ఈరోజుకు ప్రపంచం మొత్తం చరిత్రలో ఒకవిశేషం వుంది అది ఏంటి అంటే నేటికి మొదటి ప్రపంచ యుద్ధం జరిగి 98 సంవత్సరములు పూర్తి అయ్యింది. ఈ యుద్దము యూరప్ లో మధ్య ప్రాచ్య దేశాలలో జరిగింది. జర్మనీ సామ్రాజ్య విస్తరణ కాంక్ష వల్ల 1914 జూలై 28 న జర్మనీ నాయకత్వం లోని కేంద్ర రాజ్యాల అమెరికన్, బ్రిటన్ నాయకత్యంలోని మిత్ర రాజ్యలకు మధ్య ఈ యుద్ధం ప్రారంభమయ్యింది. ఇది 1914 జూన్ 28న మొదలై, 1918 నవంబర్ 11న ముగిసింది. మొదటి ప్రపంచ యుద్ధం యూరప్, ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలు, చైనా, ఫసిఫిక్ దీవుల ప్రాంతాల్లో జరిగింది. నాలుగేళ్ల పాటు జరిగిన ఈ మహాయుద్ధంలో ఆమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ నేతృత్వంలోని మిత్ర రాజ్యాలు విజయం సాధించాయి. 1919 జూన్ 28న శాంతి ఒప్పందం కుదిరింది. ఈ యుద్ధం అనంతరం జర్మన్, రష్యన్, ఓట్టోమన్, ఆస్ట్రో-హంగేరియన్ సామ్రాజ్యాలు కుప్పకూలిపోయాయి. యూరప్, మధ్య ప్రాచ్యంలో పలు కొత్త దేశాలు ఏర్పడ్డాయి. జర్మనీ వలసులుగా ఉన్న పలు దేశాలు ఇతర శక్తుల ఆధీనంలోకి వెళ్లిపోయాయి. ఈ యుద్ధం తర్వాత నానాజాతి సమితి ఏర్పడింది. ఈ యుద్ధం వాళ్ళ చనిపోయిన సైనికబలగాలు : 5,525,000, మరి గాయపడిన సైనికులు : 12,831,500, ఇంకా తప్పిపోయిన సైనికులు : 4,121,000. ఒకే ఒక కాంక్ష కక్ష వల్ల ఇన్ని వేలమంది జీవితాలను కోల్పోవటం జరిగింది. చరిత్ర మనకు చాలా పాటా లు మనకు నేర్పించింది కదా.
అంటూ శ్రీ వరలక్ష్మీ వ్రతం నాడు శ్రీ మహాలక్ష్మిని ధ్యానించిన వారికి సుఖసంతోషాలు చేకూరుతాయని అందరు అంటున్నారు. ఇటువంటి మహిమాన్వితమైన "శ్రీ వరలక్ష్మీ" వ్రత పుణ్యదినాన సూర్యోదయానికి ముందే లేచి, అభ్యంగన స్నానమాచరించి, నూతన వస్త్ర ధారణ చేయాలి. తదనంతరం పూజామందిరమును, ఇంటిని శుభ్రం చేసుకుని, గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరాన్ని పద్మం ముగ్గులతో రంగవల్లికలను తీర్చిదిద్దాలి. దానిపై పసుపు రాసి ముగ్గులు బొట్లు పెట్టుకున్న పీటను ఉంచి ఆ పీటపై నూతన వస్త్రము పరచి, బియ్యము పోసి, దానిపై అలంకరించిన కలశచెంబును ఉంచాలి. ఒక కొబ్బరికాయను తీసుకుని దానికి "శ్రీ వరలక్ష్మీ" రూపు ప్రతిబింబించేటట్లు పసుపు ముద్దతో కనులు, ముక్కు, చెవులు మున్నగునవి తీర్చిదిద్దుకోవాలి. కుంకుమ, కనులకు కాటుకలను అమర్చి ఆ రూపును కలశపై ఉంచుకోవాలి.
మా ఇంటి వరమహాలక్ష్మి అష్టలక్ష్మిలా వుండబోతున్నది.
ఆ తర్వాత కూర్చున్న లక్ష్మీదేవి ఫోటోను గానీ, ప్రతిమ ను గానీ పసుపు కుంకుమలతో అలంకరించుకుని పూజకు సిద్ధం సుకోవాలి. పూజకు ఎర్రటి అక్షింతలు, పద్మములు, ఎర్రటి కలువ పువ్వులు, గులాబి పువ్వులు, నైవేద్యమునకు బొంబాయి రవ్వతో కేసరి బాత్, రవ్వలడ్డులు, జామకాయలు వంటివి సిద్ధం చేసుకోవాలి. పూజగదిలో రెండు వెండి దీపాలలో ఆరేసి ఆరేసి మొత్తం 12 తామర వత్తులతో నేతితో దీపమెలిగించాలి.
ఇక్కడ శ్రవణ మాస వరలక్ష్మి వ్రతం ఆడియో కలదు
ఇకపోతే.. సాయంత్రం ఆరుగంటల నుంచి పూజను ప్రారంభించాలి. నుదుట కుంకుమ బొట్టు పెట్టుకుని, మెడలో తామర మాల ధరించి పూజను ఆరంభించాలి. శ్రీ లక్ష్మి సహస్రనామము, వరలక్ష్మీ వ్రత కథ పారాయణ చేసి, "ఓం మహాలక్ష్మీదేవ్యై నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. వీలైతే లక్ష్మీ అష్టోత్తరము, మహాలక్ష్మి అష్టకములను పఠించి, తదనంతరం నైవేద్యములను సమర్పించుకుని దేవదేవికి దీపారాధన చేయాలి.
పూజ పూర్తయిన తర్వాత ఇరుగు పొరుగు ముత్తైదువులను పిలుచుకుని దక్షిణ తాంబూలాలు ఇచ్చుకోవాలి. స్త్రీలకు తాంబూలముతో పాటు వరలక్ష్మీ వ్రత పుస్తకాలను కూడా అందజేయాలి.
