Blogger Widgets

శనివారం, నవంబర్ 09, 2013

శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.

శనివారం, నవంబర్ 09, 2013

శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.  
శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్  పేరొందిన సంగీత విద్వాంసులు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 1978 నుంది 2006 వరకు ఆస్థాన గాయకులుగా ఉన్నాడు. అన్నమాచార్య సంకీర్తనలకు సంప్రదాయ సంగీత స్వరకల్పనలో ఆద్యుడు. ఆయన 600లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశాడు. "వినరో భాగ్యము విష్ణుకథ..", "జగడపు చనువుల జాజర..", "పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు.." వంటి సుప్రసిద్ధ కీర్తనలకు ఆయన స్వరాలు సమకూర్చారు. ఆయన సంప్రదాయ కర్ణాటక సంగీతంలొ, లలిత సంగీతంలో, జానపద సంగీతంలోనూ పేరుపొందిన అభినవ అన్నమయ్య శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు.
600లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారు.
స్వయంగా వాగ్గేయకారుడైన ఆయన హనుమంతునిపై "ఆంజనేయ కృతిమాల" (21 కృతులు), వినాయకునిపై (50 కృతులు), నవగ్రహాలపై ఇతర దేవతలపై కృతులు రచించాడు. ఆయన స్వంత కృతులు వెయ్యికి పైగా ఉన్నాయి. వాటిలో కొన్ని సంగీత స్వరాలతో సహా ప్రచురించబడ్డాయి.
ఆయన కృష్ణవేణి, నరసింహారావు దంపతులకు రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్ లో జన్మించాడు. కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేశాడు. ఆల్ ఇండియ రేడియోలో ఏ-గ్రేడ్ గాయకుడు. ఆయన సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో అన్నమాచార్య సంకీర్తనలలో ప్రత్యేకత సంపాదించాడు. కేవలం సంగీతం నేర్చుకొవటమే కాకుండా, అన్నమాచార్య సంకీర్తనల స్వరకల్పనలోనూ, వాటికి సంగీత స్వరాలతో కూడిన పుస్తకాలు ప్రచురించడంలోనూ, సిడి రికార్డింగ్ లలోనూ పాలుపంచుకున్నాడు. ఆయన 1978లో అన్నమాచార్య ప్రాజెక్ట్ లో గాయకుడిగా చేరాడు. అన్నమయ్య సంగీత,సాహిత్యాలను ప్రజలకు చేరువ చెయ్యడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్ట్, ఆయన సంగీత నైపుణ్యాన్ని ప్రదర్శించే చక్కని వేదికగా ఉపయోగపడింది. అక్కడ చేరినప్పటినుండి, 2006లో పదవీ విరమణ వరక్లు ఆయన ఈ ప్రాజెక్ట్ లో ముఖ్యులుగా ఉన్నారు. వివిధ స్థాయులలో ఈ సంస్థను గొప్ప సాంసృతిక సంస్థగా తీర్చిదిద్దటానికి కృషి చేశాడు. నాలుగు దశాబ్ధాల నాదోపాసనలో సంపూర్ణ విశ్వాసంతో, అంకిత భావంతో, పరిపూర్ణత కోసం నిరంతరం పరిశ్రమించాడు. 6000లకు పైగా కచేరీలు చేశాడు. 600లకు పైగా అన్నమాచార్య కీర్తనలకు స్వరకలపన చేశాడు.తితిదే కోసం ఆడియో రికార్డింగ్ లు చేశాడు, స్వరకల్పనతో కూడిన పుస్తకాలను ప్రచురించాడు. అన్నమాచార్య కృతులకు ఇంకా ప్రాచుర్యం కల్పించడానికి తరగతులు నిర్వహించాడు.
 ఇంకా ఎంతో విలువైన సంగీత సంపదను మాలాంటివారికి అందజయ్యాలని కోరుకుంటున్నాను.  ఈరోజు వారి జన్మదినము కావున వారు ఇలాంటి జన్మదినోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను.  

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)