Blogger Widgets

మంగళవారం, మే 15, 2012

హనుమంతుడు

మంగళవారం, మే 15, 2012

హనుమాన్  జయంతి శుభాకాంక్షలు.
  
అందరికి నెక్కుడైన హనుమంతుడు
అందుకొనె సూర్యఫలమని హనుమంతుడు

బల్లిదుడై లంకజొచ్చి బలురాకాసుల గొట్టి
హల్లకల్లోలము చేసె హనుమంతుడు
వొల్లనె రాముల ముద్దుటుంగరము సీత కిచ్చె
అల్లదె నిలుచున్నాడు హనుమంతుడు

దాకొని యాకెముందర తనగుఱు తెరుగించి
ఆకారమటు చూపె హనుమంతుడు
చేకొని శిరోమణి చేతబట్టి జలనిధి
ఆకసాన దాటివచ్చె హనుమంతుడు

కొంకకిట్టె సంజీవి కొండ దెచ్చి రిపులకు
నంకకాడై నిలిచెను హనుమంతుడు
తెంకినే శ్రీవెంకటాద్రి దేవుని మెప్పించినాడు
అంకె కలశాపురపు హనుమంతుడు

కాటన్ దొరగారి పుట్టినరోజండి

ఈరోజు గోదావరి ప్రజలు ఎంతో అబిమానించే కాటన్  దొరగారి  పుట్టినరోజు.  ఈ దొరగారి అసలు పేరేమో జనరల్  సర్ ఆర్ధర్ కాటన్ .  ఈయన  బ్రిటిష్  సైనిక అధికారి మరియు నీటి పారుదల  ఇంజీనీయర్.  ఈయన తన జీవితం అంతా నీటి పారుదల  గురించే ఎక్కువ  కృషి చేసారండి.  ఈయన  May 15 న 1803 వ సంవత్సరం లో ఆక్సఫోర్డ్ లో  హెన్రీ కాల్వెలీ కాటన్ మరియు ఆయన శ్రీమతికి పదవ కుమారునిగా జన్మించాడు.   దొరగారు  తన   15 సంవత్సరాల వయసులో కాటన్ 1818లో మిలటరీలో క్యాడెట్ గా చేరి అడ్డిస్‌కాంబ్ వద్ద ఈస్టిండియా కంపెనీ యొక్క ఆర్టిలరీ మరియు ఇంజనీరింగు సర్వీసులలో శిక్షణ పొందాడు. 1819లో రాయల్ ఇంజనీర్స్ దళంలో సెకండ్ లెఫ్టెనెంట్ గా నియమితుడయ్యాడు.    దొరగారు తెలుగు భాషమీద  కూడా ఎక్కువ  అభిమానం కలవారు.  గోదావరి ప్రజలు మీద ఈయన  అభిమానం ఎక్కువ  చూపేవారు.  ఈయన  ఎక్కువగా  కృషి చేసి విజయం సాధించిన   ప్రాజెక్టులలో గోదావరి నుండి నిర్మించిన  కాలువల నిర్మాణంగా చెప్పుకోవచ్చు . ఈ కాలువల విభజన వల్ల  మరియు అన్ని ప్రదేశాలను  కలుపుతూ సాగే విస్తరణ, ఒకప్పుడు వ్యవసాయం లో సామాన్య దిగుబడితో ఉన్న గోదావరి పరివాహక జిల్లాలను అత్యంత అభివృద్ది, అధిక వ్యవసాయ దిగుబడులు కల జిల్లాలుగా మార్చివేసినవి. 
దొరగారు ఈ  ఆనకట్ట  లే కాకుండా 1836 - 38 సంవత్సరాలలో  కొలెరూన్ నదిపై ఆనకట్టను నిర్మించాడు. దానితో తంజావూరు జిల్లా మద్రాసు రాష్ట్రంలోనే కాక, యావత్భారత దేశంలోనే ధనధాన్య సమృద్ధికి ప్రథమ స్థానం నాకు వచ్చింది .  అన్నిటికంటే ముఖ్యంగా 1847 - 52 సంవత్సరాలలో గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్టను పూర్తిచేశాడు.  గోదావరి డెల్టా ప్రదేశాలు సస్యశ్యామలమై కలకలలాడింది. ఈ  ఆనకట్టల వల్ల  ఆరు లక్షల ఎకరాల భూమి సాగు కిందికి వచ్చింది.  ఇంత  గొప్పకార్యానికి  ఆయన కేవలం అయిదేళ్ళలో కాలంలోనే పూర్తి చేశాడు. ఇది చాలా గోప్పవిషయంగా తోచుతోంది  కదండి.  దొరగారు అంతటితో తృప్తి చెందక  కృష్ణానదిపై విజయవాడ వద్ద ఆనకట్టకు కృషి చేసారు . మొత్తం భారత  భూమిని  సస్యశ్యామలం చేయటానికి నదులను మనం ఎలావుపయోగించాలా అన్న  ఆలోచనలు చేసారు .  దానికోసం ఎన్నో పరిసోదనలు చేసారు.   భారతీయులు అందరు దొరగారికి శాశ్వత రుణగ్రస్తులు అయిపోయారు.  దొరగారికి 1861లో సర్‌ బిరుదును పొందాడు .  ఈయన  బ్రిటిష్ వాడు అయినాసరే మనదేశబౌగోళిక  పరిస్తితులు తెలుసుకొని  మనదేశాభివ్రుద్దికి కృషిచేసారు.  కాటన్ దొరగారు భారత  జల సంపద  అనే పుస్తకంలో  “భారతీయ నదీ వ్యవస్థల విషయంలో సర్ ఆర్థర్ కాటన్ అనుపమానమైన అవగాహన కలిగినవాడు. అలాంటి పథకం గత శతాబ్దం (19 వ) లోనే అమలు జరిగి ఉంటే, ఇప్పుడు ఇండియాలో రవాణా ఒక సమస్య అయ్యుండేది కాదు.” కాదు అని రాసారుట. మన  దేశం గురించి ఆయన బాగా అర్ధం చేసుకున్నాడు కదండి.  నిజంగా కాటన్  దొరగారు గ్రేటండి  బాబు.  సారూ గారిని ఈరోజు ఇలా అయినా గుర్తుతెచ్చుకున్నందుకు నాకు చాలా సంతోషంగా వుండండి .  మరి మీకో.

సోమవారం, మే 14, 2012

వలస పక్షులు వాటి యాతన.