ఈమెని పూజిస్తే అష్ట ఐస్వరాలు లభిస్తాయి మరి ఈ రోజున స్త్రీలు వరలక్ష్మి భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం. అందుచేత శుక్రవారం వచ్చిన శ్రీ వరలక్ష్మీ వ్రత పుణ్య దినాన్ని విశేషంగా జరుపుకుందాం. మరి పూజ అంతా అయ్యాకా
మనం పూజించే వరలక్ష్మి దేవి విష్ణుమనోహరి అష్టలక్ష్మి. ఈమెని ధ్యానింఛి మన కోరికలు తీర్చే తల్లిని ప్రసన్నం చేసుకుందాం మరి.
అందరికి వరలక్ష్మి వ్రతశుభాకాంక్షలు.
ఎందరో మహానుభావుల కలల పంటగా ఆగస్ట్ 15,1947 న మనకు స్వాత్రంత్రం వచ్చినవిషయం అందరికి తెలిసిన విషయమే కదా! అలా స్వాతంత్ర్యం సంపాదించటానికి ఎందరో అమరవీరుల త్యాగ ఫలితంగా మన భారతావనికి స్వాతంత్ర్య లభించింది. స్వాతంత్ర్య దినోత్సవ రోజున ఆకాశ విధిలో రివ్వు రివ్వున ఎగిరే ముచ్చటైన మువ్వన్నెల జెండాకు జులై 22 1947 భారతీయ జాతీయ పతాకముగా ఆమోదించారు. దీనిని పింగళి వెంకయ్యగారు రూపొందించారు. ఈ జెండా మన భారతమాత చేతిలో ఆయుధమైన భారతీయులకు రక్షణనిస్తుంది. మన జండా విడ్త్ 2:3 గా వుంటుంది. ఈ జెండాలోని మూడు రంగులు వుంటాయి. అవి అడ్డంగా వుంటాయి మొదటి రంగు కాషాయం. ఈరంగు త్యాగానికి గుర్తు. ఇది మన నాయకులు స్వలాభాన్ని విడిచిపెట్టి, తమ కర్తవ్యానికి అంకితం కావాలని సూచిస్తుంది.
తరువాత రెండవ రంగు తెలుపు ఇది మన ప్రవర్తనను నిర్దేశించే వెలుగుకు, సత్యానికి గుర్తుగా వుంది .
ఇక మూడవదైన ఆకుపచ్చ రంగు మట్టితో మనకున్న అనుబంధానికి, ఇతర జీవులన్నీ ఏ వృక్ష సంపదమీద ఆధారపడి ఉన్నాయో. ఆ పచ్చటి చెట్లకు, సస్యశ్యామలానికి గుర్తుగా వుంది .
జెండాలోని అశోకచక్రం ఇది సారనాద్ లోని అశోక స్థంబం నుండి తీసుకున్నది. ఇది బ్లూ రంగులో 24 ఆకులుతో వుంటుంది ఈచక్రము ధర్మపాలనకు గుర్తు. సత్యం, ధర్మం గా కలిగివుంది. చక్రం చలనానికి, చైతన్యానికి గుర్తు. జీవముండే ప్రతిచోటా చైతన్యం ఉంటుంది. చైతన్యం లేనిది చావులోనే అనేది గుర్తుంచుకోవాలి. భారతదేశం ఇకమీదట మార్పును స్వాగతిస్తూ ముందుకు సాగిపోవాలనేదాన్ని సూచిస్తున్నట్లుగా ఉండే చక్రం... శాంతియుతమైన, చైతన్యవంతమైన ప్రగతికి చిహ్నం. ఈ 24 ఆకులకు కూడా అర్ధం కలిగివున్నాయి. వాటి అర్థం తెలుసుకుందామా.
ప్రేమ
దైర్యం
సహనం
శాంతి
కరుణ
మంచి
విశ్వాసము
మృదుస్వభావం
సంయమనం
త్యాగనిరతి
ఆత్మార్పణ
నిజాయితీ
సచ్చీలత
న్యాయం
దయ
హుందాతనం
వినమ్రత
దయాగుణం
జాలి
దివ్యజ్జానం
ఈశ్వర జ్ఞనం
దైవనీతి
దైవబీతి
నమ్మకం
ఇవండీ 24 ఆకులుకు ఉన్న అర్ధాలు. వీటిని చూస్తే జండా తయారు చేయటానికి ఎంత కష్టపడ్డారో అర్ధం అవుతోంది . ఈజండా ఆకాసంలో ఎగురుతూ వుంటూ "ఝండా ఊంఛా రహే హమారా..." అనే పాటను వినని వారుండరు. ఆ పాటను వింటుంటే భారతీయ హృదయాలు పొంగిపోతాయి. మువ్వన్నెల జెండా రెప రెపలాడుతుంటే చిన్న చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్ళ గుండెలూ సంతోషంతో నిండిపోతాయి. గర్వంగా తలఎత్తి సెల్యూట్ చేయాలనిపిస్తుంది. ఈ జెండా వల్లే మన దేశానికి గుర్తింపు ఉంటుంది. అదే దేశానికి తొలి గుర్తు అదే జాతీయ పతాకం అంటే ఆ దేశ సమస్త ప్రజల ఆత్మగౌరవం, గుండెచప్పుడు... వారి సార్వభౌమ అధికారం ఎవరికీ తలవంచని దేశాధ్యక్షుడైనా జాతీయ పతాకానికి తలవంచి నమస్కరించాల్సిందే...!. మన జండాకి అవమానం జరగకుండా మనమే కాపాడుకోవాలి. అలా అవమానించిన వారికి కటినమైన పునిష్మేంట్ ఇవ్వాలి. ఇలా మన జాతీయ పతాకాన్ని అగౌరవ పరిచిన వారిపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి శిక్ష పడేట్లు చేయాలి. మన జాతి గౌరవానికి జాతి ఐకమత్యానికి, సార్వభౌమత్వానికి ప్రతీకగా నిలిచే జాతీయ పతాకాన్ని మనం విధిగా గౌరవించాలన్న విషయం మరువకూడదు.
