Blogger Widgets

శనివారం, జులై 21, 2012

మువ్వన్నెల జెండా

శనివారం, జులై 21, 2012

Clipart
భారత జాతీయ పతాకం
ఎందరో మహానుభావుల కలల పంటగా ఆగస్ట్ 15,1947 న మనకు స్వాత్రంత్రం వచ్చినవిషయం అందరికి తెలిసిన విషయమే కదా!  అలా స్వాతంత్ర్యం సంపాదించటానికి ఎందరో  అమరవీరుల త్యాగ ఫలితంగా మన  భారతావనికి  స్వాతంత్ర్య లభించింది.    స్వాతంత్ర్య దినోత్సవ రోజున ఆకాశ విధిలో రివ్వు రివ్వున ఎగిరే ముచ్చటైన మువ్వన్నెల జెండాకు  జులై 22 1947 భారతీయ జాతీయ పతాకముగా ఆమోదించారు.  దీనిని పింగళి వెంకయ్యగారు రూపొందించారు.  ఈ జెండా మన భారతమాత చేతిలో ఆయుధమైన భారతీయులకు రక్షణనిస్తుంది. మన జండా విడ్త్ 2:3 గా వుంటుంది. ఈ జెండాలోని మూడు రంగులు వుంటాయి.  అవి అడ్డంగా వుంటాయి మొదటి రంగు కాషాయం.  ఈరంగు  త్యాగానికి గుర్తు. ఇది మన నాయకులు స్వలాభాన్ని విడిచిపెట్టి, తమ కర్తవ్యానికి అంకితం కావాలని సూచిస్తుంది.
తరువాత రెండవ రంగు తెలుపు ఇది  మన ప్రవర్తనను నిర్దేశించే వెలుగుకు, సత్యానికి గుర్తుగా వుంది .
ఇక మూడవదైన ఆకుపచ్చ రంగు మట్టితో మనకున్న అనుబంధానికి, ఇతర జీవులన్నీ ఏ వృక్ష సంపదమీద ఆధారపడి ఉన్నాయో. ఆ పచ్చటి చెట్లకు, సస్యశ్యామలానికి  గుర్తుగా వుంది .
జెండాలోని అశోకచక్రం ఇది సారనాద్ లోని అశోక స్థంబం నుండి తీసుకున్నది.  ఇది బ్లూ రంగులో 24 ఆకులుతో వుంటుంది ఈచక్రము ధర్మపాలనకు గుర్తు. సత్యం, ధర్మం గా కలిగివుంది.  చక్రం చలనానికి, చైతన్యానికి గుర్తు. జీవముండే ప్రతిచోటా చైతన్యం ఉంటుంది. చైతన్యం లేనిది చావులోనే అనేది గుర్తుంచుకోవాలి. భారతదేశం ఇకమీదట మార్పును స్వాగతిస్తూ ముందుకు సాగిపోవాలనేదాన్ని సూచిస్తున్నట్లుగా ఉండే చక్రం... శాంతియుతమైన, చైతన్యవంతమైన ప్రగతికి చిహ్నం. ఈ 24 ఆకులకు కూడా అర్ధం కలిగివున్నాయి.  వాటి అర్థం తెలుసుకుందామా.  
  1.  ప్రేమ
  2.  దైర్యం
  3.  సహనం
  4.  శాంతి
  5.  కరుణ
  6.  మంచి
  7.  విశ్వాసము
  8. మృదుస్వభావం 
  9. సంయమనం 
  10. త్యాగనిరతి 
  11. ఆత్మార్పణ 
  12. నిజాయితీ 
  13. సచ్చీలత 
  14. న్యాయం 
  15. దయ 
  16. హుందాతనం 
  17. వినమ్రత 
  18. దయాగుణం 
  19. జాలి 
  20. దివ్యజ్జానం 
  21. ఈశ్వర జ్ఞనం 
  22. దైవనీతి 
  23. దైవబీతి 
  24. నమ్మకం 
ఇవండీ 24 ఆకులుకు ఉన్న అర్ధాలు.  వీటిని చూస్తే జండా తయారు చేయటానికి  ఎంత కష్టపడ్డారో అర్ధం అవుతోంది .  ఈజండా ఆకాసంలో ఎగురుతూ వుంటూ "ఝండా ఊంఛా రహే హమారా..." అనే పాటను వినని వారుండరు. ఆ పాటను వింటుంటే భారతీయ హృదయాలు పొంగిపోతాయి. మువ్వన్నెల జెండా రెప రెపలాడుతుంటే చిన్న చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్ళ గుండెలూ సంతోషంతో నిండిపోతాయి. గర్వంగా తలఎత్తి సెల్యూట్‌ చేయాలనిపిస్తుంది.  ఈ జెండా వల్లే మన దేశానికి  గుర్తింపు ఉంటుంది. అదే దేశానికి తొలి గుర్తు అదే జాతీయ పతాకం అంటే ఆ దేశ సమస్త ప్రజల ఆత్మగౌరవం, గుండెచప్పుడు... వారి సార్వభౌమ అధికారం ఎవరికీ తలవంచని దేశాధ్యక్షుడైనా జాతీయ పతాకానికి తలవంచి నమస్కరించాల్సిందే...!.  మన జండాకి అవమానం జరగకుండా మనమే కాపాడుకోవాలి.    అలా అవమానించిన వారికి కటినమైన పునిష్మేంట్ ఇవ్వాలి.   ఇలా మన జాతీయ పతాకాన్ని అగౌరవ పరిచిన వారిపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి శిక్ష పడేట్లు చేయాలి. మన జాతి గౌరవానికి జాతి ఐకమత్యానికి, సార్వభౌమత్వానికి ప్రతీకగా నిలిచే జాతీయ పతాకాన్ని మనం విధిగా గౌరవించాలన్న విషయం మరువకూడదు.

