శనివారం, జనవరి 27, 2018
రామచరిత మానస పారాయణ లోని ఈరోజు నాల్గవ రోజు రెండు శ్లోకాలు తెలుసుకుందాము.
శ్లోకం :
నీల సరోరుహ స్యామ, తరున అరన బారిజ నయన |
కరఉ సో మమ ఉర ధామ, సదా ఛీరసాగర సయన || 3||
నల్లగల్వలవలె నీలమైన శరీర కాంతి కలవాడు, విచ్చిన ఎర్రని మందారమువంటి విశాలనేత్రములు కలవాడు, క్షీరసాగర శయనుడైన శ్రీమన్నారాయణుడు సర్వదా నా హృదయమున నివశించు గాక.
శ్లోకం :
కుంద ఇందు సమ దేహ, ఉమా రమన కరునా అయన |
జాహి దీన పర నేహ, కారఉ కృపా మర్దన మయిన || 4 ||
పార్వతి పతి అయిన పరమేశ్వరుడు మల్లె పువ్వువలె , చంద్రునివలె తెల్లని దేహ కాంతి కలవాడు, కరుణామూర్తి , దీనజనరక్షకుడు , మన్మథమర్దుడు అయిన ఆ పరమేశ్వరుడు నన్ను బ్రోచు గాక.
శుక్రవారం, జనవరి 26, 2018
ప్రార్ధన:
సో-జో సుమిరత సిధి హోఇ, గన నాయక కరిబర బదన |
కరఉ అనుగ్రహ సోఇ , బుద్ది రాసి సుభ గుస సదన || 1 ||
పరమశివునిప్రథమగణములకు అధిపతియగు గజాననుడు తననుస్మరించువారికి కార్యసిద్దిని కలిగించును. అతను విజ్ఞానఖని (భక్తులకు బుద్ది ప్రదాత ), సుగుణాల రాశి , అట్టి శ్రీ వినాయకుడు నన్ను అనుగ్రహించు గాక . (సోరఠ|| 1)
మూక హోఇ బాచాల, పంగు చఢఇ గిరిబర గహన |
జాసు కృపఁ సొ దయాల, ద్రవఉ సకల కలిమల దహన || 2||
దయాళువైన భగవంతుని అనుగ్రహముచే మూగవాడు వక్త అగును. కుంటివాడు దుర్గమములైన పర్వతములైనను ఎక్కగలడు, కలి కల్మషములను రూపుమాపు ఆ భగవంతుడు నాపై కృపచూపు గాక. || 2 ||
స్వస్తి
గురువారం, జనవరి 25, 2018
ఈరోజు తులసీదాసు రచించిన రామచరిత మానస నుండి శ్లోకాలు
శ్లోకం :
యన్మాయావశవర్తి విశ్వమఖిలం బ్రహ్మాదిదేవాసురా
యత్సత్త్వాదమృషైవ భాతి సకలం రజ్జౌ యథాహేర్భ్రమః |
యత్పాదప్లవమేకమేవ హి భవాంభోధేస్తితీర్షావతాం
వందే2హం తమశేషకారణపరం రామాఖ్యమీశం హరిమ్ ||
శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారము . ఆయన మాయకు ఈ సమస్త విశ్వము, బ్రహ్మాది దేవతలు, అసురగణాములు వసవర్తులు. ఆయిన అస్తిత్వ ప్రభావముచే మిథ్యా జగత్తు అంతయును రజ్జు సర్పబ్రాంతిచే సత్యముగా తోచును . ఆయన పాదములే భవసాగరమును దాటగోరువారికి నౌకలు . అతడు అశేషకారకములకు అతీతుడు. శ్రేష్టుడు . అనగా మూలకారణమైనవాడు. అట్టి శ్రీరామచంద్ర ప్రభువునకు ప్రణామములు.
శ్లోకం :
నానాపురాణనిగమాగమసమ్మతం యద్
రామాయణే నిగదితం క్వచిదన్యతో2పి |
స్వాంతఃసుఖాయ తులసీ రఘునాథగాథా
భాషానిభంధమతిమంజులమాతనోతి ||
రఘుకులతిలకుడైన శ్రీరామచంద్రునిగాథ వేదపురాణశాస్త్రసమ్మతము. ఆకథనే శ్రీమద్రామాయణము మహాకావ్యముగా వాల్మీకిమహర్షి మనోజ్ఞముగా వర్ణించెను. ఇతరకవులు ఆ కథను వివిద రీతుల రచించిరి. అట్లే ఈ తులసీదాసు తన ఆత్మానందము కొరకు ఈ రామాయణ గాథనే సరళమైన మధురమైన భాషలో వ్రాయుచున్నాడు.
|| స్వస్తి || _/\_
బుధవారం, జనవరి 24, 2018
ఈరోజు రధసప్తమి చాలా మంచి రోజు కదా ! అందుకే ఈరోజు నుండి కొంచెం కొంచెంగా రామచరిత మానస చదువుకుందాం అనిపించింది , నాతో పాటుగా మీకు కూడా అందిస్తున్నాను. ముందుగా మనం రామచరితమానస చదివేముందు. మనకు రామచరిత మానస ను మనకు అందించిన కవివరేణ్యులు గురించి తెలుసుకుందాం వారికి ముందుగా నమస్కారములు తెలుపుకుందాం.