అలెగ్జాండర్ ద గ్రేట్ అన్న పదం మనం సాదారణంగా వినేవుంటాం. ఆయన గొప్ప గ్రీకు చక్రవర్తి. అతనికి యంగ్ టైగర్ తో పోలుస్తారు. అతి చిన్నవయస్కుడు అయిన గొప్ప చక్రవర్తి. మెగాస్ అలెగ్జాండ్రోస్, జులై 20, క్రీ.పూ. 356 - జూన్ 11, క్రీ.పూ. 323 మద్య కాలంలో జన్మించారు. ఈరోజు అలెగ్జాండరు పుట్టిన దినము. గ్రీకు దేశములోని మాసిడోనియా రాజ్యాన్ని పరిపాలించిన రాజు. ఇతను చనిపోయే సమయానికి, అప్పటి పురాతన గ్రీకులకు తెలిసినంతవరకు భూమిని ఆక్రమించుకున్నాడు. క్రీ.పూ 326 వ సంవత్సరంలో అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర చేశాడు. సింధూ నదిని దాటి తక్షశిల నగరం వైపుగా చొరబడ్డాడు. జీలం మరియు చీనాబ్ నదుల మధ్య గల రాజ్యాన్ని పరి పాలిస్తున్న పురుషోత్తముడు అనే రాజును యుద్ధానికి ఆహ్వానించాడు. అయితే ఆ సమయము లొ అప్పటికే యుద్దం చేసి అలెగ్జాండర్ సైనికులు అలసిపోతారు. అలెగ్జాండర్ సైన్యధిపతి వచ్చి మన సైనికులు అందరూ అలసిపొయారు ఇక యుద్దము చేయలేరని తెలియచేస్తాడు. అంతే కాదు పురుషొత్తముని సైనిక బలం కుడా అధికంగానే ఉంది వారిని ఎదుర్కొనే శక్తి మన సైనికులకు లేదని తెలియచేస్తాడు. ఈ విషయమ్ తెలుసుకొని కొన్ని రొజుల పాటు విశ్రాంతి తీసుకొని వెళిపొతాడు. ఇంకా ఆయన భారతదేశ సందర్శనలో ఎందరో భారతీయ తత్వవేత్తలను, బుద్ధి బలానికి ప్రఖ్యాతి గాంచిన బ్రాహ్మణుల్ని కలిశాడు. వారితో సంవాదం చేశాడు. కొందరిని వారి దేశానికి రమ్మని ఆహ్వానం కూడా పంపాడు. అలెగ్జాండర్ తో యుద్డంచేయకుండానే చాలా మంది రాజులు లొంగిపోయారు వారిలో తక్షశిలాదీసుడైన అంభి ఒక్కరు. అలెగ్జాండర్ కి మనదేశం అంటే మంచి అభిప్రాయం వుండేది అతని చివరి కోరిక ఒకటి వుంది. అది ఏమిటి అంటే హిమాలయాలను దాటి వచ్చి కాశ్మీర్ మన భారత దేశపు చివరను చూడాలి అనే కోరిక వుండేది. అయితే ఆకోరిక నెరవేరలేదు. అలెగ్జాండర్ చాలా రాజ్యాలను జయించిన తర్వాత ఇంటికి తిరిగి వెళుతున్నాడు.మార్గమధ్యంలో తీవ్ర అనారోగ్యానికి గురై మరణ శయ్యపై చేరాడు. తాను మరణించడం తథ్యమని అలెగ్జాండర్ కు అవగతమైపోయింది.తాను సాధించిన గొప్ప గొప్ప విజయాలు, అమిత శక్తిశాలురైన సైన్యం, అంతులేని సంపద తన్ను మరణం నుంచి దూరం చేయలేవని తెలుసుకున్నాడు. తనకు ఇంటికి వెళ్లిపోవాలి అనే కోరిక కలిగింది. తన తల్లికి కడసారిగా తన ముఖాన్ని చూపించి చనిపోవాలన్న కోరికతో ఇంటిముఖం పట్టాడు . కానీ తను ఇంటికి చేరే వరకు తన ప్రాణాలు ఆగలేదు చనిపోయేముందు తన సైన్యాధికారులను దగ్గరికి పిలిచి ఇలా అన్నాడు.
“నేనింక కొద్దిసేపట్లో ఈ లోకం నుంచి నిష్క్రమించబోతున్నాను. నాకు చివరగా మూడు కోరికలున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నెరవేర్చకుండా విస్మరించకండి.” అని వారి నుండి వాగ్ధానం తీసుకున్నాడు.
అశ్రు నయనాలతో కడసారిగా తమ రాజు గారి ఆజ్ఞను వినమ్రంగా అంగీకరించారు ఆ అధికారులు. నా మొదటి కోరిక: ” నా శవ పేటికను కేవలం నా వైద్యులు మాత్రమే మోయాలి”
రెండవ కోరిక: “నా పార్థివ దేహం స్మశానానికి వెళ్ళే దారిలో నేను సంపాదించిన విలువైన వజ్రాలు, మణి మాణిక్యాలు పరచండి”
మూడవ కోరిక: “శవపేటిక లో నుంచి నా ఖాళీ చేతులు బయటికి కనిపించే విధంగా ఉంచండి”
చుట్టూ మూగి ఉన్న సైనికులు ఆయన విచిత్రమైన కోరికలు విని ఆశ్చర్యపోయారు.కానీ వారిలో ఎవ్వరికీ ఆయన్ను అడిగే ధైర్యం లేకపోయింది. అలెగ్జాండర్ కు అత్యంత ప్రీతి పాత్రుడైన ఒక సైనికుడు ఆయన కోరికలను తప్పక నెరవేరుస్తామని మాట ఇచ్చాడు. ఈ కోరికల వెనక ఆంతర్యమేమిటో సెలవియ్యమని అడిగాడు. అలెగ్జాండర్ అతి కష్టమ్మీద ఇలా అన్నాడు. “ఈ మూడు కోరికలు నేనిప్పుడే నేర్చుకున్న మూడు పాఠాలకు ప్రతిరూపాలు.”