జై హింద్

శుక్రవారం, జులై 20, 2012

అలెగ్జాండర్ ద గ్రేట్ మూడు కోరికలు.

శుక్రవారం, జులై 20, 2012

అలెగ్జాండర్ ద గ్రేట్ అన్న పదం మనం సాదారణంగా వినేవుంటాం.  ఆయన గొప్ప గ్రీకు చక్రవర్తి.  అతనికి యంగ్ టైగర్ తో పోలుస్తారు.  అతి చిన్నవయస్కుడు అయిన గొప్ప చక్రవర్తి.   మెగాస్ అలెగ్జాండ్రోస్, జులై 20, క్రీ.పూ. 356 - జూన్ 11, క్రీ.పూ. 323 మద్య కాలంలో జన్మించారు.  ఈరోజు అలెగ్జాండరు పుట్టిన దినము. గ్రీకు దేశములోని మాసిడోనియా రాజ్యాన్ని పరిపాలించిన రాజు. ఇతను చనిపోయే సమయానికి, అప్పటి పురాతన గ్రీకులకు తెలిసినంతవరకు భూమిని ఆక్రమించుకున్నాడు.  క్రీ.పూ 326 వ సంవత్సరంలో అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర చేశాడు. సింధూ నదిని దాటి తక్షశిల నగరం వైపుగా చొరబడ్డాడు. జీలం మరియు చీనాబ్ నదుల మధ్య గల రాజ్యాన్ని పరి పాలిస్తున్న పురుషోత్తముడు అనే రాజును యుద్ధానికి ఆహ్వానించాడు. అయితే ఆ సమయము లొ అప్పటికే యుద్దం చేసి అలెగ్జాండర్ సైనికులు అలసిపోతారు.  అలెగ్జాండర్ సైన్యధిపతి వచ్చి మన సైనికులు అందరూ అలసిపొయారు ఇక యుద్దము  చేయలేరని తెలియచేస్తాడు. అంతే కాదు పురుషొత్తముని సైనిక బలం కుడా అధికంగానే ఉంది వారిని ఎదుర్కొనే శక్తి మన సైనికులకు లేదని తెలియచేస్తాడు. ఈ విషయమ్ తెలుసుకొని కొన్ని రొజుల పాటు విశ్రాంతి తీసుకొని వెళిపొతాడు. ఇంకా ఆయన భారతదేశ సందర్శనలో ఎందరో భారతీయ తత్వవేత్తలను, బుద్ధి బలానికి ప్రఖ్యాతి గాంచిన బ్రాహ్మణుల్ని కలిశాడు. వారితో సంవాదం చేశాడు. కొందరిని వారి దేశానికి రమ్మని ఆహ్వానం కూడా పంపాడు.  అలెగ్జాండర్ తో యుద్డంచేయకుండానే చాలా మంది రాజులు లొంగిపోయారు వారిలో తక్షశిలాదీసుడైన అంభి ఒక్కరు.  అలెగ్జాండర్ కి మనదేశం అంటే మంచి అభిప్రాయం వుండేది అతని చివరి కోరిక ఒకటి వుంది.  అది ఏమిటి అంటే హిమాలయాలను దాటి వచ్చి కాశ్మీర్ మన భారత దేశపు చివరను చూడాలి అనే కోరిక వుండేది.  