సోమవారం, ఫిబ్రవరి 05, 2018
దో - గ్రహ భేషజ జల పవన పట , పాఇ కుజోగ సుజోగ |
హోహిC కుబస్తు సుబస్తు జగ , లఖహిC సులచ్ఛన లోగ || 7 క ||
సమ ప్రకాస తమ పాఖ దుహుC , నామ భేద బిధి కీన్హ |
ససి సోషక పోషక సముఝీ, జగ జస అపజస దీన్హ || 7 ఖ ||
జడ చేతన జగ జీవ జత , సకల రామమయ జాని |
బందఉC సబకే పద కమల , సదా జోరి జుగ పాని || 7 గ ||
దేవ దనుజ నర నాగ ఖగ , ప్రేత పితర గంధర్బ |
బందఉC కిన్నెర రజనిచర, కృపా కరహు అబ సర్బ || 7 ఘ ||
గ్రహములు, ఔషధులు, జలములు , వాయువు, వస్త్రములు ఇవి అన్నియును వాటి వాటి సహచర్యములను బట్టి మంచి , లేక చెడుగా భావింపబడుచుండును. విజ్ఞులైన వారు ఈ లోకసత్యములను ఎఱుంగ గలరు. శుక్ల , కృష్ణపక్షములయందు వెన్నెల , చీకటి సమంగానే వుండును. కానీ విధాత వాటికి వేరువేరు పేర్లును పెట్టెను . లోకము చంద్రునికళలవృద్ధికి తోట్పడు శుక్లపక్షమును ప్రకాశించును . క్షీణదశకు ఆకరమగు కృష్ణపక్షమును ఏవగించుకొనును . విశ్వమునందలి చేతనాచేతన పదార్ధములన్నియును శ్రీరామమయములు . కావున నేను వాటిచరణకమలములకు చేతులుజోడించి మ్రొక్కెదను . దేవతలు, దైత్యులు, మానవులు, నాగులు, పక్షులు, ప్రేతలు, పితరులు, గంధర్వ, కిన్నెర, రాక్షసులు మొదలుగు సమస్త ప్రాణకోటికి ప్రణమిల్లుదును . తదనుగ్రహము నాకు లభించుగాక.
ఆదివారం, ఫిబ్రవరి 04, 2018
దో - జడ చేతన గున దోషమయ , బిస్వ కీన్హ కరతార |
సంత హంస గున గుహహిC పయ , పరిహరి బారి బికార || 6 ||
భగవంతుడు చేతనాచేతనరూపమైన విశ్వాసమునందు మంచిచెడులను సృష్టించెను. హంస పాలను గ్రహించి నీటిని వదలినట్లే సాధువులు గుణములను గ్రహించి , దోషములను దూరముగా పరిహరించెదరు.
చౌ - అస బిబేక జబ దేఇ బిదాతా | తబ తజి దోష గునహిC మను రాతా ||
కాల సుబాఉ కరమ బరిఆఈC | భలెఉ ప్రకృతి బస చుకఇ భలాఈC || 1 ||
సో సుధారి హరిజన జిమి లేహిC | దలి దుఖ దోష బిమల జసు దేహీC||
ఖలఉ కరహిC భల పాఇ సుసంగూ | మిటఇ న మలిన సుభాఉ అభంగూ || 2 ||
లఖి సుభేష జగ బంచక జేఊ | బేష ప్రతాప పూజిఅహిC తేఊ ||
ఉఘరహిC అంత న హోఇ నిబాహూ | కాలనేమి జిమి రావన రాహూ || 3 ||
కిఎహుC కుబేషు సాధు సనమానూ | జిమి జగ జామవంత హనుమానూ ||
హాని కుసంగ సుసంగతి లాహూ | లోకహుC బేద బిదిత సబ కాహూ || 4 ||
గగన చఢఇ రజ పవన ప్రసంగా | కీచహిC మిలఇ నీచ జల సంగా ||
సాధు అసాధు సదన సుక సారీC| సుమిరహిC రామ దేహిC గని గారీC|| 5 ||
ధుమ కుసంగతి కారిఖ హోఈ | లిఖిఅ పురాన మంజు మసి సోఈ ||
సోఇ జల అనల అనిల సంఘాతా | హోఇ జలద జగ జీవన దాతా || 6 ||
భగవదనుగ్రహమున విచక్షణాశక్తిని కల్గివున్నవారు చెడును విసర్జించి, మంచిని మాత్రమే గ్రహించుదురు. ఒక్కొక్కప్పుడు మంచివారుసైతము మాయామోహితులై కాలము , స్వభావము , కర్మల ప్రభావముచే సన్మార్గము నుండి వైదొలుగుదురు. భగవద్బాక్తులు ఈ పొరపాటును తెలుసుకుని , వాటిని సవరించుకొందురు. దుఃఖదోషములును అధిగమించి నిర్మలమైనయాశమును పొందుదురు . అలాగే దుష్టులుగూడ ఒక్కొక్కసారి సత్సాంగత్యప్రభావమున సత్కర్మలను ఆచరింతురు . కానీ వారి దుష్టస్వభావములు మాత్రము మారవు . కపట వేషధారులైన