Blogger Widgets

గురువారం, జులై 25, 2024

శుక్రవారపు మహాలక్ష్మి ముఖమును ఇంట్లోనే కొబ్బరికాయతో ఎలాగో అమ్మమ్మ జ్ఞాప...

గురువారం, జులై 25, 2024

బుధవారం, జులై 17, 2024

తొలి ఏకాదశి

బుధవారం, జులై 17, 2024

 





ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం అందరికీ అలవాటు కదండి . మొత్తం సంవత్సరం పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశిని  తొలి ఏకాదశిగా పరిగణిస్తారు.

పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు. వానకారు మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం. శరదృతువు యముడి కోర. ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలూ పబ్బాలూ ఎక్కువ గా జరుపుకున్నేవారు.  ఆనాడు  ఉపవాస  తొలి ఏకాదశి దీక్ష చేస్తారు.
ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు.  విష్ణువు పాలకడలి పై శేష తల్పమున పవళిస్తాడు.  అదే రోజును తొలి ఏకాదశి గా భావిస్తారు.

సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు.  ఇంత ప్రాముఖ్యము కల శయన ఏకాదశి రోజు విష్ణు సహస్రము పారాయణ చేసెదరు. 
అందరికీ ఈ తొలి ఏకాదశి శుభాకాంక్షలు.

శుక్రవారం, మే 10, 2024

అక్షయ తృతీయ

శుక్రవారం, మే 10, 2024














 ఈ రోజు హిందువులకు మరియు జైనులకు ప్రత్యకమైన రోజు,  అదే అక్షయ తృతీయ .  వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయ గా పిలుస్తారు. సంస్కృతం లో ' అక్షయ ' అనగా క్షయం కానిది , తరిగి పోనిది అని అర్థం. హిందూ పంచాంగం ప్రకారం అక్షయ తృతీయ రోజంతా అత్యంత శుభ కరమైన ముహూర్త కాలంగా భావిస్తారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే సంపద అక్షయమవుతుందని భారతీయుల నమ్మకము.  ఈ రోజు నాడే రైతులు విత్తనాలుకు పూజ చేసి నాటుతారు.  ఎందుకంటే విత్తులు మంచిగా వ్యవసాయం వృద్ది చెందుతుంది.  ఇంకా "అక్షయ తృతీయ" నాడే మహావిష్ణువు ఆరో అవతారమైన పరుశురాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నారు. భగీరధుడు తపస్సు ఫలితంగా గంగానది భూమి తరలి వచ్చిన రోజు. యజ్ఞ యాగాదులు చేయటానికి మంచి కాలం. శ్రీ కృష్ణులవారి బాల్య స్నేహితుడు కటిక దరిద్రుడైన సుదాముడు కృష్ణుని దగ్గరకు వెళ్లి అటుకులు సమర్పించి అత్యంత దనవంతుడైనాడు. ధర్మరాజు సూర్యనారాయణ మూర్తి నుండి అక్షయ పాత్రను పొందినాడు. వ్యాసుడు మహాభారతాన్ని చెప్తున్నప్పుడు విఘ్ననాయకుడు అయిన గణపతి భారతాన్ని రాయటం మొదలు పెట్టినరోజు.  శంకరాచార్యులు వారు కనకదరా స్తోత్రాన్ని పాడితే కనకం వర్షంలాగ పడిన రోజు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు నిండు సభలో ద్రౌపది కి వస్త్రాపహరణ చేసి అవమానించదలిచారు , అప్పుడు  ఆమెకి శ్రీ కృష్ణులు వస్త్రాలు ఇచ్చి ద్రౌపదిని కాపాడిన రోజు.  అక్షయ తృతీయ నాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెబుతున్నాయి.  కుబేరుడు, దేవతల కోశాధికారి, ధనానికి దేవత అనీ. లక్ష్మీ దేవి మరియు కుబేరుడు అక్షయ్ తృతీయ నాడు పూజిస్తే, సంపద కలగ చేస్తుంది.  అంతే కాదు ఈరోజు నాడే  అన్నపూర్ణాదేవి జన్మించినది.  ఈరోజు కి ఇన్ని విశేషాలు వున్నాయి కాబట్టే అందుకే ఈ పర్వదినాన పుష్పమో, ఫలమో భగవంతుడికి సమర్పించినా, దైవనామస్మరణ చేసినా, చివరికి నమస్కారం చేసిన సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి.   ఈ క్రమంలో అక్షయ తృతీయ నాడు బంగారం కొనడంతో పాటు అనేక శుభకార్యాలను చేపట్టవచ్చును. ఇందులో పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం వంటి మంచి కార్యాలను చేయవచ్చునని పురోహితులు సూచిస్తున్నారు. 

సోమవారం, మే 06, 2024

అమ్మమ్మ నేర్పిన మెత్త‌ని ప‌కోడీ....పకోడీ కథ, కమామిషు పద్యాలతో. తిని ఆస్వాధించండి.