“మొదటి కోరికలో నా ఆంతర్యం, నిజానికి ఏ వైద్యుడూ మరణాన్ని ఆపలేడు . ఒకవేళ వైద్యం చేసినా వల్లకాటి వరకే.” అని చెప్పడానికి.
“రెండవ కోరికలో నా ఆంతర్యం, నా జీవితంలో సింహ భాగం సంపదను కూడబెట్టడానికే సరిపోయింది.అదేదీ నా వెంట తీసుకెళ్ళలేక పోతున్నాననీ, కేవలం సిరిసంపదల వెంటబడి విలువైన సమయాన్ని, జీవితంలో మాధుర్యం కోల్పోవద్దని చెప్పడానికి”
“మూడవ కోరికలో నా ఆంతర్యం ఈ ప్రపంచంలోకి నేను వచ్చేటపుడు వట్టి చేతులతో వచ్చాను. ఇప్పుడు వట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను అని చెప్పడానికే ” అని చెప్పి కన్ను మూశాడు.
అలెగ్జాండర్ రాజ్యకాంక్ష గల గొప్ప చక్రవర్తి అయినా మనభారతదేశంలో అడుగుపెట్టే సరికి ఎంత మార్పువచ్చిందో కదా. ఆయన చనిపోయిన తరువాత ఆయన శవం పాడవకుండా తేనెలో వుంచి చేతులు బయటికి వుంచి అలేగ్జండర్ చివరి కోరికలను సైనికులు నెరవేర్చారు.
ఈరోజు నాకు చాలా ఇష్టం అయిన శాస్త్రవేత్త పుట్టినరోజు. ఆయన ఎవరో తెలుసుకుంటారా. ఈరోజు 1822 జులై 20 న జన్యు శాస్త్రానికి ఆద్యుడు గ్రెగర్ జాన్ మెండెల్ జన్మదినము. ఈయన ఆస్ట్రియా సన్యాసి, వృక్షశాస్త్రజ్ఞుడు. 'లాస్ ఆఫ్ హెరెడిటీ' జీవుల అనువంశికత సూత్రాలు కనుగొన్నాడు. చిన్నప్పుడు తోట పని చేశాడు. తేనెటీగలు పెంచాడు. పెద్దయ్యాక మతబోధకుడిగా స్థిరపడ్డాడు. అయినా నిరంతర అధ్యయనం, పరిశీలనల వల్ల శాస్త్రవేత్త అయ్యాడు. ఆయన చేసిన పరిశోధనను ఆయన జీవించి ఉండగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆయన కనుగొన్న సూత్రాలు ఆయన మరణానంతరం ఓ కొత్త శాస్త్రం ఆవిర్భావానికి నాందిగా నిలిచాయి. వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలపై ప్రయోగాలు చేసి తర్వాతి కాలంలో 'ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్'గా కీర్తి పొందిన ఆ శాస్త్రవేత్తే జోహన్ గ్రెగర్ మెండెల్. అప్పటి ఆస్ట్రియాలోని మొరావియాలో ఓ రైతు కుటుంబంలో పుట్టిన జోహన్ గ్రెగర్ బాల్యమంతా తండ్రి వెంట పొలాల్లో గడిచింది. తోటలు, తేనెటీగల పెంపకంలో చురుగ్గా ఉండే అతడికి ప్రకృతి అధ్యయనం, సునిశిత పరిశీలన సహజంగానే అలవడ్డాయి. హైస్కూలు కోసం పట్నానికి వెళ్లినా తండ్రికి జరిగిన ప్రమాదం వల్ల తిరిగి రావడంతో చదువుకు ఆటంకం ఏర్పడింది.ఆపై ఉపాధ్యాయుడి సలహాపై క్రైస్తవ సన్యాసిగా మారడానికి నిర్ణయించుకుని మఠంలో చేరాడు. ఆ విధంగా 21వ ఏటనే 'గ్రిగర్' పేరును స్వీకరించి మఠాధిపతిగా మారాడు. సైన్స్ పట్ల అభిరుచితో ఎన్నోపుస్తకాలు చదివేవాడు. మఠంలోని తోటలో బఠానీ మొక్కలపై ఉత్సుకతతో ఆయన చేసిన పరిశోధన ఫలితాలే వంశపారంపర్య సిద్ధాంతానికి మూల సూత్రాలుగా తర్వాతి కాలంలో పేరొందాయి. ఈ మొక్కల్లో పొడుగు, పొట్టి రకాలకు అంట్లు కట్టి, వాటిని కొన్ని తరాల పాటు పెంచి, ఏ తరానికి ఆ తరం వాటి లక్షణాలను నమోదు చేసుకుంటూ తన పరిశీలనలను సూత్రీకరించగలిగాడు. దాదాపు 30,000 మొక్కలపై ఆయన జరిపిన ప్రయోగాలే మెండల్ నియంత్రణ నియమం , ఖండీకరణ నియమం గా పేరొందాయి. మనుషుల్లో తరతరాల్లో కనిపించే పోలికలు, లక్షణాలు ఎలా సంక్రమించే అవకాశం ఉందనే విషయాలను కూడా ఈ సూత్రాలు విశదీకరించగలిగాయి.దాదాపు 30 ఏళ్ల తర్వాత వంశపారంపర్యతపై పరిశోధనలు చేసిన కొందరు శాస్త్రవేత్తలు, జోహన్ సూత్రాలను చదివితే కానీ తాము పొందిన ఫలితాలను అర్థం చేసుకోలేకపోయారంటే ఇవెంత ప్రాముఖ్యతను పొందాయో తెలుస్తుంది. జన్యుశాస్త్రం వివిధ ప్రయోగాలతో కూడిన, జీవులకు సంబంధించిన ఆధునిక శాస్త్రం. జెనెటిక్స్ , జీవశాస్త్రంలో ఒక ముఖ్యమైన విభాగం. ఇది జీవుల అనువంశికత కు సంబంధించిన శాస్త్ర విజ్ఞానం.
