అది మీకు చెప్తాను చూడండి ఎలావుందో మామయ్యచెప్పిన కద. ఇది కధనా మీరీ చెప్పండి.
అనగా అనగా ఒక ఊరిలో రాజు గారికి పంటలు బాగాపండి దాన్యము ఇంటికి తెచ్చారు. ఆధాన్యాన్ని ఒక గదిలో పెట్టారు. అప్పుడు అక్కడకి ఒకచీమ వచ్చింది అక్కడదాన్యం బస్తాలు చూసి సంతోషించి అనుకుంది నావాళ్ళను తీసుకు వచ్చివీటిని మా ఇంటికి తీసుకువెళ్ళి దాచుకోవాలి వచ్చేది వర్షాకాలం కదా ముందుగానే జాగ్రత్త్తపడాలి అనుకుని తనవాళ్ళను తీసుకువచ్చి ఒక్క చీమ రావటం ఒకదాన్యంగింజ తీసుకువెళ్ళటం.మరలా ఇంకోచీమ రావటం ఇంకో గింజ తీసుకువెళ్ళటం, మరలా ఇంకోచీమ రావటం ఇంకో గింజ తీసుకువెళ్ళటం అలాచెప్తూనేవున్నాడు. కాసేపు ఆగిపోయాడు చెప్పూ అనగానే ఎమన్నాడో తెలుసా గింజని పట్టుకువెళ్ళనీ అనేవాడు. నేను నిద్రపోయి లేచాను అప్పుడు తరువాత ఎమి అయ్యింది అని అడిగితే ఇంకో చీమ వచ్చి ఇంకో గిజతీసుకువెళ్ళింది అని మళ్ళీచెప్పాడు. గింజలు అన్నీపూర్తి అవ్వేవరకు అలానే చెప్తున్నాడు ఇప్పటికి వచ్చి ఆకధపూర్తికాలేదు. ఎప్పుడు అడిగినా ఇంకోచీమ వచ్చి ఇంకో గింజపట్టుకువెళ్ళింది అంటున్నాడు. ఎన్నిరోజులు తరువాత అవుతుంది అంటే మొత్తం బస్తాలు అన్నీపూర్తికావాలి అన్టున్నాడు. నేను అడిగా ఎన్నిబస్తాలు అని అప్పుడు లెక్కలేనన్ని అన్నాడు. ఆకధ అవుతుంది అని నాకు అనిపించటంలేదు. మీరు చెప్పండి ఇది అస్సలు కధలా వుందా.
ఇంకో చీమ వచ్చి ఇంకో గిజతీసుకువెళ్ళింది
రిప్లయితొలగించండిచిట్టితల్లీ, ఇంత చిన్న వయసులో బ్లాగు రాస్తున్నవా, భలే ముచ్చటగా ఉంది నిన్ను చూస్తూ ఉంటే. నేను తెలుగింటి అమ్మాయిని అని పెద్ద ఆరిందాలా చెప్తున్నవే....హ హ హ. ఇంత చిన్న వయసునుండే నీకు ఆ భావన ఉండడం చూస్తుంటే ముచ్చటేస్తోంది. చక్కగా తెలుగులో అన్ని రాస్తూ ఉండు. తెలుగుని బాగా అభివృద్ధి పరచుకో. నీకు శుభం కలుగుగాక !
రిప్లయితొలగించండిnice one..u r so cute vishnavi...ur post is also so cute like u
రిప్లయితొలగించండిహ హ్హ బాగుంది.
రిప్లయితొలగించండినేనూ చిన్నప్పుడు ఓ నవాబుగారి కథ విన్నాలే ఇలాంటిదే .. ఫిర్ .. తుర్ర్ .. అనుకుంటూ
అయితె అది కధనే మీరు కూడా అంటున్నారా...........? హాఆఆఆ.
రిప్లయితొలగించండి