ఆదివారం, ఏప్రిల్ 25, 2010
జి.మార్కోని, యస్, బ్రాన్ మనకందరికూ మర్కొని చిరపరిచితుడే. తొలిసారిగా ఇటలీ దేశస్తుడైన మార్కొని (1874 – 1937) నిస్తంత్రీ విధానం (వైర్ లెస్ మెథడ్) ద్వారా ప్రసార సాధనమైన రేడియోను కనుగొన్నాడు. ఎలాంటి యానకం లేకుండా ఒక చోటి నుండి మరొక చోటికి వెళ్ళగలిగిన తరంగాలు కాంతి (విద్యుదయస్కాంత తరంగాల ద్వారా సాధ్యమవుతుందని మార్కొని గుర్తించాడు. తక్కువ తరంగా ధైర్ఘ్యము వున్న దృశ్య కాంతి కన్నా ఎక్కువ తరంగ ధైర్ఘ్యము వున్న రేడియో తరంగాలు ఇందుకు బాగా ఉపయోగపడతాయని మార్కొని కనుగొన్నాడు. అందుకే ఈ సాధనాన్ని రేడియో అని అంటారు.
ఆ రేడియోని మార్కొని కనుకున్నారు దీని వలన అప్పట్లో ఒకరినుండి ఒకరికి కమ్యునికేషనికి బాగాయూజ్ చేసేవారు. అప్పడు తయారు చేసిన రేడియో చాలా మార్పులు చెంది నేటి ఎఫెమ్ వరకు రూపు దిద్దుకుంది. అలాంటి రేడియోని తయారు చేసిన మార్కొని పుట్టినదినము నేడు . అతనికి భౌతికశాస్త్రములో నోభుల్ బహుమతి కూడావచ్చింది.మార్కోని పుట్టినరోజు నాడు అంత గొప్పమనిషినితలచుకోవటం గొప్పగా నేను ఫీల్ అవుతున్నాను.
|
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
చి|| వైష్ణవికి ఆశిస్సులతో.. మహానుభావుడు మారోని జన్మదినాన్ని గుర్తుచేసి, ఆయన గురించి వ్రాసినందుకు. హమ్మో.. చిటి మెదడులో ఎన్ని సంగతులో! చక్కగా వివరించావు తల్లీ. శాస్త్ర ప్రపంచంలో మొదటగా రేడియో కనుగొన్నారన్నది, కాస్త చర్చనీయాంశమైన విషయమే!.కొంతమంది టెస్లా అంటే మరికొంతమంది, అలెగ్జాండర్ పాపోవు అంటారు. ఇంకొంతమంది జగదీశ్ చంద్రబోసు అంటారు. కని చాలా మంది మాత్రం మార్కోనేనని చెబుతారు.
రిప్లయితొలగించండి’తక్కువ తరంగదైర్ఘ్యం గల తరంగాల కన్నా ఎక్కువ తరంగ దైర్ఘ్యం గల తరంగాలు ఎక్కువదూరం ప్రయాణిస్తాయని’ బహు చక్కగా చెప్పావు. అందుకు కారణం ఎక్కువ తరంగదైర్ఘ్యం గల తరంగాలు తక్కువ పరికేపణం చెందడమే!.
చిన్నవయసులోనే చక్కగా అర్థంచేసుకొని వ్రాసినందుకు అభినందనలు, ఆశిస్సులు. చక్కగా చదువుకొని వృధిలోకి రా తల్లి.
చిరంజీవి వైష్ణవిని ఆశీర్వదించి నిజమె నమ్మా చక్కని విషయాలు చెప్పావు మార్కొనీ గురించి
రిప్లయితొలగించండి" ఈ, టి.వి. లు రాకముందు అందరికీ రేడియోలె ఆత్మ బంధువు. " ఇప్పుడూ టి.వీ.లను చూసి చాలా మంది రేడియోలను మర్చి పోయారు.అన్యాయం కదూ అంత గొప్ప శాస్త్ర వేత్తని నోబుల్ బహుమతి గ్రహీతని చిన్న దానివైనా చక్క గా గుర్తు చేసావ్ ఇలాగే గొప్ప గొప్ప వాళ్ళ గురించి మర్చి పోతున్న వాళ్ళందరికీ గుర్తు చేస్తూ ఉండు సరేనా ?