ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశి గురించి తెలుసుకుందాం. వరాహావతారంలో మహావిష్ణువుకు భూదేవి కుమారుడు నరకాసురుడు. భూదేవి శాపవశమున నరకాసురుడు శ్రీ కృష్ణుని తో సంహరించబడతాడు. నరకాసురుడు వృత్తాంతం మహాభాగవతము దశమ స్కందం ఉత్తర భాగములొ వస్తుంది. నరకాసురిడి సంహారం జరిగిన రోజు నరక చతుర్దశి జరుపుకొంటారు హిందువులు. తరువాతి రోజుని దీపావళి జరుపుకొంటారు. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశి గా ప్రసిద్ధి పొందింది.
కృతయుగం లో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామి కి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. అతడు లోక కంటకుడైనామహావిష్ణువు వధించరాదని, తల్లియైన తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి. మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామ గా జన్మిస్తుంది.
నరకాసురుడు ప్రాగ్-జ్యోతిషపురం అనే రాజ్యానికి రాజు. ప్రస్థుతం అది అస్సాంలోని గౌహతి ప్రాంతం. అనేక సంవత్సరాలు తపస్సులు చేసి బ్రహ్మ చేత వరాలు పొందాడు. ఆ వరగర్వంతో గర్వాంధుడై మానవుల్ని, దేవతలను, సాధువులను, తాపసులను హింసించేవాడు. కామ, క్రోధ, లోభ, మదమాత్సర్యాలకు బానిసైనాడు. గోబ్రాహ్మణులను పనికట్టుకు బాధించేవాడు. పదహారువేల మంది స్ర్తిలను చెరబట్టినాడు. దైవ దూషణ మితిమీరి చేసేవాడు. వీని దుష్టచేష్టలను భరించలేక భూదేవి మహావిష్ణువు దగ్గరకు వెళ్లి మొరపెట్టుకుంది. వరబలం, మదబలం కలిసి ఉండే నరకుని వలన ముల్లోకాలు గడగడలాడాయ. విశ్వకర్మ కూతుర్ని బలాత్కరించాడు. ఇంద్రుడి మాత అదితి కుండలాలను హరించాడు. ఇక నరకుని బాధ భరించలేక బ్రహ్మాదిదేవతలు మహావిష్ణువును శరణు కోరారు. అపుడు మహావిష్ణువు ద్వారకలో నివసించే శ్రీకృష్ణుడు సత్యభామతో కలసి నరకుని పీడ వదిలిస్తాడని అభయం ఇచ్చాడు.

అప్పటికి నరకాసురుడు లోక కంటకుడై చేస్తున్న అధర్మకృత్యాలను అరికట్టడానికి సత్యభామా సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు. వారి మధ్యజరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు. తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్థశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెరనుండి సాధుజనులు, పదహారువేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు, ధ్రర్మం సుప్రతిష్టమైంది. నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. భూమాత ఎంత గొప్పదో కదా. కొడుకు లోకకంతకుడు అని తెలిసి క్షమించకుండా మరణశిక్ష విధించింది.
ఆరోజే ఆశ్వీజమాస కృష్ణపక్ష చతుర్దశి. అదే నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది. లోక కంటకుల వినాశనానికి గుర్తుగా, లోకాలన్నీ ఆనందించేటట్టుగా బాణాసంచా కాల్చారు. నరకుణ్ణి అజ్ఞానానికి ప్రతీకగా భావించి దాన్ని దూరం చేసామని జ్ఞానానికి ప్రతీకలైన దీపాలు వెలిగించి తమను కాపాడిన దేవదేవునకు అందరూ నమస్కరించారు. ఆ నరకుని పీడ వదిలిన సందర్భంగా చతుర్ధశి తెల్లవారు జామున ‘చతుర్వత్తుల’ దీపం వెల్గించి యమధర్మరాజునుద్దేశించి తర్పణం వదలుతారు. ఈ పండుగను దక్షిణ భారతదేశంలో నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి అని మూడు రోజులు జరుపుకొంటారు. ఉత్తర భారతంలో ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమ ద్వితీయ అని ఐదు రోజులు జరుపుకొంటారు.
చతుర్దశికి ముందు రోజు బహుళ త్రయోదశిని ధన త్రయోదశి అంటారు. ఆ రోజు రాత్రి అపమృత్యువును తప్పించుకొనేదానికి ‘యమదీపం’ పెడతారు. నూనెతో దీపాన్ని వెలిగించి పూజ చేసి గుమ్మానికెదురుగా ఇంటి బయట ఉంచి, యమధర్మరాజు దయను కోరుకోవడం అందువల్ల దీనికి యమదీపం అన్న పేరు వచ్చింది. ఈ చతుర్దశి తర్వాత వచ్చే అమావాస్య నాటి రాత్రి ఒకేఒక దీపాన్ని వెలిగించి ఒక పళ్ళెం నిండా ధాన్యాన్ని నింపి, పళ్ళెం మధ్యలో ఆ వెల్గించిన దీపాన్ని పెట్టి భూమాతను పూజిస్తారు. ఆ తరువాత ఆ దివ్వెను ఇంటిలో, బయట ఆవరణ అంతా మూల మూలనా వెలుగుపడేలా త్రిప్పి తిరిగి తెచ్చి దేవునివద్ద ఉంచుతారు. ఇలాచేయడం తమలోఉన్న అజ్ఞానాంధకారాన్ని పారద్రోలమని భగవంతునికి విన్నపం అన్నమాట. తరువాత ఆ దీపంతోనే అనేక దీపాలు వెలిగిస్తారు. ఇది కన్నడ దేశ పద్ధతి. బెంగాల్‌లో దీపావళి నాడు కాశీపూజ చేస్తారు. ఒరిస్సాలో దీపావళి నాటి రాత్రి లక్ష్మీపూజ, కులదేవతార్చన చేసి, క్రొత్త బట్టలు కట్టుకుని సన్నగా చీల్చిన చెఱుకు పుల్లలకు దూదిని చుట్టి, నువ్వుల నూనెలో ముంచి వెలిగించి ‘పితృణం మార్గదర్శనం’’ అంటూ ఆకాశం వైపు చూపిస్తారు. మార్వాడీలు దీపావళినాడు వెండి, బంగారు నాణేలతో లక్ష్మీదేవిని పూజించి ఆ రోజునే నూతన సంవత్సరాంభం చేసి, కొత్త ఖాతాలను ప్రారంభిస్తారు. తీపి వంటకాలను చేసి బంధుమిత్రులకు విందు చేయటం, బాణసంచా కాల్చి, సంప్రదాయంగా చేస్తారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమవాస్య కావడంతో, చీకటిని పారద్రోలుతూ ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి, బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.