తాళము: ఆదితాళము
రాగము: ధన్యాసిరాగము
పాడినవారు: శ్రీ మంగళంపల్లి. బాలమురళికృష్ణ గారు.
రచించినవారు: శ్రీ భక్త రామధాసు గారు
Tharaka_Manthramu.... |
తారకమంత్రము కోరిన దొరికెను
ధన్యుడనైతిని ఓరన్నా
మీఱిన కాలుని దూతలపాలిటి
మృత్యువె యని నమ్మర యన్నా
మచ్చికతో నికబాతకంబుల
మాయలలో బడబోకన్నా
హెచ్చ్గ నూటయినిమిది తిరుపతు
లెలమి దిరుగ బని లేదన్నా
ముచ్చటగా నా పుణ్యనదులలో
మునిగెడీ పని యేమిటి కన్నా
వచ్చెడీ పర్వపుదినములలో సుడి
వడి పడుటలు మాను మికన్నా
ఎన్ని జన్మముల నైంచ్ చూచినను
యేకో నారాయణుడనా
అన్ని రూపులై యున్న పరమాత్ముని
నా మహాత్ము కధలను విన్న
ఎన్ని జన్మముల జేసిన పాపము
లీ జన్మముతో విడునన్నా
అన్నిటికిది కడసారి జన్మమిది
సత్యం బికబుట్టుట సున్న
నిర్మల మంతర్లక్ష్య భావమున
నిత్యానందముతో నున్న
కర్మంబులు విడి మోక్షసద్గతిని
గన్నులనే చూచుచునున్న
ధర్మము తప్పక భద్రాద్రీశుని
దనమదిలో నమ్ముచునున్న
మర్మము దెలిసిన రామదాసుని
మందిరమున కేగుచునున్న
ధన్యుడనైతిని ఓరన్నా
మీఱిన కాలుని దూతలపాలిటి
మృత్యువె యని నమ్మర యన్నా
మచ్చికతో నికబాతకంబుల
మాయలలో బడబోకన్నా
హెచ్చ్గ నూటయినిమిది తిరుపతు
లెలమి దిరుగ బని లేదన్నా
ముచ్చటగా నా పుణ్యనదులలో
మునిగెడీ పని యేమిటి కన్నా
వచ్చెడీ పర్వపుదినములలో సుడి
వడి పడుటలు మాను మికన్నా
ఎన్ని జన్మముల నైంచ్ చూచినను
యేకో నారాయణుడనా
అన్ని రూపులై యున్న పరమాత్ముని
నా మహాత్ము కధలను విన్న
ఎన్ని జన్మముల జేసిన పాపము
లీ జన్మముతో విడునన్నా
అన్నిటికిది కడసారి జన్మమిది
సత్యం బికబుట్టుట సున్న
నిర్మల మంతర్లక్ష్య భావమున
నిత్యానందముతో నున్న
కర్మంబులు విడి మోక్షసద్గతిని
గన్నులనే చూచుచునున్న
ధర్మము తప్పక భద్రాద్రీశుని
దనమదిలో నమ్ముచునున్న
మర్మము దెలిసిన రామదాసుని
మందిరమున కేగుచునున్న
baane vunnadi. kaanee konni tappylunnayyi. "enni janmamula jesina papamu eejanmamulo vidanannaa"
రిప్లయితొలగించండిis wrong. it shall be "vidu nannaa"
sadhu venkatraman
నమస్కారం వెంకట్రామన్ గారు మీరు తప్పును చూపినందుకు ధన్యవాధములు. నేను తప్పును సరి చేసాను . ఇంకా ఏమి అయినా వుంటే దయచేసి చూపగలరు.
రిప్లయితొలగించండి