20వ శతాబ్దం వరకు తల్లిదండ్రులు పిల్లల్లో కనిపించే తమ లక్షణాలకు తమ రక్తమే కారణమని భావించేవారు. కానీ తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు సంక్రమించడాన్ని అనువంశికత అంటారని, దానికి కారణం జన్యువులనీ ప్రముఖ శాస్త్రవేత్త గ్రెగర్ జాన్ మెండల్ తెలిపాడు.జన్యువులు డి.ఎన్.ఎ. నిర్మాణంలోని నిర్ధిష్ట ప్రదేశాలు. ఇవి క్రోమోజోములలో ఉంటాయి.
మెండల్ అనువంశిక సిద్ధంతములు: సంయోగ బీజాల శుద్ధతా సిద్ధాంతం: సంకరంలో కలిసివుండే రెండు యుగ్మ వికల్పాలు సంయోగబీజాలు ఏర్పడేటప్పుడు క్షయకరణ విభజన ద్వారా విడిపోయి వేర్వేరు సంయోగ బీజాల్లోకి ప్రవేశిస్తాయి. అందువలన శుద్ధమైన సంయోగబీజాలు ఏర్పడతాయి. స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం: రెండు లేదా అంతకంటే ఎక్కువ జతల లక్షణాలున్న ఒకే జాతికి చెందిన రెండు మొక్కల మధ్య సంకరణం జరిపినప్పుడు, ఒక జత లక్షణాలు (జన్యువులు) ఇంకొక జత లక్షణాలతో సంబంధం లేకుండా సంయోగబీజాల్లోకి పంపిణీ అవుతాయి.
ఈయన గురించి తెలుసుకోవటం చాలా సంతోషం గా వుంది. మనబ్లాగ్ ద్వారా ఈ గొప్ప శాస్త్రవేత్త కు నివాళి అర్పిస్తున్నాం.
ఆషాడ మాసం వెళ్ళిపోయి శ్రావణమాసం వచ్చేసింది. అందరి ఇళ్ళల్లోను హడావిడి. ఎందుకు ఈ హడావిడి. శ్రావణమాసం అంటే అందరికి ఇష్టం కాబట్టి. శ్రవణమాసం అంటే ఇళ్ళలో పూజలు, వ్రతాలు నోములు చేసుకుంటారు కదా. అసలు ఈ శ్రావణ మాసం అని ఎందుకు పేరు వచ్చిందో మీకు ఎప్పుడైనా సందేహం వచ్చిందా ? నాకు అయితే వచ్చింది అయితే అది తెలుసుకునే ప్రయత్నం చేశా అప్పుడు అమ్మమ్మ తన పని చేసుకుంటూ నాకు చెప్పింది. అది ఏమిటి అంటే మనయొక్క మొరలని ఆలకించేందుకు ఆ తల్లిని (లక్ష్మీదేవి) సిద్దపరిచే మాసం కనుకనే శ్రావణం అని పేరు వచ్చింది . మన మొరలని ఆలకించే సమయం, శ్రవణ సంబంధమైన మాసం శ్రావణము. ఈ మాసంలో అమ్మ మనకు ఏకాంతంగా లభిస్తుంది. ఆషాడ మాస ఏకాదశి వరకు స్వామితో నిరంతరం ఉండే తల్లి పాలకడలిలో స్వామిని యోగ నిద్రలో పవళింపజేసి జగత్ రక్షణ ఎట్లా చేయాలో ఆలోచించుకోవడానికి కావల్సిన సమయాన్ని ఆయనకు ఇవ్వడానికి స్వామికి విశ్రాంతినిచ్చి అమ్మ బయలుదేరుతుంది. తరువాత వచ్చే మాసమైన శ్రావణ మాసంలో అమ్మ అందరి మొరలు వినడానికి అందుబాటులోకి వస్తుంది. అందుకే అమ్మను ఆరాధన చేస్తుంటారు. శ్రావణ మాసం అంతా అమ్మను ఆరాధన చేయడానికి వీలైన సమయం. ప్రక్కన స్వామి లేనప్పుడు మన భాదలను అమ్మతో ఒంటరిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఆ అమ్మ దయకోసం మనం ఎంతో ప్రయత్నం చేయాలి. ఆ అమ్మకు అనేక రకాల పేర్లు ఉన్నట్లు మనం గ్రంథాల్లో చూస్తున్నాం. ఆమె కి వెయ్యి పేర్లు వున్నాయి. ఆమెకి లక్ష్మీ అని పేరు. శ్రీ అని పేరు. ఇందిరా అని పేరు. లోక మాతా, రమా, మంగళ దేవతా అని ఇలా ఎన్నేన్నో పేర్లు. అయితే ప్రసిద్దమైన పేర్లు 'లక్ష్మీ' మరియూ "శ్రీ", ఇవి వేదం చెప్పిన పేర్లు. అమె చేసే ఉపకారాలను బట్టి ఎన్నెన్నో పేర్లు చెప్పినా "హ్రీశ్చతే లక్ష్మీచ పత్-న్యౌ" లేక "శ్రీ భవతు " అంటూ వేదం చెబుతుంది. అందుకే భగవంతుణ్ణి గుర్తించేప్పుడు ఆయనలోని దయాది గుణాలను పైకి తెచ్చే నామంతో గుర్తించాలి. అందుకే ఆయనని శ్రీపతి లేక శ్రియపతి అని పిలుస్తుంటారు. లేదా లక్ష్మీనాథా అని పిలుస్తుంటారు. ఆయనకంటూ నారాయణ, విష్ణు అనే ఎన్నో నామాలు ఉన్నప్పటికీ ప్రచురంగా కనిపించే నామం శ్రీపతి అనో లేక లక్ష్మీనాథా అనో. ఆవిడ సంబంధం ద్వారా వచ్చిన నామాలు కనుక. అంటే ఆమె ఆయనలో పెంచిన దయ ద్వారా మనల్ని గుర్తిస్తాడు అని భావిస్తాం. మరి ఇలాంటి శ్రవణమాసపు మహాలక్ష్మి కి స్వాగతం పలుకుదాం. ఈ పాట ద్వారా ఎలా స్వాగతం పలకలో చూడండి మరి .