అయితే ఆకోరిక నెరవేరలేదు.   అలెగ్జాండర్ చాలా రాజ్యాలను జయించిన తర్వాత ఇంటికి తిరిగి వెళుతున్నాడు.మార్గమధ్యంలో తీవ్ర అనారోగ్యానికి గురై మరణ శయ్యపై చేరాడు. తాను మరణించడం తథ్యమని అలెగ్జాండర్ కు అవగతమైపోయింది.తాను సాధించిన గొప్ప గొప్ప విజయాలు, అమిత శక్తిశాలురైన సైన్యం, అంతులేని సంపద తన్ను మరణం నుంచి దూరం చేయలేవని తెలుసుకున్నాడు.  తనకు ఇంటికి వెళ్లిపోవాలి అనే కోరిక కలిగింది. తన తల్లికి కడసారిగా తన ముఖాన్ని చూపించి చనిపోవాలన్న కోరికతో  ఇంటిముఖం పట్టాడు . కానీ తను ఇంటికి చేరే వరకు తన ప్రాణాలు ఆగలేదు చనిపోయేముందు  తన సైన్యాధికారులను దగ్గరికి పిలిచి ఇలా అన్నాడు.
“నేనింక కొద్దిసేపట్లో ఈ లోకం నుంచి నిష్క్రమించబోతున్నాను. నాకు చివరగా మూడు కోరికలున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నెరవేర్చకుండా విస్మరించకండి.” అని వారి నుండి వాగ్ధానం తీసుకున్నాడు.
అశ్రు నయనాలతో కడసారిగా తమ రాజు గారి ఆజ్ఞను వినమ్రంగా అంగీకరించారు ఆ అధికారులు.
నా మొదటి కోరిక: ” నా శవ పేటికను కేవలం నా వైద్యులు మాత్రమే మోయాలి”
రెండవ కోరిక: “నా పార్థివ దేహం స్మశానానికి వెళ్ళే దారిలో నేను సంపాదించిన విలువైన వజ్రాలు, మణి మాణిక్యాలు పరచండి”
మూడవ కోరిక: “శవపేటిక లో నుంచి నా ఖాళీ చేతులు బయటికి కనిపించే విధంగా ఉంచండి”
చుట్టూ మూగి ఉన్న సైనికులు ఆయన విచిత్రమైన కోరికలు విని ఆశ్చర్యపోయారు.కానీ వారిలో ఎవ్వరికీ ఆయన్ను అడిగే ధైర్యం లేకపోయింది. అలెగ్జాండర్ కు అత్యంత ప్రీతి పాత్రుడైన ఒక సైనికుడు ఆయన కోరికలను తప్పక నెరవేరుస్తామని మాట ఇచ్చాడు. ఈ కోరికల వెనక ఆంతర్యమేమిటో సెలవియ్యమని అడిగాడు.  అలెగ్జాండర్ అతి కష్టమ్మీద ఇలా అన్నాడు. “ఈ మూడు కోరికలు నేనిప్పుడే నేర్చుకున్న మూడు పాఠాలకు ప్రతిరూపాలు.”

“మొదటి కోరికలో నా ఆంతర్యం, నిజానికి ఏ వైద్యుడూ మరణాన్ని ఆపలేడు . ఒకవేళ వైద్యం చేసినా వల్లకాటి వరకే.” అని చెప్పడానికి.