సోమవారం, మే 14, 2012

ఇక్కడ పక్షులను చూస్తూవుంటే ఇవి వలస పక్షులు అని తెలిసి పోతోంది కదండి.  నిజంగా ఇవి వల స పక్షులే ప్రపంచం నేడు వల స పక్షుల  రోజుగా  జరుపుకుంటోంది.  వలస పక్షులు అనగానే మనకు కొల్లేరు సరస్సు దగ్గర కు వచ్చే పక్షులు  గుర్తుకు వస్తాయి .    ఈ పక్షులన్నీ ఎక్కడో పుట్టి వున్న ప్రదేశాన్ని విడిచి  కొన్ని వేల  మైళ్ళు  ఎగురుకొని  కొండలూ కోనలు  సముద్రాలు , నదులు , చెరువులు , అడవులు , వూర్లు, ఎడారులు దాటుకొని కొత్త ప్రదేశానికి చేరుకుంటాయి.  అక్కడ  కొన్ని రోజులు వుండి తరువాత  వాటికి అనుకూలమైన  వాతావరణం  ఏర్పడినప్పుడు మరలా తిరిగి వాటి ప్రదేశానికి వెళ్లి పోతాయి కావున  వాటిని వలస  పక్షులు అంటారు.  ఇవి గుంపులు గుంపులుగా ఈ ప్రయాణాన్ని చేస్తాయి.  ఇవి మామూలుగా పగటి జీవులే అయినప్పటికీ ఇవి ఈ వలస  ప్రయాణము  మాత్రం రాత్రి సమయంలోనే ప్రయాణం చేస్తాయి.  ఈ ప్రయాణం చీకటి పడ్డాక  మొదలు పెట్టి తెల్లారేలోపు వరకు ప్రయాణం సాగిస్తాయి.  ఇలా రాత్రులే ఎందుకు ప్రయాణిస్తున్నాయో ఉహించగలరా.  రాత్రులు అయితే  వాటికి శతృభయము వుండదు అందుకే అలా ప్రయాణిస్తాయి.  రాత్రులు గంటకి తొమ్మిదివేల  పక్షులు ప్రయాణిస్తాయి.   కష్టకాలంలో ఆహారం దొరకక ఆహారాన్వేషణలో వలసపోవటం జరుగుతుంది. వసంతకాలంలో జంట కట్టడానికి, గుడ్లు పెట్టి పిల్లల్ని పెంచటం కోసం పక్షలు వలస పోతాయి. శీతాకాలపు తీవ్రత నుండి బయటపడటానికి వెచ్చని ప్రదేశాలను వెదుక్కుంటూ వలసపోతాయి. భూమధ్యరేఖ ప్రాంతపు వెచ్చని ప్రాంతాలు చాలా పక్షులను వేసవి విడుదలుగా ఉండటం విశేషం. ఈ ప్రయాణం ఎప్పుడు చేపట్టాలో ఎలా తెలుస్తుంది. మరి ? ఎక్కడికి పోవాలో ఎలా తెలుస్తుంది ? చాలా  కాలం నుండి నేటివరకూ మానవ మేధస్సును ఈ ప్రశ్నలు తొలుస్తూనే వున్నాయి.  ఏటవాలుగా పయనించే సూర్యకిరణాలు, శరీరంలో వచ్చే హార్మోన్ల మార్పులు ప్రయాణము చెయ్యాలి వాటికి తెలుస్తుంది అంటారు . అంతేగాక వాతావరణంలో వచ్చే మార్పులు ప్రధానంగా వలసకు దారి తీస్తాయి. ప్రయాణానికి సరిపడినంత కొవ్వు నిల్వ చేసుకుని మరీ బయల్దేరుతాయి.  సూర్యుడు, నక్షత్రాలను తమ మార్గదర్శకులుగా చేసుకొని ప్రయాణం సాగిస్తాయని పలు పరిశోధకులు తెలియజేశారు.  పావురాలు తమ మార్గాన్వేషణలో వాసనను ఉపయోగించుకుంటాయి. అయితే కొన్నిసార్లు దారితప్పిన సందర్భాలు కూడ లేకపోలేదు. ప్రయాణంలో వెనుకబడినవి, పిల్లపక్షులు తరచూ దారిగానక చెల్లాచెదురవుతాయి. ఏమైనా వేల మైళ్ళు ప్రయాణం చేయడం, తిరిగి ఇల్లు చేరుకోవటం జీవులు ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా తమనుతాము తీర్చిదిద్దుకున్న ప్రక్రియ ఇది సృష్టిలో మహాద్భుతం గా చెప్పుకోవచ్చు .  
పక్షులును చూసి మనలాంటి వారు కష్ట కాలంలో ఎలా జీవించాలో నేర్చుకోవచ్చు. ఎలాగైనా గమ్యాన్ని తిరిగి చేరుతాయి.  ఇదే వలసపక్షులు వాటి యాతన .  

ఆటలమ్మ

Chicken pox vaccine
ఆటలమ్మ(Chicken pox) లేదా అమ్మవారు అని సాధారణంగా పిలవబడే ఈ వైరల్ వ్యాధిని వైద్య పరిభాషలో వారిసెల్లా జోస్టర్ (Varicella zoster) అని వ్యవహరిస్తారు. ఈ వ్యాధి చిన్నతనంలో ప్రతి పిల్లవాడికి సోకి నయమవడం సర్వసాధారణం. ఆటలమ్మ వారిసెల్లా జోస్టర్ వైరస్ ద్వారా సంక్రమిస్తుంది, ఈ వైరస్‌ను హ్యూమన్ హెర్పిస్ వైరస్ 3 అని కూడా వ్యవహరిస్తారు.  ఆ రోజుల్లో మశూచి (Smallpox) అంటే చాలా భయపడేవారు, ఎందువలనంటే ఈ జబ్బు బారిన పడిన ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోయేవారు, లేక వారు రూపురేఖలు చూడటానికి భయంకరంగా వుంటుంది.  అలాంటప్పుడు ఎడ్వర్డ్ జెన్నర్  అను శాస్త్రవేత్త.    18 శతాబ్దాంతంలో ఎడ్వర్డ్ జెన్నర్ 1879 లో మొట్టమొదటి టీకాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క మశూచి నిర్మూలనోద్యమంలో వాడాడు.  మశూచి కారకాన్ని శరీరంలోకి ప్రవేశపెట్టడం కంటే మశూచి బారి నుండి రోగనిరోధక శక్తిని ఏర్పరచడం చాలా సురక్షితంగా చేయవచ్చు.  చికెన్ పాక్స్ వైరస్ అనే చిన్న క్రిముల దార్వావచ్చు చర్మవ్యాధి (Varicella-zoster) అని తెలుసుకొని దానికి టీకా కనిపెట్టి మొట్టమొదట  ఇద్దరు పిల్లలు మీదప్రయోగిమ్చారు వారు ఇద్దరు పిల్లలు మీద  ఆ మందు బాగా పనిచేసింది.  చికెన్ పాక్స్ (varicella) టీకాలు మాత్రమే వ్యాధిని - నిరోధించగలవు. ఈ వ్యాధి వచ్చు ప్రాంతాలలో చిన్నపిల్లలకు, యుక్త వయస్సువారికి ఈ వ్యాధినిరోధక టీకాలు వేయిచుట ద్వారా - వ్యాధి సంక్రమణను అదుపుచేయవచ్చును.  సమాజంలో ఈ వ్యాధిలక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి అనగాహన కలిగే చర్యలు చేపట్టాలి. అని నిర్ణయించుకున్నారు. 1796 May 14 న  ఎడ్వర్డ్ జెన్నర్ తను కనిపెట్టిన ఆటలమ్మ అని, అమ్మవారు అని పిలవబడే స్మాల్‌పాక్స్ కి మందును, మొదటిసారిగా ప్రజలకు వేయటం మొదలుపెట్టాడు.

