మంగళవారం, ఫిబ్రవరి 13, 2018
దో - అతి అపార జే సరిత బర , జౌC నృప సేతు కరాహిC |
చఢి పిపీలికఉC పరమ లఘు , బిను శ్రమ పారహి జాహిC ||
ఒక మహానదిపైన ఏరాజైనను వంతెన కట్టించినపిమ్మట చిన్న చిన్న చీమలుగూడ ఆనదిని అవలీలగా దాటకలదు.
చౌ - ఎహి ప్రకార బల మనహి దెఖాఈ | కరహిఉC రఘుపతి కథా సుహాఈ ||
బ్యాస ఆది కబి పుంగవ నానా | జిన్హ సాదర హరి సుజస బఖానా || 1 ||
చరన కమల బందఉC తిన్హ కేరే | పురవహుC సకల మనోరథ మేరే ||
కలి కే కబిన్హ కరఉC పరనామా | జిన్హ బరనే రఘుపతి గున గ్రామా || 2 ||
జే ప్రాకృత కబి పరమ సయానే | భాషాC జిన్హ హరి చరిత బఖానే ||
భఏ జె అహహిC జె హొఇహహిC ఆగేC | ప్రనవఉC సబహి కపట సబ త్యాగేC || 3 ||
హోహు ప్రసన్న దేహు బరదానూ | సాధు సమాజ భనితి సనమానూ ||
జో ప్రబంధ బుధ నహిC ఆదరహీC | సో శ్రమ బాది బాల కబి కరహీC || 4 ||
కీరతి భనితి భూతి భలి సోఈ | సురసరి సమ సబ కహC హిత హోఈ ||
రామ సుకీరతి భనితి భదేసా | అసమంజస అస మోహి అCదేసా || 5 ||
తుమ్హారీ కృపాC సులభ సొఉ మోరే | సిఅని సుహావని టాట పటోరే ||
ఈవిధముగా నామనస్సును దృఢపరచుకొని , మనోహరమైన శ్రీరామ వృత్తాంతమును రచించెదను. శ్రీరామకథావైభవమును వర్ణించిన వ్యాసాదిమహర్షులకు నా నమోవాకములు . నా మోనోరధమును వారు సఫలము చేయుదురు గాక , శ్రీరఘుపతిగుణములను వర్ణించిన ఈకలియుగకవులకును నేను ప్రణమిల్లుదును . శ్రీహరిగాథలను వర్ణించినప్రాకృత కవులకును , భూతభవిష్యద్వర్తమాన కవులందరికిని నిస్సంకోచముగా నమస్కరించుదును . నాకవితాను సాధుసమాజము గౌరవించును గాక , సహృదయులైన బుద్ధిమంతులుమెచ్చని వ్యర్ధకవిత్వములను వ్రాసినవాడు మూర్ఖుడే , కీర్తి , కవిత , సంపద అనునవి గంగా జలములవలె - అందరికిని హితమును చేకుర్చునవిగా ఉండవలెను . శ్రీరామునికీర్తి అతిమనోహరమైనది అతి సాధారణమైన నాకవితద్వారా దానిని వర్ణించుట అసంజసమగునేమో అని నా భయము. ఓ మహాకవులారా ! మీ కృప వలన ఈభయము కూడా దూరముకాగలదు. ఏలనన పట్టుదారముతో చేసిన నగిషీలు గోనెపట్టపై కూడా అందంగానే ఉండును .
సోమవారం, ఫిబ్రవరి 12, 2018
దో - సారద సేస మహేస బిధి , ఆగమ నిగమ పురాన |
నేతి నేతి కహి జాసు గున , కరహిC నిరంతర గాన || 12 ||
వాగ్దేవియు , శేషుడు , పరమశివుడు పరమేష్ఠియు , వేదశాస్త్రపురాణములు శ్రీరామచంద్రుని గుణములను నిరంతరము గానముచేయుచు పూర్తిగా వర్ణింపబడును, కానీ అతని అనంతగుణములను వర్ణింపజాలక నేతి నేతి ( న + ఇతి , న + ఇతి ) అనుచు గానము చేయుచుండెను .