“రెండవ కోరికలో నా ఆంతర్యం, నా జీవితంలో సింహ భాగం సంపదను కూడబెట్టడానికే సరిపోయింది.అదేదీ నా వెంట తీసుకెళ్ళలేక పోతున్నాననీ, కేవలం సిరిసంపదల వెంటబడి విలువైన సమయాన్ని, జీవితంలో మాధుర్యం కోల్పోవద్దని చెప్పడానికి”

“మూడవ కోరికలో నా ఆంతర్యం ఈ ప్రపంచంలోకి నేను వచ్చేటపుడు వట్టి చేతులతో వచ్చాను. ఇప్పుడు వట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను అని చెప్పడానికే ”  అని చెప్పి కన్ను మూశాడు.

అలెగ్జాండర్ రాజ్యకాంక్ష గల గొప్ప చక్రవర్తి అయినా మనభారతదేశంలో అడుగుపెట్టే సరికి ఎంత మార్పువచ్చిందో కదా.  ఆయన చనిపోయిన తరువాత ఆయన శవం పాడవకుండా తేనెలో వుంచి చేతులు బయటికి వుంచి అలేగ్జండర్ చివరి కోరికలను  సైనికులు నెరవేర్చారు. 

జన్యుశాస్త్రానికి ఆద్యుడు

ఈరోజు నాకు చాలా ఇష్టం అయిన శాస్త్రవేత్త పుట్టినరోజు.  ఆయన ఎవరో తెలుసుకుంటారా.  ఈరోజు 1822 జులై 20 న  జన్యు శాస్త్రానికి ఆద్యుడు  గ్రెగర్ జాన్ మెండెల్ జన్మదినము.  ఈయన  ఆస్ట్రియా సన్యాసి, వృక్షశాస్త్రజ్ఞుడు. 'లాస్ ఆఫ్ హెరెడిటీ' జీవుల అనువంశికత సూత్రాలు కనుగొన్నాడు. చిన్నప్పుడు తోట పని చేశాడు. తేనెటీగలు పెంచాడు. పెద్దయ్యాక మతబోధకుడిగా స్థిరపడ్డాడు. అయినా నిరంతర అధ్యయనం, పరిశీలనల వల్ల శాస్త్రవేత్త అయ్యాడు. ఆయన చేసిన పరిశోధనను ఆయన జీవించి ఉండగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆయన కనుగొన్న సూత్రాలు ఆయన మరణానంతరం ఓ కొత్త శాస్త్రం ఆవిర్భావానికి నాందిగా నిలిచాయి. వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలపై ప్రయోగాలు చేసి తర్వాతి కాలంలో 'ఫాదర్‌ ఆఫ్‌ జెనెటిక్స్‌'గా కీర్తి పొందిన ఆ శాస్త్రవేత్తే జోహన్‌ గ్రెగర్‌ మెండెల్‌.  అప్పటి ఆస్ట్రియాలోని మొరావియాలో ఓ రైతు కుటుంబంలో పుట్టిన జోహన్‌ గ్రెగర్‌ బాల్యమంతా తండ్రి వెంట పొలాల్లో గడిచింది. తోటలు, తేనెటీగల పెంపకంలో చురుగ్గా ఉండే అతడికి ప్రకృతి అధ్యయనం, సునిశిత పరిశీలన సహజంగానే అలవడ్డాయి. హైస్కూలు కోసం పట్నానికి వెళ్లినా తండ్రికి జరిగిన ప్రమాదం వల్ల తిరిగి రావడంతో చదువుకు ఆటంకం ఏర్పడింది.