ఆదివారం, మే 13, 2012

సర్ రోనాల్డ్ రాస్

ఆదివారం, మే 13, 2012


సర్ రోనాల్డ్ రాస్  మలేరియ  చక్రం 
సర్ రోనాల్డ్ రాస్  తెలియని వారు వుండరు అనుకుంటున్నా.  ఈయన ప్రముఖ ఆంగ్లో ఇండియన్ శాస్త్ర వేత్త.  నేడు సర్  రోనాల్డ్ రాస్  పుట్టిన రోజు  సందర్బముగా సింపుల్ గా ఈయన గురించి తెలుసుకుంనే ప్రయత్నం చేద్దాం.  ఈయన మలేరియా పారసైట్ యొక్క జీవితచక్రానికి చెందిన పరిశోధనకు గాను 1902లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రదానం చేయబడినది. ఈయన హైదరాబాదు నగరంలో తన పరిశోధన జరిపారు. ప్రస్తుతం "మినిస్టర్స్ రోడ్" గా పిలిచే రహదారిని 2000 సంవత్సరం వరకు "సర్ రోనాల్డ్ రాస్ రోడ్" అనేవారు.  రొనాల్డ్ రాస్ భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా లో జన్మించారు. ఇతని తండ్రి జనరల్ సర్ గ్రాంట్ రాస్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ లో పనిచేశారు.   ఎనిమిది సంవత్సరాల వయసులో రాస్ ను విద్యాభ్యాసం కోసం ఇంగ్లాండు పంపించారు. రైడ్ లో ప్రాధమిక విద్యాభ్యాసం తరువాత 1869లో సౌతాంప్టన్ లోని బోర్డింగ్ పాఠశాల కు పంపించారు.
రాస్ వైద్యశాస్త్రాన్ని లండన్ లోని సెయింట్ బార్తొలోమ్ హాస్పిటల్ లో 1875 - 1880 మధ్య పూర్తిచేశాడు. తర్వాత రోయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ సభ్యత్వం (Membership of the Royal College of Surgeons:MRCS) పొందాడు. ఇతడు 1881 లో ఇండియన్ మెడికల్ సర్వీసు లో చేరి ముందుగా మద్రాసులో పనిచేశాడు.
Sir Ronald Ross Institute of Tropical and Communicable Diseases హైదరాబాద్ లో ఈ  మలేరియ వ్యాధి గురించి పరిశోధించి విజయం సాధించారు.  ఇందుకు గాను ఈయనికి నోబెల్ బహుమతి ఇచ్చారు.

మాతృమూర్తులకు మాతృపూజాదినోత్సవ నాశుభాకాంక్షలు

 
      ఈ రోజు మాతృపూజా దినోత్సవంగా జరుపుకుంటున్నాం  అందుకుగాను ముందుగా  మన మాతృ భూమికి (భారతమాత )కు మరియు ప్రపంచంలో వున్నా మాతృమూర్తులకు మాతృపూజాదినోత్సవ నాశుభాకాంక్షలు.  

సృష్టిలో అమ్మ లేనిజీవి అన్నది లేదు .  ఎక్క డైనా చెడ్డ బిడ్డ  వుండవచ్చేమో కాని చెడ్డ తల్లి అన్నది వుండదుట.  ఏ  తల్లి అయ్యినా తన  బిడ్డ  గొప్పగా వుండాలి అని కోరుకుంటుంది.  మనకు ప్రపంచంలో కెల్లా అతి తియ్యనైన పదం అమ్మ .  అమ్మప్రేమ కంటే  గొప్ప ప్రేమ  , అమ్మకంటే గొప్ప రక్షణ , అమ్మ  కంటే గొప్ప గురువు, అమ్మ కంటే గొప్ప దైవం ఎక్కడా లేదు. ఇది  నిజం .  అలాంటి అమ్మ ఋణము మనం ఎన్ని జన్మలుఎత్తినా తీర్చలేము.  

ఈ సందర్బములో నాకు ఒక కదా గుర్తు వస్తోంది అది ఏమిటి అంటే!!!!! ఈ కదా అమ్మ ప్రేమకు ఒక  నిదర్సనం అని చెప్పుకోవచ్చు.  ఒక ఊరిలో ఒక అమ్మ వుంది ఆ అమ్మకి ఒక బిడ్డ వున్నాడు.  అతను  అన్ని చెడ్డ అలవాట్లు కలిగి వుంటాడు.  అతనికి ఒక ప్రియురాలు వుంది ఆమె ఒకనాడు నాకు తల నొప్పిగా వుంది అని చెప్పింది.  ఆ తలనొప్పి తగ్గాలి అంటే అతని అమ్మ  హృదయపు రక్తం రాస్తే తగ్గుతుంది అని చెప్పింది.  అప్పుడు ఆతను మాఅమ్మ హృదయం ఇప్పుడే తెస్తాను అని చెప్పి వెళ్ళాడు.  వెళ్లి అమ్మని అడిగాడు.  అమ్మా నీ హృదయం కావాలి అని అడిగాడు.  ఆమె వెంటనే సరే నాయనా తప్పకుండా తీసుకో అంది.  అప్పుడు ఆతను తల్లిని పొడిచి హృదయాన్ని తీసుకున్నాడు. ఆ హృదయం రక్తం కారుతోంది దానిని తన చేతిలో తీసుకొని వెళ్తూ వుండగా ఆ రక్తం లో జారి పడబోయాడు.  అప్పుడు అమ్మ హృదయం తల్లడిల్లిపోయి బాబూ జాగ్రత్త చూసుకొని నడువు నాయనా అంది.  అప్పుడు ఆ కొడుకులో మార్పు వచ్చి ఇంత మంచి అమ్మనా నేను చంపింది అని ఏడుస్తాడు.  చూసారా ఎక్కడైనా అమ్మ మంచిగానే వుంటుంది.  అలాంటి అమ్మను మనం కష్టపెట్టకూడదు.

