స్వామీ వివేకానంద (జనవరి 12, 1863 - జూలై 4, 1902) ప్రసిద్ధి గాంచిన గొప్ప హిందూ మత యోగి. పూర్తి పేరు నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంసగారి అత్యంత ప్రియమైన శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.
భారతదేశాన్ని మాత్రమే జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండుల లో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయము చేసిన ఖ్యాతి వివేకానందునికి కలదు. గురువు గారి కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు. అతని వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరధం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయనే. తూర్పు దేశాల తత్త్వమును షికాగో లో జరిగిన ప్రపంచ మత జాతరలో 1893 లో ప్రవేశపెట్టాడు. అక్కడే షికాగోలోను, అమెరికాలోని ఇతర ప్రాంతాలలోను ప్రజల అభిమానాన్ని పొందారు. ఈయన తిరిగి భారత దేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. ముప్పై తొమ్మిధి ఏళ్ళ వయసు లోనే మరణించాడు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మ దినాన్ని "జాతీయ యువజన దినోత్సవం" గా ప్రకటించింది.
ఆరోగ్యం దెబ్బతిన్నది. |
అవిశ్రాంతంగా పని చేయడం వలన స్వామి ఆరోగ్యం దెబ్బతిన్నది. అమెరికాలోని ఆయన శిష్యుల అభ్యర్థన మేరకు మరల అక్కడికి వెళ్ళాడు. ప్యారిస్ లోని సర్వమత సమావేశాలలో పాల్గొని తిరిగి స్వదేశానికి వచ్చాడు. రానూ రానూ అంతర్ముఖుడయ్యాడు. శరీరమైతే బలహీనంగా తయారయ్యింది కానీ ఆయన ఆత్మ,మనసు మాత్రం చాలా చురుగ్గా వ్యవహరించేవి. జులై 4, 1902న యధావిధిగా ఆయన రోజూవారీ కార్యక్రమాలు నిర్వర్తించుకున్నాడు. శిష్యులకు బోధనలు చేశాడు. భోంచేసిన తరువాత కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నాడు. కొద్ది సేపటి తరువాత ఆయనకు చిన్న వణుకు లాంటిదేదో కలిగింది. తనను చూడడానికి వచ్చిన వారితోనూ, శిష్యులతోనూ చాలా ఉల్లసంగా నవ్విస్తూ గడిపాడు. రాత్రి 9 గంటల సమయంలో ఆయనఅలసిపోయినట్లుగా కనిపించాడు. చేతులలో సన్నగా వణుకు ప్రారంభమైంది.చిన్నగా అరిచి లేచి కూర్చున్నాడు. దీర్ఘంగా శ్వాస పీల్చి నెమ్మదిగా శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. ఆయన శిష్యులు తల్లితండ్రులను కోల్పోయిన అనాథలవలే చాలా భాద పడ్డారు .
వివేకానందుడు చేసిన కృషిని గురించి మనం చెప్పలేమేమో. కదా. ఈ రోజు వివేకానంద స్వామి వర్ధంతి రోజు ఆయన గురించి కొంచెం తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ బ్లాగ్ ద్వారా ఆయనకు నివాళి అర్పిద్దాం మరి..
వివేకానందస్వామి బోధనలు రచనలు రామకృష్ణమఠంవారి వద్ద లభిస్తాయి.
రిప్లయితొలగించండిఇంతవరకు చదవని వారు కనీసం స్వామివారు 'వివేక సూర్యోదయం' పుస్తకంతో మొదలు పెట్టండి. అద్భుతమైన చిన్న పుస్తకం. నా చిన్నతనంలో మా నాన్నగారు నాకు యీ పుస్తకం కొని యిచ్చారు. ఆ తరువాత కాలంలో నేను మరికొంత మందికి యీ పుస్తకం బహుమానంగా ఇచ్చాను.
స్వామివారి రచనలు భగవద్గీతలలోని కొన్ని అధ్యాయాల పైన కూడా కర్మయోగం, రాజయోగం, భక్తియోగం మొదలయిన పుస్తకాలు ఉన్నాయి. వీలు చూసుకొని అవికూడా తప్పక చదవండి.
వివేకానందుని ఒక హిందూసన్యాసిగా చూడకండి. అది హ్రస్వదృష్టి అవుతుంది. ఆయనకు ముందు ప్రజల దృక్కోణంలో వేదాంతం అనేది ముసలివాళ్ళ, సన్యాసుల వ్యవహారం. దానిని మార్చి ఆయన వేదాతం మువకులకు యుక్తినీ,శక్తినీ జీవితంలో ఒక ఆదర్శాన్నీ ఇచ్చే మంచి tonic లాగా మన జాతికి అందిచ్చాడు. కులమతాది బేధాలకు అతీతంగా అందరూ ఆయన యిచ్చిన అమూల్య సందేశంతో లాభపడండి!
నేను ఆయన రాసిన దాదాపు అన్ని పుస్తకాలు చదివాను.. కార్య దీక్షత అంటే ఎలా వుండాలో... ధృఢత్వం అంటే ఏమిటొ, మనసుని ధీరత్వం గా మలచుకుని.. నిజవారి దైనందిక జీవితంలో మనకు ఏర్పడే కష్ట నష్టాలను ఎలా ఎదుర్కోవాలో ఇచ్చే ధైర్యాన్ని కలగచేసే విధంగా స్వామి భోధనలు వుంటాయి..నిజమైన సోదరుడు అందరికీ..ది గ్రేట్ స్వామిజీ..మీ ద్వారా ఆయనకు నా నివాళులర్పిస్తున్నాను..
రిప్లయితొలగించండి