ఆపై ఉపాధ్యాయుడి సలహాపై క్రైస్తవ సన్యాసిగా మారడానికి నిర్ణయించుకుని మఠంలో చేరాడు. ఆ విధంగా 21వ ఏటనే 'గ్రిగర్‌' పేరును స్వీకరించి మఠాధిపతిగా మారాడు. సైన్స్‌ పట్ల అభిరుచితో ఎన్నోపుస్తకాలు చదివేవాడు.  మఠంలోని తోటలో బఠానీ మొక్కలపై ఉత్సుకతతో ఆయన చేసిన పరిశోధన ఫలితాలే వంశపారంపర్య సిద్ధాంతానికి  మూల సూత్రాలుగా తర్వాతి కాలంలో పేరొందాయి. ఈ మొక్కల్లో పొడుగు, పొట్టి రకాలకు అంట్లు కట్టి, వాటిని కొన్ని తరాల పాటు పెంచి, ఏ తరానికి ఆ తరం వాటి లక్షణాలను నమోదు చేసుకుంటూ తన పరిశీలనలను సూత్రీకరించగలిగాడు. దాదాపు 30,000 మొక్కలపై ఆయన జరిపిన ప్రయోగాలే మెండల్‌ నియంత్రణ నియమం , ఖండీకరణ నియమం గా పేరొందాయి.  మనుషుల్లో తరతరాల్లో కనిపించే పోలికలు, లక్షణాలు ఎలా సంక్రమించే అవకాశం ఉందనే విషయాలను కూడా ఈ సూత్రాలు విశదీకరించగలిగాయి.దాదాపు 30 ఏళ్ల తర్వాత వంశపారంపర్యతపై పరిశోధనలు చేసిన కొందరు శాస్త్రవేత్తలు, జోహన్‌ సూత్రాలను చదివితే కానీ తాము పొందిన ఫలితాలను అర్థం చేసుకోలేకపోయారంటే ఇవెంత ప్రాముఖ్యతను పొందాయో తెలుస్తుంది.  జన్యుశాస్త్రం  వివిధ ప్రయోగాలతో కూడిన, జీవులకు సంబంధించిన ఆధునిక శాస్త్రం. జెనెటిక్స్ , జీవశాస్త్రంలో ఒక ముఖ్యమైన విభాగం. ఇది జీవుల అనువంశికత కు సంబంధించిన శాస్త్ర విజ్ఞానం.
20వ శతాబ్దం వరకు తల్లిదండ్రులు పిల్లల్లో కనిపించే తమ లక్షణాలకు తమ రక్తమే కారణమని భావించేవారు. కానీ తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు సంక్రమించడాన్ని అనువంశికత అంటారని, దానికి కారణం జన్యువులనీ ప్రముఖ శాస్త్రవేత్త గ్రెగర్ జాన్ మెండల్ తెలిపాడు.జన్యువులు డి.ఎన్.ఎ. నిర్మాణంలోని నిర్ధిష్ట ప్రదేశాలు. ఇవి క్రోమోజోములలో ఉంటాయి.
 