ధూర్తులు మొదట గౌరవింపబడినను కాలక్రమమున వారివారి నిజస్వరూపము బట్టబయలగును . కాలనేమి , రావణుడు , రాహువు మొదలుగు వారివృత్తాంతములు ఇందుకు ప్రబల నిదర్శనము . సజ్జనుల , రూపములు, వేషములు ఎట్లనన్న వారు హనుమద్జాంబవతాదులువాలె అందరిచే గౌరవింపబడుదురు . దుష్టసహవాసము ప్రమాదకరం . సజ్జనమైత్రి వరప్రసాదం . ఇది లోకవిదితము , వేదప్రామాణికము . వాయు సాంగత్యమున పైకెగురు ధూళి ఉన్నతస్థితికి చేరును. అదియే పతనోన్ముఖంగా సాగిపోవు నీటితో కూడినప్పుడు బురదై అధోగతిపాలగును . సజ్జనులఇండ్లలో పెరిగిన చిలుకలు , గోర్వంకలు , రామనామము జపించును . దుర్జనుల ఇండ్లలోని చిలుకలు దుర్భాషలాడును . పొగ మాలినములతో కల్సినచొ నల్లబారును . కానీ సిరాగా మారినచో పవిత్ర పురాణములును వ్రాయవచ్చును . ఆ పోగయే- నీరు , అగ్ని , గాలితో కలిసి , మేఘముగా , మారినపుడు , వర్షజలముల ద్వార జీవులకు ప్రాణదాత యగును.
శనివారం, ఫిబ్రవరి 03, 2018
దో - భలో భలాఇహి పై లహఇ , లహఇ నిచాఇహి నీచు ||
సుధా సరాహిఅ అమరతాC , గరల సరాహిఅ మీచు || 5 ||
సజ్జనులు మంచినే పట్టుకుందురు. దుర్జనులు చెడును విడిచిపెట్టారు. అమృతము అమరత్వమును ప్రసాదించును, విషము మరణమునే ప్రసాదించును ఈరెండును తమతమ గుణములకు ప్రసిద్ధము, దోహదకారులు.
చౌ - ఖల అఘ అగున సాధు గున గాహా | ఉభయ అపార ఉదధి అవగాహా ||
తెహి తేC కఛు గున దోష బఖానే | సంగ్రహ త్యాగ న బిను పహిచానే || 1 ||
భలెఉ పోచ సబ బిధి ఉపజాఏ | గని గున దోష బేద బిలగాఏ ||
కహహిC బేద ఇతిహాస పురానా | బీధి ప్రపంచు గున అవగున సానా || 2||
దుఖ సుఖ పాప పున్య దిన రాతీ | సాధు అసాధు సుజాతి కుజాతీ ||
దానవ దేవ ఊCచ ఆరు నీచు | అమిఅ సుజీవను మాహురు మీచూ || 3||
మాయా బ్రహ్మ జీవ జగదీసా | లఛ్చి అలఛ్చి రంక అవనీసా ||
కాసీ మగ సురసిరి క్రమనాసా | మరు మారవ మహిదేవ గవాసా || 4||
సరగ నరక అనురాగ బిరాగా | నిగమాగమ గున దోష బిభాగా ||
దుర్జనుల పాపకృత్యాలను దోషములను , సజ్జనుల సద్గుణాలను చెప్పే కథలు సముద్రములవలే అపారములు , అగాధములు . ఇందులో సజ్జనుల గుణములను , దుర్జనులు దోషములను వర్ణించబడినవి . ఎలా అంటే వారి తారతమ్యమును గుర్తించనిదే సుగుణాలను గ్రహించుటకును , దుర్గుణములను నిరాకరించుటకు సాధ్యము కాదు. గుణదోషములు రెండును బ్రహ్మ సృష్టిలోని భాగమే . వాటి తారతమ్యములను వేర్వేరుగా స్పష్టముగా విశదీకరించును . వేదములతో పాటు ఇతిహాసపురాణాదులు గూడా బ్రహ్మ సృష్టి గుణదోషముల సమ్మేళనమని నొక్కివక్కాణించెను . ఇట్టి వైరుద్యములు ఈ సృష్టిలో అనంతము . సుఖదుఃఖాలు, పాపపుణ్యాలు , దివారాత్రములు , మంచిచెడులు, సుజాతికుజాతులు , దేవదానవులు , ఉచ్చనీచములు , అమృతవిషములు , జననమరణములు , బ్రహ్మ - మాయలు , ఈశ్వర - జీవులు , సంపద - దారిద్రములు , రాజు - పేదలు , కాశీ - మగధలు , గంగా - కర్మనాశనాదులు , మార్వార - మాళవ దేశములు , బ్రాహ్మణుడు - కసాయివాడు , స్వర్గ - నరకాదులు , వైరాగ్యము - అనురాగములు మొదలగున్నవి. ఈ వైవిధ్యములు ప్రజలనిదర్శనము, వేదశాస్త్రములు వీటి మంచిచెడులను వివరించినవి .