మనకు తెలిసిన రామాయణంలో రాముడు  తల్లి (కైకెయి)కోరికకు కట్టుబడి అడవికి వెళ్లి ఎన్నోకస్టాలు అనుభవించాడు.  కృష్ణుడు, యశోద ప్రేమ మనం వర్ణించలేము. అర్జునుడు ద్రుపది స్వయంవరంలో గెలిచిన ద్రుపధిని  పాండవులు తల్లిమాట విని ద్రౌపదిని ఐదుగురు భార్యగా పొందారు. తరువాత చత్రపతి శివాజి తనతల్లి కొరికను నెరవేర్చి. చక్రవర్తి అయ్యాడు.  గాంధి గారుకు తన తల్లి తన చిన్నప్పటి నుండి అనేక కదలు చెప్పేది.  ఆ కధలు గాంధిగారికి మార్గనిర్ధేశకంగా నిలిచాయి.      
మనకు పంచ  మాత లు కలరు అని కుమారశతకంలో ఇలా అన్నారు.

ధరణీ నాయకు రాణియు
గురు రాణియు నన్నరాణి కులకాంతను గ
న్న రమణి దనుగన్నదియును
ధరనేవురు తల్లులనుచు దలుపు కుమారా !

భావం:రాజు భార్య (రాణి), అన్న భార్య (వదిన), గురుని భార్య (గురుపత్ని), భార్య తల్లి (అత్త) మరియు కన్న తల్లి - పంచమాతలు గా భావించవలెను.

అమ్మని ఇప్పుడు mommy అని పిలుస్తున్నారు.  mommy అన్న పదం కంటే అమ్మ అన్న పదం లోనే తియ్యదనం వుంది అని తెలుసుకుంటే బాగుంటుంది. 
ఎవరు రాయగలరూ అమ్మ అను మాటకన్న కమ్మని కావ్యం 
ఎవరు పాడగలరూ అమ్మ అనురాగం కన్న తీయని రాగం 
అమ్మేగా… అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి .........
ధీరులకు దీనులకు అమ్మ ఒడి ఒక్కటే... --సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్న పాట రాసారు ఇది అక్షరసత్యం అని గ్రహించగలరు.  ఎందరో కవులు అమ్మ గురించి వర్ణించటానికి ప్రయత్నించారు.  కానీ ఎవరు రాయగలరండి అమ్మ గురించి. 
 అమ్మలందరికి మాతృ పూజా దినోత్సవం శుభాకాంక్షలు.  

(మా అమ్మకి)I love You Amma. 