మెండల్ అనువంశిక సిద్ధంతములు:
సంయోగ బీజాల శుద్ధతా సిద్ధాంతం: సంకరంలో కలిసివుండే రెండు యుగ్మ వికల్పాలు సంయోగబీజాలు ఏర్పడేటప్పుడు క్షయకరణ విభజన ద్వారా విడిపోయి వేర్వేరు సంయోగ బీజాల్లోకి ప్రవేశిస్తాయి. అందువలన శుద్ధమైన సంయోగబీజాలు ఏర్పడతాయి.
స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం: రెండు లేదా అంతకంటే ఎక్కువ జతల లక్షణాలున్న ఒకే జాతికి చెందిన రెండు మొక్కల మధ్య సంకరణం జరిపినప్పుడు, ఒక జత లక్షణాలు (జన్యువులు) ఇంకొక జత లక్షణాలతో సంబంధం లేకుండా సంయోగబీజాల్లోకి పంపిణీ అవుతాయి.
ఈయన గురించి తెలుసుకోవటం చాలా సంతోషం గా వుంది.  మనబ్లాగ్ ద్వారా ఈ గొప్ప శాస్త్రవేత్త కు నివాళి అర్పిస్తున్నాం.

గురువారం, జులై 19, 2012

రంగులముగ్గులు ముంగిటనిలిచి రమ్మనిపిలిచినవీ

గురువారం, జులై 19, 2012

ఆషాడ మాసం వెళ్ళిపోయి శ్రావణమాసం వచ్చేసింది.  అందరి ఇళ్ళల్లోను హడావిడి.  ఎందుకు ఈ హడావిడి.  శ్రావణమాసం అంటే అందరికి ఇష్టం కాబట్టి.  శ్రవణమాసం అంటే ఇళ్ళలో పూజలు, వ్రతాలు నోములు చేసుకుంటారు కదా.  అసలు ఈ శ్రావణ మాసం అని ఎందుకు పేరు వచ్చిందో మీకు ఎప్పుడైనా సందేహం వచ్చిందా ? నాకు అయితే వచ్చింది అయితే అది తెలుసుకునే ప్రయత్నం చేశా అప్పుడు అమ్మమ్మ తన పని చేసుకుంటూ నాకు చెప్పింది.  అది ఏమిటి అంటే  మనయొక్క మొరలని ఆలకించేందుకు ఆ తల్లిని (లక్ష్మీదేవి) సిద్దపరిచే మాసం కనుకనే శ్రావణం అని పేరు వచ్చింది . మన మొరలని ఆలకించే సమయం, శ్రవణ సంబంధమైన మాసం శ్రావణము. ఈ మాసంలో అమ్మ మనకు ఏకాంతంగా లభిస్తుంది.  ఆషాడ మాస ఏకాదశి వరకు స్వామితో నిరంతరం ఉండే తల్లి పాలకడలిలో స్వామిని యోగ నిద్రలో పవళింపజేసి జగత్ రక్షణ ఎట్లా చేయాలో ఆలోచించుకోవడానికి కావల్సిన సమయాన్ని ఆయనకు ఇవ్వడానికి స్వామికి విశ్రాంతినిచ్చి అమ్మ బయలుదేరుతుంది. తరువాత వచ్చే మాసమైన శ్రావణ మాసంలో అమ్మ అందరి మొరలు వినడానికి అందుబాటులోకి వస్తుంది. అందుకే అమ్మను ఆరాధన చేస్తుంటారు. శ్రావణ మాసం అంతా అమ్మను ఆరాధన చేయడానికి వీలైన సమయం. ప్రక్కన స్వామి లేనప్పుడు మన భాదలను అమ్మతో ఒంటరిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది.  ఆ అమ్మ దయకోసం మనం ఎంతో ప్రయత్నం చేయాలి.  ఆ అమ్మకు అనేక రకాల పేర్లు ఉన్నట్లు మనం గ్రంథాల్లో చూస్తున్నాం. ఆమె కి వెయ్యి పేర్లు వున్నాయి.  ఆమెకి లక్ష్మీ అని పేరు. శ్రీ అని పేరు. ఇందిరా అని పేరు. లోక మాతా, రమా, మంగళ దేవతా అని ఇలా ఎన్నేన్నో పేర్లు. అయితే ప్రసిద్దమైన పేర్లు 'లక్ష్మీ' మరియూ "శ్రీ", ఇవి వేదం చెప్పిన పేర్లు.  అమె చేసే ఉపకారాలను బట్టి ఎన్నెన్నో పేర్లు చెప్పినా "హ్రీశ్చతే లక్ష్మీచ పత్-న్యౌ" లేక "శ్రీ భవతు " అంటూ వేదం చెబుతుంది. అందుకే భగవంతుణ్ణి గుర్తించేప్పుడు ఆయనలోని దయాది గుణాలను పైకి తెచ్చే నామంతో గుర్తించాలి. అందుకే ఆయనని శ్రీపతి లేక శ్రియపతి అని పిలుస్తుంటారు. లేదా లక్ష్మీనాథా అని పిలుస్తుంటారు. ఆయనకంటూ నారాయణ, విష్ణు అనే ఎన్నో నామాలు ఉన్నప్పటికీ ప్రచురంగా కనిపించే నామం శ్రీపతి అనో లేక లక్ష్మీనాథా అనో. ఆవిడ సంబంధం ద్వారా వచ్చిన నామాలు కనుక. అంటే ఆమె ఆయనలో పెంచిన దయ ద్వారా మనల్ని గుర్తిస్తాడు అని భావిస్తాం.  మరి ఇలాంటి శ్రవణమాసపు  మహాలక్ష్మి కి స్వాగతం పలుకుదాం.  ఈ పాట  ద్వారా ఎలా స్వాగతం పలకలో చూడండి  మరి .
                         
రంగుల  ముగ్గులు ముంగిట నిలిచి రమ్మని పిలిచినవీ
వాకిట నిలిచినా తోరనమాలలు స్వాగతమోసగినవి 

అనేకవిదాలుగా శ్రావణ లక్ష్మి దేవికి స్వాగతము పలుకుతున్నది.  మరి ఇదే సంధర్బములో మన బ్లాగ్ మిత్రులందరి కోరికలు అమ్మ తప్పకుండా విని .  వారికోరికలు నెరవేర్చాలని అమ్మని నేనుకూడా కోరుకుంటున్నాను.  అందరికి శ్రావణమాసం శుభాకాంక్షలు.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)