చౌ - సబ జానత ప్రభు ప్రభుతా సోఈ | తదపి కహేC బిను రహా న కోఈ ||
తహాC భేద అస కారన రాఖా | భజన ప్రభాఉ భాCతి బహు భాషా || 1 ||
ఏక అనీహ అరూప అనామా | అజ సచ్చితానంద పర ధామా ||
బ్యాపక బిస్వరూప భగవానా | తెహిC ధరి దేహ చరిత కృత నానా || 2 ||
సో కేవల భగతన హిత లాగీ | పరమ కృపాల ప్రనత అనురాగీ ||
జెహి జన పర మమతా అతి ఛోహో | జెహిC కరునా కరి కీన్హీన కోహూ || 3 ||
గఈ బహోర గరీబ నెవాజూ | సరల సబల సాహీబ రాఘురాజు ||
బుధ బరనహిC హరి జస అస జానీ | కరహిC పునీత సుఫల నిజ బానీ || 4 ||
తెహిC బల మైC రఘుపతి గున గాథా | కహిహఉC నాఇ రామ పద మాధా ||
మునిస్హ ప్రథమ హరి కీరతి గాఇ | తెహిC మగ చలత సుగమ మొహి భాఈ || 5 ||
శ్రీరాముని వైభవమును వర్ణింపనలవికానిదని ఎఱింగియు ఎవ్వరును వర్ణించుట మానలేదు ఆయనభజనప్రభావమును వేదములు అనేకవిధములుగా తెల్సినవి . ఏ కొద్దిపాటి గుణగానమైనను మానవులను భవసాగరమునుండి తరింపచేయును . పరమేశ్వరుడొక్కడే . అతడు నిష్కాముడు , నిరాకారుడు , జన్మనామములేనివాడు , సచ్చితానంద స్వరూపుడు , పరంధాముడు , విశ్వవ్యాప్తి , విశ్వరూపుడు . అయినను దివ్యశరీరము ధరించి , పెక్కుఅవతారము ద్వారా తనలీలలను ప్రకటించును . భగవంతుడు పరామకృపాళువు, శరణాగతివత్సలుడు , కావున భక్త సంరక్షణమునకై వారి శ్రేయస్సుముకొరకై తన ఈలీలలును ప్రదర్శించుచుండును . తన కరుణాదృష్టిని అయాచితముగానే భక్తులపై ఆయనకు కల కృపావాత్సల్యము అపారము . ఒక్కోసారి కృపజూపినవారిపై ఎన్నడును ఆయన కోపగింపడు . భక్తులు నష్టపోయినదానిని లభ్యమగునట్లు చేయును . అనగా భక్తులయోగక్షేమములను వహించుచుండువాడతడే . అతడు దీనబందువు , సరళస్వభావుడు , సర్వశక్తిమంతుడు , అందరికిప్రభువు . దీనిని ఎరింగియే బుద్ధిమంతులు శ్రీహరియసమును కీర్తించుచు తమవాక్కులను పునీత మొనర్చుకొనుచు జీవితములను సఫలముచేసికొనుచుందురు . ఈకారణమునే శ్రీరామునిపాదకమలములకు శిరసా ప్రణమిల్లి ,ఆయన గుణగానమొనర్చెదను . పూర్వము వ్యాస వాల్మీకాది మహర్షులు , శ్రీహరివైభవములను వర్ణించిరి . వారిమార్గమును అనుసరించుటయే నాకును సులభము.
ఆదివారం, ఫిబ్రవరి 11, 2018
దో - జుగుతి బేధి పుని పోహిఅహిC , రామచరిత బర తాగ |
పహిరహిC సజ్జన బిమల ఉర , సోభా అతి అనురాగ || 11 ||
ఈ కవితా ముక్తామణులను యుక్తితో భేదించి , రామకధాసూత్రమున గూర్చి , సజ్జనుల తమ నిర్మల హృదయములయందు ధరించినచో అవి మిక్కిలి అనురాగశోభితములగును , భక్తి భరితములగును . ( దో || 11|| )
చౌ - జే జనమే కలికాల కరాలా | కరతబ బాయస బేష మరాలా ||
చలత కుంపథ భేద మగ ఛాCడే | కపట కలేవర కలిమల భాCడే || 1 ||
బంచక భగత కహాఇ రామ కే | కింకర కంచన కోహ కామ కే ||
తిన్హ మహC ప్రథమ రేఖ జగ మోరీ | ధీంగ ధరమధ్వజ ధందక ధోరీ || 2 ||
జౌC అపనే అవగున సబ కహఊC | బాఢఇ కథా సార నహిC లహఊC ||
తాతే మైC అతి అలప బఖానే | ధోరే మహుC జానిహహిC సయానే || 3 ||
సముఝి బిబిథి బిధి బినతీ మోరీ | కొఉ న కథా సుని దేఇహి ఖోరీ ||
ఏతెహు పర కరిహహిC జె అసంకా| మొహి తే అధిక తె జడ మతి రంకా ||4||
కబి న హోఉC నహిC చతుర కహావఉC | మతి అనురూప రామ గున గావఉC ||
కహC రఘుపతి కే చరిత అపారా | కహC మతి మోరి నిరత సంసారా || 5 ||