శనివారం, మే 12, 2012

ఫ్లోరెన్స్ నైటింగేల్

శనివారం, మే 12, 2012




ఈ రోజు ప్రపంచం మొత్తం మీద నర్సులు  పండగ గా గరుపుకుమ్తున్నారు ఎందుకు  అంటే ఈరోజు International Nurses Day కదా! .  ఈరోజునే ఎందుకు జరుపుకుంటున్నారు అంటే ఈరోజు ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టిన రోజు.  ఈమె ఒక నిజంమైన  స్పూర్తిదాయకమైన నర్సు.
ఫ్లోరెన్స్ నైటింగేల్ క్రిమియన్ యుద్ధం సందర్భంగా ఆమె నర్సింగ్ పని చేసి ప్రసిద్ధి చెందింది.ఆమె చాలా ముఖ్యమైన బాధ్యతలు ఒక అత్యధిక నైపుణ్యం కలిగిన మరియు బాగా గౌరవనీయ వైద్య వృత్తి ఎక్కువగా అభ్యాసం లేని వృత్తి నుండి నర్సింగ్ మార్చబడింది.ఫ్లోరెన్స్ నైటింగేల్ 12 మే 1820 న ఫ్లోరెన్స్, ఇటలీ లో జన్మించారు. ఆమె తండ్రి ఒక సంపన్న భూస్వామి . ఆమె డెర్బిషైర్  మరియు హాంప్షైర్  లో పెరిగింది.  ఫ్లోరెన్స్ కు ఆమె జన్మ స్థలం పేరు పెట్టబడిందిఫ్లోరెన్స్ జన్మింఛి ఉన్నప్పుడు ఆ సమయంలో, అమ్మాయిలు విద్యను ఏ రకంగాను అందుకోలేదు. ఆమె తండ్రి, విలియం నైటింగేల్,  మహిళలు ఒక విద్యను పొందాలి అని  భావించారు ఎందుకంటే ఫ్లోరెన్స్ బాగా అదృష్టవంతుడు. అతను ఫ్లోరెన్స్ మరియు ఆమె సోదరి సైన్స్ మరియు గణితం నుండి చరిత్ర మరియు తత్వశాస్త్రం వరకు విషయాలు  నేర్పించారు.ఫ్లోరెన్స్ పెరిగిన గా ఆమె ఇతరులు సహాయం మీద ఆసక్తి పెరిగింది. ఆమె అవకాశం లభించింది చేసినప్పుడు ఆమె అనారోగ్యంతో పెంపుడు జంతువులు మరియు సేవకులు కోసం ఆలోచించలేదు.ఫ్లోరెన్స్ నైటింగేల్ ఒక నర్సు కావాలని దేవునిని ప్రార్ధించారు.  వయస్సు పదిహేడు సంవత్సరాలు,  ఆమె దేవుని ద్వారా సేవ చెయ్యాలి అని "నిస్సహాయంగా మరియు నీచ నుండి బాధలో వున్నవారికి సహాయం చేయాలని." కోరుకున్నారు.మొదట ఆమె తల్లిదండ్రులు ఆ సమయంలో, అది ఒక బాగా విద్యావంతులు స్త్రీ ఒక అనుకూలమైన వృత్తిగా  భావించ లేదు, ఎందుకంటే ఆమె ఒక నర్సు మారింది దానికి  వారు  తిరస్కరించారు.  చిట్టచివరికి 1851 లో ఆమె తండ్రి అనుమతితో  ఫ్లోరెన్స్ ఒక నర్స్ గా శిక్షణ Germany కు వెళ్లి పొందారు.1853 లో లండన్ లో ఒక ఆసుపత్రి నడుస్తున్న జరిగినది.1849 - యూరోపియన్ ఆసుపత్రి వ్యవస్థ అధ్యయనం యూరప్ కి ప్రయాణించాడు.1850 - అలెగ్జాండ్రియా, ఈజిప్ట్ వెళ్లింది సెయింట్ విన్సెంట్ డి పాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వద్ద నర్సింగ్ చదవడం ఆరంభించారు.1851 - వయస్సు ముప్పై-ఒక గొప్ప నర్స్ మారింది.  ఆమె మరికొందరికి శిక్షణ ఇవ్వడానికి Germany కు వెళ్ళారు.1853 - లండన్ లో Gentlewomen కోసం ఆసుపత్రి సూపరింటెండెంట్గా మారింది.1854 - క్రిమియన్ యుద్ధంలో బయటపడింది.1854 లో ఫ్లోరెన్స్ నైటింగేల్ క్రిమియన్ యుద్ధం (- 56 1854) గాయపడ్డాడు బ్రిటీష్ సైనికుల నర్సింగ్ నిర్వహించేందుకు టర్కీ వెళ్ళారు. ఆమె గాయపడిన సైనికులుకు  సహాయం Scutari (క్రిమియన్ యుద్ధంలో గాయపడిన మరియు అనారోగ్యంతో సైనికులు తీసిన ఇక్కడ స్థానం) వెళ్ళింది.ఫ్లోరెన్స్ తన జీవితం ఉద్యోగంకు  అంకితం చేశారు. ప్రతి ఒక కేవలం వారు సరి ఉండేవి నిర్థారించడానికి నిద్రలోకి ఉన్నప్పుడు ఆమె తరచుగా రాత్రి సైనికులు సందర్శించండి ఉంటుంది. ఆమె చక్రంలా నిద్ర సమయం విరామం తీసుకునేదే కాదు  ఎందుకంటే అప్పుడు ఆమె "లేడి విత్  ది లంప్ " అని అనటం జరిగినది.  గాయపడిన చాలా unwashed మరియు బ్లాకెట్స్ను లేదా decent ఆహార లేకుండా overcrowded, మురికి గదులు లో నిద్రపోవటం వల్ల .  టైఫస్ ఈ పరిస్థితులు వ్యాధులు లో, కలరా మరియు విరేచనాలు త్వరగా వ్యాపించాయి. ఫలితంగా, గాయపడిన సైనికులు మధ్య మరణాల రేటు బాగా ఎక్కువ.చాలా సైనికులు అంటువ్యాధులు మరియు వ్యాధి మరణించారు. ఫ్లోరెన్స్ మరియు ఆమె నర్సులు ఈ పరిస్థితులును మార్చింది.  వారు, ఒక వంటగది ఏర్పాటు వారి స్వంత సరఫరా నుండి గాయపడిన మృదువుగా, పారిశుధ్యం కోసం latrines తవ్విన, మరియు గాయపడిన యొక్క భార్యలు నుండి సహాయం కోసం కోరారు. వారు అప్పుడు సరిగా పడిపోయింది సైనికులు మధ్య అనారోగ్యం మరియు గాయపడిన మరియు మరణం రేటు కోసం శ్రమ పోయారు.ఫ్లోరెన్స్ నైటింగేల్ ఇంగ్లాండ్ లో ఒక సంవృద్ధిఅయిన కుటుంబం కుమార్తె. క్రిమియన్ యుద్ధం సమయంలో, ఆమె నర్సింగ్ విభాగ ఉంచబడినది. ఆమె యుద్ధ రంగంలో ఆసుపత్రిలో మందిరాలు లేచి, "దీపం తో మహిళ" అని పిలుస్తారు మారింది ఆమె ఒక దీపం తీసుకెళ్లారు.  ఈమె ఒక గొప్ప నర్సు గా పేరు తెచ్చుకుని, నర్సు లకు ఆదర్శంగా నిలిచినది. 

