దసరా ఒక హిందువుల ముఖ్యమైన పండుగ . ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది.
ఈ పండుగకు ఈ పది రోజులు పది అవతారాలుగా అమ్మవారిని అలంకరించుకొని పూజ చేస్తారు. రోజు ప్రతి ఇంట్లోను లలితా సహస్త్రమ్ చదువుతారు. బొమ్మలకొలువులు పెడతారు. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతల్తో ఘోరమైన యుద్ధమి చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది .త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది. దేవినవరాత్రి పూజలు చేయుట, అనునది అనాదికాలంగా వస్తున్న శాస్త్రవిధి. "అశ్వనీ" నక్షత్రంలో కలసివచ్చిన పూర్ణిమమాసమే "ఆశ్వీయుజమాసం" అవుతుంది. ఈ మాసమందు 'దేవీనవరాత్రుల'ను శరన్నవరాత్రులని పిలుస్తూ శుద్ధపాడ్యమి తిథితో ప్రారంభించి తొమ్మిది రోజులు ఈ నవరాత్రులు వైభవంగా చేస్తారు.
ఈ దసరా రోజులలో అమ్మవారి అవతారాలు:
నవరాత్రి ఉత్సవాలలో ఆలయాలలో పార్వతీదేవికి రోజుకు ఒక అంకరణ చేస్తారు ఇలా ఒక్కోప్రాంతంలో ఒక్కోలా నామాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో మొదటి రోజు శైల పుత్రి, రెండవ రోజున బ్రహ్మచారిణి, మూడవ నాడు చంద్రఘంటాదేవి, నాల్గవ రోజున కూష్మాండాదేవి, అయిదవ రోజున స్కందమాత, ఆరవ రోజున కాత్యాయినీ, ఏడవరోజున కాళరాత్రి, ఎనిమిదవ రోజున మహాగౌరి, తొమ్మిదవ రోజున సిద్ధిధాత్రిదేవిగా పూజిస్తారు.
మరికొందరు మొదటి రోజున బాల త్రిపురా సుందరిగాను, రెండవరోజున గాయిత్రిమాతగా , మూడవరోజున శ్రీ లలితా త్రిపురా సుందరిదేవి, నాలగవ రోజున అన్నపూర్ణదేవిగాను , ఐదవరోజున మహాలక్ష్మీదేవిగా , ఆరవరోజున సరస్వతిదేవి, ఏడవరోజున శ్రీ దుర్గాదేవి, ఎనిమిదవరోజున మహిషాసుర మర్దినిదేవి, తొమ్మెదవరోజున శ్రీ రాజరాజేశ్వరిదేవి రూపాలలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనుంది.
యస్యాం బింబిత మాత్మ తత్వమగమత్ సర్వేశ్వరాఖ్యాం శుభాం యా విష్వగ్జగదాత్మనా పరిణతా యా నామరూపాశ్రయా యా మూలప్రకృతి ర్గుణ త్రయవతీ యానంత శక్తి స్స్వయం నిత్యావృత్త నవాత్మికా జయతు సా దుర్గా నవాకారిణీ
ఎవతె యందు ప్రతిబింబించిన ఆత్మతత్వం సర్వేశ్వరుడనే శుభనామాన్ని పొందిందో, ఎవతె తనే జగదాకారంగా పరిణామం చెందిందో, ఎవతె నామరూపాలకు ఆశ్రయమో, ఎవతె మూడు గుణాలు గవ మూల ప్రకృతియో, ఎవతెయే స్వయంగా అనంత రూపాలైన శక్తియో, ఎవతె నిత్యమూ మళ్ళీ మళ్ళీ ఆవృత్తమయ్యే తొమ్మిది రూపాలు (నూతన రూపాలు) కలదియో, అట్టి నవరూపాలుగా ఉన్న దుర్గాదేవి జయుంచుగాక.
నవరాత్రి సమారాధ్యాం నవచక్ర నివాసినీం నవరూప ధరాం శక్తిం, నవదుర్గాముపాశ్రయే
నవరాత్రులలో ఆరాధింపదగినది, (శ్రీ చక్రం లోని) నవచక్రాలలో నివసించేది, శక్తి రూపిణి, అయిన నవదుర్గను ఆశ్రయిస్తున్నాను.
ప్రథమాశైలపుత్రి, ద్వితీయా బ్రహ్మచారిణీ
తృతీయాచంద్రఘంటీతి, కూష్మాండేతి చతుర్థికీ
పంచమా స్కందమాతేతి షష్టాకాత్యాయనేతి చ
సప్తమా కాళరాత్రిచ అష్టమాచాతి భైరవీ
నవమా సర్వసిద్ధిశ్చాత్ నవదుర్గా ప్రకీర్తితా.
మూర్తులు వేరైనా మూలపుటమ్మ ఒకరే! అలంకారాలు వేరైనా అమ్మదయ అందరిపట్ల ఒకటే! హిందువులు అత్యంత ప్రీతిపాత్రంగా ఎంతో వైభవంగా నిర్వహించే పండుగలలో ఈ "దసరావైభవం" ఒకటి. ఇది పదిరోజులు పండుగ అయినప్పటికి దేవిని రోజుకో అవతారంగా అలంకరించి అమ్మవారికి అర్చనలుచేసి, నవవిధ పిండివంటలతో నివేదనలుచేస్తూ విశేష పూజలతో పాటు శ్రీలలితా సహస్రనామ పారాయణ నిత్యము గావిస్తూ "శరన్నవరాత్రులు" గా వ్యవహరిస్తారు. శ్రవణానక్షత్రయుక్త 'దశమి' తిథిన విజయదశమితో ఈ దసరావైభవాలు పూర్తిచేస్తారు. దసరాకు మరోపేరు "దశహరా" అంటే! పది పాపాలను హరించేది అని అర్థం చెప్తారు.
నేటిదినమును బాలాత్రిపురసుందరి అవతారములో అమ్మవారిని పూజించవచ్చు.ఈరోజు చిన్నపిల్లలకు పసుపురాసి పూజచేసి వారిలో అమ్మవారిని చిన్నపిల్లగా చూస్తారు. ఈ బాలాత్రిపురసుందరి దేవికి పాయసం నివేదనగా అర్పిస్తారు.
శైలపుత్రి: సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించి, పిదప పర్వతరాజైన హిమవంతుని యింట పుత్రికయై అవతరించినందున ఆమెకు శైలపుత్రి అను నామము. వృషభవాహనారూఢయైన ఈ మాతకు కుడిచేతిలో త్రిశూలము, ఎడమచేతిలో కమలము విరాజిల్లుచుండును. తలపై చంద్రవంకను ధరించియుండును. పార్వతి, హైమవతి అనునవియు ఆమె పేర్లే. శైలపుత్రి మహిమలు, శక్తులు అనంతములు. వాంఛితములను ప్రసాదించు తల్లి.
ఈ నవరాత్రులు రోజులలో రోజు లలితా సహస్రము పట్టిస్తారు.
మంచి వివరాలందించారు.కృతజ్ఞతలు.ఈ తొమ్మిదిరోజులూ మీటపాలకోసం వేచిచూస్తాం.
రిప్లయితొలగించండి