సోమవారం, మే 06, 2024

అమ్మమ్మ నేర్పిన మెత్త‌ని ప‌కోడీ....
అమ్మమ్మ నేర్పిన మెత్త‌ని ప‌కోడీ రిసిపి చెప్పే  ముందు కొన్నివిషయాలు మీతో షేర్ చేసుకుంటాను .  ఈ పకోడీ మీద పూర్వపు కవులు అనేకమైన పద్యాలు రాశారు. 
అందులో కొన్ని 
చిలకమర్తి వారు పకోడీపై కొన్ని పద్యాలు ఆశువుగా చెప్పారు. పద్యాలు చదివి పకోడీ రుచి ఆస్వాదించండి.
వనితల పలుకులయందున
ననిముష లోకమున నున్న దమృతమటంచున్
జనులనుటె గాని, లేదట
కనుగొన నీయందమృతము గలదు పకోడీ !

ఎందుకు పరమాన్నంబులు
ఎందుకు పలు పిండివంటలెల్లను నాహా ! నీ
ముందర దిగదుడుపున కని
యందును సందియము కలుగ దరయ పకోడీ !

ఆ కమ్మదనము నా రుచి
యా కర కర యా ఘుమ ఘుమ, యా పొమకములా
రాకలు పోకలు వడుపులు
నీకేదగు నెందులేవు పకోడీ !

నీ కర కర నాదంబులు
మా కర్ణామృతములు, నీదు మహితాకృతియే
మా కనుల చందమామగ
నే కొనియాడెదను సుమ్ము నిన్ను పకోడీ!

ఇలా ఎంతో మంది కవులు పకోడీమీద పద్యాలు రాశారు. మా తాతగారు కూడా రాసారనుకొండి . 
ఈ పకోడీ రిసిపీ గురించి అందరితో నా అనుభవం పంచుకుంటాను...ఒక రోజు మా ఇంటికి మా తాతగారిని కలవడానికి తాత  ఫ్రెండ్స్ వచ్చారు.వచ్చిన వారికీ ఎదో ఒకటి పెట్టడం మన అందరి అలవాటు కదా ఉట్టిగా  టీ ఇవ్వలేము కదా  ఇంట్లో ఉల్లిపాయలు,బెండకాయలు,దొండకాయలు ఉన్నాయి,బెండకాయ,దొండకాయ తో ఏమి చేసి ఇవ్వలేము..పోనీ ఉల్లిపాయ గట్టి పకోడీ చేద్దాం అంటే తరగడానికే సగం సమయం అయ్యిపోతుంది..అందుకని మా అమ్మమ్మ నేర్పిన ఈ పకోడీ గుర్తు వచ్చి పది నిమిషాల్లో చేసి వాళ్లకు పెట్టాము వాళ్ళు అంతో అందనందించారు...రుచి ఎంతో కమ్మగా,హాయిగా ఉంటుంది..... పకోడీ అంటే ఇష్టం ఉండనివారు ఎవరు ఉంటారు చెప్పండి. :) 

మా అమ్మమ్మ నేర్పిన పకోడీ రిసిపి మీకోసం . 

కావలిసిన పదార్ధాలు..
   ఉల్లిపాయలు - 2 
 పచ్చిమిర్చి   -  3
                   కరివేపాకు    -   సన్నగా తరిగింది 1 1/2 చెంచా 
             కొత్తిమీర       - సన్నగా తరిగింది   1 1/2 చెంచా 
నెయ్యి          - 1 చెంచా
   నీళ్లు             - సరిపడినంత   
    నూనె         - డీప్  ఫ్రై కి సరిపడినంత 
   ఉప్పు        - రుచికి సరిపడినంత 

              సెనగపిండి   - 1 కప్

తయారీ విధానం :

ముందుగా ఉల్లిపాయలు ని కొంచం పెద్ద ముక్కలుగా తరుగుకోవాలి (డైస్ ) అందులో పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, నెయ్యి  వేసి బాగా కలుపుకోవాలి.  అందులో సెనగపిండి వేసి బాగా కలిపిన తరువాత నీళ్లు వేసుకుని ఇడ్లీ పిండిలాగా కలుపుకోవాలి.  ఇప్పుడు వాటిని వేడి వేడి నూనె లో వేసి మీడియం ఫ్లేమ్ మీద కదపకుండా పైకి తేలిన తరువాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి..

బయట క్రిస్ప్య్ గ లోపల  సాఫ్ట్ గ ఉంటాయి (ఇంకా బాగా రవాలి అంటే ఒక రెండు నిముషాలు బాగా బీట్(beat) చేసుకోవాలి) అంతే  పది నిముషాలు తయారు అయ్యిపోతుంది  . 


ఇదండీ పకోడీ కథ,  కమామిషు పద్యాలతో. తిని ఆస్వాధించండి. 


 


 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)