బుధవారం, మే 09, 2012

అన్నమయ్య జన్మదిన శుభాకాంక్షలు

బుధవారం, మే 09, 2012

అమ్మ తన బిడ్డ అన్నము తినటానికి  మారం చేసినప్పుడు ప్రతీ  ఇంట్లోని అమ్మ   చందమామని చూపిస్తూ ,గోరుముద్దలు తినిపిస్తూ  తన  బిడ్డకి  "చందమామరావో జాబిల్లిరావో"  అన్నపాట ను పాడుతుంది.  ఈ పాట  తెలియని తెలుగు లోగిలి వుండదు.  ఇలాంటి  పాటలు రాసిన వారు శ్రీమహావిష్ణువు యొక్క ఖడ్గం అయిన నందకాంశ సంభూతుడు అయిన  "పదకవితా పితామహుడు", "సంకీరత్నాచార్యుడు", "పంచమాగమ సార్వభౌముడు", "ద్రవిడాగమ సార్వభౌముడు"  అను బిరుదాంకితుడు అన్నమయ్య.   నారాయణయ్య కొడుకు నారాయణ సూరి. విద్యావంతుడు. అతని భార్య లక్కమాంబ. ఆమెది తాళ్ళపాక సమీప గ్రామం మాడుపూరు. అక్కడ ఉన్న విష్ణువు కోవెలలో అమె శ్రద్ధగా మాధవుని అర్చించేదట. వారికి చాలా కాలం సంతానం కలుగలేదు. అతడు, అతని భార్య సంతానార్ధులై తిరుమలను దర్శించారట. ఆ దంపతులు తిరుమల తిరుపతిని దర్శించుకొని, ధ్వజస్తంభం ఎదురుగా సాష్టాంగ ప్రమాణం ఆచరించినపుడు ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించిందని ఒక  కధ  కలదు. అలా జన్మిచిన వాడే అన్నమయ్య  . సర్వధారి సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు (మే 9, 1408) కడప జిల్లా లోని రాజంపేటమండలం తాళ్ళపాక గ్రామములో అన్నమయ్య జన్మించాడు. 8వ యేట అన్నమయ్యకు ఆయన గురువు ఘనవిష్ణు దీక్షనొసగినపుడు అన్నమాచార్య నామం స్థిరపడిపోయింది.
అన్నమయ్య ఇంటిలోతల్లి సంగీతం, తండ్రి పాండిత్యం ఛాయలలో పెరిగాడు. ఉపవీత సంస్కారం పొందిన తరువాత ఇంటి గురుకులంలోనే విద్యాభ్యాసం సాగింది. ఏక సంధాగ్రాహి అయినందున అనతికాలంలో ఉన్నత విద్యావంతుడయ్యాడు. తన పదహారవ యేట అన్నమయ్యకు శ్రీవేంకటేశ్వర దర్శనానుభూతి కలిగింది. అప్పటినుండి అన్నమయ్య అద్భుతమైన కీర్తనలను రచింపసాగాడు.  ఈ పాటరాసింది తెలుగువాగ్గేయకారుడు కలియుగదైవము వేంకటేశ్వరస్వామికి గొప్పభక్తుడు అయిన అన్నమయ్య .  అన్నమయ్య చాలాపాటలు రాసారు పాడారు .స్వామి వారికి మేలుకొలుపు అన్నమయ్య పాడినప్పుడు "మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల మేలుకోవె నా పాలి మించిన నిధానమా "  వంటి మేలుకోలుపు పాటలకు స్వామి వారు నిద్రలేసారు. మళ్ళీ రాత్రి జోల పాటలు అన్నమయ్య రాసిన"జో అచ్యుతానంద జోజో ముకుందా, రావె పరమానంనద , రామ గోవిందా జోజో జోజో"  అన్నపాటకు స్వామి వారు హాయిగా నిద్రపోతారు. అన్నమాచార్యలవారు అనేఅనేక వేలపాటలు రాసారు పాడారు. అయానపాటలవల్లే స్వామి వారికి అంతకీర్తికలిగిందా అనిపించేటట్టు వుంటాయి అన్నమయ్య పాటలు సామాన్యమానవులు కు అర్ధమైయ్యె టంత వీలు గా వుంటాయి. అన్నమయ్యపాటలు స్వామి వారికే కాదు అమ్మవారికి కూడాచాలా ఇష్టం  అమ్మవారిమీదకూడా చాలాపాటలు రాసారు. "క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయమునకు నీరాజనం"  అన్నపాట అమ్మవారి నీరాజనం ఇచ్చుసమయమున పాడారు. అమ్మను చూసి   చక్కని తల్లికి చాంగుభళా అంటూ పాట చలా బాగుంటుంది.   అంతే కాకు తిరుతిరు జవరాల అన్న పాట,  వుయ్యాల పాటల, తుమ్మెద పాటలు , గొబ్బిళ్ళ పాటలు, జనపదాలు,  శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వుంన్నాయి. అన్నమయ్యరచనలు ఇంచుమించు ముప్పైరెండువేలు పాటలు వుంటాయి.  అన్నమయ్యకు పదకవితాపితామహుడు అన్నబిరుదు కలదు. అన్నమయ్య 32,000 సంకీర్తనలతో పాటు, సంస్క్రత వేంకటాచల మహాత్మ్యం, సంకీర్తనా లక్షణం, ద్విపద రామాయణం, 12 తెలుగు శతకాలు, శృంగార మంజరి, వంటి "నానా ప్రబంధములను" రచించినట్టు చిన్నన్న రచించిన ద్విపద వల్ల తెలుస్తుంది.  అన్నమయ్య గురించి మరియు ఆయన రచనలు గురించి చెప్పుకుంటే ఎంతకీ తరుగదు అనిపిస్తోంది.  నాకు అవకాసం వున్నప్పుడు అన్నమయ్య వారి సంకీర్తలగురించి తప్పకుండా పోస్ట్  చేస్తాను.

సోమవారం, మే 07, 2012

నవ్వితినే గొల్లెతా

సోమవారం, మే 07, 2012




నవ్వితినే గొల్లెతా నాయ మవుర గొల్లడా
యెవ్వరేమనిరే నిన్ను నియ్యకుంటిఁ బదరా

కానీలే గొల్లెతా కద్దులేరా గొల్లడా
ఔనా మఱవకువే అట్టే కానీరా
నే నేమంటిని నిన్ను నీకే తెలుసురా
మానితినే ఆమాట మంచిదాయఁ బదరా

అదియేమే గొల్లెతా అందుకేరా గొల్లడా
కదినెఁ గడుపనులు కల్లగాదురా
ఇది నిక్కమటవే ఇంతకంటె నటరా
పదరకువే నీవు పలుమారు నేలరా

మెచ్చితినే గొల్లెతా మేలు లేరా గొల్లడా
కుచ్చితిఁ గాగిట నిన్నేఁ గూడుకొంటిరా
యిచ్చకుఁద శ్రీవేంకటేశుడను నేనేయెచ్చరించవలెనా, యెఱుగుదుఁ బదరా

Belle With Frog Dissection

Hello, everyone!  We all are enjoying summer holidays.  So Today we have biology class to dissect a frog.  We must enjoy this game and also improve our knowledge.
so let us start the game.  Follow instructions by mouse.  Thank you.


Get Adobe Flash Player

ఆదివారం, మే 06, 2012

చిత్రాంగుడు కధ వినండి.

ఆదివారం, మే 06, 2012


Cup Stacking

శుక్రవారం, మే 04, 2012

త్యాగరాజు @ తెరతీయగరాదా

శుక్రవారం, మే 04, 2012

నేడు కర్ణాటక  సంగీత  త్రిమూర్తులలో ఒక్కడు అయిన  శ్రీ త్యాగరాజు స్వామివారి పుట్టినరోజు.  ఈయనకు త్యాగ బ్రహ్మ అనే పేరు కూడా కలదు. ఈయన  సంగీతము ద్వారా కూడా భగవంతుని గురించి తెలుసుకోవచ్చని నిరూపించిన  గొప్ప వాగ్గేయకారుడు త్యాగరాజు.  ఈయన కీర్తనలలో శ్రీరాముని పై ఆయనకి గల భక్తిని ప్రదర్శించారు.  ఆ కీర్తనలలోనే ఆయనకు వున్నా జ్ఞానాన్ని చూపిస్తున్నాయి.  ఇతడు తిరుపతి వేంకటేశ్వరుని దర్శనం కోసం వెళ్ళినప్పుడు అక్కడ తెరవేసి ఉంటే, తెరతీయగరాదా  అనే పాట పాడితే తెరలు వేంకటేశ్వరుని దయచేత అవే తొలగిపోయినాయి. ఆ తరువాత ఆయన వేంకటేశ నిను సేవింప అనే పాట పాడినాడు.