శుక్రవారం, ఫిబ్రవరి 02, 2018
దో - ఉదాసీన అరి మీత హిత , సునత జరాహిC ఖల రీతి |
జానీ పాని జుగ జోరి జన , బినతీ కరఇ సప్రీతి ||
దుష్టులు తమ మిత్రులయొక్క, శత్రువుల యొక్క, తటస్థులయొక్క ఉన్నతిని జూచి, ఈర్ష్యతో మాడిపోవుదురు. వీరి యీరీతిని గమనించి, వినయముతో ప్రేమతో చేతులు జోడించి వీరికి నమస్కరింతును . (దో || 4 )
చౌ - మైC అపనీ దిసి కీన్హ నిహోరా | తిన్హ నిజ ఓర న లఉబ భోరా ||
బాయస పలిఅహిC అతి అనురాగా | హోహిC నిరామిష కబహుC కి కాగా || 1 ||
బందఉC సంత అసజ్జన చరనా | దుఖప్రద ఉభయ బీచ కఛు బఠనా||
బిఛురత ఏక ప్రాన హరి లేహిC | మిలత ఏక దుఖ దారున దేహీC || 2 ||
ఉపజహిC ఏక సంగ జగ మాహిC | జలజ జోCక జిమి గున బిలగాహీC ||
సుధా సుర సమ సాధు అసాధూ | జనక ఏక జగ జలధి అగాధూ ||
భల అనభల నిజ నిజ కరతూతీ | లహత సుజస అపలోక బిభూతీ ||
సుధా సుధాకర సురసరి సాధూ | గరల అనల కలిమల సరి బ్యాధూ|| 4 ||
గున అవగున జానత సబ కో ఈ | జో జెహి భావ నీకా తెహి సో ఈ || 5 ||
నాధర్మముగా వారిని నేను ప్రార్ధించితిని . కానీ వారిస్వభావమును మానుకొందురా ? కాకులను ఎంతటి తియ్యటి పాయసముతో పోషించినను అవి మాంసమును తినుట మానుకొనునా ? నేను సాధువులకును, దుష్టులకును నమస్కరించుదును. ఉభయులును కష్టపెట్టేవారే. కానీ వారిమధ్య మిక్కిలి అంతరం కలదు. సాధువులు మనకు దూరమైనను మనకు ప్రాణములే పోయినట్లే అగును . దుష్టులు మనకు చేరువైనను మనకు ఎనలేని భాధకలుగును. ఏ కాలమునందైనను సజ్జనులను దుష్టులను ఈ లోకమున ప్రక్క ప్రక్కనే జనించుదురు . కానీ వారి వారి స్వభావములు వేరు . కమలములు జలగలు నీటిలోనే పుట్టు చుండును . అమృతము మధిర రెండును సముద్రము నుండియే ఉద్భవించినవి . సజ్జనులను దుష్టులును వారి వారి కర్మలను అనుసరించి కీర్తి - అపకీర్తి లను పొందును. సాధువులు స్వభావములు అమృతము, చంద్రుడు పవిత్ర గంగానది వంటివి . దుష్టుల స్వభావములు ,విషము , అగ్ని , కలి పాపములతో గూడిన కర్మనాశనదివంటిది . వీరి గుణావగుణములును ఎల్లరును ఎరుగుదురు . ఎవరినచ్చినవి వారు గ్రహించుదురు .
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