Blogger Widgets

శనివారం, ఫిబ్రవరి 10, 2018

రామచరిత మానస, 18, సరస్వతీదేవి రాక.

శనివారం, ఫిబ్రవరి 10, 2018

చౌ - మని మానిక ముకుతా ఛబి జైసీ | అహి గిరి గజ సిర సోహ న తైసీ ||
         నృప కిరీట తరునీ తను పాఈ  | లహహిC సకల సోభా అధికాఈ || 1 ||
         తైసెహిC సుకబి కబిత బుధ కహహీC | ఉపజహిC అనత అనత ఛబి లహహీC ||
         భగతి హేతు బిధి భవన బిహాఈ | సుమిరత సారత ఆవతి ధాఈ || 2 || 
         రామ చరిత సర బిను అన్హవాఏC | సో శ్రమ జాఇ  న కోటి ఉపాఏC || 
         కబి కోబిత  అస హృదయC బిచారీ | గావహిC హరి జస కలిమల హారీ || 3 ||
         కీన్హేC ప్రాకృత జన గున గానా | సిర ధుని గిరా లగత పఛితానా ||
         హృదయ సింధు మతి సీప సమానా | స్వాతి సారద కహహిC సుజానా || 4 ||
         జౌC బరసఇ బర బారి బిచారూ | హోహిC కబిత ముకుతామని చారూ || 5 ||
పాములపడగలపైగలమణులును పర్వతములపైగల మాణిక్యములును , గజములమస్తకముల యందుండు ముత్యములను అంతగాశోభింపవు .  అవియే రాజులకిరీటములయందును, తరుణీమణులతనువులపైనను చేరి , వింతకాంతులను వెదజల్లును .  " కవిః కరోతి కావ్యాని , రసం జానాతి పండితః " అని ప్రాజ్ఞులు పల్కుచుందురు .  కావ్య నిర్మాణమునకు పూనుకొనిన కవి స్మరించినంతమాత్రముననే శ్రీరామభక్తి పారవశ్యమున సరస్వతీదేవి బ్రహ్మలోకమునుండి భూమికి పరుగులుదీయుచు వచ్చును.  ఆమెచే కవి శ్రీరామచరితమనెడి సరోవరమునందు స్నానము చేయించినప్పుడే ఆమె యొక్క దూరప్రయాణపుబడలిక తొలగిపోవును.  ఇది తప్ప వేఱుగా కోటి ఉపాయములు చేసినను ఆ బడలిక తీరదు .  ఈ విషయమును గ్రహించియే కవులును, పండితులను, కలిపాపములనురూపుమాపు రామచరిత యశోగానమును చేయుదురు.  కవులు సామాన్యమానవుల చరిత్రమును పొగడినచో సరస్వతీదేవి తనరాకకు పశ్చాత్తాపబడును .  పండితులు కవిహృదయమును సముద్రముతోడను అతని బుద్దిని ముత్యపు తోడను సరస్వతీదేవిని స్వాతివానతోడను పోల్చెదరు. ఇందులో సుందరభావములనెడి వర్షపుచినుకులు పడినచో అందమైన కవితాముక్తాముణులరూపములలో అది భాసించును .        

శుక్రవారం, ఫిబ్రవరి 09, 2018

రామచరిత మానస, 17, సజ్జనులు గానము చేయుదురు

శుక్రవారం, ఫిబ్రవరి 09, 2018

ఛం - మంగల కరని కలిమల హరని తులసీ కథా రఘునాధ కీ |
          గతి కూర కబితా సరిత కీ జ్యోC సరిత పావన పాథ కీ ||
          ప్రభు సుజన సంగతి భనితి భలి హోఇహి సుజన మన భావనీ |
          భవ అంగ భూతి మసాన కీ సుమిరత సుహావని పావనీ ||
తులసీదాసు పలుకుచున్నాడు .  శ్రీరఘునాధునిచరితము కలియుగపాపములను కడిగి వేయును ,  కళ్యాణపరంపరను గూర్చును.  శోభరహితమైన నా కవితాస్రవంతి పావనగంగానదివలె ఎన్నిమలుపు తిరిగినను .  శ్రీహరి వైభవ సాంగత్యముచే సుజనులుకు మనోహరముగా ఉండును .  స్మశానములోని అపవిత్రమైన భస్మముకూడా శంభుని శరీరస్పర్శ చేత సుశోభితమై , స్మరణమాత్రముననే పవిత్రమొనర్చును .  (చంద్)
దో - ప్రియ లాగిహి అతి సబహి మమ , భనితి రామ జస సంగ |
         దారు బిచారు కి కరఇ కొఉ , బందిఅ మలయ ప్రసంగ || 10 క ||
         స్యామ సురభి పయ బిసద అతి , గునద కారేహిC సబ పాన |
         గిరా గ్రామ్య సియ రామ జస , గావహిC సునహిC  సుజాన || 10 ఖ ||
మలయాపర్వతమునందలి చందనవృక్షసమీపమునకుగల ఏ వృక్షమైనను అది చందన వృక్షముగానే మాఱును . అందరూ దానిని ఆదరించుదురు .  అట్లే శ్రీరామ వైభవ సాహచర్య ప్రభావమున నా కవిత ఎల్లరురకు అత్యంత ప్రీతికరమేయగును .  నల్లని ఆవుపాలు కూడా తెల్లగాను , పుష్టికరముగాను ఉండును .  అందరును దానిని సేవింతురు.  అట్లే నా భాష గ్రామ్యమేయైనను సీతారాములకథను వర్ణించుటవలన సజ్జనులు దానిని గానము చేయుదురు, చెవులప్పగించి విందురు .   
     

