Blogger Widgets

Monday, September 19, 2011

అనగనగా ఒక......

Monday, September 19, 2011

భారతదేశం ఒక అధ్బుతమైన జానపద కథల సమాహారం. ఈ కథల చెప్పడంకథ యొక్క సంప్రదాయం ద్వారా శతాబ్దాలుగా ఉద్భవించింది కలిగి వుంది. అదే అనగనగ ఒక (రోజు, వూరు, లేక రాజు) అన్న పదాలతో మొదలు అవుతాయి మన కధలు.  మా పిల్లలుకు కధలు వినాలంటే కధకు ముందు అనగనగా అనగనగా అన్న మాటలు లేకపోతె కదా విన్న ఫీలింగే వుండదు.  నిజంగా మన దేశం యొక్క సంస్కృతి అంతర్భాగమైన. వారు ప్రాచీన భారతదేశం వారు చాలా ఆలోచనాపరులు మరియు ఋషులు ద్వారా పెద్దవారి ద్వారా సాధారణంగా జానపద కధలు లో జ్ఞానం అలాగే సార్వత్రిక విలువలు కలిగి ఉంటాయి.  కథలు సేకరణ సాంస్కృతికంగా అధిక మరియు విభిన్నమైన స్ధలం వివిధ ప్రాంతాల జీవితాలను మరియు తత్వాలుప్రతిబింబిస్తుంది. 
ప్రపంచ సాహిత్యానికి భారత దేశం అందించిన గొప్ప రచనలలో ఎన్నదగినది పంచతంత్రం. క్రీ. శ. 5 వ శతాబ్దంలో విష్ణుశర్మ అనే గురువర్యుడు సంస్కృత భాషలో రచించిన ఈ పుస్తకాన్ని ఆయన రచించాడు. ఐదు భాగాలుగా విభజించిన ఈ పుస్తకం అనేక చిన్నచిన్న కథల సమాహారం. మానవ జీవితంలో అవసరమైన ఎన్నో ధర్మాలను, నీతి సూత్రాలను చక్కటి కథల రూపంలో, ఆసక్తికరమైన కథనంతో విష్ణుశర్మ బోధించాడు. విషయ పరిజ్ఞానం, బోధనా సామర్థ్యం, ​​చక్కని పాఠ్య ప్రణాళిక ఉంటే, చదువంటే ఇష్టము, ఆసక్తి లేని వారికి కూడా బోధించి విద్యావంతులను చెయ్యవచ్చని 5 వ శతాబ్దం లోనే విష్ణుశర్మ నిరూపించాడు. పాత్రల పేర్లు వాటి మనస్తత్వాన్ని, సహజ ప్రవృత్తినీ, నడతను సూచిస్తూ ఉంటాయి. కథనం సరళంగా ఉంటూ, సామెతలు, ఉపమానాలను గుప్పిస్తూ, ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది.సమాజం గురించి, వ్యవస్థ, మనుష్య ధర్మం గురించిన ఎన్నో విషయాలు కథలలో మిళితమై వస్తాయి. పంచతంత్రం ఒక ప్రాంతానికి, ఒక కాలానికి పరిమితం కాని, చిరస్థాయిగా నిలిచిపోయే సార్వత్రిక విజ్ఞానం మనం పొడవచ్చు అని విష్ణుశర్మ నిరూపించారు. మా అమ్మమ్మ కధలు చెప్పేటప్పుడు అనగనగా అని కధ మొదలు పెడుతుంది అప్పుడు ఆకధలోకి మేము లీనము అయిపోయి మరీ వింటాము. అనగనగా అన్నపదం మనలను కధను ఏకాగ్రతను కలిగేలా చేస్తుంది.  మన ప్రాచీనులు పిల్లల మనస్తత్వాన్ని భాగా అర్ధం చేసుకొని మరీ కనిపిట్టినట్టువున్నారు కదూ.  వారికి మనము థాంక్స్ చెప్పుకోవాలి కదా.

3 comments:

  1. చాలామంచి విషయం రాశావు బంగారు.. నీ తెలుగు చాలా బాగుంది.. ఇలానే మరిన్ని రాస్తూ ఉండు.

    ReplyDelete
  2. చక్కగా రాశావమ్మా.

    ReplyDelete
  3. ధన్యవాధములండి. తప్పకుండా రాయటానికి ప్రయత్నం చేస్తానండి.

    ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers