Blogger Widgets

శుక్రవారం, జులై 20, 2012

అలెగ్జాండర్ ద గ్రేట్ మూడు కోరికలు.

శుక్రవారం, జులై 20, 2012

అలెగ్జాండర్ ద గ్రేట్ అన్న పదం మనం సాదారణంగా వినేవుంటాం.  ఆయన గొప్ప గ్రీకు చక్రవర్తి.  అతనికి యంగ్ టైగర్ తో పోలుస్తారు.  అతి చిన్నవయస్కుడు అయిన గొప్ప చక్రవర్తి.   మెగాస్ అలెగ్జాండ్రోస్, జులై 20, క్రీ.పూ. 356 - జూన్ 11, క్రీ.పూ. 323 మద్య కాలంలో జన్మించారు.  ఈరోజు అలెగ్జాండరు పుట్టిన దినము. గ్రీకు దేశములోని మాసిడోనియా రాజ్యాన్ని పరిపాలించిన రాజు. ఇతను చనిపోయే సమయానికి, అప్పటి పురాతన గ్రీకులకు తెలిసినంతవరకు భూమిని ఆక్రమించుకున్నాడు.  క్రీ.పూ 326 వ సంవత్సరంలో అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర చేశాడు. సింధూ నదిని దాటి తక్షశిల నగరం వైపుగా చొరబడ్డాడు. జీలం మరియు చీనాబ్ నదుల మధ్య గల రాజ్యాన్ని పరి పాలిస్తున్న పురుషోత్తముడు అనే రాజును యుద్ధానికి ఆహ్వానించాడు. అయితే ఆ సమయము లొ అప్పటికే యుద్దం చేసి అలెగ్జాండర్ సైనికులు అలసిపోతారు.  అలెగ్జాండర్ సైన్యధిపతి వచ్చి మన సైనికులు అందరూ అలసిపొయారు ఇక యుద్దము  చేయలేరని తెలియచేస్తాడు. అంతే కాదు పురుషొత్తముని సైనిక బలం కుడా అధికంగానే ఉంది వారిని ఎదుర్కొనే శక్తి మన సైనికులకు లేదని తెలియచేస్తాడు. ఈ విషయమ్ తెలుసుకొని కొన్ని రొజుల పాటు విశ్రాంతి తీసుకొని వెళిపొతాడు. ఇంకా ఆయన భారతదేశ సందర్శనలో ఎందరో భారతీయ తత్వవేత్తలను, బుద్ధి బలానికి ప్రఖ్యాతి గాంచిన బ్రాహ్మణుల్ని కలిశాడు. వారితో సంవాదం చేశాడు. కొందరిని వారి దేశానికి రమ్మని ఆహ్వానం కూడా పంపాడు.  అలెగ్జాండర్ తో యుద్డంచేయకుండానే చాలా మంది రాజులు లొంగిపోయారు వారిలో తక్షశిలాదీసుడైన అంభి ఒక్కరు.  అలెగ్జాండర్ కి మనదేశం అంటే మంచి అభిప్రాయం వుండేది అతని చివరి కోరిక ఒకటి వుంది.  అది ఏమిటి అంటే హిమాలయాలను దాటి వచ్చి కాశ్మీర్ మన భారత దేశపు చివరను చూడాలి అనే కోరిక వుండేది.  అయితే ఆకోరిక నెరవేరలేదు.   అలెగ్జాండర్ చాలా రాజ్యాలను జయించిన తర్వాత ఇంటికి తిరిగి వెళుతున్నాడు.మార్గమధ్యంలో తీవ్ర అనారోగ్యానికి గురై మరణ శయ్యపై చేరాడు. తాను మరణించడం తథ్యమని అలెగ్జాండర్ కు అవగతమైపోయింది.తాను సాధించిన గొప్ప గొప్ప విజయాలు, అమిత శక్తిశాలురైన సైన్యం, అంతులేని సంపద తన్ను మరణం నుంచి దూరం చేయలేవని తెలుసుకున్నాడు.  తనకు ఇంటికి వెళ్లిపోవాలి అనే కోరిక కలిగింది. తన తల్లికి కడసారిగా తన ముఖాన్ని చూపించి చనిపోవాలన్న కోరికతో  ఇంటిముఖం పట్టాడు . కానీ తను ఇంటికి చేరే వరకు తన ప్రాణాలు ఆగలేదు చనిపోయేముందు  తన సైన్యాధికారులను దగ్గరికి పిలిచి ఇలా అన్నాడు.
“నేనింక కొద్దిసేపట్లో ఈ లోకం నుంచి నిష్క్రమించబోతున్నాను. నాకు చివరగా మూడు కోరికలున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నెరవేర్చకుండా విస్మరించకండి.” అని వారి నుండి వాగ్ధానం తీసుకున్నాడు.
అశ్రు నయనాలతో కడసారిగా తమ రాజు గారి ఆజ్ఞను వినమ్రంగా అంగీకరించారు ఆ అధికారులు.
నా మొదటి కోరిక: ” నా శవ పేటికను కేవలం నా వైద్యులు మాత్రమే మోయాలి”
రెండవ కోరిక: “నా పార్థివ దేహం స్మశానానికి వెళ్ళే దారిలో నేను సంపాదించిన విలువైన వజ్రాలు, మణి మాణిక్యాలు పరచండి”
మూడవ కోరిక: “శవపేటిక లో నుంచి నా ఖాళీ చేతులు బయటికి కనిపించే విధంగా ఉంచండి”
చుట్టూ మూగి ఉన్న సైనికులు ఆయన విచిత్రమైన కోరికలు విని ఆశ్చర్యపోయారు.కానీ వారిలో ఎవ్వరికీ ఆయన్ను అడిగే ధైర్యం లేకపోయింది. అలెగ్జాండర్ కు అత్యంత ప్రీతి పాత్రుడైన ఒక సైనికుడు ఆయన కోరికలను తప్పక నెరవేరుస్తామని మాట ఇచ్చాడు. ఈ కోరికల వెనక ఆంతర్యమేమిటో సెలవియ్యమని అడిగాడు.  అలెగ్జాండర్ అతి కష్టమ్మీద ఇలా అన్నాడు. “ఈ మూడు కోరికలు నేనిప్పుడే నేర్చుకున్న మూడు పాఠాలకు ప్రతిరూపాలు.”

