1) తండ్రి గరగర,
తల్లి పీచుపీచు,
బిడ్డలు రత్నమాణిక్యాలు,
మనుమలు బొమ్మరాళ్ళు.
ఏమిటది చెప్పండి?
2) వ్రేలిమీద నుండు వెండుంగరము కాదు - వ్రేలిమీద నుండి నేలజూచు
అంబరమున దిరుగు నది యేమిచోద్యమో - విశ్వదాభిరామ వినురవేమ !
అయ్యోరామా ఆలోచిస్తారెమి మరి చెప్పండి.
౩) ఏడుగురు అన్నదమ్ములం మేము;
విడివిడిగా వుంటే చెప్పలేవు ,
కలసి వుంటే చెప్పగలవు.
అయితె మెము ఎవరము ?
4) ఇంతింతాకు ఇస్తరాకు
రాజులు మెచ్చిన రత్నాలాకు
అదే మాకు చెప్పండి?
1)పనసపండు
రిప్లయితొలగించండి3)ఇంద్రధనుస్సు
మరి నా సమాదానాలు
రిప్లయితొలగించండి1) పనసపండు
2) ఆకాశంలో ఎగిరే గాలిపటం
3) ఇంద్రధనస్సు
4) తమలపాకు