తెరతీయగరాదా లోని    ॥తెర॥
తిరుపతి వేంకటరమణ మచ్చరమను    ॥తెర॥

పరమపురుష ధర్మాదిమోక్షముల
పారదోలుచున్నది నాలోని    ॥తెర॥

ఇరవొందగ భుజియించు సమయమున
ఈగ తగులురీతి యున్నది
హరిద్యానము సేయువేళ చిత్తము
అంత్యజువాడకు బోయినట్లున్నది   ।।తెర॥

మత్స్యము ఆకలిగొని గాలముచే
మగ్నమైన రీతి యున్నది
అచ్చమైన దీపసన్నిధిని మరు
గిడబడి చెఱచినట్లున్నది  ॥తెర॥

వాగురయని తెలియక మృగ గణములు
వచ్చి తగులురీతి యున్నది
వేగమే నీ మతము ననుసరించిన
త్యాగరాజనుత మదమత్సరమను   ॥తెర॥

మంగళవారం, ఏప్రిల్ 24, 2012

రేడియో@మార్కొని

మంగళవారం, ఏప్రిల్ 24, 2012



Radio పితామహుడు గూగ్లీమో మార్కొని గురించి మనం చెప్పుకుందాం.  
వైర్‌లెస్‌ను మొట్ట మొదట  ఇటలీ దేశానికి చెందిన గూగ్లీమో మార్కొని కనుగొన్నాడు. మార్కొని 1874 ఏప్రిల్ 25న ఇటలీలో దేశములో జన్మించాడు. ఈయన  గొప్ప ధనవంతుల కుటుంబంలో జన్మించటం వలన ప్రవేట్‌గానే చదువు కొనసాగించాడు. ఈయనికి చిన్నతనము నుండి కొత్తవిషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా కనబరిచేవారు.  ఎప్పుడు కొత్త కొత్త వస్తువులు కనిపెట్టే ప్రయత్నం చేసేవారు.  ప్రతీ విషయాన్ని బాగా లోతుగా పరిశీలించేవారు.

వివోర్నో టెక్నికల్ ఇనిస్టిట్యూట్‌లో చదువుకుంటున్న సమయంలో ఒక వ్యాసం ఆయన దృష్టిని ఆకర్శించింది. ఆ వ్యాసం పేరు ‘వైర్లు లేకుండా రేడియో తరంగాల ప్రసారం సాధ్యమా?’ అన్నది.  అప్పట్లో 1894 నాటికి టెలిగ్రాఫ్‌ని తీగల ద్వారా పంపడమే గొప్ప. మరో రెండేళ్లలో మార్కొని ప్రయోగాలు చేసి రెండు మైళ్ల దూరం వరకూ తీగల సాయం లేకుండా రేడియో తరంగాలను ప్రసారం చేయగలిగాడు.   ఎలాంటి యానకం లేకుండా ఒక చోటి నుండి మరొక చోటికి వెళ్ళగలిగిన తరంగాలు కాంతి (విద్యుదయస్కాంత తరంగాల ద్వారా సాధ్యమవుతుందని మార్కొని గుర్తించాడు. తక్కువ తరంగా ధైర్ఘ్యము వున్న దృశ్య కాంతి కన్నా ఎక్కువ తరంగ  ధైర్ఘ్యము వున్న రేడియో తరంగాలు ఇందుకు బాగా ఉపయోగపడతాయని మార్కొని  కనుగొన్నాడు. అందుకే ఈ సాధనాన్ని రేడియో  అని అంటారు.  తన పరిశోధనను ఇటలీ ప్రభుత్వం ఆమోదించకపోవడంతో బ్రిటిష్ వారికి ఇచ్చాడు. 1897 వ సంవత్సరములో ఇటాలియన్ వైజ్ఞానికుడు అయిన గూగ్లీమొ మార్కొని లండన్ లో రేడియో కోసం పేటెంట్ పొందాడు.  అప్పట్లో మార్కొని కనుక్కొన్న  రేడియో పరికరాన్ని కొన్ని నౌకలలో వాడేవాడు.  క్రమంగా 1899 నాటికి రేడియో సంకేతాలను 31 మైళ్ల్ల దూరానికి ప్రసారం చేయగలిగాడు. 1901లో అట్లాంటిక్ మహా సముద్రాన్ని దాటి రేడియో సంకేతాలను ప్రసారం చేశారు. దీంతో వైర్ లెస్ పరిశ్రమలో పెద్ద మార్పు వచ్చింది. ఆ తర్వాత వైర్‌లెస్ వ్యవస్థ వలన ఎన్నో ఉపయోగాలు కలిగాయి. మార్కొని 1909లో భౌతికశాస్త్రంలో కార్ల్ ఫెర్డినాండ్ అనే మరో శాస్త్రవేత్తతో కలిసి నోబెల్ బహుమతి పొందాడు. నేడు తీగ లేకుండా సంకేతాలు పంపుతున్న, అందుకుంటున్న టెక్నాలజీకి ఆద్యుడు మార్కొని.  ఆ రేడియోని మార్కొని కనుకున్నారు దీని వలన అప్పట్లో ఒకరినుండి ఒకరికి కమ్యునికేషనికి బాగాఉపయోగించారు. అప్పడు తయారు చేసిన రేడియో చాలాచాలా  మార్పులు చెంది నేటి FM  వరకు రూపు దిద్దుకుంది.  ఈరోజుల్లో టీవీ లు వున్నా  రేడియో  అంటే ప్రజలు ఎక్కువ ఉపయోగిస్తున్నారు.  మనకు ఎక్కడ బడితే అక్కడ  రేడియో వినటానికి వీలుగా వుంది.  మనకు Online Radio లు కూడా ప్రజలుకు అందుబాటులోకి వచ్చాయి.   అలాంటి రేడియోని కనుక్కొన్న మార్కొని పుట్టినదినము ను గుర్తు చేసుకున్నందుకు  నాకు చాలా సంతోషంగా వుంది.  అతనికి భౌతికశాస్త్రములో నోభుల్ బహుమతి కూడావచ్చింది.