“మొదటి కోరికలో నా ఆంతర్యం, నిజానికి ఏ వైద్యుడూ మరణాన్ని ఆపలేడు . ఒకవేళ వైద్యం చేసినా వల్లకాటి వరకే.” అని చెప్పడానికి.

“రెండవ కోరికలో నా ఆంతర్యం, నా జీవితంలో సింహ భాగం సంపదను కూడబెట్టడానికే సరిపోయింది.అదేదీ నా వెంట తీసుకెళ్ళలేక పోతున్నాననీ, కేవలం సిరిసంపదల వెంటబడి విలువైన సమయాన్ని, జీవితంలో మాధుర్యం కోల్పోవద్దని చెప్పడానికి”

“మూడవ కోరికలో నా ఆంతర్యం ఈ ప్రపంచంలోకి నేను వచ్చేటపుడు వట్టి చేతులతో వచ్చాను. ఇప్పుడు వట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను అని చెప్పడానికే ”  అని చెప్పి కన్ను మూశాడు.

అలెగ్జాండర్ రాజ్యకాంక్ష గల గొప్ప చక్రవర్తి అయినా మనభారతదేశంలో అడుగుపెట్టే సరికి ఎంత మార్పువచ్చిందో కదా.  ఆయన చనిపోయిన తరువాత ఆయన శవం పాడవకుండా తేనెలో వుంచి చేతులు బయటికి వుంచి అలేగ్జండర్ చివరి కోరికలను  సైనికులు నెరవేర్చారు. 

4 కామెంట్‌లు:

  1. రేపు జగన్ ద గ్రేట్,మన్మోహన్ ద స్ట్రాంగ్ అన్నా నమ్మేలా ఉన్నారు మీరు.. వాడెవడో వీన్ని గ్రేట్ అంటే దాన్ని పట్టుకు వేలాడటమేనా ? మీకు రామున్ని, కృష్ణున్ని విమర్శించే హక్కు లేదా ? వీడు మాత్రం గ్రేట్ ఆ ? ఏం చదువుకున్నారు మీరు ? ఏ ఊరు మీది ?

    రిప్లయితొలగించండి
  2. ఓ మీరింత చిన్న వయస్కులా .. చూడనే లేదు మీ ప్రొఫైల్. నా కామెంట్ పెద్దవారిని ఉద్దేశించింది. అలా పుస్తకం లో ఇచ్చే విశేషణాలను పట్టించుకోకుండా, ఎవరు చేసిన పనులను వారికి ఆపాదించి చూడు పాపా. వేలాది మంది చావు కి కారణమైనవాడు గ్రేట్ అని ఎలా చెబుతాం. ఇంకా కావాలంటే తిండీ తిప్పలు మాని నిరాహార దీక్ష అని, తనని తాను హింసించుకునే గాంధీది అహింస అని ఎలా ఒప్పుకోగలం, అతను ఎలా మహాత్ముడు అని ప్రశ్నించటం అలవాటు చెసుకోగలవని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)