ఏప్రిల్ 1 ని మనం ఏప్రిల్ ఫూల్ రోజు గా జరుపుకుంటాం. దీనికి ఒక కధ వుంది. అది ఏమిటంటే పదహారో శతాబ్దం మధ్య వరకు యూరప్ లో కూడ సంవత్సరాది మార్చి నెల మధ్యలోనే జరుపుకునేవారు. యూరప్ లో ఈ నూతన సంవత్సరపు ఉత్సవాలు మరియు వసంత కాలపు ఉత్సవాలు కలిపి ఓ పది రోజుల పాటు వరసగా జరుపుకునేవారు. ఏప్రిల్ 1 రాగానే ఈ ఉత్సవాలు ముగిసే సందర్భంలో ఒకరికొకరు బహుమానాలు ఇచ్చి పుచ్చుకునేవారు. ఇలా ఎప్పుడూ ఘనంగా జరుపుకునేవారు. అలావుండగా అప్పటి ఫ్రాంసు దేశపు రాజు సంవత్సరాదిని మార్చి మధ్య నుండి జనవరి 1 వ తారీఖుకి మార్చుతూ ఒక నోటీసు జారీ చేసాడు. ఆ రోజులలో వార్తాపత్రికలు, రేడియోలు, టీవీలు, కంప్యూటర్స్ లేవు. వారు అప్పట్లో దండోరా వేయించి వుంటారు. కాని రాజు గారి నోటీసు అందరికీ చేరలేదు. అందిన వాళ్ళు కూడ పాత అలవాట్లని వారు మార్చుకోలేకపోయారు. కనుక రాజధానిలో సంవత్సరాది జనవరి ఒకటిన జరిగిపోయినా కానీ దేశపు మూలల్లో మాత్రము ఏప్రిల్ 1 న బహుమానాలు ఇచ్చుకోవటంమానలేదు. అందుకని వాళ్ళని ఎగతాళిగా ఏప్రిల్ ఫూల్స్ అనేవారు. పాత అలవాట్లు మనలేక వారు జరుపుకుంటున్నారు కదా. అందుకని ఇప్పటికీ అల్లరిగా బహుమానాలు ఇచ్చుకోవటం, మరియు ఒకరిని ఒకరు ఫూల్స్ చేసుకుంటున్నారు. అందుకే ఏప్రిల్ 1 ని ఫూల్స్ డే గా జరుపుకుంటున్నారు. చాలా సరదాకా వుంటుంది. ఫూల్స్ అయ్యినవారు బాధపడకుండా సరదాగా తీసుకొని ఎంజాయ్ చేయచ్చు. ఫూల్స్ డే బాగుంది కదండి. Enjoy The Fools Day .