గురువారం, ఫిబ్రవరి 08, 2018

రామచరితమానస , 16 , రామాయణ మహత్త్వం

గురువారం, ఫిబ్రవరి 08, 2018

రామచరితమానస , 16 , రామాయణ మహత్త్వం
దో - భనితి  మోరి సబ గున రహిత ,  బిస్వ బిదిత గున ఏక |
         సో బిచారి సునిహహిC సుమతి , జిన్హ కేC బిమల బిబేక || 9  ||
నాకవితలో ఎట్టి సుగుణములు లేవు . కానీ జగత్ప్రసిద్ధమైన శ్రీరామకథయను ఒకే ఒక సుగుణము కలదు , జ్ఞానులును , వివేక వంతులును దానిని ఎరిగి సాదరముగా ఆలకింతురు . 

రామాయణ మహత్త్వం
      చౌ - ఎహి మహC రఘుపతి నామ ఉదారా | అతి పావన పురానా శృతి సారా || 
              మంగల భావన అమంగల హారి | ఉమా సహిత జెహి జపత పురారీ || 1 || 
              భనితి బిచిత్ర సుకబి కృత జోఊ| రామ నామ బిను సోహ న సోఊ || 
              బిధుబదనీ సబ భాCతి సCవారీ | సోహ న బసన బినా బర నారీ || 2 || 
              సబ గున రహిత కుకబి కృత బానీ | రామ నామ జస అంకిత జానీ || 
              సాదర కహహిC సునాహిC బుధ తాహీ |  మధుకర సరిస సంత గునగ్రాహీ || 3 ||  
              జదపి కబిత రస ఏకఉ  నాహీC | రామ ప్రతాప ప్రగట ఎహి మాహీC|| 
              సోఇ భరోస మోరేC మన ఆవ | కెహిC న సుసంగ బడప్పను పావా || 4 || 
              ధూమఉ తజఇ సహజ కరుఆఈ | అగరు ప్రసంగ సుగంధ బసాఈ || 
              భనితి భదేస బస్తు భలి బరనీ | రామ కథా జగ మంగల కరనీ || 5 || 

ఇందు సాంబశివుడు సర్వదా జపించు శ్రీరామచంద్రునిపావననామము గలదు .  ఇది మిక్కిలి పవిత్రమైనది .  వేద , పురాణములసారము , కళ్యాణములకు పెన్నిధి , అశుభములు రూపుమాపునది , అనేకకాలంకారభూషితైనను , ఎంత సౌందర్యవతి అయినను వస్త్రములుధరింపని స్త్రీ శోభింపదు .  అట్లే మహాకవిచే వ్రాయింపబడినది అయినను మిక్కిలి ప్రశంసింపమైనదైనను రామనామము లేని కావ్యము శోభింపదు .  కానీ అల్పజ్ఞుడైన కుకవిచే వ్రాయబడినను , అది గుణరహితమైనదైనను రామనామవైభవముచే అలంకృతమైన కావ్యమును సజ్జనులు సాదరంగా చదివి , విని ఆనందింతురు.  తుమ్మెదలు పుష్పములోని మధువును గ్రోలినట్లు సత్పురుషులు గుణములనే గ్రహించుదురు .   ఇందు కవితారసపోషణలేకున్నను శ్రీరామచంద్రునిప్రతాపము బహుదా కీర్తింపబడినది.  ఇదియే నా సంపూర్ణ విశ్వాసమునకు మూలము .  సత్సాంగత్యమువలన గౌరవముదక్కని వారెవరు ? పొగ అగరు సాంగత్యమున తన సహజమైన ఘాటును , కఱుకుధనమును వదలి సుగంధమునే వ్యాపింపచేయును .  అట్లే నా కవిత సౌందర్య శోభితముకాకున్నాను రామకథావర్ణమహిమగుటవలన  శుభప్రదమైనది .  