జేహిC మారుత గిరి మేరు ఉడాహీC | కహాహు తూల కెహి లేఖే మాహీC ||
సముఝత అమిత రామ ప్రభుతాఈ | కరత కథా మన అతి కదరాఈ || 6 ||
పాప పంకిలమైన ఈ కలియుగమున పుట్టి , హంసవేషము ధరించి , కాకులవలె ప్రవర్తించువారును , వైదిక మార్గము విడిచి , దుర్మార్గములో సాగిపోయెడి వారును, పాపాత్ములును , రామభక్తులమని చెప్పుకొనుచు లోకులను మోసగించెడివంచకులును , కామక్రోధలోభములనకు దాసులను , పాషండులును , ధర్మధ్వజులను అయినవారిలో నేను ప్రధముడును , నాదుర్గుణములకు లెక్కలేనేలేదు , వాటిని వివరింప సాగినచో ఆ కథయే విస్తృతమగును . వాటిలో కొన్నిటిని మాత్రమే తెలిపితిని . సహృదయాలు ఈమాత్రము వివరములుతో అంతయు అర్ధంచేసుకుందురు. నా ఈ మానవుని గ్రహించి , నా ఈకథను విన్నవారెవరు నన్ను దోషిగాతలంపరు. అయినప్పటికీ శంకించిన వారు నాకంటే మిక్కిలి మూర్ఖులు , మందబుద్ధులు , నేను కవిని కాను , చతురుడను కాను , శ్రీరాముని కథావైభవమును నా బుద్ధికి తోచినట్లుగా వర్ణించుచున్నాను . శ్రీరాముని అపారమైన చరిత్ర ఎక్కడ ? సంసార వ్యామోహములో కూరుకుపోయిన నా బుద్ది ఎక్కడ ? మేరు పర్వతమును కూడా కదలించు శక్తి కలిగిన వాయువుముందు దూది ఎట్లా నిలువగలదు . శ్రీరాముని అనంతవైభవములను తలచినప్పుడు ఈ కథను చెప్పుటకు నాకు ధైర్యము చాలదు .
శనివారం, ఫిబ్రవరి 10, 2018
చౌ - మని మానిక ముకుతా ఛబి జైసీ | అహి గిరి గజ సిర సోహ న తైసీ ||
నృప కిరీట తరునీ తను పాఈ | లహహిC సకల సోభా అధికాఈ || 1 ||
తైసెహిC సుకబి కబిత బుధ కహహీC | ఉపజహిC అనత అనత ఛబి లహహీC ||
భగతి హేతు బిధి భవన బిహాఈ | సుమిరత సారత ఆవతి ధాఈ || 2 ||
రామ చరిత సర బిను అన్హవాఏC | సో శ్రమ జాఇ న కోటి ఉపాఏC ||
కబి కోబిత అస హృదయC బిచారీ | గావహిC హరి జస కలిమల హారీ || 3 ||
కీన్హేC ప్రాకృత జన గున గానా | సిర ధుని గిరా లగత పఛితానా ||
హృదయ సింధు మతి సీప సమానా | స్వాతి సారద కహహిC సుజానా || 4 ||
జౌC బరసఇ బర బారి బిచారూ | హోహిC కబిత ముకుతామని చారూ || 5 ||
పాములపడగలపైగలమణులును పర్వతములపైగల మాణిక్యములును , గజములమస్తకముల యందుండు ముత్యములను అంతగాశోభింపవు . అవియే రాజులకిరీటములయందును, తరుణీమణులతనువులపైనను చేరి , వింతకాంతులను వెదజల్లును . " కవిః కరోతి కావ్యాని , రసం జానాతి పండితః " అని ప్రాజ్ఞులు పల్కుచుందురు . కావ్య నిర్మాణమునకు పూనుకొనిన కవి స్మరించినంతమాత్రముననే శ్రీరామభక్తి పారవశ్యమున సరస్వతీదేవి బ్రహ్మలోకమునుండి భూమికి పరుగులుదీయుచు వచ్చును. ఆమెచే కవి శ్రీరామచరితమనెడి సరోవరమునందు స్నానము చేయించినప్పుడే ఆమె యొక్క దూరప్రయాణపుబడలిక తొలగిపోవును. ఇది తప్ప వేఱుగా కోటి ఉపాయములు చేసినను ఆ బడలిక తీరదు . ఈ విషయమును గ్రహించియే కవులును, పండితులను, కలిపాపములనురూపుమాపు రామచరిత యశోగానమును చేయుదురు. కవులు సామాన్యమానవుల చరిత్రమును పొగడినచో సరస్వతీదేవి తనరాకకు పశ్చాత్తాపబడును . పండితులు కవిహృదయమును సముద్రముతోడను అతని బుద్దిని ముత్యపు తోడను సరస్వతీదేవిని స్వాతివానతోడను పోల్చెదరు. ఇందులో సుందరభావములనెడి వర్షపుచినుకులు పడినచో అందమైన కవితాముక్తాముణులరూపములలో అది భాసించును .
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