రంగుల ముగ్గులు ముంగిట నిలిచి రమ్మని పిలిచినవీ
వాకిట నిలిచినా తోరనమాలలు స్వాగతమోసగినవి
అనేకవిదాలుగా శ్రావణ లక్ష్మి దేవికి స్వాగతము పలుకుతున్నది. మరి ఇదే సంధర్బములో మన బ్లాగ్ మిత్రులందరి కోరికలు అమ్మ తప్పకుండా విని . వారికోరికలు నెరవేర్చాలని అమ్మని నేనుకూడా కోరుకుంటున్నాను. అందరికి శ్రావణమాసం శుభాకాంక్షలు.
రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యంలో తిరుగుబాటు పతాకమును ఎగురవేసిన మంగళ్ పాండే జయంతి నేడు 1827, జూలై19న ఉత్తరప్రదేశ్ లోని బలియా జిల్లా నాగ్వ గ్రామంలో మంగళ్ పాండే జన్మించారు.
బెంగాల్ నేటివ్ ఇన్ ఫాంట్రీలో ఒక సాధారణ సిపాయిగా పనిచేసిన మంగళ్ పాండే 1857ప్రథమ భారత స్వాతంత్ర్య పోరాటాని నాంది పలికాడు. మంగళ్ పాండే 34 వ బ్రిటిష్ బెటాలియన్ లో పనిచేసిన అతిచిన్న వయస్సు గల బ్రాహ్మణ యువకుడు . మంచి సాహసవంతుడు అయిన పాండే తన 22వ ఏట ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యం బి.ఎన్.ఐలో చేరాడు. 1857, మార్చి 29న కలకత్తాలో బ్రిటీష్ సార్జెంట్ పై మంగళ్ పాండే దాడిచేయడంతో సిపాయిల తిరుగుబాటు మొదలైంది.అప్పట్లో బ్రిటిష్ వారు పి.53 రైఫిల్ తూటాలో ఆవుకొవ్వు నింపుతున్నారన్న వదంతి మంగళ్ పాండేలో బ్రిటీష్ వారిపై ద్వేషానికి కారణమైంది. సార్జెంట్ పై దాడిచేసిన మంగళ్ పాండే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. అది కాస్త విఫలమవ్వడంతో బ్రిటీష్ సేనలు అదుపులోకి తీసుకున్నాయి. మంగళ్ పాండే చర్యతో పోరాటం మీరట్ కు పాకింది. 1857, ఏప్రిల్8న పాండేను ఆయనకు సహకరించాడన్న ఆరోపణపై సహచర సిపాయిని బ్రిటీష్ ప్రభుత్వం ఉరితీసింది. పాండేపై చర్య తీసుకోమని హేవ్సన్ అనే సైనిక అధికారి ఆదేశించినా సాటి సిపాయిలు వ్యతిరేకించారు. అప్పట్లో ఝాన్సీలక్ష్మి బాయిగారికి కూడా సహకారం అందించారు పాండే గారు. దీంతో అప్పటినుండి ఉద్యమం మరింత ఎక్కువగా భారతమంతటా వ్యాపించింది. కాకతాళీయంగా పాండే హీరో అయ్యాడని, భంగు ను సేవించిన మత్తులో బ్రిటీష్ అధికారిపై దాడి చేశాడన్న వాదనలూ ఉన్నాయి. ఏదేమైనా కాలం విసిరిన సవాలును స్వీకరించిన మంగళ్ పాండే ఒక గొప్ప ఉద్యమకారుడు. భారతదేశ స్వతంత్ర్య చరిత్రలో చిరస్మరణీయుడుగా నిలిచిపోయాడు . ఇలాంటి వారిని మనం గుర్తు చేసుకోవటం ప్రతీ భారతీయుని కర్తవ్యం. ఈయన జయంతి సందర్బముగా మంగళ్ పాండే గారికి నివాళ్ళు అర్పిద్దాం మరి.
