చక్రవర్తి... ఆరోగ్యదాత... అభయప్రదాత... అన్న పేర్లున్నవాడు. రాత్రిపగళ్లతో- చీకటివెలుగులను పంచడంలో సిద్ధహస్తుడు. ఆయనే సూర్యుడు. అదితికశ్యపులకు పుట్టిన సూర్యభగవానుడి జన్మదినమే రథసప్తమి.  రధసప్తమి రోజునుండి వేసవి కాలము ప్రారంబమవుతుంది . అందుకే రధసప్తమిరోజు తప్పకుండా సూర్య నమస్కారములు చేయాలి. మనకు ప్రతినిత్యము ప్రత్యక్షముగా కనిపించే దైవం సూర్యభగవానుడు. ప్రపంచములో అన్ని జీవరాసులకు వేడి, వెచ్చదనము, పాడిపంటలను, వెలుగును ఇచ్చేవాడు భాస్కరుడు. సుర్యారాధన మనకు వేద కాలమునుండి ఉంది. సూర్యుని పేరు సప్తిమ. ఏడు గుర్రాలను (ఏడు  గుర్రముల పేర్లు వరుసగా గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి, త్రిష్ణుప్, అనుష్ణుప్, పంక్తి )  వంచిన రధము కలిగినవాడు. సప్తలోకములకు తన శక్తిని ప్రసాదించువాడు సూర్య కిరణాలు ఏడురంగులకు నిదర్శనమని, రధసప్తమినాడు ఆకాసములో గ్రహ నక్షిత్ర సన్నివేసం రధమును పోలి ఉంటుంది కనుకనే ఈ తిధిని రధసప్తమి అని పేరు వచ్చింది.
అనంతసక్తితో కూడుకొన్న కిరణాలు, తేజస్సు, శుద్ధమైన వాడు , భక్తులకు అభయము ఇచ్చేవాడు. జగతికి వెలుగుకారకుడు, జ్యోతిర్మయుడు, శుభానిచ్చే ఆదిత్యుడు, చీకటి పారద్రోలేవాడు, భక్తుల కోరికలు తీర్చేవాడు ఆదిత్యుడు , మార్తాండుడు, శుభంకరుడు, భాస్కరుడు అయిన సూర్యనారాయణమూర్తికి నమస్కారములు అంటూ ధ్యానించాలి.
సుర్యుడు ఆరోగ్య ప్రదాత. అది సైన్స్ ద్వారా కూడానిరూపించబడినది. సూర్య కిరణాలలో డి విటమిన్ కలదు. ఎముకలకు  బలముగా వుంటాయి.  కేన్సర్ రాకుండా కాపాడతాయి.  ఒకప్పుడు సూర్యరశ్మి సమృద్ధిగా ఉండే భారతదేశంలో.. ప్రజలకు అసలు 'విటమిన్‌-డి' లోపమనేదే ఉండదని భావించేవారు. కానీ నేడది వట్టి అపోహేనని తాజా అధ్యయనాలన్నీ రుజువుచేస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో 90% మందికి విటమిన్‌-డి లోపం ఉంది.
అన్నట్టు రధసప్తమి రొజు స్త్రీలు ఎన్నో నోములు చెయటానికి ప్రారంబధినముగా చెయుదురు. అక్షింతలు వేసుకొని నోములకు నాంది పలుకుదురు.
శుద్ధ సప్తమికి ’రథసప్తమి’ అని పేరు. ఈరోజు ఒక పరిపూర్ణ పర్వం. దీక్షానిర్వహణకి, వ్రతాచరణకి, సాధనాలకు ఈ సప్తమి ప్రసిద్ధి. ఏడాది పొడుగునా సూర్యారాధన చేసిన ఫలం ఈ దినం లభిస్తుంది.
సూర్యునికి రాగి పాత్ర ద్వారా అర్ఘ్యాన్నివ్వడం, ఎర్రచందనం, ఎర్రపువ్వులతో అర్చన చేయడం వంటివి ఈ రోజు ప్రత్యేకతలు.ఆవుపాల పాయసం నివేదించడం, అది కూడా ఆరుబయట సూర్యకిరణాలు పడే తావున ఆవుపేడ పిడకలను మండించి, దానిపై పాయసాన్ని పొంగించడం ఒక చక్కని ప్రక్రియ. వైద్యవిధానం, దేవతా మహిమ కలబోసిన పద్ధతి ఇది.
’రథ’శబ్దం గమనంలోని మార్పుని సూచిస్తుంది. సూర్యకిరణ ప్రసారం భూమికి లభించే తీరులో ఈ రోజునుండి ఒక మలుపు. ఈ మలుపులోని దేవతా ప్రభావాన్ని పొందేందుకు మన సంస్కృతిలో ఈ ఆనవాయితీని ప్రవేశపెట్టారు.
రామాయణంలో రావణవధి సమయంలో శ్రీరాముడు ’ఆదిత్యహృదయం’తో సూర్యోపాసన చేసి విజయం సాధించాడు. భారతంలో ధర్మరాజు ధౌమ్యుని ద్వారా సూర్యాష్టోత్తర శతనామ మంత్రమాలను ఉపదేశం పొంది , ఆదిత్యానుగ్రహంతో అన్న సమృద్ధిని, అక్షయపాత్రని సంపాదించాడు.
శ్రీకృష్ణుని పుత్రుడు సాంబుడు సూర్యోపాసన ద్వారా కుష్టువ్యాధి నుండి విముక్తుడయ్యాడు. చారిత్రకంగా మయూర కవి సూర్యశతక రచనతో ఆరోగ్యవంతుడయ్యాడు.
ఇలా పౌరాణిక చారిత్రకాధారాలు రవికృపా వైభవాన్ని చాటి చెబుతున్నాయి.  ఆదిత్య హృదయం అనే ఈ స్తోతము సూర్యభగవానుడి ని ఉద్దేశించినది. రామాయణం యుద్ధకాండలో శ్రీ రాముడు అలసట పొందినప్పుడు, అగస్త్య మహర్షి యుద్ధ స్థలానికి వచ్చి ఆదిత్య హృదయం అనే ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు.ఈ ఉపదేశము అయిన తరువాత శ్రీరాముడు రావణాసురుడిని నిహతుడిని చేస్తాడు. వాల్మీకి రామాయణం లోని యుద్ధకాండమునందు 107 సర్గలో ఈ అదిత్య హృదయ శ్లోకాలు వున్నాయి.  
సూర్య రశ్మిలో విటమిన్ D ఉంటుంది అది ఎముకల పటుత్వానికి అవసరం అని చెబుతారు. అంతే కాకుండా విటమిన్ D కణ విభజనలో కూడా తోడ్పడుతోంది. దీన వలన గాయాలు మానడమే కాకుండా కాన్సర్ రాకుండా కూడా ఉపయోగం ఉంటుంది. సూర కాంతికి ఎక్కువగా ఎక్స్‌పోజ్ అయిన వారిలో చాలా రకాల కాన్సర్ తక్కువగా వస్తుంది అని డాక్టర్స్ చెబుతారు. ముఖ్యంగా పెద్ద పేగు, మల ద్వారానికి సంబంధించిన కాన్సర్ మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.  పన్నెండు భంగిమలతో కూడిన సూర్యనమస్కారాలలో ఒక సంక్షిప్తమైన ప్రాణాయామం, ధ్యానం సమ్మిళితమైన వ్యాయామం ఇమిడి ఉన్నాయి. 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)