మనకు కధలు వినటం అంటే చాలా ఇష్టం కదా! నాకు అయితే చాలా ఇష్టం. నాకు తెలిసిన మంచిది , చాలా చిన్నకధ మీకు షేర్ చేస్తున్నా చదవండి.
అనగనగా ఒక రోజు ఒక బడిలొ బాలుడికి ఒక సందేహం వచ్చింది. అతని గురువుని వెళ్ళి అడిగాడు – “గురువుగారు, ఎక్కువ మాట్లాడితే మంచిదా, తక్కువ మాట్లాడితే మంచిదా?”గురువుగారు చిరునవ్వుతొ ఈ జవాబు చెప్పారు. “కప్పకూత రాత్రి-పగలు వినిపిస్తూనే వుంటుంది, అయినా దాన్ని యెవ్వరూ పట్టించుకోరు. కాని కోడి ఒక్కే ఒక్క సారి కూస్తే ఊరంతా నిద్ర లేస్తుంది. దీని వల్ల అర్ధమయ్యేది యేమిటంటే, యెక్కువ మాట్లాడి ప్రయోజనం లేదు. మాట్లాడేది ఒక మాటే అయినా, అది సూటికా అందరూ మెచ్చేదిగా వుండాలి, అంతేకాదు అది సరైన సమయంలో మాట్లాడితే అందరూ వింటారు.”
సందేహం తీరిన కుర్రవాడు సంతోషంగా వెళ్ళాడు. చిన్న కధ అయినా చాలా మంచి విషయం వుంది కదా.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.