గోస్వామి తులసీదాసు ఉత్తరప్రదేశ్ బాండా జిల్లా రాజ్ పూర్‌లో ఆత్మారాం దుబే మరియు హుల్సీ దేవి దంపతులకు జన్మించాడు. రామాయణాన్ని సంస్కృతంలో విరచించిన వాల్మీకి యొక్క అవతారమే తులసీదాసు అని అంటారు. భక్తి, కావ్య రచన, తాదాత్మ్యత, భాష వీటిని చూస్తే ఆయన అపర వాల్మీకి అనటానికి ఏ సందేహమూ లేదు తులసీదాసు తన జీవితాన్ని రామభక్తికి అంకితం చేశాడు. గోస్వామి తులసీదాసు అవధ ప్రాంత కవి, తత్వవేత్త. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో సమీప ప్రాంతాలను అప్పట్లో అవధ దేశంగా పిలిచేవారు. తులసీదాసు జీవిత కాలంలో సంస్కృతంతో పాటుగా హిందీలో 22 రచనలు చేశాడు.
వాల్మీకి రచించిన రామాయణాన్ని సామాన్య ప్రజలు కూడా చదవడానికి వీలుగా హిందీలో అనువదించాడు తులసీదాసు. దీనికి శ్రీరామచరితమానస్‌గా తులసీదాసు నామకరణం చేశాడు. ఈ మహాగ్రంథం రచనా కార్యక్రమాన్ని దశరథనందనుడైన శ్రీరాముని రాజ్య రాజధాని అయోధ్యలో చేపట్టాడు. గ్రంథం పూర్తికావటానికి రెండు సంవత్సరాల ఏడు నెలల సమయం పట్టింది. అయితే ఈ గ్రంథంలోని ఎక్కువ భాగం రచనను తులసీదాసు వారణాసిలో చేశాడు.ఆయన తదనంతరం వారణాసిలో "తులసీ ఘాట్" ఏర్పడింది. తులసీదాసు ఇతర రచనల్లో దోహావళి, కవితావళి, గీతావళి, వినయ పీఠిక, జానకీ మంగళ్, రామలాల నహచాచు. రామాంజ ప్రసన్న, పార్వతి మంగళ్, కృష్ణ గీతావళి, హుమాన్ బాహుక, సంకట మోచనస వైరాగ్య సందీపిని, హనుమాన్ చాలీసా వంటివి ఉన్నాయి.
అవసాన సమయంలో ఆఖరికి వారణాశిలో స్థిరపడ్డాడు. అక్కడే క్రీ.శ.1623లో తన తనువు చాలించాడు. అభినవ వాల్మీకి, భక్తశిరోమణి అయిన తులసీదాస కవులకు నమస్కారములు.
ఈరోజు నుండి రామచరితమానస .................._/\_
సత్యం శివమ్ సుందరం శ్రీ గణేశాయనమః శ్రీ జానకీవల్లబో విజయతే శ్రీరామచరిత మానసము
శ్లోకం: వర్ణానామర్ధసంఘానాం రసానాం ఛాందసామపి
మంగళానాం చ కర్తారౌ వందే వాణీవినాయకౌ||
భవానీశంకరౌ వందే శ్రద్దావిశ్వాసరూపిణౌ
యాభ్యామ్ వినా న పశ్యంతి సిద్ధాః స్వాంతఃస్థమీశ్వరమ్||
వందే బోధమయం నిత్యం గురుం శంకరరూపిణమ్
యమాశ్రితో హి వక్రో2పి చంద్రాః సర్వత్ర వంద్యతే||
సీతారామగుణగ్రామపుణ్యారణ్య విహారిణౌ
వందే విసుద్ధవిజ్ఞానౌ కవీశ్వరాకపీశ్వరౌ ||
ఉద్భవస్థితిసంహారకారిణీం క్లేశహారిణీం
సర్వశ్రేయస్కరీం సీతాం నతో౭హం రామవల్లబామ్ ||
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