తెలుగు జాతి గౌరవం నిలబెట్టి .ప్రపంచ చరిత్రలో మన జాతీయ జండాను ఎగురేలా చేసాడు . మన త్రివర్ణపతాక రూపకర్త
జాతీయ పతాకం రెపరెపలాడే వరకు ఒక్క తెలుగు వారే కాకుండా.. జాతియావత్తూ స్మరించుకోదగిన మహాపురుషుల్లో పింగళి వెంకయ్య ఒకరు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని భట్లపెనుమర్రు గ్రామంలో హనుమంతరాయుడు-వెంకటరత్నమ్మ దంపతులకు ఆగష్టు 2,1878 న జన్మించారు. వెంకయ్య చిన్నప్పటి నుండే చాలా చురుకైన విద్యార్ధి. ఈయన ప్రాధమిక విద్య చల్లపల్లిలో మరియు మచిలీపట్నములోని హిందూ ఉన్నత పాఠశాలలో జరిగినది. దక్షిణాఫ్రికాలోనే మహాత్మా గాంధీని కలిసిన తెలుగు యువనేత. వీరిమధ్య ఏర్పడిన సాన్నిహిత్యం అర్ధ శతాబ్దం పాటు సాగింది. 1913 నుంచి ప్రతి కాంగ్రెస్ సమావేశానికి హాజరై నాయకులందరితోనూ జాతీయ పతాక ప్రతిష్ఠాపన గురించి చర్చలు జరిపారు. 1916లో "భారతదేశానికొక జాతీయ జెండా" అనే పుస్తకాన్ని ఇంగ్లీషులో రాసి ప్రచురించారు. మన తెలుగువారు తమ వారిని గౌరవించటంలో ఏనాడూ ముందంజవేయలేదు. జీవితాంతం దేశం కొరకు స్వాతంత్ర్యం కొరకు పోరాడిన వెంకయ్య చివరి రోజుల్లో తిండికి కూడా మొహం వాచి నానా అగచాట్లు పడినట్లు ' త్రివేణి ' సంపాదకులు డా. భావరాజు నరసింహారావుగారు పేర్కొన్నారు. అంతిమదశలో విజయవాడలో డా. కె.ఎల్.రావు, డా.టి.విఎస్.చలపతిరావు, కాట్రగడ్డ శ్రీనివాసరావు మున్నగు పెద్దలు 15-1-1963 న వెంకయ్య గారిని సత్కరించి వారికి కొంత నిధిని అందించారు. ఆ సత్కారం తరువాత ఆరు నెలలకే 1963, జూలై 4న వెంకయ్య దివంగతుడయ్యాడు.
కన్నుమూసేముందు వారి చివరి కోరికను వెల్లడిస్తూ
" నా అంత్య దశ సమీపించింది. నేను చనిపోయిన తర్వాత త్రివర్ణ పతాకాన్ని నాభౌతిక కాయంపై కప్పండి. శ్మశానానికి చేరిన తర్వాత ఆ పతాకం తీసి అక్కడ ఉన్న రావి చెట్టుకు కట్టండి. ఇది నా తుది కోరిక " అన్నారు. ఇది నాకు తెలిసినప్పుడు నా కళ్ళు నీళ్ళు వచ్చాయి అంటే నమ్మండి.
జాతీయ పతాకం ఎగిరే వరకు స్మరించుకోదగిన ధన్యజీవి పింగళి వెంకయ్య. నిరాడంబరమైన, నిస్వార్థమైన జీవితం గడిపిన మహామనీషి పింగళి వెంకయ్య. ఈయన వర్ధం నేడు. ఈ మహానీయునికి నివాళు అర్పిద్దాం.
అల్లూరి సీతారామ రాజు మన ఆంద్రప్రదేశంలో జన్మించిన స్వాతంత్ర సమరయోధుడు. ఈయన దారిలోనే తూర్పుగోదావరి, విశాఖపట్టణం జిల్లాలో అడవుల ప్రదేశంలో మన్యం ప్రజలు విప్లవ దారిలో నడిచాయి. అల్లూరి సీతామరాజు 4 జూలై 1897 లో పాండ్రంగి అనే ఉరిలో విజయనగరం జిల్లా దగ్గర వెంకట రామరాజు మరియు సూర్యనారాయణమ్మ లకు జన్మించారు. వీరికి ఒక తమ్ముడు సత్యనారాయణరాజు మరియు చెల్లి సీతమ్మ కలరు. మనకు చరిత్రనుండి చూస్తే రక్తపాతం జరగకుండా ఉన్న ఉద్యమాల్లేవు. అంతే కాదు రక్తపాతం జరక్కుండా ఉద్యమాన్ని నడిపించాలని ప్రయత్నించిన ఉద్యమ నాయకులు కూడా వున్నారు. వారిలో గాంధీజీ మన జాతీయ కథానాయకుడు అని మనకు తెలుసు కదా. అల్లూరి సీతారామరాజు మన ఊరి విప్లవ నాయకుడు! మన్యంలో కొండదళానికి, తెల్లదండుకి మధ్య అరవెరైండు సార్లు కాల్పులు జరిగినా, అనవసరమైన రక్తపాతం జరగా కూడదు అని మన మన్యం వీరుడు అనేకసార్లు ఆపుచేసాడు. అల్లూరి సీతారామ రాజును మనము ఆదర్శంగా తీసుకోవాలి. శత్రువుపై నిప్పులు కురిపించిన మన్యం అగ్నికణం అల్లూరి సీతారామరాజు, ఈయన విప్లవ పోరాట సమయం మొత్తం జీవితకాలం గా మనం చెప్పుకోవచ్చు లెక్కకు వస్తే అల్లూరి సీతారామరాజు 22 ఆగస్టు 1922 నుంచి 1924 వరకు అని చెప్పుకుంటారు. అసలు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారికి ఒకలేఖ రాసారు నేను మీకు లొంగిపోతున్నాను అని. కానీ బ్రిటిష్ వారు రుదర్ ఫర్డ్ అద్యక్షణ తో కాల్చి చంపేశారు. ఈ వీరుని కద ముగించేసారు .
స్వామీ వివేకానంద (జనవరి 12, 1863 - జూలై 4, 1902) ప్రసిద్ధి గాంచిన గొప్ప హిందూ మత యోగి. పూర్తి పేరు నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంసగారి అత్యంత ప్రియమైన శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.
భారతదేశాన్ని మాత్రమే జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండుల లో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయము చేసిన ఖ్యాతి వివేకానందునికి కలదు. గురువు గారి కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు. అతని వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరధం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయనే. తూర్పు దేశాల తత్త్వమును షికాగో లో జరిగిన ప్రపంచ మత జాతరలో 1893 లో ప్రవేశపెట్టాడు. అక్కడే షికాగోలోను, అమెరికాలోని ఇతర ప్రాంతాలలోను ప్రజల అభిమానాన్ని పొందారు. ఈయన తిరిగి భారత దేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. ముప్పై తొమ్మిధి ఏళ్ళ వయసు లోనే మరణించాడు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మ దినాన్ని "జాతీయ యువజన దినోత్సవం" గా ప్రకటించింది.