శుక్రవారం, ఏప్రిల్ 20, 2012

భూలోక స్వర్గం

శుక్రవారం, ఏప్రిల్ 20, 2012

దివాన్-ఎ-ఖాస్
"భూమి మీద ఎక్కడైనా స్వర్ఘము అంటూ వుంటే అది ఇదే" అని మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ ద్వారా నిర్మించబడినది  ఈ భవనము.  ఈ భవనం ఢిల్లీ లో వుంది మరి ఆభవనం పేరు ఏమిటో తెలుసా  దివాన్-ఎ-ఖాస్.  ఇది రెడ్ ఫోర్ట్ లోని ఒక భాగము.  ఇది అద్భుతమైన కట్టడము. చక్రవర్తి గారి ప్రవేట్ విషయాలు చర్చించుకోవటానికి నిర్మించారు.  మొత్తం పాలరాయితో నిర్మించబడింది.  అక్కడ విలువైన నెమలి సింహాసనం మీద కూర్చొని విషయాలు చర్చించటానికి నిర్మించారు.  ఈ హాల్ నిర్మాణానికి పాలరాయి నవరత్నాలను ఉపయోగించి బంగారంతో నిర్మించారు.  నెమలి రూపంలో నిర్మించారు.  ఇలా తీర్చి దిద్దటానికి ఏడు సంవత్సరాలు కాలం పట్టిందిట. ఇలా చెప్తూ వుంటే ఈ నిర్మాణాన్ని చూడాలి అనిపిస్తోంది.  షాజహాన్ అన్నట్టు నిజంగా భూలోక స్వర్గంగా అనిపిస్తోంది కదండి. 

గురువారం, ఏప్రిల్ 19, 2012

ఛార్లెస్ డార్విన్

గురువారం, ఏప్రిల్ 19, 2012

మహావిశ్వాన్నీ, భూగోళం మీద కోటాను కోట్ల జీవరాశుల్ని ఎవరూ సృష్టించలేదనీ, వాటి కవే ఏర్పడ్డాయనీ, డార్విన్  చెప్పారు.  మన పాఠాల్లో చదువుకుంటున్నాం కదా!.  మరి ఈ డార్విన్ ఎవరు ఆయన సంగతి తెలుసుకోవాలని వుంది కదా!  చాలా క్లుప్తముగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.  ఛార్లెస్ డార్విన్ ష్రుబర్రీ లో ఫిబ్రవరి 12, 1809  జన్మించాడు. వీరి తండ్రిగారు తాతగారు డాక్టర్లు. డార్విన్ తన చిన్నతనము లోనుండి ప్రకృతిని చాలా బాగా పరిశీలనా తత్వం కలవారు.  అదే ప్రకృతి పరిశీలనాశక్తి వారసత్వంగా సంక్రమించిందని మనకు తెలుస్తున్నది.  ప్రకృతి పరిశీలనపట్ల డార్విన్ కున్న ఇష్టం వల్లన డాక్టర్ కాలేకపోయాడుతన తండ్రి కోరిక మేరకు మతాచార్యుడిగా మారాడుతన పరిశీలనలకు ఎక్కువ సమయం దొరకడమే దీనికి కారణం.  175 ఏళ్ల క్రితమే భూమ్మీదే లేవంటే చాలా ఆశర్యంగా ఉంటుంది.  చార్లెస్ డార్విన్ అనే శాస్త్రవేత్త జీవ జాతుల పుట్టుక అనే తన గ్రంథంలో జీవులన్నీ తమ కంటే సరళమైన ప్రాథమిక జీవుల నుండి ఆవిర్భవించాయని ప్రకటించి మత వాదుల సృష్టి వాద సిద్ధాంతాన్ని దెబ్బతీశారు. అప్పట్లో డార్విన్ చెప్పిన సిద్దాంతాలు ఎవరు నమ్మలేదు.   అప్పట్లో డార్విన్ పై అనేకమైన వ్యతిరేక ప్రచారాలు వుండేవి.  మనుషులు కోతులునుండి పరిణామం చెందాడు అని డార్విన్ అన్నదానికి.  డార్విన్  గేలిచేస్తూ ఇలా అనేవారు "మనుషులంతా కోతుల నుండి పరిణామం చెందలేదు డార్విన్ మాత్రమే కోతి నుండి వచ్చాడని"
NewsListandDetails
లండన్ కు చెందిన నావికాదళం దక్షిణ అమెరికా సముద్ర తీరాన్ని సర్వే చేయడానికి బీగల్ అనే ఓడలో బయలుదేరింది.  ప్రకృతి శాస్త్రజ్ఞుడైన డార్విన్ కు బృందంతో ప్రయాణించే అవకాశం దొరికింది. డార్విన్ డిసెంబర్ 27,1831 బీగల్ ఓడలో బయలుదేరి నాలుగు సంవత్సరాల పాటు ప్రకృతి పరిశీలనలో గడిపాడు.  అప్పుడు ఆ  యాత్రలో డార్విన్ అనేక జీవ జాతులను, శిలాజాలాలను నిశితంగా పరిశీలించాడు. ప్రతి జీవజాతి వేరువేరుగా సృష్టించబడినదా అవి ఒకదానినొకటి ఒకానొక సామాన్య జీవజాతితో సంబంధం కలిగే వున్నాయా. అనే ప్రశ్నలకు సమాధానాలు వెదకసాగాడు. 1859 లో జాతుల పుట్టుక అనే గ్రంథాన్ని రచించాడు. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని మొదట కొద్ది మంది శాస్త్రవేత్తలు మాత్రమే అంగీకరించారు. క్రమక్రమంగా తర్వాత వచ్చిన ఉత్పరివర్తన సిద్దాంతాలు కూడా పరిణామ వాదాన్నే బలపరిచాయి. దీంతో అన్ని చోట్ల డార్వాన్ సిద్దాంతానికి బలం వచ్చింది.  ఆరోగ్యం క్షీణించడంతో 1881 ఏప్రిల్ 19 డార్విన్ మరణించాడు. ప్రపంచ ప్రజలలో ఆలోచనలకు శాస్త్రీయత వైపు మళ్ళించిన మహా గొప్పమేథావిగా జీవశాస్త్ర చరిత్రలో నిలిపోయాడు.  

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)