బుధవారం, ఫిబ్రవరి 07, 2018

రామచరిత మానస, 15, దుర్జనుల పరిహాసముగూడ నాకు హితమే

బుధవారం, ఫిబ్రవరి 07, 2018

దో - భాగ చోట అభిలాషు బడ , కరఉC ఏక బిస్వాస |
        పై హహిC సుఖ సుని సుజల సబ , ఖల కరిహహిC ఉపహాస ||
నాశక్తి అల్పము , కానీ లక్ష్యము అనల్పం దుర్జనులు పరిహాసించును , సుజనులు నా రచనకు ఆనందింతురని నా పరమ విశ్వాసము . 

చౌ - ఖల పరిహాస హోఇ హిత మోరా | కాక కహహిC కలకంఠ కఠోరా ||
        హంసహి బక దాదుర చాతకహీ | హCసహిC మలిన ఖల బిమల బతకహీ  || 1  ||
        కబిత రసిక న రామ పద నేహూ| తిన్హ కహC సుఖద హాస రస ఏహూ ||
        భాషా భనితి బోరి మతి మోరీ | హCసిబే జోగ హCసేC నహిC ఖోరీ || 2 ||
        ప్రభు పద ప్రీతి న సాముఝి నీకీ | తిన్హహి కథా సుని లాగిహి ఫీకీ  ||
        హరి హర పద రతి మతి న కుతరకీ | తిన్హ కహుC మధుర కథా రఘుబర కీ || 3 ||
        రామ భగతి భూషిత జియCజానీ | సునిహహిC సుజన సరాహి సుభానీ ||
        కబి న హోఉC నహిC బచన ప్రబీనూ | సకల కలా సబ బిద్యా హీనూ || 4 ||
        ఆఖర ఆరథ ఆలంకృతి నానా | ఛంద ప్రబంధ అనేక బిధానా ||
        భావ భేద రస భేద అపారా | కబిత దోష గున బిబిధ ప్రకారా || 5 ||
        కబిత బిబేక ఏక నహిC మోరేC | సత్య కహఉC లిఖి కాగద  కోరేC || 6 ||
దుర్జనుల పరిహాసముగూడ నాకు హితమే .   కోకిలపాట కాకులకు కఠోరముగానే ఉండును.  కొంగలు హంసలను .  కప్పలు చాతకపక్షులను పరిహసించుచుండును.  నీచులు సచ్చరితలు విని నవ్వుదురు .  కవిత్వమునందును  శ్రీరామచంద్రుని పాదపద్మములయందును భక్తిలేని కవితారసికులకు ఈ కవిత హాస్యరస ప్రధానమై సుఖమునిచ్చును.  నా రచన లౌకికభాషలో సాగినది .  పైగా నాబుద్ధి అల్పమైనది .  కావున నవ్వదగినది.  అందువల్లవారు నవ్వుటలో వారిదోషము ఏమిలేదు.  శ్రీహరి చరణకమలములయందు భక్తిలేనివారికిని , అవగాహనరహితులకును ఈ కథ పేలవంగా కనిపించవచ్చు.  హరిహర భక్తులకును , కుతర్కబుద్దులుకానివారికిని శ్రీ రఘునాధునిచరితము మధురముగా ఉండును , హాయిని గొల్పును , సజ్జనులు ఈ గాధను శ్రీరామభక్తివైభవభూషితమైనదిగా గ్రహించి, మనోహరముగా ప్రశంసించుదురు.  నేను కవిని కాను .  వాక్చతురుడునూ కాను , వాక్యరచనాకళయందును , నాకు ప్రావీణ్యములేదు .  శబ్దార్ధ ప్రయోగములు వివిధములు . అలంకారములు , ఛందస్సులు అనేకము .  భావరుసభేదములు అపరిమితములు .   కవితాగుణములు , దోషములు వివిధములు ఈ కవితావిశేషములలో ఏ ఒక్కదానిని గూర్చియు నేనెరుగనేఎరుగను .  ఈ సత్యమును   ప్రమాణపూర్వకముగా తెల్పుచున్నాను .   

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)