ఆరోగ్యం దెబ్బతిన్నది.
అవిశ్రాంతంగా పని చేయడం వలన స్వామి ఆరోగ్యం దెబ్బతిన్నది. అమెరికాలోని ఆయన శిష్యుల అభ్యర్థన మేరకు మరల అక్కడికి వెళ్ళాడు. ప్యారిస్ లోని సర్వమత సమావేశాలలో పాల్గొని తిరిగి స్వదేశానికి వచ్చాడు. రానూ రానూ అంతర్ముఖుడయ్యాడు. శరీరమైతే బలహీనంగా తయారయ్యింది కానీ ఆయన ఆత్మ,మనసు మాత్రం చాలా చురుగ్గా వ్యవహరించేవి. జులై 4, 1902న యధావిధిగా ఆయన రోజూవారీ కార్యక్రమాలు నిర్వర్తించుకున్నాడు. శిష్యులకు బోధనలు చేశాడు. భోంచేసిన తరువాత కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నాడు. కొద్ది సేపటి తరువాత ఆయనకు చిన్న వణుకు లాంటిదేదో కలిగింది. తనను చూడడానికి వచ్చిన వారితోనూ, శిష్యులతోనూ చాలా ఉల్లసంగా నవ్విస్తూ గడిపాడు. రాత్రి 9 గంటల సమయంలో ఆయనఅలసిపోయినట్లుగా కనిపించాడు. చేతులలో సన్నగా వణుకు ప్రారంభమైంది.చిన్నగా అరిచి లేచి కూర్చున్నాడు. దీర్ఘంగా శ్వాస పీల్చి నెమ్మదిగా శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. ఆయన శిష్యులు తల్లితండ్రులను కోల్పోయిన అనాథలవలే చాలా భాద పడ్డారు .
వివేకానందుడు చేసిన కృషిని గురించి మనం చెప్పలేమేమో. కదా. ఈ రోజు వివేకానంద స్వామి వర్ధంతి రోజు ఆయన గురించి కొంచెం తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ బ్లాగ్ ద్వారా ఆయనకు నివాళి అర్పిద్దాం మరి..
తాత్పర్యము: గురువు బ్రహ్మ, విష్ణు, శివ లక్షణములు కలవాడు. అట్టి సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడైన గురుదేవులకు నమస్కరిస్తున్నాను.
ఈరోజు గురుపూర్ణిమ. వ్యాసుని పుట్టిన దినమును మనము గురుపూర్ణిమగా జరుపుకుంటున్నాము. ఈరోజు గురువులను (Teachers) , పెద్దవారిని పూజించేరోజు. గురుపూర్ణిమను వ్యాసుని పుట్టిన దినము రోజు జరుపుకుంటున్నాముకావున దీనిని వ్యాస పూర్ణమ అని కూడా అంటారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు. శ్రీ మహావిష్ణువుని అవతారంగా వ్యసుని గురించి చెప్తారు. ఈయన పేరు కృష్ణద్వైపాయనుడు. వేదాలను నాలుగు బాగాలుగా చేసాడుకావునా ఈయనికి వేదవ్యాసుడని పేరు వచ్చింది. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే| నమో వై బ్రహ్మనిధ్యే వాసిష్ఠాయ నమోనమ:||
విశాల బుద్ధిగల వ్యాస మహర్షీ! వికసించిన పద్మ దళముల వంటి నేత్రములుగల వాడా! మహాభారతమనే తైలముచే నింపబడిన జ్ఞానదీపము నీచే వెలిగించబడింది. అట్టి నీకు నా నమస్కారములు.
మనకు మంచి చెప్పే ప్రతీవారు గురువులే. ఈరోజు పెద్దవారి ఆశిర్వాధములు మనము తీసుకోవాలి. ఈరోజు షిరిడి సాయిబాబాగారికి, దత్త్తాత్రయుని వారికి ప్రత్యేక దినముగా పూజిస్తారు.
ఇంకా గురువు తత్వాన్ని
దత్త్తాత్రయులవారు మనకు చాలా విషయాలలో చెప్తారు. అందులో నాకు అర్ధం అయినవి మీకు చెప్తాను. దత్త్తాత్రయులు వారు అన్నారు మనకు 24 మంది గురువులువున్నారు అని చెప్పారు. మనకు వరసగా తన గురువులు గురించి చెప్పారు.
మొదటి గురువు: భూమి.
రెండవ గురువు: వాయువు
మూడవ గురువు: ఆకాశము
నాల్గవ గురువు: అగ్ని
ఐదవ గురువు: సూర్యుడు
ఆరవ గురువు: పావురము
ఏడవ గురువు: కొండచిలువ
ఎనిమిదవ గురువు: సముద్రము
తొమ్మిదవ గురువు : మిడత
పదవ గురువు: ఏనుగు
పదకొండవ గురువు: చీమ
పన్నెండవ గురువు: చేప
పదమూదవ గురువు: పింగళ అనే వెశ్య
పదునాల్గవ గురువు: శరకారుడు
పదిహేనవ గురువు: ఒక బాలుడు
పదహారవ గురువు: చంద్రుడు
పదహేడవ గురువు: తేనెటీగ
పద్దెనిమిదవ గురువు: లేడి
పంతొమ్మిదవ గురువు: గ్రద్ద
ఇరవైవ గురువు: కన్య
ఇరవైవోకటివ గురువు: సర్పము
ఇరవై రెండవ గురువు: సాలెపురుగు
ఇరవై మూడవ గురువు: భ్రమరకీటకము
ఇరవై నాల్గవ గురువు: జలము
ఇలా తనగురువులు గురుంచి చెప్పారు. మనకు ప్రతీజీవి ఒక గురవే అని చెప్పారు దత్తాత్రయులవారు. వీటినుండి ఏమి నేర్చుకోవాలో తరువాత తెలుసుకుందాం.