శనివారం, జులై 21, 2012
|
భారత జాతీయ పతాకం |
ఎందరో మహానుభావుల కలల పంటగా ఆగస్ట్ 15,1947 న మనకు స్వాత్రంత్రం వచ్చినవిషయం అందరికి తెలిసిన విషయమే కదా! అలా స్వాతంత్ర్యం సంపాదించటానికి ఎందరో అమరవీరుల త్యాగ ఫలితంగా మన భారతావనికి స్వాతంత్ర్య లభించింది. స్వాతంత్ర్య దినోత్సవ రోజున ఆకాశ విధిలో రివ్వు రివ్వున ఎగిరే ముచ్చటైన మువ్వన్నెల జెండాకు జులై 22 1947 భారతీయ జాతీయ పతాకముగా ఆమోదించారు. దీనిని పింగళి వెంకయ్యగారు రూపొందించారు. ఈ జెండా మన భారతమాత చేతిలో ఆయుధమైన భారతీయులకు రక్షణనిస్తుంది. మన జండా విడ్త్ 2:3 గా వుంటుంది. ఈ జెండాలోని మూడు రంగులు వుంటాయి. అవి అడ్డంగా వుంటాయి మొదటి రంగు కాషాయం. ఈరంగు త్యాగానికి గుర్తు. ఇది మన నాయకులు స్వలాభాన్ని విడిచిపెట్టి, తమ కర్తవ్యానికి అంకితం కావాలని సూచిస్తుంది.
తరువాత రెండవ రంగు తెలుపు ఇది మన ప్రవర్తనను నిర్దేశించే వెలుగుకు, సత్యానికి గుర్తుగా వుంది .
ఇక మూడవదైన ఆకుపచ్చ రంగు మట్టితో మనకున్న అనుబంధానికి, ఇతర జీవులన్నీ ఏ వృక్ష సంపదమీద ఆధారపడి ఉన్నాయో. ఆ పచ్చటి చెట్లకు, సస్యశ్యామలానికి గుర్తుగా వుంది .
జెండాలోని అశోకచక్రం ఇది సారనాద్ లోని అశోక స్థంబం నుండి తీసుకున్నది. ఇది బ్లూ రంగులో 24 ఆకులుతో వుంటుంది ఈచక్రము ధర్మపాలనకు గుర్తు. సత్యం, ధర్మం గా కలిగివుంది. చక్రం చలనానికి, చైతన్యానికి గుర్తు. జీవముండే ప్రతిచోటా చైతన్యం ఉంటుంది. చైతన్యం లేనిది చావులోనే అనేది గుర్తుంచుకోవాలి. భారతదేశం ఇకమీదట మార్పును స్వాగతిస్తూ ముందుకు సాగిపోవాలనేదాన్ని సూచిస్తున్నట్లుగా ఉండే చక్రం... శాంతియుతమైన, చైతన్యవంతమైన ప్రగతికి చిహ్నం. ఈ 24 ఆకులకు కూడా అర్ధం కలిగివున్నాయి. వాటి అర్థం తెలుసుకుందామా.
- ప్రేమ
- దైర్యం
- సహనం
- శాంతి
- కరుణ
- మంచి
- విశ్వాసము
- మృదుస్వభావం
- సంయమనం
- త్యాగనిరతి
- ఆత్మార్పణ
- నిజాయితీ
- సచ్చీలత
- న్యాయం
- దయ
- హుందాతనం
- వినమ్రత
- దయాగుణం
- జాలి
- దివ్యజ్జానం
- ఈశ్వర జ్ఞనం
- దైవనీతి
- దైవబీతి
- నమ్మకం
ఇవండీ 24 ఆకులుకు ఉన్న అర్ధాలు. వీటిని చూస్తే జండా తయారు చేయటానికి ఎంత కష్టపడ్డారో అర్ధం అవుతోంది . ఈజండా ఆకాసంలో ఎగురుతూ వుంటూ "ఝండా ఊంఛా రహే హమారా..." అనే పాటను వినని వారుండరు. ఆ పాటను వింటుంటే భారతీయ హృదయాలు పొంగిపోతాయి. మువ్వన్నెల జెండా రెప రెపలాడుతుంటే చిన్న చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్ళ గుండెలూ సంతోషంతో నిండిపోతాయి. గర్వంగా తలఎత్తి సెల్యూట్ చేయాలనిపిస్తుంది. ఈ జెండా వల్లే మన దేశానికి గుర్తింపు ఉంటుంది. అదే దేశానికి తొలి గుర్తు అదే జాతీయ పతాకం అంటే ఆ దేశ సమస్త ప్రజల ఆత్మగౌరవం, గుండెచప్పుడు... వారి సార్వభౌమ అధికారం ఎవరికీ తలవంచని దేశాధ్యక్షుడైనా జాతీయ పతాకానికి తలవంచి నమస్కరించాల్సిందే...!. మన జండాకి అవమానం జరగకుండా మనమే కాపాడుకోవాలి. అలా అవమానించిన వారికి కటినమైన పునిష్మేంట్ ఇవ్వాలి. ఇలా మన జాతీయ పతాకాన్ని అగౌరవ పరిచిన వారిపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి శిక్ష పడేట్లు చేయాలి. మన జాతి గౌరవానికి జాతి ఐకమత్యానికి, సార్వభౌమత్వానికి ప్రతీకగా నిలిచే జాతీయ పతాకాన్ని మనం విధిగా గౌరవించాలన్న విషయం మరువకూడదు.
జై హింద్
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
చాలా బాగా చెప్పారండి
రిప్లయితొలగించండి